ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారనే సమచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు 50 ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్నారు.
వేములవాడ రూరల్: ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారనే సమచారంతో దాడులు నిర్వహించిన పోలీసులు 50 ఇసుక డంపులను స్వాధీనం చేసుకున్నారు. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం కుడుముంజ, రుద్రవారం గ్రామాల్లో అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 50 ఇసుక డంపులను గుర్తించిన పోలీసులు తహశీల్దార్ కు సమాచారం అందించారు. ఆదివారం ఉదయం తహశీల్దార్ రమేష్ ఇసుక డంపులకు వేలం నిర్వహించారు. ఈ వేలంలో రూ. 1.12 వేలకు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి ఇసుక డంపులను సొంతం చేసుకున్నాడు.