కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి, యువకుడు చనిపోయారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు విద్యార్థుల మృతి
Mar 3 2016 9:33 AM | Updated on Apr 3 2019 8:07 PM
తిమ్మాపూర్: కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం కొత్తపేట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో యువతి, యువకుడు చనిపోయారు. రాజేంద్రనగర్ అగ్రి కళాశాలలో ఫస్టియర్ చదువుతున్న లావుడ్యా మనోహర్‌నాయక్, ఎంబీబీఎస్ చదువుతున్న మొలుగూరి హిమబిందు లక్ష్మి గురువారం ఉదయం రామగుండం నుంచి బైక్ పై వెళ్తుండగా వారి వాహనం కొత్తపేట సమీపంలోని మలుపు వద్ద రోడ్డు పక్కనున్న బండలను ఢీకొట్టింది. ఈ ఘటనలో మనోహర్ నాయక్, హిమబిందు లక్ష్మి అక్కడికక్కడే మృతి చెందారు. కాగా, మనోహర్‌ది నల్లగొండ జిల్లా కాగా, హిమబిందు లక్ష్మిది రామగుండం అని సమాచారం.
Advertisement
Advertisement