ఉద్యోగి విధులకు ఆటంకం కలిగించారని శిక్ష | Sakshi
Sakshi News home page

24 మంది గ్రామస్తులకు ఎడాది జైలు శిక్ష..

Published Fri, Aug 23 2019 10:35 AM

24 Villagers Held Prison For Interrupted Public Employee Dutie In Khammam - Sakshi

సాక్షి, కొత్తగూడెం(అన్నపురెడ్డిపల్లి) : అటవీశాఖ, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో నేరం రుజువు కావడంతో మొత్తం 24 మందికి సంవత్సరం జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.700 చొప్పున జరిమానా విధిస్తూ కొత్తగూడెం 3వ అదనపు కోర్టులో గురువారం తీర్పువెలువడింది. 2015 సంవత్సరానికి పూర్వం అన్నపురెడ్డి మండలం మర్రిగూడెం గ్రామ పరిసర అటవీభూముల్లో స్థానిక గిరిజనులు పోడు సాగుచేసుకున్నారు. ఆ భూములు అటవీశాఖవి కావడంతో ఆ శాఖ ఉద్యోగులు 2015 సం వత్సరంలో మొక్కల పెంపకం చేపట్టారు. కాగా తాము సాగుచేసుకుంటున్న భూముల్లో మొక్క లు నాటారంటూ స్థానికులు సుమారు 500 మంది న్యూడెమోక్రసీ, సీపీఎం ఆధ్వర్యంలో అటవీశాఖ ఉద్యోగులను అడ్డుకున్నారు.

అటవీ శాఖ ఉద్యోగుల ఫిర్యాదుమేరకు పోలీస్‌స్టేషన్‌లో ప్రభుత్వ ఉద్యోగుల విధులకు ఆటంకం తదితర నేరారోపణతో కేసు నమోదయింది. న్యూడెమోక్రసీ, సీపీఎం నాయకులు ఎస్‌కే ఉమర్, కాక మహేశ్లతోపాటు మొత్తం 24 మందిపై కేసులు నమోదయ్యాయి. వీరిలో స్థానికులు 22 మంది ఉన్నారు. ఇటీవల ఈ కేసులో సుమారు 14 మంది సాక్షులను న్యాయమూర్తి దేవీమానస విచారించారు. నేరం రుజువైనం దున సంవత్సరం జైలుశిక్ష, ఒక్కొ్కరికి రూ.700 చొప్పున జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్‌ తరఫున సహాయ ప్రభుత్వ న్యాయవాది ఫణికుమార్‌ వాదించగా లైజన్‌ ఆఫీసర్‌ వీరబాబు సహకరించారు. 

Advertisement
Advertisement