వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పంట కాలువలో పడింది. దీంతో ఆటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి.
తిర్యాని (ఆదిలాబాద్) : వేగంగా వెళ్తున్న ఆటో అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న పంట కాలువలో పడింది. దీంతో ఆటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా తిర్యాని మండలం రాంపల్లి శివారులో సోమవారం చోటుచేసుకుంది.
రాంపల్లి నుంచి తిర్యాని వెళ్తున్న ప్రయాణికుల ఆటో రోడ్డు పక్కన ఉన్న ఎన్టీఆర్ సాగర్ ప్రాజెక్ట్ కాలువలో పడటంతో ఆటోలో ఉన్న ముగ్గురు వ్యక్తులకు తీవ్రంగా గాయపడ్డారు. ఇది గుర్తించిన స్థానికులు క్షతగాత్రులను తిర్యాని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.