breaking news
-
ముందూ వెనుక ఆలోచించకుండానే కూల్చివేతలా?
తెలంగాణ రాజధాని భాగ్య నగరంలో ఏం జరుగుతోంది? ప్రక్షాళన చేస్తున్నామని, లండన్ స్థాయికి చేరుస్తున్నామని ప్రభుత్వం చెబుతూంటే.. కాపురముంటున్న ఇళ్లను కూల్చి తమ జీవితాలను ప్రభుత్వం ధ్వంసం చేస్తోందని బాధితులు ఆరోపిస్తున్నారు. వరదలొస్తే ముంపు సమస్య లేకుండా చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. కాదనడం లేదు. అనుమతుల్లేని నిర్మాణాలపై చర్యలకూ అభ్యంతరం లేదు. చెరువుల్లాంటి జల వనరుల పరిరక్షణే లక్ష్యంగా, అక్రమ నిర్మాణాల కూల్చివేతలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏర్పాటు చేసిన సంస్త హైడ్రా దూకుడుపై సామాన్య, మధ్య తరగతి వర్గాల నుంచి ముందుగా సానుకూలతే వ్యక్తమైంది.అయితే ధనికుల ఇళ్ల మాట ఎలా ఉన్నా.. హైడ్రా పేద, మధ్య తరగతి వర్గాలకే కేంద్రంగా చేసుకుని కూల్చివేతలకు పాల్పడుతూండటంతో గగ్గోలూ ప్రారంభమైంది. నోటీసులివ్వకుండా, అకస్మాత్తుగా.. ఇంట్లోని సామాన్లు రక్షించుకునేందుకూ సమయం ఇవ్వకుండా నేరుగా జేసీబీలతో హైడ్రా విరుచుకుపడుతూండటం సర్వత్రా విమర్శలకు గురవుతోంది. ఇళ్లు కోల్పోయిన వారు దిక్కులేని స్థితిలో పడిపోతున్నారు. అందుకే వారు అంతలా శాపనార్థాలు పెడుతున్నారు.ఇళ్ల కూల్చివేతలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చూసిన వారు ఎవరికైనా ఆవేదన కలక్క మానదు. పుస్తకాలు కూడా తీసుకోనివ్వకుండా తాముంటున్న ఇల్లు కూల్చేశారని ఐదేళ్ల పసిపాప ఏడుస్తూ చెప్పిన వైనం అందరినీ కలచివేసింది. ఇంకో మహిళ తాము రూ.కోటి పెట్టుబడి పెట్టి వర్క్‌షాప్ ఏర్పాటు చేసుకున్నామని, యంత్రాలు తరలించుకునేందుకు అవసరమైన సమయమూ ఇవ్వకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చేశారని వాపోతూ కాంగ్రెస్ పార్టీని దుమ్మెత్తి పోసింది. కొందరు మధ్యతరగతి వారు తాము పది- పదిహేనేళ్లుగా పైసా పైసా కూడబెట్టుకని, బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని కష్టపడి ఇల్లో, అపార్ట్మెంటో సొంతం చేసుకున్నామని, ఇప్పుడు ప్రభుత్వ అకస్మాత్తుగా వాటిని కూల్చేస్తే ఎక్కడికెళ్లాలని ప్రశ్నిస్తున్నారు.గృహప్రవేశం చేసిన వారం కూడా కాక ముందే తమ ఇల్లు కూల్చేశారని ఓ కుటుంబం ఆవేదన వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి సోదరుడితోపాటు ధనికులు ఎక్కువగా ఉన్న చోట్ల నోటీసులిచ్చారని.. వారు కోర్టుకు వెళితే కొంత గడువూ ఇచ్చారని.. పేద, మధ్య తరగతికి చెందిన తమకు మాత్రం అలాంటి సౌకర్యాలు ఎందుకు లేవని వారు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ అనుమతులన్నీ తీసుకుని, రిజిస్ట్రేషన్లూ జరిగిన తమ ఇళ్లకు పన్నులు కూడా కడుతున్నామని, ప్రభుత్వాలు విద్యుత్తు, మురుగునీటి సౌకర్యాలు కల్పించిందని, అయినా.. చెరువు సమీపంలో ఉందనో, ఇంకేదో కారణం చేతనో కూల్చివేతలకు దిగితే తాము ఎవరికి చెప్పుకోవాలని బాధితులు వాపోతున్నారు. ప్రభుత్వ భవనాల మాటేమిటి?మూసి పరివాహక ప్రాంతంలో కాని, హుస్సేన్ సాగర్ తదితర చోట్ల ఎఫ్ టిఎల్, బఫర్ జోన్లలో ప్రభుత్వ ఆఫీసులు ఉన్నాయి. వాటి సంగతేమిటన్న ప్రశ్నలు కూడా వస్తున్నాయి.. వరదలలో ఉండాలని ఎవరూ కోరుకోరు. అదే టైమ్ లో ఇల్లు లేకుండా రోడ్డు మీద పడిపోయే పరిస్థితిని కూడా కోరుకోరు. ఒకవైపు ఇందిరమ్మ ఇళ్లను ఇస్తామని ప్రభుత్వం చెబుతూ, మరో వైపు వేల సంఖ్యలో పేదల ఇళ్లను పడవేస్తుంటే ప్రయోజనం ఏమి ఉంటుంది? ఏది అతి కాకూడదు. మూసి నది మధ్యలో ఉన్న ఇళ్లను తొలగించడానికి కూడా ప్రభుత్వం పూనుకుంది. అయితే ఇక్కడ వారిని మాత్రం బుజ్జగిస్తారట. వారికి మాత్రమే పునరావాసం కల్పించాకే కూల్చుతామని అధికారులు చెబుతున్నారు. కూల్చి వేయవలసిన ఇళ్ల సర్వేకి సిబ్బంది వస్తే ప్రజలు అడ్డుకున్నారు.మూసి నది బెడ్ లో ఉన్న వారికే ఇళ్లు ఇస్తే, మిగిలిన ప్రాంతాల పేదలు ఏమి చేయాలి. రోడ్డు మీదనే నివసించాలా? కూల్చివేతలకు ఇప్పుడు ఉన్న హైడ్రా సిబ్బంది చాలదట. మరో 169 మంది సిబ్బందిని తీసుకుంటారట. ఈ ఫుల్ ఫోర్స్ తో కూల్చివేతలకు దిగుతారట. అన్ని చెరువులకు ఫుల్ టాంక్ లెవెల్, బఫర్ జోన్ వంటివి నిర్ధారణ అయిందా? లేక ఏదో ఒఒక అంచనా ప్రకారం ఇళ్లను తొలగిస్తున్నారా? ఎక్కడైనా వరదలకు కారణం అవుతున్న ఇళ్లను తీయడానికి ప్రయత్నిస్తే అదో పద్దతి. అంతేకాక తగు నోటీసులు ఇచ్చి ఇళ్లు ఖాళీ చేయడానికి అవకాశం కల్పించాలి. అవేమీ అవసరం లేదని అనుకుంటే అది మానవత్వం కాదు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ కు ఓట్లు వేయలేదన్న అక్కసుతోనే రేవంత్ ప్రభుత్వం పేదల ఇళ్లను కూల్చుతోందని మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ అధ్యక్షుడు కెటిఆర్ ఆరోపించారు. అర్థం, పర్థం లేకుండా కూల్చివేతలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ కాని, ఇతర మంత్రులు కాని ప్రభుత్వ చర్యలను సమర్థించుకుంటున్నారు. హైదరాబాద్ ప్రతిష్ట పెంచేందుకు, వరదల వంటి సమస్యలు రాకుండా చేయడానికే తమ ప్రయత్నమని అంటున్నారు. కానీ ప్రభుత్వాలే లాండ్ రెగ్యులరైజేషన్, బిల్డింగ్ రెగ్యులైజేషన్ స్కీములు పెట్టి వేల కోట్లు వసూలు చేసుకున్నాయని, కానీ ఇప్పుడు అందుకు విరుద్దంగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని కొందరు విమర్శిస్తున్నారు.మరో కోణం ఏమిటంటే ప్రస్తుత హైడ్రా కూల్చివేస్తున్న ఇళ్లు, అపార్ట్ మెంట్లు చాలావాటికి బ్యాంకులు, ప్రైవేటు ఆర్దిక సంస్థలు రుణాలు ఇచ్చాయి. ఒక అంచనా ప్రకారం ఇప్పటివరకు కూల్చిన ఇళ్లకు సంబంధించి బ్యాంకు రుణాలే రూ.రెండు వేల కోట్లు వరకు ఉన్నాయి. ఇప్పుడు ఈ కూల్చివేతల వల్ల ఆ బకాయిలు వసూలు కావని బ్యాంకులు ఆందోళన చెందుతున్నాయి. దీనిపై బ్యాంకులు కేద్రానికి, ఆర్బీఐకి లేఖలు రాస్తాయట. ఈ పరిణామాలను ఆలోచించిన తర్వాత, వివిధ పరిష్కార మార్గాలను చూపి ఇళ్ల కూల్చివేతలు చేస్తే ఫర్వాలేదు. అలా కాకుండా లేడికి లేచిందే పరుగు అన్నట్లు ప్రభుత్వం, హైడ్రా, తమకు తోచిన రీతిలో ఇళ్లు కూల్చితే దాని ప్రభావం లక్షల మందిపై పడుతుంది. రేవంత్ ప్రభుత్వం ప్రజాగ్రహానికి గురి అయ్యే అవకాశం ఉంది.లక్ష్యం, ఉద్దేశం మంచిదే అయినా, అమలు తీరు సరిగా లేకపోతే కూడా నష్టం జరుగుతుంది.ఎమర్జెన్సీ టైమ్ లో ఇందిరగాంధీ రెండో కుమారుడు సంజయ్ గాంధీ ఢిల్లీ సుందరీకరణ లో భాగంగా తుర్కుమాన్ గేట్ వద్ద ఇళ్లు కూల్పించారు. దానితో వేలాది మంది నష్టపోయారు. అలాంటి చర్యల ఫలితంగా ఎమర్జెన్సీ ఎత్తివేసి 1977లో ఎన్నికలకు వెళితే డిల్లీతో సహా ఉత్తరాది రాష్ట్రాలన్నిటిలో కాంగ్రెస్ తుడుచిపెట్టుకుపోయింది. అలాంటి అనుభవాలను నేతలు గ్రహించాలి. ప్రస్తుతం హైదరాబాద్‌లోని పలు ప్రాంతాలలో బాధిత ప్రజలు రేవంత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలకు దిగుతున్నారు.ఇందిరాగాంధీ పేరుతో ఏర్పాటైన కాంగ్రెస్ పార్టీ పేదలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోందన్న విమర్శ కూడా మంచిది కాదు. ఇందిరాగాంధీ పేదల కోసం 20 సూత్రాల పధకం తో సహా, పలు కార్యక్రమాలను అమలు చేసి వారి పెన్నిదిగా పేరు తెచ్చుకున్నారు.కాని ఇప్పుడు అదే కాంగ్రెస్ పేదల వ్యతిరేక పార్టీ అని పేరు తెచ్చుకోవడం మంచిది కాదు.నిరసనలు తీవ్రమవుతున్నాయని గమనించిన రేవంత్ ప్రభుత్వం కొద్దిగా తగ్గినట్లు అనిపిస్తోంది. పూర్తి స్థాయిలో ప్రజామోదం లేకుండా రేవంత్ కూల్చివేతలపై ముందుకు వెళితే, తీవ్రమైన పరిణామాలు సంభవించే అవకాశాలు ఉన్నాయి. అంతేకాదు..కాంగ్రెస్ లో ప్రత్యర్ధి వర్గాలు దీనిని అవకాశంగా తీసుకుని రేవంత్ పదవికి ఎసరు పెట్టవచ్చు.కనుక రేవంత్ రెడ్డి తస్మాత్ జాగ్రత్త అని చెప్పాలి.-కొమ్మినేని శ్రీనివాసరావుసీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఢిల్లీ నుంచి వచ్చి క్షమాపణ చెప్తారా?.. కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ నుంచి రాహుల్, ప్రియాంక వచ్చి క్షమాపణ చెప్పాలంటూ ఎక్స్ వేదికగా మాజీమంత్రి, బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ డిమాండ్ చేశారు. అప్పుడు 100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని ఫుల్ పేజీ ప్రకటనలు, స్టాంపు పేపర్ల మీద అఫిడవిట్లు’’ అంటూ కేటీఆర్ దుయ్యబట్టారు. ఇప్పుడు 300 రోజుల తర్వాత, ఒక్క కాంగ్రెస్ నాయకుడు గాని, కార్యకర్త గాని ప్రజలకు సమాధానం చెప్తారా? అంటూ ఆయన ప్రశ్నించారు. అప్పుడు,100 రోజుల్లో నెరవేరుతుంది ప్రతి గ్యారంటీ అని ఫుల్ పేజీ ప్రకటనలు, స్టాంపు పేపర్ల మీద అఫిడవిట్లు ఇప్పుడు,300 రోజుల తర్వాత, ఒక్క కాంగ్రెస్ నాయకుడు గాని, కార్యకర్త గాని ప్రజలకు సమాధానం చెప్తారా ? ఢిల్లీ నుండి రాహుల్, ప్రియాంక వచ్చి క్షమాపణ చెప్తారా ?… pic.twitter.com/eg4Z0S1Jmv— KTR (@KTRBRS) September 30, 2024 -
మూసీ ప్రక్షాళన పేరుతో అవినీతి: బండి సంజయ్
సాక్షి,కరీంనగర్జిల్లా:తెలంగాణలో కాంగ్రెస్,బీఆర్ఎస్ పార్టీలు అవినీతిమయంగా మారాయని కేంద్రమంత్రి బండిసంజయ్ విమర్శించారు.సోమవారం(సెప్టెంబర్30) బండిసంజయ్ మీడియాతో మాట్లాడారు.‘మూసీ ప్రక్షాళన పేరుతో లక్షన్నర కోట్ల అవినీతికి తెర లేపారు.కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలు అమలు చేయలేక హైడ్రా పేరుతో డ్రామాలు చేస్తోంది.పేదల ఇండ్లు కూల్చడం ఇందిరమ్మ రాజ్యమా. బాధితులకు బీజేపీ అండగా నిలుస్తుంది.హైడ్రా మానవత్వం కోణంలో ఆలోచించాలి.ఢిల్లీకి పైసలు పంపడానికే ఈ అక్రమాలకు తెర లేపారు.వారసత్వ, కుటుంబ పార్టీలను బొందపెట్టే సమయం ఆసన్నమైంది.వారసత్వ రాజకీయాలకు బీజెపీ దూరం.స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్తారు’అని బండిసంజయ్ హెచ్చరించారు.ఇదీచదవండి: మూసీకి లక్షల జీవితాలు బలి -
రూ.లక్షన్నర కోట్ల ‘మూసీ’కి లక్షల జీవితాలు బలి
సాక్షి, హైదరాబాద్: ‘రూ. లక్షన్నర కోట్ల మూసీ ధనదాహానికి బలవుతున్న జీవితాలు లక్షల్లో ఉన్నాయి మిస్టర్ చీఫ్ మినిస్టర్’ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ధ్వజమెత్తారు. మూసీ రివర్‌ఫ్రంట్ ప్రాజెక్టుపై సీఎం రేవంత్‌రెడ్డిని నిందిస్తూ ప్రముఖ సామాజిక మాధ్యమ వేదిక ‘ఎక్స్’లో ఆదివారం సుదీర్ఘ పోస్ట్ చేశారు. ‘గుండెలు పగిలి గూళ్లు చెదిరి ఆడబిడ్డల ఆవేద నతో, ఇంటి పెద్దల శాపనార్థాలతో నగరం రోది స్తోంది. రెక్కలు ముక్కలు చేసి కలల కుటీరా లను నిర్మించి కన్నబిడ్డలకు ఇవ్వలేకపోతున్నాన ని ఓ తల్లి... అమ్మ లాంటి ఇల్లు వదిలి వేరే దిక్కు కు ఎలా పోతామని మరో తండ్రి గుండెలు బాదు కుంటున్నారు.ఆడబిడ్డకు కట్నంగా ఇచ్చే ఇల్లు కూలుస్తారేమోనని ఓ తల్లిఆత్మహత్య చేసుకుంది. భార్య కడుపుతో ఉందన్నా కనికరించరా? అని ఓ భర్త ఒంటిపై పెట్రోల్ పోసుకున్నాడు. నాడు రైతుల ప్రయోజనం కోసం 30 వేల ఎకరాల ఆయకట్టుకు నీళ్లు ఇచ్చే రిజర్వాయర్ నిర్మాణం విషయంలో 20 కార్లతో రైతులను రెచ్చగొడుతూ శవాలపై పేలాలు ఏరుకున్న సన్నాసి ఇప్పుడు ఎక్కడ పన్నావ్? నాడు అలా – నేడు ఇలా.. నీ అవసరానికి ఎంత నీచానికైనా తెగిస్తావని మరోమారు నిరూపించావ్’అని సీఎం రేవంత్‌పై కేటీఆర్ ధ్వజమె త్తారు. ప్రజలు అధైర్యపడి ప్రాణాలు తీసుకోవద్దని.. కోర్టులు, బీఆర్ఎస్ అండగా ఉంటాయని ధైర్యం చెప్పారు.బావమరిదితో నోటీసు ఇప్పిస్తే..అమృత్ టెండర్ల అంశంలో తాను చేసిన ఆరో పణలపై సీఎం రేవంత్ బావమరిది సృజన్‌రెడ్డి లీగల్ నోటీసులు పంపడాన్ని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘బావ మరిదితో లీగల్ నోటీసు పంపితే నీ ఇల్లీగల్ దందాల గురించి మాట్లాడుడు బంద్ చేస్తానని అనుకుంటున్నావా? బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూ స్తూ ఊరుకోము’అని వ్యాఖ్యానించారు. సీఎం ప్రాతినిధ్యం వహిస్తున్న మున్సిపల్ శాఖలోనే ఆయన బావమరిది శోధ కంపెనీకి రూ.1,137 కోట్ల టెండర్ కట్ట బెట్టింది నిజమన్నారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లు 7, 11, 13ని సీఎం ఉల్లంఘించారని ఆరోపించారు. శోధ గత రెండే ళ్లుగా కేవలం రూ. 2 కోట్ల లాభాన్నే ఆర్జించిన ఓ చిన్న కంపెనీ అన్నారు. ‘ఢిల్లీలో ఉన్న నీ బీజేపీ దోస్తులు కూడా నిన్ను కాపాడటం కష్టమే. నీకు ఆదర్శ్ కుంభకోణంలో అశోక్ చవాన్‌గా దొరి కావు.. రాజీనామా తప్పదు’ అని పోస్ట్ చేశారు. -
ప్రజల్ని భయభ్రాంతుల్ని చేస్తే ఊరుకోం
బండ్లగూడ: రాష్ట్ర ప్రభుత్వం మూసీ సుందరీకరణ పేరుతో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తోందని.. ప్రజల జోలికి వస్తే ఊరుకునే ప్రసక్తే లేదని మాజీ మంత్రి హరీశ్‌రావు హెచ్చరించారు. హైదరా బాద్‌లోని బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరే షన్ పరిధిలో ఉన్న గంధంగూడ, బైరాగిగూడ మూ సీ పరీవాహక ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోతున్న బాధి తులను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఆ పార్టీ నేతలు ఆదివారం పరామర్శించారు.ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు హరీశ్‌రావు, మహమూద్ ఆలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, మాజీ శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్, మాజీ స్పీకర్ మధుసూద నాచారి, ఎమ్మెల్యేలు కౌశిక్‌రెడ్డి, మాధవరం కృష్ణారావు, రాజేంద్రనగర్ నియోజకవర్గ బీఆర్ఎస్ ఇన్చార్జి పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి, స్థానిక కార్పొరేటర్లు మాలతీనాగరాజ్, రవీందర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా విశాల్ నగర్ కాలనీ నుంచి కేంద్రీయ విహార్ వరకు ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వానికి, సీఎం రేవంత్‌రెడ్డికి వ్యతిరే కంగా నినాదాలు చేశారు. అనంతరం కేంద్రీయ విహార్ వద్ద ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లాడారు. ఫోన్ చేయండి.. అరగంటలో మీ ముందుంటామూసీ పరీవాహక ప్రాంతాల్లో ఇళ్లు కోల్పోతున్న బాధితులకు అండగా నిలుస్తామని హరీశ్‌రావు చెప్పారు. ‘ఆపదొస్తే ఫోన్ చేయండి... అర్ధ గంటలో మీ ముందుంటా. బుల్డోజర్లు వచ్చి నా, జేసీబీలు వచ్చానా ముందు మమ్మల్ని దా టాలి’ అని వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ తీరుపై విరుచుకుపడ్డారు. ‘బలిసినోళ్ల కు దగ్గరుండి ఇళ్లు కట్టిస్తున్నావ్.. పేదల ఇళ్లను మా త్రం కూలగొడుతున్నావ్. ఇదెక్కడి న్యాయం? రేవంత్‌రెడ్డి.. నీ ప్రభుత్వ జీవితకాలం ఐదేళ్లు మాత్రమే.కానీ నువ్వు కూలగొట్టే పేదల ఇళ్లు వారి జీవితకా లం కల’అని హరీశ్‌రావు పేర్కొన్నారు. కొడంగల్ లోని సీఎం ఇల్లు రెడ్డికుంటలో ఉందని.. ఆ ఇంటిని రేవంత్ ముందుగా కూలగొట్టాలని డిమాండ్ చేశా రు. సీఎం బయటకొచ్చి బాధితులకు భరోసా ఇవ్వాలని.. మూసీ సుందరీకరణను ప్రభుత్వం మానుకోవాలని హితవు పలికారు. ప్రజలకు ఇబ్బందులు వస్తే తెలంగాణ భవన్‌కు రావాలని... అర్ధరా త్రి వచ్చినా బాధితులకు ఆశ్రయం ఇస్తామని.. ఆత్మవిశ్వాసం కోల్పోవద్దని సూచించారు.బడి పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టడం ప్రాధాన్యత కాదా?ఎస్సీ, బీసీ హాస్టల్స్‌లో పేద పిల్లలకు అన్నం పెట్టేందుకు డబ్బుల్లేవంటున్న ప్రభుత్వం.. మూసీ సుందరీకరణ కోసం రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేస్తానంటే ప్రజలు నమ్మరని హరీశ్‌రావు పేర్కొన్నారు. పేద పిల్లలకు బుక్కెడు బువ్వ పెట్టడం ప్రభుత్వ ప్రాధా న్యతా లేక రూ. లక్షన్నర కోట్లు ఖర్చు చేసి మూసీ సుందరీకరణ చేపట్టడం ప్రాధాన్యతో సీఎం చెప్పా లన్నారు. కొన్ని పాఠశాలల్లో ఆడ పిల్లలకు టాయి లెట్స్ లేక వందల మంది లైన్లలో నిలబడుతున్నా రని.. వారి కోసం టాయిలెట్స్ కట్టడం ప్రభుత్వ ప్రాధాన్యత కాదా? అని ప్రశ్నించారు.ప్రభుత్వం బిల్లులు చెల్లించకపోవడంతో గాంధీ ఆస్పత్రికి మందుల సరఫరా నిలిచిపోయిందని.. దీంతో రోగులకు మందులు లేక అవస్థలు పడుతున్నారన్నారు. కానీ సీఎం మాత్రం సుందరీకరణ పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఫార్మాసిటీ కోసం గత కేసీఆర్ ప్రభుత్వం 15 వేల ఎకరాల భూసేకరణ చేస్తే దాన్ని పక్కనపెట్టి రియల్ ఎస్టేట్ బ్రోకర్ సాయంతో ఫోర్త్‌సిటీ నిర్మిస్తానని సీఎం అంటున్నారని విమర్శించారు. -
అసమ్మతిపై కాంగ్రెస్ ‘ఫోకస్’
సాక్షి, హైదరాబాద్: వలస నేతల రాకతో క్షేత్రస్థాయిలో నివురు గప్పిన నిప్పులా ఉన్న అసమ్మతిపై అధికార కాంగ్రెస్ పార్టీ ప్రత్యేక దృష్టి పెడుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు, ఆ తర్వాత ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతల కారణంగా రాష్ట్రంలోని 20–25 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పార్టీ నేతల మధ్య సమన్వయం లోపించిందనే నిర్ణయానికి వచ్చిన పీసీసీ ఈ మేరకు కార్యాచరణ రూపొందిస్తోంది. టీపీసీసీ కొత్త చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్ స్వయంగా ఇందుకోసం రంగంలోకి దిగనున్నారని తెలుస్తోంది.జిల్లా ఇన్చార్జి మంత్రి, ఏఐసీసీ ఇన్చార్జి కార్యదర్శిల సమక్షంలో ఆయా నియోజకవర్గాల్లోని పాత, కొత్త నాయకులు, కేడర్‌ను పిలిపించి మాట్లాడాలని, వారి అభ్యంతరాలు, సమస్యలను తెలుసుకుని రెండు బృందాలు కలిసి పనిచేసేలా సమన్వయం చేయాలనే నిర్ణయానికి పీసీసీ చీఫ్ వచ్చారు. ఇప్పటికే ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని గద్వాల అసెంబ్లీ నేతలతో మాట్లాడిన ఆయన.. ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి, అక్కడి నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన సరితాయాదవ్ల మధ్య సఖ్యత కుదిర్చారనే చర్చ గాంధీభవన్ వర్గాల్లో జరుగుతోంది.ఈ నియోజకవర్గమే కాకుండా ఇటీవల బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి వచ్చిన నాయకులకు సంబంధించి పది అసెంబ్లీ నియోజకవర్గాలు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి ఎమ్మెల్యేలుగా పోటీ చేసి గెలిచిన మరో పది నుంచి పదిహేను అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో కూడా మాట్లాడి క్షేత్రస్థాయిలో కేడర్‌కు ఇబ్బంది లేకుండా చూడాలని, ముఖ్యంగా స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో తలనొప్పులు రాకుండా ముందే పరిస్థితిని సెట్ చేయాలని పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ నిర్ణయించారు.సమర్థుల కోసం అన్వేషణపీసీసీకి కొత్త చీఫ్ నియమితులైన నేపథ్యంలో పాత కార్యవర్గం రద్దు కానుంది. ఈ నేపథ్యంలో కొత్త కార్యవర్గాన్ని ఏర్పాటు చేయనున్నారు. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్లు, సీనియర్ ఉపాధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, కార్యదర్శులు, అధికార ప్రతినిధులను కొత్తగా నియమించనున్నారు. అయితే, పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో జంబో కార్యవర్గం కాకుండా పదవుల సంఖ్యను తగ్గించే యోచనలో రాష్ట్ర నాయకత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఇదే విషయంపై ఏఐసీసీ పెద్దలతో చర్చించిన అనంతరం నిర్ణయం తీసుకోనున్నారు. ప్రస్తుతం గాంధీభవన్ వర్గాల్లో జరుగుతున్న చర్చ ప్రకారం.. గతంలో నలుగురు వర్కింగ్ ప్రెసిడెంట్లు ఉండగా, ఇప్పుడు మూడుకు తగ్గించే అవకాశాలున్నాయి.సీనియర్ ఉపాధ్యక్షుల నియామకంపై పునరాలోచన చేయాలని, ఉపాధ్యక్ష పదవులు, ప్రధాన కార్యదర్శుల పదవుల్లో సీనియర్ నాయకులకు అవకాశమివ్వాలని యోచిస్తున్నట్టు తెలుస్తోంది. ఈసారి టీపీసీసీ అధికార ప్రతినిధులను ఏరికోరి ఎంపిక చేయాలని పార్టీ పెద్దలు భావిస్తున్నారు. ఇటు పార్టీతో పాటు అటు ప్రభుత్వ వాయిస్‌ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగేలా మాట్లాడగలిగిన సమర్థుల కోసం అన్వేషిస్తున్నారు. దీంతో ఈసారి అధికార ప్రతినిధుల జాబితాలో కూడా భారీ మార్పులు జరుగుతాయని తెలుస్తోంది. ఇక, కొత్త పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ ఇటీవల విలేకరులతో ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ పార్టీకి డీసీసీ అధ్యక్షులే కీలకమని చెప్పారు.ఈ నేపథ్యంలో త్వరలోనే డీసీసీ అధ్యక్షుల మార్పు ఉండే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొన్ని జిల్లాల్లో పార్టీ ఎమ్మెల్యేలను జిల్లా పార్టీ అధ్యక్షులుగా నియమించనున్నారు. ఇక, కొత్త పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ అక్టోబర్ 4వ తేదీ నుంచి జిల్లాల పర్యటనకు వెళ్లనున్నారు. తన సొంత జిల్లా అయిన నిజామాబాద్‌కు ఆయన ముందుగా వెళ్తారని, ఆ తర్వాత అన్ని జిల్లాల పార్టీ సమీక్షలు ముగించుకుని ఒక్కో జిల్లాకు వెళ్లి పార్టీ కేడర్‌కు మహేశ్‌గౌడ్ దిశానిర్దేశం చేస్తారని గాంధీభవన్ వర్గాలు వెల్లడించాయి. -
అశోక్ చవాన్‌లా దొరికావు: సీఎం రేవంత్‌పై కేటీఆర్ ట్వీట్
సాక్షి,హైదరాబాద్:‘బావమరిదితో లీగల్ నోటీసు పంపితే నీ అక్రమ దందాల గురించి మాట్లాడుడు బంద్ చేస్తా అనుకుంటున్నావా?’అని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు కేటీఆర్ ఆదివారం(సెప్టెంబర్29) ఎక్స్(ట్విటర్)లో ఒక పోస్టు చేశారు.‘ఆదర్శ్ కుంభకోణంలో మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్లాా నువ్వు దొరికావు. నీ రాజీనామా తప్పదు.బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోం.సీఎం ఆధ్వర్యంలో ఉన్న శాఖలోనే ఆయన బావమరిది శోద కంపెనీకి రూ.1,137 కోట్ల టెండర్ కట్టబెట్టింది నిజం.అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్స్ 7,11,13ని సీఎం ఉల్లంఘించారు.శోద కంపెనీ గత రెండు సంవత్సారాలుగా రెండు కోట్లు మాత్రమే లాభం ఆర్జించిన ఒక చిన్న కంపెనీ.ఈ కుంభకోణంలో ఢిల్లీలో ఉన్న నీ బీజేపీ దోస్తులు కూడా నిన్ను కాపాడడం కష్టమే.ఈ దేశంలో న్యాయవ్యవస్థ బలంగా,నిజాయితీగా ఉన్నది’అని కేటీఆర్ ట్వీట్లో పేర్కొన్నారు.ఇదీ చదవండి: హైడ్రా కూల్చివేతలు..మంత్రి శ్రీధర్‌బాబు కీలక ప్రకటన -
‘హైడ్రా’ కూల్చివేతలు..మంత్రి శ్రీధర్‌బాబు కీలక ప్రకటన
సాక్షి,హైదరాబాద్: ప్రజలను రెచ్చగొట్టేందుకు కొన్ని అవకాశవాద శక్తులు చాలా కష్టపడుతున్నాయని రాష్ట్ర ఐటీ, పరిపశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు అన్నారు.అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో శ్రీధర్‌బాబు ఆదివారం(సెప్టెంబర్29) మీడియాతో మాట్లాడారు.‘చెరువులు,జలాశయాల రక్షణ కోసం రాష్ట్ర ప్రభుత్వం పరితపిస్తోంది.మూసీ ఆక్రమణలో ఉన్న ప్రతీ ఒక్కిరికీ ప్రత్యమ్నాయ సదుపాయం కల్పిస్తున్నాం.పేదలకు ఏ రోజూ కాంగ్రెస్ అన్యాయం చేయలేదు.చేయదు. ఇళ్లు కోల్పోయిన వారందరికీ 2013 చట్టప్రకారం నష్టపరిహారం అందజేస్తాం. హైడ్రాతో పేదవారికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. మూసీ ఆక్రమణలో ఉన్న పేదలందరికీ డబుల్‌బెడ్ రూమ్ ఇల్లు ఇస్తామని సీఎం హామీ ఇచ్చారు.మూసీలో మంచి నీరు ప్రవహించాలని మేం ప్రయత్నం చేస్తున్నాం.నందనవనం ప్రాజెక్టు చేపట్టినపుడు ప్రత్యమ్నాయ ఏర్పాట్లు చేయలేకపోయారు.కానీ మేం ఈరోజు పేదలందరికీ పక్కా ఇల్లు ఇస్తున్నాం.పేదలను నిలబెట్టే సంస్కృతి కాంగ్రెస్‌ది. పడగొట్టే సంస్కృతి బీఆర్ఎస్ది. బీఆర్ఎస్ది బుల్డోజర్ పాలసీ. మల్లన్నసాగర్ వద్ద బుల్డోజర్లతో పేదలను ఇళ్లను కూల్చారు’అని శ్రీధర్‌బాబు విమర్శించారు.ఇదీ చదవండి: హైడ్రా ముందే మేల్కొంటే బాగుండేది -
ఇందిరమ్మ రాజ్యమంటే ఇళ్లు కూల్చడమా?: బండి సంజయ్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైడ్రా పాపం కాంగ్రెస్‌కు తప్పకుండా తగులుతుందన్నారు కేంద్రమంత్రి బండి సంజయ్. ఇందిరమ్మ రాజ్యం అంటే పేదల ఇళ్లు కూల్చడమా? అంటూ ప్రశ్నించారు. అలాగే, ప్రభుత్వం ఇప్పడికైనా హైడ్రాపై సమీక్ష చేయాలన్నారు.కేంద్రమంత్రి బండి సంజయ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. కిషన్ రెడ్డి రాగానే హైడ్రాపై బీజేపీ కార్యాచరణ ప్రకటిస్తాం. పేదలకు బీజేపీ అండగా ఉంటుంది. ఒకటి లేదా రెండు రోజుల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. బుల్డోజర్లు ముందుగా మామీద నుండి వెళ్లాలి. అప్పుడే పేదల ఇళ్ల వద్దకు బుల్డోజర్లు వెళ్తాయి. తెలంగాణలో హైడ్రా పాపం కాంగ్రెస్‌కు తగులుతుంది. ఎన్ని ఇబ్బందులు తలెత్తిన అధికారులతో మీడియా సమావేశం పెట్టి తప్పును కప్పి పుచ్చుకుంటున్నారు. ఇందిరా రాజ్యం అంటే పేదల ఇళ్ళు కూల్చడమా?. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు చుక్కలు చూపిస్తోంది. భూమి పట్టాలు, లింకు డాక్యుమెంట్స్, గ్రామా పంచాయితీ అనుమతి ఉన్న వారి ఇళ్లను కూడా కూల్చివేస్తున్నారు. అందులో ఉన్న వాళ్లంతా పేదలే. హైడ్రా వల్ల ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి కూడా దెబ్బతింది. ఇప్పటికైనా హైడ్రాపై ప్రభుత్వం సమీక్ష చేయాలి’ అంటూ కామెంట్స్ చేశారు.మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్ మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డి హామీలు అమలు చేయలేక పిల్లి గంతులు వేస్తున్నారు. బ్యాంకులు 73 లక్షల మందికి రుణాలు ఇచ్చామని చెబుతున్నారు.. 48 లక్షల మందికి అని రేవంత్ రెడ్డి చెప్పారు. 35 నుంచి 40 శాతం మంది రైతులకు మాత్రమే రుణమాఫీ అయ్యింది. మేడ్చల్‌లో ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నారు. రైతులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ రేపు బీజేపీ దీక్ష చేపట్టింది. అప్పులపాలై రుణమాఫీ కానీ రైతులందరూ రైతు దీక్షకు హాజరై విజయవంతం చేయాలి. రైతు బంధు, రైతు బీమా, రైతు బోనస్ వస్తాయనే నమ్మకం లేకుండా పోయింది. రేవంత్ వాలకం చూస్తుంటే ఇచ్చిన హామీలు అమలు చేసే పరిస్థితి కనిపించడం లేదు. రేవంత్ రెడ్డి మెడలు వంచడానికి కలిసికట్టుగా పోరాటం చేద్దాంబీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి.. రేపు ధర్నా చౌక్‌లో రైతు దీక్ష చేపడుతున్నాం. రైతులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం విస్మరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ దీక్ష చేస్తున్నాం. రైతు హామీల సాధన దీక్షను విజయవంతం చేయడానికి ప్రతీ రైతు కదలిరావాలని పిలుపునిచ్చారు. ఇది కూడా చదవండి: కూల్చివేతలపై హైడ్రా మరోసారి ఆలోచించాలి: దానం నాగేందర్ -
హైడ్రా ముందే మేల్కొంటే బాగుండేది: దానం నాగేందర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో హైడ్రా అంటే ప్రజల్లో టెన్షన్ కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో హైడ్రాపై ఎమ్మెల్యే దానం నాగేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు. హైడ్రా కొంచెం ముందుగా మేల్కొంటే ప్రజల్లో అభద్రతాభావం వచ్చేది కాదు అంటూ కామెంట్స్ చేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కారణంగానే అక్రమ కట్టడాలను పర్మిషన్ ఇచ్చినట్టు చెప్పుకొచ్చారు.ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘హైడ్రా కూల్చివేతలపై నిజ నిర్దారణ కమిటీ వేయాలని సీఎం రేవంత్ రెడ్డిని కోరుతాను. హైడ్రా కాస్త ముందే మేల్కొంటే ప్రజల్లో అభద్రతాభావం వచ్చేది కాదు. మూసీలో ఆక్రమణలు ఉన్నాయని మంత్రిగా ఉన్న సమయంలో కేటీఆర్ చెప్పలేదా?. అక్రమ కట్టడాలను కూల్చేస్తామని కేసీఆర్ ప్రకటించింది మర్చిపోయారా. అక్రమ కట్టడాలకు బీఆర్ఎస్ హయాంలోనే విచ్చలవిడిగా పర్మిషన్ ఇచ్చారు. కూల్చివేతలపై కాంగ్రెస్ పార్టీ కూడా మరింత లోతుగా ప్రజలకు అవగాహన కల్పించాలి. కూలగొట్టే ముందు అక్కడి వాస్తవ పరిస్థితులు హైడ్రా ప్రజలకు తెలియజేస్తే ఇంత ఇబ్బంది అయ్యేది కాదు. చిన్న చిన్న ఘటనలు ప్రభుత్వానికి చెడ్డ పేరు తెస్తున్నాయి. ఒక చిన్నారి తన పుస్తకాలు ఇంట్లో ఉన్నాయని బోరున ఏడ్చింది.. నాకు చాలా బాధగా అనిపించింది. పేదల విషయంలో హైడ్రా మరోసారి ఆలోచించాలి. గ్రేటర్ హైదరాబాద్‌లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకు పది ఎమ్మెల్యేలు సిద్ధంగా ఉన్నారు. మా కేసు బూచీగా చూపెట్టి బీఆర్ఎస్ పెద్దలు ఆపుతున్నారు. కాస్త ఆలస్యం అయినా మిగతా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక పక్కా. సీఎం రేవంత్ రెడ్డిని అసభ్య పదజాలంతో బీఆర్ఎస్, బీజేపీ నేతలు తిట్టిస్తున్నారు. గౌరవప్రదంగా ఉండే హరీష్ రావు కూడా గాడి తప్పారు. బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారు. ఇదే విషయాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్ళాను’అని కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా..‘మూసీ, హైడ్రా బాధితులకు బీఆర్ఎస్ పార్టీ అండగా నిలిచింది. మాజీ మంత్రులు హరీశ్‌రావు, సబితా ఇంద్రారెడ్డి నేతృత్వంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల బృందం మూసీ పరీవాహక ప్రాంతాల్లో పర్యటిస్తున్నారు. ఇందులో భాగంగా హైదర్షా కోట్లో మూసీ బాధితుల ఇండ్లను పరిశీలిస్తున్నారు. బాధితులకు అండగా ఉంటామని భరోసానిస్తున్నారు. పార్టీ తరఫున న్యాయపరంగా పోరాటం చేస్తామని వెల్లడించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మూసీ బాధితులు చేస్తున్న ధర్నాకు మద్దతు తెలిపారు.ఇది కూడా చదవండి: బలవంతంగా ఖాళీ చేయించం.. ఒప్పించి పంపిస్తాం: హైడ్రా రంగనాథ్ -
హైడ్రా బాధితులతో బీఆర్ఎస్ బృందం ముఖాముఖి
సాక్షి, హైదరాబాద్: హైడ్రా కూల్చివేతల ప్రాంతాల్లో బీఆర్ఎస్ బృందం ఆదివారం పర్యటించింది. బండ్లగూడ జాగీర్, హైదర్షాకోట్, గంధంగూడలో పర్యటించిన బీఆర్ఎస్ నేతలు.. మూసీ ప్రాంత వాసుల ధర్నాలో పాల్గొన్నారు. హడ్రా బాధితులతో మాజీ మంత్రులు హరీష్‌రావు, సబిత, తలసాని ముఖాముఖిగా మాట్లాడారు.తెలంగాణ భవన్ నుంచి క్షేత్రస్థాయి పర్యటనకు బీఆర్ఎస్ బృందం బయలు దేరింది. మాజీ మంత్రులు హరీష్ రావు, సబితా ఇంద్రారెడ్డి, మల్లారెడ్డి, గంగుల కమలాకర్, మహమ్మద్ హాలీ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ బృందంలో ఎమ్మెల్యేలు, రాజశేఖర్ రెడ్డి, వివేక్ గౌడ్, కాలేరు వెంకటేష్ , మాధవరం కృష్ణారావు, సంజయ్, పాడి కౌశిక్ రెడ్డి ఉన్నారు.ఈ సందర్భంగా హరీష్‌రావు మాట్లాడారు. తెలంగాణలో తుగ్లక్ పాలన సాగుతోందన్నారు. సీఎం రేవంత్ మూసీ సుందరీకరణ పేరిట రియల్ వ్యాపారం చేస్తున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: ‘బలవంతంగా ఖాళీ చేయించం.. ఒప్పించి పంపిస్తాం’‘‘పేదల ఇళ్లకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలం రక్షణ కవచంలా నిలబడతాం. పేదల ఇళ్లు కూల్చాలంటే ముందుగా మా ఎమ్మెల్యేలపై జేసీబీ, బుల్డోజర్లు వెళ్లాలి. దేశాన్ని కాపాడే సైనికులు సైతం తమ ఇంటిని కాపాడుకోలేకపోతున్నారు. కొడంగల్‌లో సర్వే నంబర్ 1138లో ముఖ్యమంత్రి ఇల్లే చెరువులో ఉంది. ముఖ్యమంత్రికి ఒక రూల్.. ఆయన సోదరుడికి ఒక రూల్.. గరీబోళ్లకు మరొక రూలా?. హైడ్రా బలిసినోళ్ల కోసమే పని చేస్తుంది. ఇందిరాగాంధీ పేదరికాన్ని పోగడతానంటే.. ఇందిరమ్మ రాజ్యంలో రేవంత్ పేదల బతుకులను కూల్చుతున్నాడు. బుల్డోజర్ రాజ్యం నడవదంటోన్న రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలి’’ హరీష్‌రావు డిమాండ్ చేశారు.‘‘హస్తం గుర్తు స్థానంలో కాంగ్రెస్.. బుల్డోజర్ గుర్తు పెట్టుకోవాలి. హైడ్రా పుణ్యమాని మూడు ప్రాణాలు పోయాయి. లే అవుట్స్‌కు అప్రోవల్ ఇచ్చిందే కాంగ్రెస్ ప్రభుత్వంలో.. కాంగ్రెస్ తప్పిదాలకు పేదలు బలికావాలా ?. సీఎం రేవంత్ రెడ్డి పేదల ఉసురు పోసుకుంటున్నాడు. హామీలను అమలు చేయడానికి లేని డబ్బులు.. మూసీ సుందరీకరణకు నిధులెక్కడవి?. లక్ష కోట్లు డిపాజిట్ చేశాకనే మూసీ సుందరీకరణ చేయాలి. 1908లో మూసీకి వరదలు వస్తే.. నిజాం నవాబ్ గోడ నిర్మించాడు. ప్రభుత్వం చేసే తప్పులను అసెంబ్లీ లోపల, బయట ఎత్తిచూపుతునే ఉంటాం’’ అని హరీష్‌రావు చెప్పారు. -
రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి తేవాలి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతూనే సభ్యత్వ నమోదును కూడా పూర్తిస్థాయిలో చేపట్టాలని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జేపీ నడ్డా పార్టీ రాష్ట్ర నేతలను ఆదేశించారు. ఈ కార్యక్రమాలను సమాంతరంగా చేపడుతూ వచ్చే ఎన్నికల్లో బీజేపీని రాష్ట్రంలో అధికారంలోకి తెచ్చే లా కృషి చేయాలని సూచించారు. శనివారం బేగంపేటలోని ఓ హోటల్లో సభ్యత్వ నమోదుపై సమీక్షలో ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ, ఎన్నికల్లో పోటీ చేసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలతో నడ్డా సమావేశమయ్యారు. అత్యధిక సభ్యత్వాలు చేసిన వారికే పదవులు గత ఎన్నికల్లో ఓటమి చవిచూసిన ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపీలు, ఎమ్మెల్యేలుగానే పార్టీ పరిగణిస్తోందని చెప్పారు. అందువల్ల ఎన్నికల్లో ఓడిన నేతలు కూడా పార్టీ పటిష్టానికి పనిచేయాలని దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఇప్పటివరకు 10 లక్షల మందిని సభ్యులుగా చేర్చారని.. అక్టోబర్ 15 వరకు చేపడుతున్న సభ్యత్వ నమోదులో భాగంగా 50 లక్షల మందికిపైగా సభ్యులను చేరి్పంచేలా కృషి చేయాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు 77 లక్షల ఓట్లు రావడంతోపాటు 8 ఎంపీ సీట్లు గెలిచినందున... పడిన ఓట్లలో 75 శాతం మందిని పార్టీ సభ్యులుగా చేర్పించడం పెద్ద కష్టమేమి కాకూడదన్నారు.అత్యధిక సభ్యత్వాలను చేయించిన వారికే పదవులు దక్కుతాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో ఏర్పడిన రాజకీయ పరిస్థితులు, పార్టీ పటిష్టానికి చేపడుతున్న చర్యలను గురించి పార్టీ నేతలను అడిగి తెలుసుకున్నట్టు పార్టీ వర్గాలు పేర్కొన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిస్థాయిలో రైతు రుణమాఫీని చేయనందున ఈ నెల 30న పార్టీ ఆధ్వర్యంలో రైతు హామీల సాధన పేరిట దీక్ష నిర్వహిస్తున్నట్టు రాష్ట్ర నేతలు నడ్డాకు వివరించారు. ఈ సమావేశం ముగిశాక బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డా. కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో బీజేపీ సభ్యత్వ నమోదుకు మంచి స్పందన వస్తోందని నడ్డా ప్రశంసించారన్నారు. నడ్డాతో భేటీలో పార్టీ పార్లమెంటరీ బోర్డు సభ్యుడు కె. లక్ష్మణ్, కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, ఈటల రాజేందర్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎం.రఘునందన్‌రావు, గోడెం నగే‹Ù, బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి పాల్గొన్నారు. -
హైడ్రా బాధితుల తరఫున కొట్లాడుతాం: బీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: కూల్చివేతల పేరుతో బుల్డోజర్లు వస్తే.. వాటికంటే ముందు తాము వస్తామని భరోసా ఇస్తోంది బీఆర్ఎస్. శనివారం మధ్యాహ్నాం తెలంగాణ భవన్లో మూసీ సుందరీకరణ బాధితులతో ఆ పార్టీ నేతలు సమావేశం అయ్యారు.ఈ భేటీలో పలువురు కూల్చివేతలతో తమకు జరుగుతున్న నష్టం గురించి కంటతడి పెట్టుకున్నారు. ‘‘కొడంగల్‌లో రేవంత్ రెడ్డి ఇల్లు చెరువులో ఉంది. బాధితుల వద్దకు బుల్డోజర్లు వెళ్తే వాటికంటే ముందు మేము వస్తాం. ఈ ప్రభుత్వంతో మీ తరఫున మేం కొట్లాడుతాం. అధైర్యపడొద్దు’’ అని బీఆర్ఎస్ నేతలు ప్రస్తావించారు. ఈ కార్యక్రమంలో హరీష్‌రావు, సబితా ఇంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.కేటీఆర్‌కు జ్వరం తెలంగాణ భవన్‌కు వస్తున్న హైడ్రా బాధితులకు అండగా నిలవాని పార్టీ నాయకులకు, శ్రేణులకు వర్కింగ్ ప్రెసిడెంట కేటీఆర్ సూచించారు. గత రెండ్రోజులగా తీవ్ర జ్వరంతో బాధపడుతున్న ఆయన.. ఇవాళ్టి తెలంగాణ భవన్‌కు వెళ్లలేకపోయారు. ఈ నేపథ్యంలో ఆయన ఎక్స్ ఖాతాలో ఓ సందేశం ఉంచారు. హైడ్రా బాధితులకు అండగా పార్టీ సీనియర్ నాయకులు, పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ న్యాయవిభాగం అండగా ఉంటుందని తెలిపారాయన.Down with fever, cough and heavy cold since 36 hours. Taking Anti viral, antibiotics, anti histamine as per doctor instructions Hopefully will be better soon Meanwhile, our @BRSparty MLAs and senior leaders along with legal team will support the demolition victims who are…— KTR (@KTRBRS) September 28, 2024ఇక.. హైడ్రా బాధితుల కోసం బీఆర్ఎస్ క్షేత్రస్థాయి పర్యటనకు సిద్దమైంది. ఆదివారం ఉదయం బాధితుల వద్దకే బీఆర్ఎస్ బృందం వెళ్లనుందని సమాచారం. ఈ బృందంలో కేటీఆర్, హరీష్‌రావుతో పాటు నగర ఎమ్మెల్యేలు, మాజీమంత్రులు ఉండనున్నారు. బండ్లగూడ జాగీర్, హైదర్ షా కోట్, గంధంగూడలో పర్యటించి.. పలువురు అపార్ట్మెంట్లు, విల్లాల వాసులతో సమావేశంకానున్నారు. -
ఎనుముల కాదు.. ఎగవేతల రేవంత్‌రెడ్డి: హరీశ్‌రావు
సాక్షి, సిద్దిపేట/నంగనూరు: హామీలన్నీ తుంగలో తొక్కుతున్న సీఎం.. ఇక నుంచి ఎనుముల రేవంత్‌రెడ్డి కాదని, ఎగవేతల రేవంత్‌రెడ్డి అని మాజీమంత్రి తన్నీరు హరీశ్‌రావు ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా ఇచ్చిన హామీలు అమలు చేయాలన్నారు. సిద్దిపేట జిల్లా నంగనూరు మండలకేంద్రంలో శుక్రవారం రైతు ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హరీశ్‌రావు మాట్లాడుతూ దసరాలోపు రైతులందరికీ రుణ మాఫీ చేయాలని, లేకపోతే రైతులందరితో కలిసి సచివాలయం ముట్టడిస్తామని హెచ్చరించారు.రైతులకు రూ.2 లక్షల రుణమాఫీ జరిగే వరకు రేవంత్‌రెడ్డి గుండెల్లో నిద్రపోతా అన్నారు. ఒక్క నంగనూరు మండలంలోనే 11 వేల మంది రైతులు రుణాలు తీసుకుంటే, కేవలం 5,102 మందికే మాఫీ అయ్యిందని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని చెబుతున్న సీఎం.. మల్లన్నసాగర్, రంగనాయకసాగర్ ఎలా నిండిందో చెప్పాలన్నారు. దసరాలోపు మాఫీ చేయకుంటే రైతులతో కలసి సచివాలయం ముట్టడిస్తామని చెప్పారు. -
మాది నిర్మాణం.. కాంగ్రెస్‌ది విధ్వంసం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ ప్రభుత్వం లక్ష డబుల్ బెడ్ రూం ఇళ్లను నిర్మించిందనే వాస్తవాన్ని.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎట్టకేలకు అంగీకరించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు అన్నారు. మూసీ నది పునరుద్ధరణలో ఇళ్లు కోల్పోతున్న వారికి.. డబుల్ బెడ్ రూం ఇళ్లు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేయడమే దీనికి నిదర్శనమన్నారు. డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణంపై ఇన్నాళ్లూ కాంగ్రెస్ పార్టీ చేసిన విష ప్రచారం, అబద్ధాలకు తాజా ఉత్తర్వులే సాక్ష్యమని ‘ఎక్స్’వేదికగా కేటీఆర్ పేర్కొన్నారు. ‘మేము నిర్మిస్తే.. మీరు కూల్చేస్తున్నారు.మాది నిర్మాణం.. మీది విధ్వంసం. లక్షల నిర్మాణాలు మావి.. లక్షల కూల్చివేతలు మీవి. డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టలేదని ఇన్నాళ్లూ ప్రజలను మభ్యపెట్టారు. మరి లక్ష ఇళ్లు రాత్రికి రాత్రే ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి. మీ జూటా మాటలు, కుట్రలు, మెదడు తక్కువ పనుల ద్వారా జరుగుతున్న నష్టాన్ని నివారించేందుకు నేడు కేసీఆర్ పాలనలో జరిగిన నిర్మాణాలే దిక్కయ్యాయి’.. అని కేటీఆర్ మండిపడ్డారు. -
‘హైడ్రా’తో డైవర్షన్ పాలిటిక్స్: డీకే అరుణ
సాక్షి,హైదరాబాద్:డబ్బు సంచులను కాంగ్రెస్ అధిష్టానానికి సమకూర్చడానికి,ఆరు గ్యారెంటీలపై నుంచి ప్రజల దృష్టిమరల్చడానికే రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తెరపైకి తెచ్చిందని బీజేపీ ఎంపీ డీకే అరుణ విమర్శించారు. ఈ విషయమై డీకే అరుణ శుక్రవారం(సెప్టెంబర్27)మీడియాతో మాట్లాడారు.‘సామాన్యులను ఉన్నఫలంగా నిరాశ్రయులను చేయడం ఎంత వరకు న్యాయం.హైడ్రా పేరుతో ప్రభుత్వం ప్రజలను బెంబేలెత్తిస్తోంది.హైదరాబాద్ అభివృద్ధి ప్రశ్నార్థకంగా మారింది.హైదరాబాద్ రావాలంటే పెట్టుబడిదారులు భయపడాల్సిన పరిస్థితి.కేసీఆర్‌కు మించిన అవినీతిని రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తోంది.కాంగ్రెస్ ప్రభుత్వ దోపిడీ ప్రజలు గమనిస్తున్నారు.అడ్డగోలుగా టెండర్లు కట్టబెట్టి ప్రాజెక్టులు కేటాయిస్తున్నారు.ఎన్నికలకు ముందు కాంగ్రెస్ నేతలు మాట్లాడిన మాటలు మర్చిపోయారా ? నిబంధనలు అందరికీ ఒకేలా ఉండాలి.కొందరికి ఒకలా మరికొందరికి ఇంకోలా నిబంధనలు పెడుతున్నారు.కాంగ్రెస్ పార్టీ నేతలు ప్రజలకు హామీలు ఇచ్చి మభ్యపెట్టి మోసం చేశారు.వక్ఫ్ యాక్ట్ 2024 సవరణ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) రేపు హైదరాబాద్‌కు రానుంది.వివిధ రాష్ట్రాల్లో కమిటీ ఇప్పటికే పర్యటించింది. ఈక్రమంలోనే రేపు హైదరాబాద్‌లో కమిటీ పర్యటిస్తుంది.తాజ్ కృష్ణ హోటల్లో రేపు కమిటీని కలిసి వినతిపత్రాలు ఇవ్వవచ్చు.వక్ప్ సవరణ బిల్లుపై దుష్ప్రచారాలను ఎవరు నమ్మొద్దు.వక్ప్ బోర్డులు కొందరి చేతుల్లోనే ఉన్నాయి.పేద ముస్లీంలకు న్యాయం జరగాలనే లక్ష్యంతోనే ఎన్డీఏ ప్రభుత్వం సవరణ బిల్లును ప్రవేశపెట్టింది’అని డీకే అరుణ పేర్కొన్నారు. ఇదీచదవండి: నిజాంకన్నా దుర్గార్ముడు సీఎం రేవంత్‌రెడ్డి: ఎంపీ ఈటల -
TG: ప్రభుత్వానికి హరీశ్‌రావు డెడ్‌లైన్
సాక్షి,సిద్ధిపేటజిల్లా:రుణమాఫీ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి మాజీ మంత్రి హరీష్‌రావు డెడ్‌లైన్ విధించారు.దసరాలోపు రైతులందరికీ రుణమాఫీ చేయాలని అల్టిమేటం ఇచ్చారు. శుక్రవారం(సెప్టెంబర్27) సిద్దిపేట జిల్లా నంగునూరు వేదికగా రైతు ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. దసరా లోపు రుణమాఫీ చేయకుంటే రైతులతో కలిసి హైదరాబాద్‌లోని సచివాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.ఇదీచదవండి: నిజాం కన్నా దుర్గార్గుడు సీఎం రేవంత్: ఈటల -
పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులు బీజేపీ రాజకీయ కుట్రే: అద్దంకి దయాకర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి నివాసాల్లో ఈడీ దాడుల ఘటన రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. ఈ క్రమంలో ఈడీ దాడులు.. బీజేపీ ఆడుతున్న రాజకీయ కుట్ర అని అద్దంకి దయాకర్ ఘాటు విమర్శలు చేశారు.మంత్రి పొంగులేటి ఇంట్లో ఈడీ దాడులపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి అద్దంకి దయాకర్ తాజాగా స్పందించారు. ఈ సందర్భంగా దయాకర్ మాట్లాడుతూ.. ఈడీ దాడులు బీజేపీ రాజకీయ కుట్ర. ప్రభుత్వంలో ఉన్న పెద్దలపై దాడులు చేసి బీజేపీ భయపెట్టాలని చూస్తోంది. రాజకీయ వ్యతిరేక పక్షాలపై నిరంతరం దాడులు చేయడమే బీజేపీ లక్ష్యంగా పెట్టుకుంది. ప్రభుత్వంలో ఉన్న నాయకులను భయపెట్టి మానసికంగా దెబ్బకొట్టాలని బీజేపీ చూస్తోంది.కర్ణాటకలో కూడా బీజేపీ ఇదే తరహాలో ముందుకు సాగింది. డీకే శివ కుమార్‌పై కూడా ఇలాగే దాడుల ప్రయోగం చేశారు. కాంగ్రెస్ నేతలు సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను కూడా వదలకుండా కేంద్రంలోని బీజేపీ.. ఈడీ దాడులు చేయించింది. దీనికి బీజేపీ తగిన మూల్యం చెల్లించుకోక తప్పుదు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఇది కూడా చదవండి: హైడ్రా ఎఫెక్ట్.. మూసీ పరివాహక ప్రాంతాల్లో ఉద్రిక్తత -
నిజాం కన్నా దుర్మార్గుడు రేవంత్: ఎంపీ ఈటల ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో నిజాం సర్కార్ కంటే దుర్మార్గమైన పాలన చేస్తున్నాడు సీఎం రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్. శని, ఆదివారాలు చూసుకుని పేదల ఇళ్లను కూల్చివేస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఆనందిస్తోందా? అని ప్రశ్నించారు.హైడ్రా బాధితులు శుక్రవారం బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ను కలిశారు. ఈ సందర్బంగా అక్రమంగా తమ ఇళ్లను కూల్చివేసినట్టు వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఎంపీ ఈటల మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో పేదలు కంటి మీద కునుకు లేకుండా బతుకుతున్నారు. రేవంత్ పాలన నిజాం సర్కార్ కంటే దుర్మార్గంగా ఉంది. హైడ్రా పేరుతో డ్రామాలు చేస్తున్నారు. శని, ఆదివారాలు చూసుకొని ఇళ్లను కూలగొడుతున్నారు.సంజయ్ గాంధీ కూడా ఢిల్లీలో మారుతీ కంపెనీ కోసం పేదల ఇళ్లను కూలగొట్టారు. ఆయనకు వారి ఉసురు తగిలింది అంటారు. పేదల కళ్ళలో నీళ్లు చూసేవారికి ఎప్పుడు మంచి జరగదు. పోయేకాలం వచ్చినట్టుంది కాబట్టే ఎలా ప్రవర్తిస్తున్నారు. పేదలతో పెట్టుకున్న ప్రభుత్వం బాగుపడినట్టు చరిత్రలోనే లేదు. జీతాలు ఇవ్వడానికి డబ్బులు లేవు కానీ.. లక్ష కోట్లు పెట్టి మూసీ సుందరీ కరణ చేస్తారట. బట్టలు లేవు కానీ బంగారం కొనిపిస్తా అన్నట్టు ఉంది కాంగ్రెస్ నేతల తీరు. మేక వన్నె పులులు ఎన్నికలప్పుడు ముసలి కన్నీరు కారుస్తూ ఓట్లు అడిగారు. ఇప్పుడు ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రజలు ఎవరూ ఆందోళన పడవద్దు. నేను ఉన్నంత వరకు మీ పక్షాన కొట్లాడుతాను’ అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: మంత్రి పొంగులేటి నివాసంలో ఈడీ సోదాలు -
ఫార్మాసిటీ రద్దు వెనుక వేల కోట్ల భూస్కాం
సిరిసిల్ల/సాక్షి, హైదరాబాద్: ఫార్మాసిటీ రద్దు వెనుక రూ.వేల కోట్ల భూకుంభకోణం ఉందని మాజీ మంత్రి, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఫార్మాసిటీ పేరిట సేకరించిన భూములను ఇతర రియల్ ఎస్టేట్ వ్యాపారాలకు వినియోగిస్తే చూస్తూ ఊరుకోబోమన్నారు. 14 వేల ఎకరాలను తాము సేకరిస్తే ఒక్క ఎక రం కూడా సేకరించకుండా సీఎం రేవంత్‌రెడ్డి ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ అంటూ.. ఫోర్బ్రదర్స్కు రియల్ ఎస్టేట్ దందా కోసం ఇవ్వాలని చూస్తున్నారని ఆరోపించారు. న్యాయమూర్తులు సైతం ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరారు.రాజన్నసిరిసిల్ల జిల్లాలో గురువారం పలు కార్యక్రమా ల్లో పాల్గొన్న కేటీఆర్ సిరిసిల్లలోని తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. ‘ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఓ పిచ్చోడు.. ఆయనకేం తెల్వదు.. ఒక్క నోటిఫికేషన్ ఇవ్వకుండానే 35 వేల ఉద్యోగాలు ఇచ్చినం అంటాడు.. 22 మంది నేతన్నలు ఆత్మహత్యలు చేసుకుంటే పట్టించుకోడు.. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే స్పందించడు. సిరిసిల్ల నేతన్నల ఉపాధి కోసం బతుకమ్మ చీర ల పథకాన్ని తెస్తే దాన్ని బంద్ చేసిండ్రు.. కేసీఆర్ కిట్లు లేవు.. రంజాన్ తోఫా లేదు.. క్రిస్మస్ కానుక లేదు. సిరిసిల్లకు ఏడేళ్లలో రూ.3,312 కోట్ల ఆర్డర్లు ఇచ్చి రూ.200 కోట్ల బకాయిలుంటే.. మేమే ఇస్తున్నామని పోజు లు కొడుతున్నారు. మళ్లీ మా ప్రభుత్వమే వస్తుందనే అంచనాతో డబుల్ బెడ్రూం ఇళ్లను కట్టి లబి్ధదారులకు అందించలేకపోయాం. 1.65 లక్షల ఉద్యోగాలు ఇచ్చి కూడా చెప్పుకోలేకపోయాం’ అని పేర్కొన్నారు. తనపై కోపం, పగ ఉంటే.. తనతోనే చూసుకోవాలి.. కానీ సిరిసిల్ల నేతన్నలను గోస పెట్టవద్దని కోరారు. రికవరీ చేస్తాం... రైతుల రుణమాఫీ కాలేదు.. రైతు భరోసా సీజన్ అయిపోయినా.. అందలేదు.. కాంగ్రెసోళ్లు ఊళ్లలోకి వెళ్తే రైతులు తన్నేటట్లు ఉన్నారని కేటీఆర్ దుయ్యబట్టారు. కొందరు అధికారులు ఆలిండియా సరీ్వస్ స్థాయిలో ఉన్న వాళ్లు కాంగ్రెస్ కార్యకర్తల్లా పనిచేస్తున్నారని.. ఇష్టారాజ్యంగా పనిచేస్తే.. ఆర్డీ వో అయినా.. కలెక్టర్ అయినా.. వడ్డీతో స హా చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించా రు. రిటైరై వెళ్లిపోయినా జరిగిన నష్టాన్ని సంబంధిత అధికారి నుంచి రికవరీ చేస్తామని హె చ్చరించారు.హైడ్రా పేరిట హైడ్రామా చేస్తున్నారని, తన అన్న తిరుపతిరెడ్డికి నోటీసులు ఇచ్చి వదిలేశారని, అదే పేదోళ్ల ఇళ్లను కూలగొడుతున్నారని ఆరోపించారు. మూసీ బాధితులకు డబుల్ బెడ్రూం ఇళ్లు ఇస్తామంటున్న సీఎం ఒక్క ఇల్లు అయినా కట్టించాడా? అని ప్రశ్నించారు. సిరిసిల్లలో తనపై నాలుగుసార్లు ఓడిపోయిన వ్యక్తి ఎలాంటి ప దవి లేకపోయినా రేషన్ షాపులను అక్రమంగా అనుచరులకు కట్టబెట్టారన్నారు. హైకోర్టునూ మోసం చేస్తున్నారు... ఫార్మాసిటీ వ్యవహారంలో నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలతో పాటు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మోసం చేస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. ‘ఎన్నికల ప్రచారంలో హైదరాబాద్ ఫార్మాసిటీని రద్దు చేసి రైతులకు భూమిని తిరిగి ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత వెంటనే ఫార్మా సిటీని రద్దు చేసింది. ఫార్మాసిటీ పేరు మార్చి ఫ్యూచర్ సిటీ, ఫోర్త్ సిటీ, ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్ ఏఐ సిటీ అని రకరకాల కొత్త పేర్లను తెరపైకి తెచ్చి అతి పెద్ద కుంభకోణానికి స్కెచ్ వేసింది. ఫార్మాసిటీ విషయంలో హైకోర్టును, న్యా యమూర్తులను కూడా తప్పుదోవ పట్టించే విధంగా కోర్టులో ప్రభుత్వం అబద్ధాలు చెబుతోంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఒక్క ఎకరం భూమి కూడా సేకరించకుండా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సిటీ, ఫోర్త్ సిటీ, ఫ్యూచర్ సిటీలను ఎక్కడ కడతారో చెప్పాలి’అని కేటీఆర్ నిలదీశారు. ఈ మేరకు కేటీఆర్ గురువారం బహిరంగ లేఖ రాశారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఫార్మాసిటీపై స్పష్టమైన ప్రకటన చేయడంతో పాటు హైకోర్టుకు వాస్తవ పరిస్థితులను తెలియజేయాలని డిమాండ్‌చేశారు. -
ఇళ్ల కూల్చివేతతో పేరు కోసం తాపత్రయం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ఏ ప్రణాళిక లేకుండానే, హడావుడి చేసి నిత్యం వార్తల్లో ఉండే లక్ష్యంతో అక్రమ కట్టడాల పేరిట ఇళ్ల కూల్చివేతలతో పేరు తెచ్చుకోవాలని భావిస్తోందని కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి మండిపడ్డారు. అయితే ఈ కూల్చివేతల ప్రక్రియ న్యాయబద్ధంగా, చట్టబద్ధంగా చేపట్టి ఉంటే బాగుండేదని ప్రజల అభిప్రాయమని సీఎం రేవంత్‌రెడ్డికి గురువారం రాసిన లేఖలో పేర్కొన్నారు. హైడ్రా బాధితులు తన దృష్టికి తీసుకొచ్చిన అంశాలు, మేధావుల ఆలోచనలు, నిత్యం వార్తాపత్రికలు, టీవీ చానళ్ల ద్వారా తెలుసుకుంటున్న అంశాలన్నింటితో ఈ లేఖ రాస్తున్నట్టు తెలిపారు. ఆక్రమణలు, అక్రమ నిర్మాణాలను తాము సమరి్థంచబోమని, అయితే వీటిపై చర్యలు తీసుకునే సమయంలో సహజ న్యాయ సూత్రాలకు (ప్రిన్సిపుల్స్ ఆఫ్ నేచురల్ జస్టిస్) అనుగుణంగా ఉండాలనేదే తమ ఉద్దేశమని స్పష్టం చేశారు. ముఖ్యంగా పేద, మధ్యతరగతి విషయంలో వీటి ఆధారంగానే పనిచేయాలనేది అందరి అభిప్రాయమని పేర్కొన్నారు. రాష్ట్రంలో చాలా కేసుల్లో సహజ న్యాయ సూత్రాలను ప్రభుత్వం పాటించడం లేదన్నారు. ఇవాళ అక్రమమని కూల్చేస్తున్న వాటి గురించి సున్నితంగా ఆలోచించాల్సిన అవసరముందని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో ప్రస్తుతం అక్రమ కట్టడాలు అంటున్న ప్రాంతాల్లో వెలసిన ఇళ్లకు ప్రభుత్వ పక్షాన రూ.కోట్లు ఖర్చుచేసి రోడ్లు, డ్రైనేజీ సౌకర్యం, కరెంటు కనెక్షన్లు, కమ్యూనిటీ హాళ్లు, ఇంటి నంబరు కేటాయింపు వాస్తవం కాదా అని ప్రశ్నించారు. దశాబ్దాలుగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల ద్వారా సేవలు పొందుతూ పన్నులు కడుతుండగా, ఇప్పుడు హఠాత్తుగా అక్రమం అంటే వారు ఎక్కడకు వెళ్లాలి? అందులోనూ పేద, మధ్యతరగతి ప్రజలు ఏమైపోవాలి? అని నిలదీశారు. గతంలో అనేకసార్లు కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు అక్రమ నిర్మాణాలను రెగ్యులరైజ్ కూడా చేశాయన్నారు.మూసీ రివర్ బ్యూటిఫికేషన్లో భాగంగా గ్రేటర్ పరిధిలో ఇళ్లు కోల్పోయే వారితో చర్చించాలని సూచించారు. మూసీతోపాటు, ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న కూల్చివేతల విషయంలోనూ ఎలాంటి దుందుడుకు విధానాలతో ముందుకెళ్లకూడదన్నారు. హైడ్రా పేరుతో ఏర్పాటు చేసిన విభాగంతో ప్రభుత్వం ఏకపక్షంగా ముందుకెళుతోందని చెప్పారు. దీనిపై పేద ప్రజలు చేస్తున్న ఆందోళనలను, వారి మనోవేదనను పరిగణనలోకి తీసుకోకుండా హైడ్రాకు మరిన్ని అధికారాలు కల్పించడాన్ని తప్పుబట్టారు. -
తప్పు చేయకూడదనే దానికి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నీటి పారుదల శాఖ లో కొత్తగా నియమకమైన 700 మంది ఏఈఈలకులకు సీఎం రేవంత్ రెడ్డి నియామక పత్రాలను అందజేశారు. ఎర్రమంజిల్‌లో జలసౌధలో గురువారం జరిగిన ఈ కార్యక్రమంలో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా సీఎం రేవంత్ మాట్లాడుతూ.. తెలంగాణ ఇరిగేషన్‌ను ప్రపంచానికి చాటేలాగా అందరం కలిసి పనిచేద్దామని పిలుపునిచ్చారు. జలవివాదాలు కారణంగా ప్రాజెక్టులు ఆలస్యం అవుతున్నాయని తెలిపారు. తెలంగాణలో ప్రాజెక్టులు ఎందుకు ఆలస్యం అయ్యాయో గత పది ఏళ్లలో చేశామని, ఆ పరిస్థితి మళ్లీ పునరావృతం కాకుండా చూడాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో రెండు లక్షల కోట్ల రూపాయలు ఇప్పటివరకు సాగునీటి ప్రాజెక్టుల కోసం ఖర్చు చేశామని తెలిపారు.‘నీళ్లు, నియామకాల ఆకాంక్షల కోసమే తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. నీళ్లు మన సంస్కృతిలో భాగస్వామ్యం.. అలాంటి శాఖకు మీరు ప్రతినిధులుగా నియామకమవుతున్నారు. తెలంగాణ ఏర్పడిన దశాబ్దం తరువాత నియామకాల ప్రక్రియ వేగంగా జరుగుతోంది. ఇది మీకు ఉద్యోగం కాదు.. ఇది మీకు ఒక భావోద్వేగం. తెలంగాణ ప్రజల భావోద్వేగం నీళ్లతో ముడిపడి ఉంది. వారి భావోద్వేగాలకు అనుగుణంగా నీళ్లను ఒడిసిపట్టి ప్రజలకు అందించాల్సిన బాధ్యత మీపై ఉంది. ఏ వృత్తిలోనైనా క్షేత్ర స్థాయిలో అనుభవం ఉన్నవాళ్లే రాణిస్తారు. రాజకీయాల్లోనూ క్షేత్ర స్థాయి నుంచి వచ్చిన వారే ఎక్కువ రాణిస్తారు.పీవీ నరసింహారావు, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి, నీలం సంజీవ రెడ్డి లాంటి వారు సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రులు, ప్రధానులుగా ఎదిగారు. నేను కూడా జిల్లా పరిషత్ మెంబర్ స్థాయి నుంచే సీఎం స్థాయికి వచ్చా. గతంలో ఇంజనీర్లు ఉదయం 5 గంటలకే క్షేత్రస్థాయి పరిశీలనకు వెళ్లేవారు. ఫీల్డ్ విజిట్ చేసాకే రిపోర్టులు రాసే వారు. కానీ ఈ మధ్య క్షేత్ర స్థాయి పర్యటనలకు వెళ్లే వారు తగ్గిపోయారు. మేం అధికారంలోకి వచ్చాక అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించాల్సిందేనని ఆదేశించాం. కాళేశ్వరం లాంటి ప్రాజెక్టులకు లక్ష కోట్లు ఖర్చు చేస్తే.. కట్టడం కూలడం రెండూ జరిగాయి. అధికారులు జీవితంలో ఎలాంటి తప్పు చేయకూడదో దానికి ఉదాహరణ కాళేశ్వరం ప్రాజెక్టు. దీనికి ఎవరిని బాధ్యులను చేయాలో మీరే చెప్పాలి. అధికారులనా? రాజకీయ నాయకులనా?.మీ మోడల్ స్టడీకి కాళేశ్వరమే సరైన ఉదాహరణ. ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ నిర్మించిన మోక్షగుండం విశ్వేశ్వరయ్యను ఆదర్శంగా తీసుకోండి. కాళేశ్వరం విషయంలో అందరిపై చర్యలు తీసుకుంటే డిపార్ట్మెంటే ఉండదు. చర్యలు తీసుకోకపోతే చర్యలు తీసుకోవడం లేదని ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఈఈ చెప్పారని ఒకరు, ఎస్ఈ చెప్పారని ఇంకొకరు.. ఇలా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు తీసుకునే తప్పుడు నిర్ణయాలను అమలు చేయకుండా ఉంటే ఇలాంటి పరిస్థితులు ఉత్పన్నం అయ్యేవి కాదు. లక్ష కోట్లు ఖర్చు చేసినా లక్ష ఎకరాలకు కూడా నీళ్లు ఇవ్వలేకపోయారు.పదేళ్లలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి కాకపోవడానికి కారణం ఏమిటో గమనించండి. 2లక్షల కోట్లు ఖర్చు చేసినా తెలంగాణలో ప్రాజెక్టులు పూర్తి కాలేదు. భవిష్యత్ లో ఇలాంటివి పునరావృతం కావొద్దు. తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణంలో నీళ్లు అత్యంత కీలకం.ప్రాజెక్టుల పూర్తికి క్షేత్ర స్థాయిలో పని చేయాలి. రికమెండేషన్‌తో వచ్చే వారికి సుదూర ప్రాంతాల్లో పోస్టింగ్ ఇచ్చి పనిష్మెంట్ ఇవ్వండి. పని మీద శ్రద్ధ పెట్టండి.. పోస్టింగ్‌ల మీద కాదు. అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేస్తే తెలంగాణ దేశంలోనే ఆదర్శంగా నిలబడుతుంది. క్షేత్రస్థాయిలో పని చేసి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించండి.’ అని పేర్కొన్నారు. -
వారి బతుకులు ఏమైపోవాలి?.. సీఎం రేవంత్‌కు కిషన్‌రెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్: హైడ్రాతో ఏకపక్షంగా ముందుకెళ్తున్నారని.. ప్రభుత్వాలే అనుమతులిచ్చి ఇప్పుడు అక్రమం అంటే ఎలా? అంటూ ప్రశ్నిస్తూ.. సీఎం రేవంత్‌రెడ్డికి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి లేఖ రాశారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఏమైపోవాలి?. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఇచ్చిన అనుమతులు తప్పు అని హైడ్రా ఎలా చెబుతుంది. కూల్చివేతలకు ముందు బాధితులతో చర్చించాలి’’ అని లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘హైడ్రా దూకుడు పేదలపై కాకుండా బాధితులతో చర్చించండి. ఇతర భాగస్వామ్య పక్షాలను పరిగణనలో తీసుకోండి. 30 ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లు అక్రమమని సర్కార్ కూల్చివేస్తే వారి బాధ ఎవరికి చెప్పుకోవాలి. అక్రమంగా భూములు అమ్మిన వారిని బాధ్యులను చేయాలి. రాత్రికి రాత్రి కట్టుబట్టలతో రోడ్డున పడేస్తే వాళ్ల బతుకులు ఏమైపోతాయి.’’ అంటూ లేఖలో కిషన్‌రెడ్డి పేర్కొన్నారు.‘‘పాలకుల, అధికారుల అవినీతి, ఓటుబ్యాంకు రాజకీయాల కారణంగా పేదలు, మధ్యతరగతి ప్రజల నుంచి దళారులు దోచుకున్నారు. అన్ని అనుమతులున్న భవనాలను నేలమట్టం చేయడం బాధకరం. జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏ ఇచ్చే అనుమతులను తప్పు అని హైడ్రా ఎలా నిర్ణయిస్తుంది. మూసీ పరివాహ ప్రాంతాల్లో నివాసం ఉంటున్న వేలాది మంది జీవనోపాధి ఇక్కడే ఉంటుంది. దుందుడుకు విధానాలతో ముందుకు వెళ్లవద్దు’’ అని లేఖలో రేవంత్‌కు కిషన్‌రెడ్డి సూచించారు.ఇదీ చదవండి: తస్మాత్ జాగ్రత్త..! కనిపించని కన్ను చూస్తోంది..!బ్యాంకులకు, బ్యాంకింగ్యేతర ఆర్థిక సంస్థలు రుణ నిబంధనలకు విరుద్ధంగా నిర్ణయాలు తీసుకోవద్దు. కూల్చివేతలతో ప్రజలు ఆందోళనలో ఉన్నారని లేఖలో పేర్కొన్న కిషన్‌రెడ్డి.. ప్రభుత్వ అధికారుల వ్యవహార శైలితో గందరగోళానికి గురవుతున్నారన్నారు. అధికారులు ఎలాంటి ప్రకటనలు జారీ చేయకుండా ఆదేశాలివ్వాలని కిషన్‌రెడ్డి కోరారు. మీరు తీసుకునే నిర్ణయం అందరికీ న్యాయం జరిగేలా ఉండాలని సీఎంకు కిషన్‌రెడ్డి సూచించారు.‘‘ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందని పక్షంలో అవకాశం ఉన్నచోట పేదలు తమ కష్టాన్ని దారబోసి ఇళ్లను నిర్మించుకున్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు చేసిన మోసానికి గురయ్యారు. సహజ న్యాయ సూత్రాలను ప్రభుత్వం పాటించడం లేదు. ఆక్రమణలను, అక్రమ నిర్మాణాలను మేం సమర్థించం. ఆక్రమణలపై, ఆక్రమ నిర్మాణాలపై చట్టబద్దంగా, న్యాయబద్దంగా చర్యలు ఉండాలన్నదే మా ఉద్దేశ్యం. హడావుడి చేసి, నిత్యం వార్తల్లో ఉండేందుకే ప్రభుత్వం అక్రమ నిర్మాణాల కూల్చివేత’’ అంటూ లేఖలో కిషన్‌రెడ్డి నిలదీశారు. -
బీఆర్ఎస్ కుట్రలో భాగమే వరంగల్ ఆరు ముక్కలు: కడియం శ్రీహరి
సాక్షి, జనగామ: తెలంగాణలో అవినీతి, అక్రమాలకు మారుపేరు బీఆర్ఎస్ అంటూ సంచలన ఆరోపణలు చేశారు ఎమ్మెల్యే కడియం శ్రీహరి. అలాగే, వరంగల్ చరిత్రను కనుమరుగు చేసేందుకే జిల్లాను ఆరు ముక్కలు చేశారని చెప్పుకొచ్చారు. జిల్లాను ముక్కలు చేయవద్దు అన్నందుకే తనకు రెండోసారి మంత్రి పదవి ఇవ్వలేదని కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన వ్యాఖ్యలు రాజకీయంగా హాట్ టాపిక్‌గా మారాయి.స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి గురువారం మీడియాతో మాట్లాడుతూ..‘ప్రజాస్వామ్య వ్యవస్థను బీఆర్ఎస్ ప్రభుత్వమే కాలరాసింది. అవినీతి, అక్రమాలకు బీఆర్ఎస్ మారుపేరు. వరంగల్ చరిత్రను కనుమరుగు చేసేందుకు కేసీఆర్ కుట్ర పన్నారు. అందులో భాగంగానే జిల్లాను ఆరు ముక్కలు చేశారు. దీనిపై ప్రశ్నించినందుకే రెండో సారి నాకు మంత్రి పదవి ఇవ్వలేదు.కేసీఆర్ కుటుంబ చేతిలో తెలంగాణ బంధీ అయ్యింది. బీఆర్ఎస్ నేతలు సిగ్గులేకుండా ఇప్పుడు పార్టీ ఫిరాయింపులపై మాట్లాడటం విడ్డూరంగా ఉంది. ఏకంగా శాసనసభ పక్షాలను కలుపుకున్న చరిత్ర బీఆర్ఎస్ పార్టీది. ఇప్పట్లో తెలంగాణలో ఉప ఎన్నికలు రావు. ఒకవేళ వచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ పార్టీ సిద్ధంగా ఉంది. స్టేషన్ ఘనపూర్‌లో ఎన్నికలు వస్తే బీఆర్ఎస్కు డిపాజిట్ కూడా రాదు. కోర్టులు, ప్రజాస్వామ్యంపై మాకు గౌరవం ఉంది’ అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: మూసీ పరివాహక ప్రాంతాల్లో టెన్షన్.. అక్కడ భవనం కూల్చివేత -
హామీలు అడిగితే మహిళలను అరెస్ట్ చేస్తారా?: కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. రుణమాఫీ చేయాలని బ్యాంక్‌ల వద్దకు వెళ్లిన వారిని హింసిస్తారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజా పాలనా? అని ప్రశ్నించారు.కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘తెలంగాణ గడ్డపై నిలబడి రైతు రుణమాఫీ అంటూ రైతు డిక్లరేషన్ ఇచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక.. రుణమాఫీ చేయండి అని బ్యాంకుకు వెళ్తే ఇలాంటి మాటలా? లక్ష రూపాయల రుణమాఫీ కావాలని వెళ్తే లక్ష రూపాయల ఖర్చు అయ్యేలా కేసులు పెడతారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజా పాలన?.తెలంగాణ గడ్డపై నిలబడి రైతు రుణమాఫీ అంటూ రైతు డిక్లరేషన్ ఇచ్చారు... తీరా అధికారంలోకి వచ్చాక... రుణమాఫీ చేయండి అని బ్యాంకుకు వెళ్తే ఇలాంటి మాటలా? లక్ష రూపాయల రుణమాఫీ కావాలని వెళ్తే లక్ష రూపాయల ఖర్చు అయ్యేలా కేసులు పెడతారా? ఇదేనా ఇందిరమ్మ రాజ్యం, ఇదేనా ప్రజా పాలన...? I demand… pic.twitter.com/qjl6dfmNhh— KTR (@KTRBRS) September 26, 2024ప్రభుత్వం చేసిన తప్పిదానికి రైతులను కరడుగట్టిన నేరస్థులుగా పరిగణిస్తున్నందుకు సీఎం బేషరతుగా రైతులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాను!. మీరు మీ వాగ్దానాలను అందించడంలో విఫలమయ్యారు. మీరు ఇచ్చిన హామీని తీర్చాలని వచ్చినప్పుడు వారిని అరెస్టు చేస్తారా?. అలాగే కోదాడ రూరల్ సీఐ రజితారెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. మీకు ఆహారం ఇచ్చే చేతులను గౌరవించడం నేర్చుకోండి!’. అన్నం పెట్టే అన్నదాతపై పోలీస్ జులూమ్. ఒకరు దర్వాజాలు పీకుతారు-మరోకరు కేసులు పేట్టి లోపలేస్తాం అంటారు. మాఫీ కాలేదు మాఫీ చెయ్యండి మొర్రో అంటూ రైతులు నానా తంటాలు పడుతుంటే మరో వైపు కేసులు పెడతాం అంటూ పోలీసుల బెదిరింపులు. కేసులు పెట్టి లక్ష ఖర్చయ్యేదాకా తిప్పుదాం అని అన్నదాతపై పోలీసుల దాష్టీకాలు. రుణమాఫీపై శృతి గతి లేని మాటలతో ఇప్పటికే సర్కార్ రైతుల ఊసురు పోసుకుంటే అధికారుల అతి అన్నదాతలను మరింత అగాధంలోకి నెట్టుతుంది. కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఖబర్దార్ కాంగ్రెస్ పాలకులారా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. అంటూ కామెంట్స్ చేశారు. ఇది కూడా చదవండి: హైడ్రా పేరుతో హైడ్రామాలు: కేటీఆర్