అశోక్‌ చవాన్‌లా దొరికావు: సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ ట్వీట్‌ | Ktr Interesting Tweet On Cm Revanth reddy | Sakshi
Sakshi News home page

అశోక్‌ చవాన్‌లా దొరికావు: సీఎం రేవంత్‌పై కేటీఆర్‌ ట్వీట్‌

Sep 29 2024 6:17 PM | Updated on Sep 29 2024 6:25 PM

Ktr Interesting Tweet On Cm Revanth reddy

సాక్షి,హైదరాబాద్‌:‘బావమరిదితో లీగల్ నోటీసు పంపితే నీ అక్రమ దందాల గురించి మాట్లాడుడు బంద్ చేస్తా అనుకుంటున్నావా?’అని సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ అన్నారు. ఈ మేరకు కేటీఆర్‌ ఆదివారం(సెప్టెంబర్‌29) ఎక్స్‌(ట్విటర్‌)లో ఒక పోస్టు చేశారు.

‘ఆదర్శ్ కుంభకోణంలో మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్ చవాన్‌లాా నువ్వు దొరికావు. నీ రాజీనామా తప్పదు.బావమరిదికి అమృతం పంచి, పేదలకు విషం ఇస్తుంటే చూస్తూ ఊరుకోం.సీఎం ఆధ్వర్యంలో ఉన్న శాఖలోనే ఆయన బావమరిది శోద కంపెనీకి రూ.1,137 కోట్ల టెండర్ కట్టబెట్టింది నిజం.అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్స్ 7,11,13ని సీఎం ఉల్లంఘించారు.

శోద  కంపెనీ గత రెండు సంవత్సారాలుగా రెండు కోట్లు మాత్రమే లాభం ఆర్జించిన ఒక చిన్న కంపెనీ.ఈ కుంభకోణంలో ఢిల్లీలో ఉన్న నీ బీజేపీ దోస్తులు కూడా నిన్ను కాపాడడం కష్టమే.ఈ దేశంలో న్యాయవ్యవస్థ బలంగా,నిజాయితీగా ఉన్నది’అని కేటీఆర్‌ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ఇదీ చదవండి: హైడ్రా కూల్చివేతలు..మంత్రి శ్రీధర్‌బాబు కీలక ప్రకటన

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement