ఎవరి పాత్ర ఎంత? | 3 groups invastgate over bus accident | Sakshi
Sakshi News home page

ఎవరి పాత్ర ఎంత?

Jul 25 2014 1:51 AM | Updated on Sep 2 2017 10:49 AM

మాసాయిపేట దుర్ఘటనపై రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇందుకు 3 బృందాలను ఏర్పాటు చేశారు. దుర్ఘటనకు ప్రధాన కారకులెవరు? రైల్వే శాఖ నిర్లక్ష్యం ఉందా? స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఏ మేరకు ఉంది?

విచారణ ప్రారంభించిన రైల్వే పోలీసులు


 సాక్షి, హైదరాబాద్: మాసాయిపేట దుర్ఘటనపై రైల్వే పోలీసులు విచారణ ప్రారంభించారు. ఇందుకు 3 బృందాలను ఏర్పాటు చేశారు. దుర్ఘటనకు ప్రధాన కారకులెవరు? రైల్వే శాఖ నిర్లక్ష్యం ఉందా? స్కూల్ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం ఏ మేరకు ఉంది? సదరు డ్రైవర్‌కు లెసైన్సు ఉందా? బస్సు నడిపిన అనుభవం ఉందా? స్కూల్ యాజమాన్యం పాత్ర వంటి అంశాలపై దర్యాప్తు జరుపుతున్నారు. రాష్ట్ర రైల్వే పోలీసు ఇంచార్జీ డీజీ కృష్ణప్రసాద్ గురువారం రాత్రి సాక్షితో మాట్లాడుతూ ‘ఈ దుర్ఘటనపై అన్ని కోణాల నుంచి దర్యాప్తు చేస్తున్నాం. ఘటనాస్థలి నుంచి కొన్ని అధారాలు కూడా సేకరించాం’అని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement