breaking news
-
హైడ్రా పేరుతో హైడ్రామాలు: కేటీఆర్
కూకట్పల్లి (హైదరాబాద్)/సాక్షి, హైదరాబాద్: హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామాలు ఆడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీ రామారావు మండిపడ్డారు. సామా న్యులకు అన్యాయం జరిగే పక్షంలో బుల్డోజర్లకు అడ్డం పడన్నా న్యాయం జరిగేంతవరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఆక్రమణలకు తప్పుడు అనుమతులు ఇచ్చింది కాంగ్రెస్ వారేనని చెప్పారు. బ్లాక్ లిస్టు అయిన పాకిస్తాన్ కంపెనీకి మూసీ సుందరీకరణ కాంట్రాక్టు ఇచ్చి భారీ కుంభకోణానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ కుంభకోణానికి తెర లేపిన పెద్దల బాగోతాలను బయటకు తీస్తామని అన్నారు. బుధవారం ఫతేనగర్, ఖాజాకుంటలో మురుగునీటి శుద్ధి కేంద్రాలను (ఎస్టీపీలు) సందర్శించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. కోర్టులను అపహాస్యం చేస్తున్నారు ‘హైదరాబాద్‌లో హైడ్రా పేరుతో పేదలకు ఓ న్యాయం, పెద్దలకు ఓ న్యాయం జరుగుతోంది. వేదశ్రీ అనే ఏడేళ్ల పాప తన పాఠ్య పుస్తకాలు తీసుకోవటానికి కూడా సమయం ఇవ్వకుండా ఇళ్లు కూల్చివేశారు. కస్తూరి అనే మహిళ చెప్పుల దుకాణాన్ని కూడా కూల్చివేశారు. కోర్టు సెలవు దినాన కావాలని ఉదయమే వచ్చి అభాగ్యుల ఇళ్లను కూల్చివేస్తూ కోర్టులను అపహాస్యం చేస్తున్నారు. బఫర్ జోన్లో అనుమతులు ఇచ్చిన వారిని వదిలేసి, పేదల ఇళ్లను కూల్చివేయటం ఎంతవరకు సబబు? తమ ప్రభుత్వ హయాంలో పేదలకు లక్ష ఇళ్లు నిర్మించి ఇచ్చాం. మీకు చిత్తశుద్ధి ఉంటే పేదవారికి ఇళ్లు నిర్మించి ఇవ్వండి. మీ దౌర్జన్యాలను, దాషీ్టకాలను ఇలాగే కొనసాగిస్తే ప్రజలు బుద్ధి చెబుతారు. మీ ఫాంహౌస్‌ల వీడియోలు బయట పెడతాం జీహెచ్ఎంసీ, హైడ్రా ఆఫీసు, నీ అన్న ఇళ్లు బఫర్ జోన్లోనే ఉన్నాయి. మీ మంత్రుల ఫాంహౌస్‌లు కూడా బఫర్ జోన్లోనే ఉన్నాయి. అవసరమైతే ఫాంహౌస్‌ల వీడియోలు బయట పెడతాం. ముందు వాటిని కూలగొట్టి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరితో రియల్ ఎస్టేట్ వ్యాపారం 42 శాతానికి పడిపోయింది. ఎంతోమంది కార్మికులు ఉపాధి దొరకక ఖాళీగా ఉంటున్నారు. హైడ్రా బాధితులందరికీ మేం అండగా ఉంటాం. ప్రజలు తెలంగాణ భవన్‌కు కూడా వచ్చి ఫిర్యాదులు ఇవ్వొచ్చు..’అని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ సంకల్పం తీసుకుని ‘మురుగునీటి’పనులు పూర్తి చేశారు ‘మా ప్రభుత్వ హయాంలో హైదరాబాద్‌లో నాలాల పరిరక్షణతో పాటు రూ.4 వేల కోట్లతో 31 ఎస్టీపీలను నిర్మించాం. కేవలం కూకట్‌పల్లిలో నియోజకవర్గంలోనే రూ.350 కోట్లు ఖర్చు పెట్టాం. దక్షిణాసియాలోనే 100% మురుగునీటి శుద్ధి నగరంగా హైదరాబాద్ చరిత్ర సృష్టించబోతోంది. కేసీఆర్ సంకల్పం తీసుకుని ఈ పనులు పూర్తి చేశారు. గత 10 నెలల్లో ఈ ప్రభుత్వం ఏ ఒక్క మంచి పని కూడా చేపట్టలేదు..’అని కేటీఆర్ విమర్శించారు. హైదరాబాద్ ప్రజలు సంపూర్ణ ఆశీర్వాదం ఇచ్చి బీఆర్ఎస్ను గెలిపించినందుకు వారికి రుణపడి ఉంటామని చెప్పారు. కార్యక్రమంలో మాజీ మంత్రులు మహమూద్ ఆలీ, సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యేలు మాధవరం కృష్ణారావు, మాగంటి గోపీనాథ్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, కేపీ వివేకానంద్, కాలేరు వెంకటే‹Ù, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు తదితరులు పాల్గొన్నారు. మనం సంధికాలంలో ఉన్నాం – మళ్లీ నాలుగేళ్లలోనే కేసీఆర్‌ను సీఎంగా గెలిపించుకోవాలి ‘ఉద్యమ పార్టీగా అనేక ఆటు పోట్లు ఎదుర్కొని తెలంగాణ సాధించిన మనం ఇప్పుడు సంధి కాలంలో ఉన్నాం. 14 ఏళ్లు ఉద్యమ పార్టీ, పదేళ్లు అధికార పార్టీగా ఉన్న మనం ఇప్పుడు పోషిస్తున్న ప్రతిపక్ష పాత్ర కొత్తది. రాష్ట్రంలో చాలామంది మనవైపు చూస్తున్నారు. ఈ సమయంలో పార్టీని బలోపేతం చేసుకోవాలి. గాడిద ఉంటేనే గుర్రం విలువ తెలుస్తుంది అన్నట్లు చిట్టి నాయుడు (రేవంత్‌రెడ్డి) ఉంటేనే కేసీఆర్ విలువ తెలుస్తుంది. ఈ ప్రభుత్వం తీరు చూసి మళ్లీ కేసీఆర్ కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. మళ్లీ నాలుగేళ్లలో కేసీఆర్‌ను సీఎంగా గెలిపించుకోవాలి..’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ అధ్యక్షతన జరిగిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన ప్రసంగించారు. వందేళ్ల పాటు దృఢంగా ఉండేలా పార్టీ నిర్మాణం ‘ఒక్కో జిల్లా కమిటీలో 800 మందికి పైగా కార్యకర్తలు, నేతలకు పదవులు ఇచ్చే వీలుంటుంది. తమిళనాడులో డీఎంకే పార్టీ 76 ఏళ్లుగా రాజకీయాలను శాసిస్తోంది. 24 ఏళ్ల మన పార్టీ మరో వందేళ్ల పాటు దృఢంగా ఉండేలా పార్టీ నిర్మాణంపై దృష్టి పెడదాం. శిక్షణ శిబిరాలు ఏర్పాటుతో పాటు గతంలో జరిగిన తప్పులు పునరావృతం కాకుండా చూసుకుందాం. కాంగ్రెస్ ఇచ్చిన హామీల అమలు కోసం షాడో గవర్నమెంట్ మాదిరిగా పనిచేసేందుకు కమిటీలు వేస్తాం..’అని కేటీఆర్ చెప్పారు. స్టేషన్ ఘనపూర్ అభ్యర్ధిగా రాజయ్య ‘కొందరు పెద్ద నాయకులు పదవులు అనుభవించి పార్టీని వదిలివెళ్లారు. వారిని గతంలో రేవంత్ పచ్చిబూతులు తిట్టినా సిగ్గు లేకుండా ఆయన చుట్టూ తిరుగుతున్నారు. ఫిరాయింపులపై నెలలోగా నిర్ణయం తీసుకోవాలనే కోర్టు తీర్పుతో వారిలో భయం మొదలైంది. .’అని కేటీఆర్ తెలిపారు. సమావేశంలో ఎమ్మెల్సీలు మధుసూదనాచారి, పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, వికలాంగుల కార్పొరేషన్ మాజీ చైర్మన్ కె.వాసుదేవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై కేటీఆర్ కామెంట్స్!
సాక్షి : హైదరాబాద్ : ‘దేవర’ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దుపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వం ఉంటే దేవర ఈవెంట్ ఫంక్షన్ అద్భుతంగా జరిగేదన్నారు.బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి కేటీఆర్ ఫతేనగర్ బ్రిడ్జ్‌ని సందర్శించారు. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేటీఆర్ దేవర ప్రీ రిలీజ్ రద్దుపై మాట్లాడారు.Jr ఎన్టీఆర్ దేవర సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కూడా సరిగ్గా నిర్వహించడానికి రాలేదు ఈ అసమర్ధత ప్రభుత్వానికి - కేటీఆర్ pic.twitter.com/0I8CGXVEjt— Telugu Scribe (@TeluguScribe) September 25, 2024 సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందని కేటీఆర్ మండిపడ్డారు. జూనియర్ ఎన్టీఆర్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు ప్రభుత్వం కనీస సౌకర్యాలు కల్పించలేదని విమర్శలు గుప్పించారు. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో పోలీసులు చేతులెత్తేశారని, తాము అధికారికంలో ఉన్నప్పుడు సినిమా ఫంక్షన్లు సంతోషంగా జరుపుకునే వాళ్లని కేటీఆర్ ప్రస్తావించారు. తాము సినిమా ఫంక్షన్లతో పాటు అన్ని మతాల పండుగలను సమర్థవంతంగా నిర్వహించామని అన్నారు. 👉చదవండి : దేవర ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎందుకు రద్దైందికొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జంటగా నటించిన ‘దేవర’ భారీ అంచనాల మధ్య ఈ చిత్రం సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో సెప్టెంబర్ 22న చిత్రబృందం ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో ఘనంగా నిర్వహించాలని భావించింది. అయితే పరిమితికి మించి అభిమానులు రావడంతో గందరగోళం నెలకొంది. దీంతో నిర్వహాకులు ఈవెంట్‌ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. -
నా కాలేజీలు కాంగ్రెస్ హయాంలో కట్టినవే: మాజీ మంత్రి మల్లారెడ్డి
సాక్షి, యాదాద్రి భువనగిరి: తెలంగాణలో హైడ్రా కారణంగా ప్రజలు ఎవరూ ప్రశాంతంగా నిద్రపోవడం లేదన్నారు మాజీ మంత్రి మల్లారెడ్డి. కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలు. ఒక్కొక్కరూ ఒక్కో గ్రూపు తయారు చేశారని ఎద్దేవా చేశారు. అలాగే, ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు.మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి బుధవారం యాదగిరిగుట్ట వద్ద మీడియాతో మాట్లాడుతూ..‘హైడ్రా ప్రజలను హైరానా చేస్తోంది. ప్రజల దృష్టిని మరల్చడానికే హైడ్రా పనిచేస్తోంది. ఇళ్లను కూలగొట్టి ప్రజలను రోడ్లపై పడేయాల్సిన అవసరం ఏం వచ్చింది?. యుద్ధం చేసినట్టుగా ఇళ్లను కూల్చివేస్తున్నారు. హైడ్రా కారణంగా ప్రజలు ఎవరూ ప్రశాంతంగా నిద్రపోవడం లేదు. అందరి ఇళ్లకు నోటీసులు ఇచ్చినట్టే నాకు కూడా నోటీసులు ఇచ్చారు. నేను కట్టిన కాలేజీలు అన్నీ కాంగ్రెస్ హయాంలో నిర్మించినవే.కేసీఆర్, కేటీఆర్‌ను తిట్టడమే హస్తం పార్టీ నేతలు పనిగా పెట్టుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను సవాల్ చేస్తున్నా. కేసీఆర్ పాలనలో పండించిన పంట కంటే ఎక్కువ పంట పండిస్తే కాంగ్రెస్ వాళ్లు పాలాభిషేకం చేస్తా. రేవంత్ సర్కార్ పాలనలో రైతుభరోసా లేదు. రుణమాఫీ పూర్తిగా కాలేదు. మంత్రుల మధ్య కూడా సఖ్యత సరిగాలేదు. ఒక్కొక్కరూ ఒక్కో గ్రూపు తయారు చేశారు. కాంగ్రెస్ అంటేనే గ్రూపు రాజకీయాలు. కాంగ్రెస్ నేతలు ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి’ అంటూ కామెంట్స్ చేశారు.ఇది కూడా చదవండి: పాక్ కంపెనీలతో కలిసి రేవంత్ సర్కార్ భారీ స్కామ్: కేటీఆర్ -
మూసీ సుందరీకరణపై కేటీఆర్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్, సాక్షి: మూసీ నదిని కొత్తగా శుద్ధి చేయాల్సిన అవసరం లేదని.. గత బీఆర్ఎస్ హయాంలో కట్టిన ఎస్టీపీ(sewage treatment plants)ను ఉపయోగించుకుంటే సరిపోతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు అంటున్నారు. బీఆర్ఎస్ బృందంతో కలిసి ఫతేనగర్ బ్రిడ్జి వద్ద సందర్శనకు వెళ్లిన ఆయన ఆపై మీడియాతో మాట్లాడారు. ‘‘ రేవంత్ రెడ్డి మూసీ సుందరీకరణ పనులను పాకిస్తాన్ కంపెనీలకు కట్టబెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొత్తగా మూసీని శుద్ది చేయాల్సిన అవసరం లేదు . గత బీఆర్ఎస్ ప్రభుత్వం కట్టిన STPలను ఉపయోగించుకుంటే సరిపోతుంది. మా హయాంలో రూ. 4వేల కోట్లతో జీహెచ్ఎంసీ పరిధిలో 31ఎస్టీపీలు నిర్మించాం. .. మూసీ నదీ సుందరీకరణ ప్రాజెక్టుపై ఇప్పుడున్న ముఖ్యమంత్రి, మంత్రుల మాటలకు పొంతన లేదు. లక్ష 50వేల కోట్లు.. 70వేల కోట్లు.. 50వేల కోట్లు.. అంటూ రకరకాలుగా మాట్లాడుతున్నారు. మూసీ శుద్ధి వెనుక ప్రభుత్వ అస్సలు ఉద్దేశం వేరే ఉంది. మూసీ సుందరీకరణ పేరుతో వేల కోట్ల కుంభకోణం జరగబోతోంది.ఇదీ చదవండి: ఓటుకు నోటు కేసులో ఇక రేవంత్ విచారణ.. ఇండియాలో 31ఎస్టీపీలు ఉన్న ఏకైన నగరం హైదరాబాద్. STPలు కేసీఆర్ ముందు చూపునకు నిదర్శనం. బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సిటీలో అన్ని ఎస్టీపీలను సందర్శిస్తాం. కేసీఆర్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాన్ని ప్రజలకు తెలియజేస్తాం. .. బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూంలు కట్టకుంటే మూసీ నిర్వాసితులకు ఎక్కడ నుంచి ఇస్తున్నారు. హైడ్రా కూల్చివేతలపై కాంగ్రెస్ నేతలకు ఒక న్యాయం.. పేదలకు మరొక న్యాయమా?. సిటీ ఎమ్మెల్యేలతో చర్చించి హైడ్రాపై ఒక నిర్ణయానికి వస్తాం. పేదల పట్ల హైడ్రా ప్రతాపానికి వేదశ్రీ అనే బాలిక మాటలే ఒక ఉదాహరణ. ప్రస్తుత ప్రభుత్వం చేసే పనులను బీఆర్ఎస్ గతంలోనే చేసింది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలు అమలు చేస్తే చాలు. పబ్లిక్ సిటీ స్టంట్లతో రేవంత్ ఎక్కువ కాలం ప్రభుత్వాన్ని నడపలేరు’’ అని కేటీఆర్ అన్నారు. -
ప్రభుత్వం పేదల గూడు కూలుస్తోంది: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: రేవంత్‌రెడ్డి ప్రభుత్వం హైడ్రా పేరిట పేదల బతుకులను రోడ్డుపాలు చేస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం సోదరుడు తిరుపతిరెడ్డికి ఒక న్యాయం.. పేదలకు మరో న్యాయం అనే రీతిలో ప్రభుత్వ తీరు ఉందని మండిపడ్డారు. పేదల ఇళ్లను కూలిస్తే తాము ఊరుకోబోమన్నారు. మంగళవారం తెలంగాణ భవన్లో శేరిలింగంపల్లి బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ ప్రసంగించారు. హైదరాబాద్‌లో బీఆర్ఎస్ అన్ని సీట్లనూ గెలుచుకోవడంతో కాంగ్రెస్‌కు ఓటేయలేదనే కక్షతో రేవంత్.. ప్రజలపై కక్ష కట్టారని ఆరోపించారు. రేవంత్ కుటుంబం, ఆయన సోదరులు రాష్ట్రాన్ని పంచుకొని స్వైర విహారం చేస్తున్నారని.. వారి దౌర్జన్యాలతో రియల్ ఎస్టేట్ రంగం కుప్పకూలిందని దుయ్యబట్టారు. మాదాపూర్‌లో సీఎం సోదరుడు తిరుపతిరెడ్డి కమీషన్ల దుకాణం తెరిచారని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ తనకు చెప్పారన్నారు. నోటీసు డ్రామా ఆడి తిరుపతిరెడ్డి ఇల్లు కూల్చకుండా స్టే తెచ్చుకొనేందుకు ప్రభుత్వం ఆయనకు సహకరించిందని కేటీఆర్ ఆరోపణలు గుప్పించారు. పేదల పిల్లలు కనీసం తమ పుస్తకాలు కూడా తీసుకొనే వ్యవధి ఇవ్వని హైడ్రా అధికారులు.. సీఎం సోదరుడి ఇంటిని మాత్రం ముట్టుకోవట్లేదని మండిపడ్డారు. త్వరలో గ్రేటర్ ఎమ్మెల్యేల సమావేశం.. ‘ప్రభుత్వానికి దమ్ముంటే మంత్రి పొంగులేటి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డి తదితరుల ఇళ్లు కూల్చాలి. పేదలకు దిక్కులేక నాలాలపై ఇళ్లు కట్టుకుంటే కనీసం నోటీసు కూడా ఇవ్వట్లేదు. గత ప్రభుత్వం నిర్మించిన 40 వేల డబుల్ బెడ్రూం ఇళ్లను పేదలకు ఇవ్వాలి. పేదలకు అండగా నిలిచేందుకు త్వరలో కేసీఆర్ అనుమతితో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని ఎమ్మెల్యేలతో సమావేశమై కార్యాచరణ సిద్ధం చేస్తాం. అరికెపూడి గాందీని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అని మంత్రి శ్రీధర్‌బాబు చెబుతున్నారు. మరి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పింది ఎవరో శ్రీధర్‌బాబు చెప్పాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేల పరిస్థితి బతుకు బస్టాండ్లా తయారైంది. ఏ పార్టీలో ఉన్నానో చెప్పుకోలేని స్థితిలో అరెకపూడి ఉన్నారు. దమ్ముంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలపై చర్యలు చేపట్టి ఉపఎన్నికలు నిర్వహించాలి. శేరిలింగంపల్లిలో ఎప్పుడు ఉపఎన్నిక వచ్చినా కార్యకర్తల నుంచే అభ్యరి్థని ఎంపిక చేస్తాం’అని కేటీఆర్ ప్రకటించారు. సీఎంకు కుర్చీపై భరోసా లేదు.. రైతు భరోసాకు హామీ ఇచ్చిన రేవంత్‌కు ఆయన కుర్చీపైనే భరోసా లేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తన పదవిని ఖమ్మం, నల్లగొండ బాంబులు తీసుకుంటాయనే భయంతో ఉన్నారని ఎగతాళి చేశారు. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని చిట్టి నాయుడు తరహాలో రేవంత్ సవాళ్లు చేస్తున్నారని.. కానీ తెలంగాణ ఉన్నన్ని రోజులు కేసీఆర్ ఆనవాళ్లను చెరిపేయడం ఎవరికీ సాధ్యం కాదన్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో కొత్త కమిటీ ఏర్పాటు చేసి పార్టీని బలోపేతం చేస్తామని కేటీఆర్ ప్రకటించారు. ఈ సమావేశంలో మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు గోపీనాథ్, మాధవరం కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. ‘అమృత్’లో అవినీతిపై బండివి చిల్లర మాటలు కేంద్ర పథకమైన అమృత్‌లో అవినీతిపై కేంద్ర మంత్రి బండి సంజయ్ వైఖరి దొంగలుపడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగిన చందంగా ఉందని కేటీఆర్ ‘ఎక్స్’లో ఎద్దేవా చేశారు. అమృత్‌లో అవినీతి జరిగిందని మొదట చెప్పింది బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్రెడ్డేనని.. అయినా పాలు తాగుతున్న దొంగ పిల్లిలా బండి కళ్లు మూసుకున్నారని మూసుకున్నారని విమర్శించారు. పథకంలో అవినీతిని ఆధారాలతో తాము బయట పెట్టాక ఆయన చిల్లర మాటలు మాట్లాడటం దేనికని ప్రశ్నించారు. వైద్యవిద్య ప్రవేశాలపై సర్కారు మొద్దునిద్ర గత పదేళ్లు ప్రశాంతంగా, పకడ్బందీగా సాగిన ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్ల ప్రక్రియను కాంగ్రెస్ ప్రభుత్వం తొలి ఏడాదే అస్తవ్యవస్తంగా మార్చి గందరగోళాన్ని సృష్టిస్తోందని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ బిడ్డలకు స్థానికత విషయంలో అన్యాయం చేసేలా జీవో–33 తెచ్చి ప్రవేశాల ప్రక్రియను ఆగం చేసిన సీఎం విద్యార్థులకు క్షమాపణలు చెప్పాలని ‘ఎక్స్’వేదికగా డిమాండ్ చేశారు. స్థానికతపై మార్గదర్శకాలు రూపొందించాలని సుప్రీంకోర్టు తీర్పు చెప్పినా ప్రభుత్వం మొద్దునిద్ర వీడట్లేదని విమర్శించారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఒక్క విద్యార్థికి నష్టం జరిగినా చూస్తూ ఊరుకోబోమని కేటీఆర్ హెచ్చరించారు. -
ట్రిపుల్ ఆర్‌పై కాంగ్రెస్ మాట తప్పింది
సాక్షి, హైదరాబాద్: రీజినల్ రింగు రోడ్డు (ట్రిపు ల్ ఆర్) భూ సేకరణలో నష్టపోతున్న రైతులు, బాధితులకు న్యాయం చేయాలని మాజీమంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో వారికి ఇచ్చిన హామీని సీఎం రేవంత్, మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి నిలబెట్టుకోవాలన్నారు. ట్రిపుల్ ఆర్తో నష్టపోతున్న రైతులు మంగళవారం హరీశ్‌రావును హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో కలిసి వినతిపత్రం అందజేశారు. బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని హరీశ్ భరోసా ఇవ్వడంతో పాటు ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ‘బాధితులకు న్యాయం చేస్తామని అసెంబ్లీ ఎన్నికల సమయంలో సాక్షాత్తూ భువనగిరి సభలో ప్రియాంకాగాంధీ హామీ ఇచ్చారు. ట్రిపుల్ ఆర్ ఉత్తరభాగంలో జంక్షన్‌ను 40 కిలోమీటర్లకు బదులు 28 కిలోమీటర్లను పరిగణనలోకి తీసుకోవడంతో చౌటుప్పల్ మున్సిపాలిటీతోపాటు మండలంలోని రైతులు నష్టపోతున్నారు. గతంలో జంక్షన్ రింగును 78 ఎ కరాల్లో ప్రతిపాదించగా, ప్రస్తుతం 184 ఎకరా లకు పెంచడంతో నష్టం పెరుగుతుంది. గతంలో ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకట్రె డ్డి ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్చాలని రాయగిరి, చౌటుప్పల్ రైతులతో కలిసి ధర్నా చేశారు. కానీ ఇప్పు డు పోలీసు బలగాలతో నిర్బంధంగా సర్వే చేసి ఒప్పంద పత్రాల మీద సంతకాలు చేయాలని ఒత్తిడి చేయడం దుర్మార్గం. కాంగ్రెస్ మాట నిలుపుకునేంత వరకు బాధితులకు బీఆర్ఎస్ అండగా ఉంటుంది. బాధితుల పక్షాన పోరాటం చేస్తాం’అని హరీశ్‌రావు చెప్పారు. -
ఆ ఇద్దరు మంత్రులు దద్దమ్మలు: జగదీష్‌రెడ్డి
సాక్షి,నల్లగొండజిల్లా:ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఇద్దరు దద్దమ్మ మంత్రులున్నారని మాజీ మంత్రి,బీఆర్ఎస్ సీనియర్ నేత జగదీష్‌రెడ్డి మండిపడ్డారు. సాగర్ జలాలపై ఈ మంత్రులకు అవగాహన లేకపోవడంతో ఆయకట్టు పొలాలు ఎండిపోతున్నాయన్నారు. సూర్యాపేటలో మంగళవారం(సెప్టెంబర్24) నిర్వహించిన మీడియా సమావేశంలో జగదీష్‌రెడ్డి మాట్లాడారు.ఖమ్మం జిల్లాకు సాగర్ నీళ్లు అధికంగా తరలించడం వల్లనే ఎడమ కాల్వకు గండి పడిందని ఆరోపించారు. జిల్లాలో ఉన్న మంత్రుల మాటలు విని పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. రెండు లక్షల రుణమాఫీ ఇంకా 30 శాతం కూడా పూర్తిచేయలేదని విమర్శించారు. రైతు భరోసా వెంటనే ఇవ్వాలని జగదీష్‌రెడ్డి డిమాండ్ చేశారు.ఇదీ చదవండి: సాగర్‌కాలువ గండి పూడ్చడం చేతకాదా..? -
పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే : కేటీఆర్
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల బతుకు జూబ్లీ బస్టాండే అవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం తెలంగాణ భవన్లో శేరిలింగంపల్లి నాయకులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడారు. బీఆర్ఎస్ ఏం పాపం చేసిందని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే ఆరికెపూడి గాంధీ కాంగ్రెస్‌లోకి వెళ్లారని కేటీఆర్ ప్రశ్నించారు.మంత్రి శ్రీధర్ బాబు అతితెలివి ప్రదర్శించొద్దని హెచ్చరించారు. ఇద్దరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కొట్టుకున్నారని మాట్లాడారు. ఎమ్మెల్యేలకు కండువా కప్పిన సన్నాసి ఎవరు? అని అన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యే బతుకు జూబ్లీ బస్టాండే అవుతుందని సూచించారు. Live: BRS Party Cadre Meeting, Serilingampally Assembly constituency.@KTRBRS https://t.co/9PwrvDngy6— BRS Party (@BRSparty) September 24, 2024చదవండి : చంద్రబాబు ప్రభుత్వం ఐదేళ్లు బతకదు -
కాంగ్రెస్ పార్టీలో రాజుకుంటున్న వర్గపోరు
జనగామ: డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి వర్సెస్ సీనియర్ నాయకుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గున మండుతోంది. కొమ్మూరి తనను హత్య చేయించేందుకు సుపారీ ఇచ్చాడని కంచె రాములు చేసిన ఫిర్యాదుతో జిల్లాలో పార్టీ అడ్డంగా చీలిపోయే పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఎన్నికలు ముగిసే వరకు అంతా కలిసే ఉన్న నాయకత్వం.. లోక్‌సభ ఎన్నికలు వచ్చే సరికి రెండు వర్గాలుగా విడిపోయింది. ఎమ్మెల్యే ఎన్నికల సమయంలో తన ఓటమికి కారణమయ్యారంటూ కొంతమంది నాయకులపై ప్రతాప్‌రెడ్డి బహిరంగంగానే విమర్శలు గుప్పించడంతో ఇరువురి మధ్య దూరం పెరిగింది. కొమ్మూరి నిర్లక్ష్యం, ఒంటెద్దు పోకడలతోనే ఓడిపోయారే తప్ప.. నాయకులు, కార్యకర్తల తప్పు లేదని మరోవర్గం అంటోంది. ఇద్దరి మధ్య రాజుకున్న వివాదం.. పార్టీ అధిష్టానం వద్దకు చేరింది. రోజుకో ఫిర్యాదుతో రెండు వర్గాల వారు గాంధీభవన్, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, క్రమశిక్షణ సంఘం ప్రతినిధులకు ఫిర్యాదు చేసుకుంటున్నారు. పార్టీ ఇచ్చిన ప్రతీ కార్యక్రమాన్ని వేర్వేరుగా నిర్వహిస్తూ గ్రూపులకు ఆజ్యం పోస్తున్నా రు. దీంతో దిగువ శ్రేణి నాయకత్వం దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతోంది.రెండు వర్గాలుగా విడిపోయి..పార్టీ నాయకులు, శ్రేణులు జనగామ నుంచి కొమురవెల్లి వరకు రెండు వర్గాలుగా విడిపోయి ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటూ ప్రతిపక్షాన్ని తలపించేలా వ్యవహరిస్తున్నాయి. డీసీసీ అధ్యక్షుడి ఫొటో లేని ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తూ.. చించి వేసుకునే స్థాయికి దిగజారి పోతున్నారు. ప్రతిపక్షంలో పదేళ్లు ఉండి పార్టీని కాపాడుకుంటే.. కొమ్మూరి బాధ్యతలు తీసుకున్న తర్వాత సీనియర్లను పక్కన పెడుతున్నారన్న పంచాయితీ తెలిసిందే. జనగామ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం కొమ్మూరి వర్సెస్ సీనియర్ల మధ్య మరింత దూరం పెంచగా, చినికి చినికి గాలివానలా మారింది. హత్య చేయించేందుకు డీసీసీ అధ్యక్షుడు సుపారీ ఆఫర్ చేశారంటూ ఆ పార్టీ నేత కంచె రాములు పోలీసులకు ఫిర్యా దు చేసుకునే వరకు వెళ్లింది. పార్టీ రాష్ట్ర కార్యదర్శి కంచె రాములును హత్య చేయించేందుకు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి రాహుల శ్రీనివాస్‌రెడ్డి అనే వ్యక్తికి రూ.25లక్షలు ఆఫర్ చేసి కుట్ర పన్నారని డీసీపీకి ఫిర్యాదు చేయడం హాట్ టాపిక్‌గా మారింది. ఈ విషయాన్ని పార్టీ క్రమశిక్షణ సంఘం చైర్మన్ చిన్నారెడ్డి దృష్టికి తీసుకువెళ్లినట్లు రాములు చెప్పగా.. తనపై అనవసరంగా బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ డీసీసీ అధ్యక్షుడు కొట్టి పారేశారు. ‘అసలు శ్రీనివాస్‌రెడ్డి నా శత్రువు.. సోషల్ మీడియాలో నాకు వ్యతిరేఖంగా పోస్టులు పెడుతున్నాడు. అంభాడాలు వేస్తున్నాడు.. పోలీసులు సమగ్ర విచారణ చేపట్టాలని’ కొమ్మూరి కోరడం గమనార్హం.ఒకరిపై ఒకరు ఫిర్యాదులు..కొద్ది రోజులుగా డీసీసీ అధ్యక్షుడు కొమ్మూరి ప్రతాప్‌రెడ్డితోపాటు మరో వర్గానికి చెందిన సీని యర్ నాయకులు వేమెళ్ల సత్యనారాయణరెడ్డి, ఎర్రమల్ల సుధాకర్, కంచె రాములు వర్గీయులు టీపీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్‌గౌడ్, మంత్రులు, సీఎం వద్దకు వెళ్లి జనగామ నియోజకవర్గంలో తాజా రాజకీయ పరిస్థితులపై ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. జనగామ వ్యవసాయ మార్కెట్ చైర్మన్ పదవి ఆశిస్తున్న కంచె రాములును కాదని డీసీసీ అధ్యక్షుడు మరో పేరును సూచించడంతో సీనియర్లు సీరియస్ అయ్యారు. అయినా కొమ్మూరి యువ నాయకు ల వైపే మొగ్గు చూపారు. ఈసారి బీసీ(ఏ) రిజర్వేషన్ ఉంది.. ఆ పదవి తనకే ఇవ్వాలని లోకుంట్ల ప్రవీణ్ పట్టు బడుతున్నాడు. అవసరమైతే కోర్టుకు వెళ్లేందుకు సిద్ధమంటూ సవాల్ విసురుతుండంతో అధిష్టానం మార్కెట్ చైర్మన్ పదవి విషయాన్ని పెండింగ్‌లో ఉంచింది. ఏది ఏమైనా డీసీసీ అధ్యక్షుడు వర్సెస్ కంచె రాములు వర్గపోరు ఎటుదారి తీస్తుందో వేచిచూడాలి. -
దిద్దుబాటు దిశగా బీఆర్ఎస్.. ఆ నియోజకవర్గాలపై ఫోకస్
సాక్షి, హైదరాబాద్: కారు గుర్తుపై గెలిచిన పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. దీంతో బీఆర్ఎస్ దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఎమ్మెల్యేలు పార్టీ వీడిన నియోజకవర్గాలపై ఆ పార్టీ దృష్టి పెట్టింది. ఈ క్రమంలో శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ నేతలకు మాజీ మంత్రి, ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నుంచి పిలుపొచ్చింది. కాసేపట్లో తెలంగాణ భవన్లో శేరిలింగంపల్లి నేతలతో ఆయన భేటీ కానున్నారు.అరికెపూడి గాంధీ పార్టీ మారిన నేపథ్యంలో శేరిలింగంపల్లి నియోజకవర్గంపై బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ బలోపేతంపై కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. ఎమ్మెల్యేలు పార్టీ వీడిన నియోజకవర్గాల్లో క్యాడర్‌ను కాపాడుకునే పనిలో బీఆర్ఎస్ పడింది. కొత్త నాయకత్వాన్ని తయారు చేయటంపై బీఆర్ఎస్ కసరత్తు ప్రారంభించింది. ఈ నేపథ్యంలో వరస సమావేశాలను కేటీఆర్ నిర్వహించనున్నారు.ఇదీ చదవండి: యజమానుల తప్పిదం.. సామాన్యులు బలి! -
ఆ కిటుకేదో సామాన్యులకు చెప్పండి.. రేవంత్ సోదరుడికి కేటీఆర్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్‌రెడ్డి సోదరుడు తిరుపతిరెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఎక్స్ వేదికగా ప్రశ్నల వర్షం కురిపించారు. ‘‘అనుముల తిరుపతి రెడ్డి గారు! ఎల్కేజీ చదివే వేదశ్రీ కి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు!. 50 ఏళ్ల కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది!. 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేల మట్టమైంది!. వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా.. పేక మేడల కూల్చివేయబడింది!. తిరుపతి రెడ్డి గారు, క్షణం కూడా సమయం ఇచ్చే ప్రసక్తే లేదన్న హైడ్రా.. మీ విషయంలో నోరు మెదపలేదు!’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.‘‘వాల్టా అనుకుంటా.. ఏకంగా మీకు 30 రోజుల టైం ఇచ్చింది! కోర్టులో స్టే సంపాదించుకున్నారు!. ప్రస్తుతం జరుగుతున్న కూల్చివేతల రావణకాష్టంలో మట్టి కూడా అంటనిది బహుశా మీకు మాత్రమేనామో!. మీ సోదరుడి బల్డోజర్ల కింద నలిగిపోతున్న సామాన్యులకు ఆ కిటుకేదో చెప్పండి!’’ అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.అనుముల తిరుపతి రెడ్డి గారు! LKG చదివే వేదశ్రీ కి తన పుస్తకాలు తీసుకునే సమయం కూడా ఇవ్వలేదు! 50 ఏళ్ళ కస్తూరి బాయి తన జీవనాధారమైన చెప్పుల దుకాణం కోల్పోయింది! 72 గంటల క్రితం కొన్న ఇల్లు నేల మట్టమైంది! వారం ముందు గృహప్రవేశం చేసుకున్న ఇల్లు, అన్ని కాగితాలు ఉన్నా….పేక మేడల… pic.twitter.com/1zIb7cBrCB— KTR (@KTRBRS) September 24, 2024ఇదీ చదవండి: యజమానుల తప్పిదం.. సామాన్యులు బలి! -
వారంలో ఇద్దరు మంత్రులు గాంధీభవన్‌లో
సాక్షి, హైదరాబాద్: ప్రతీవారంలో ఇద్దరు మంత్రులు కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యాల యమైన గాంధీ భవన్‌ను సందర్శించనున్నారు. ఈ మేరకు సోమవారం టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ షెడ్యూల్ విడుదల చేశారు. ప్రతి బుధ, శుక్రవారాల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం వరకు పార్టీ కార్యకర్తలు, సమస్యలు చెప్పుకునేందుకు వచ్చే ప్రజలను గాంధీభవన్‌లో కలుస్తారన్నారు. ఈ సందర్భంగా ప్రజల ఫిర్యాదులు, అర్జీలను ఆ రోజున తీసుకుంటారని మహేశ్‌కుమార్‌గౌడ్ ఆ షెడ్యూల్లో వివరించారు. మంత్రుల షెడ్యూల్ ఇలా...25 సెప్టెంబర్: దామోదర రాజనర్సింహ, 27 సెప్టెంబర్: శ్రీధర్‌బాబు, 2 అక్టోబర్: గాంధీ జయంతి (కార్యక్రమం లేదు), 4 అక్టోబర్ : ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, 9 అక్టోబర్: పొన్నం ప్రభాకర్, 11 అక్టోబర్: సీతక్క, 16 అక్టోబర్: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, 18 అక్టోబర్: కొండా సురేఖ, 23 అక్టోబర్: పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, 25 అక్టోబర్: జూపల్లి కృష్ణారావు, 30 అక్టోబర్: తుమ్మల నాగేశ్వరరావు -
సాగర్ కాలువ గండిని పూడ్చడం చేతకాదా?: హరీశ్‌రావు
సాక్షి, హైదరాబాద్: ఖమ్మం జిల్లాలో లక్షల ఎకరాల్లో పంటలు ఎండు తున్నా 22 రోజులుగా నాగార్జున సాగర్ కాలువకు పడిన గండిని పూడ్చ డం కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకావ డం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్‌రావు మండిపడ్డారు. కృష్ణా నది నిండుకుండలా ఉన్నా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పొలాలను ఎండ బెడుతోందన్నారు. ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగే శ్వరరావు గండి పడిన కాలువ పక్క నుంచే వెళ్తున్నా మరమ్మతులు జరగడం లేదని ఎద్దేవా చేశారు.దీంతో ‘సీఎంను క్షమించు.. రైతులను రక్షించు’అంటూ భద్రాచలం సీతారామచంద్ర స్వామిని వేడుకుంటున్నామని హరీశ్‌రావు అన్నా రు. సోమవారం ఆయన తెలంగాణ భవన్లో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్యే చింత ప్రభా కర్, మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలసి మీడియాతో మాట్లాడుతూ, బీఆర్ఎస్ తరఫున త్వరలో ఖమ్మం జిల్లాలో పర్యటించి రైతులకు మనోధైర్యం కల్పిస్తామన్నారు.రైతులతో కన్నీళ్లు పెట్టిస్తున్నారు..‘పాలేరు, ఖమ్మం, వైరా, సత్తుపల్లి, మధిర నియో జకవర్గాల్లో రైతులు పార్టీలకు అతీతంగా నాగా ర్జునసాగర్ ప్రాజెక్టు ఆఫీసులను ముట్టడిస్తూ ధర్నాలు చేస్తున్నారు. ఆకాశాన్ని దించుతాం, సూర్యుడిని వంచుతాం అనే డైలాగులు కొడు తున్న రేవంత్ రెడ్డి, జిల్లా మంత్రులకు కాలువ గండి పూడ్చటం చేతకావడం లేదా. 3 లక్షల ఎకరాలు ఎండుతున్నా కాంగ్రెస్ సర్కార్‌కు కూల్చి వేతలు తప్ప పూడ్చివేత రాదా? వరదల్లో కొట్టు కుపోయిన పంటలకు నష్టం పరిహారం ఇవ్వకుండా రైతులతో కన్నీళ్లు పెట్టిస్తోంది’అని హరీశ్‌రావు మండిపడ్డారు.‘వరదల కారణంగా సాగర్ పరీవాహక ప్రాంతంలో 60 వేల ఎకరాలు, కాంగ్రెస్ నిర్వాకంతో లక్ష ఎకరాలు నష్టపోయినట్లు ప్రాథమికంగా అంచనా. ఇప్పుడు కాంగ్రెస్ సర్కా రు నీళ్లిచ్చినా పంటలు చేతికొచ్చే పరిస్థితి లేదు. పంటలను కాపాడుకునేందుకు రైతులు జనరే టర్లు, డిజిల్, ట్రాక్టర్ల కోసం వేల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. వరదల్లో నష్టపోయిన వారికి ఇస్తున్న పరిహారం రూ.10 వేలు ఏ మూలకూ సరిపోవడం లేదు’అని అన్నారు. రాష్ట్రంలో గూండాయిజం పెరిగి, అత్యాచారాలు నిత్యకృత్యం అయ్యాయన్నారు. రేవంత్ అధికారంలోకి వచ్చిన పది నెలల్లోనే రెండు వేల అత్యాచార ఘటనలు చోటు చేసుకున్నాయని హరీశ్ పేర్కొన్నారు. -
నాటి చావులు గుర్తులేవా కేటీఆర్?
సాక్షి, హైదరాబాద్: ‘‘గత ప్రభుత్వ హయాంలో 2017లో కోఠి మెటర్నిటీ ఆస్పత్రిలో మూడు రోజు ల్లో ఆరుగురు బాలింతలు, అదే ఏడాది ఐదు రోజు ల వ్యవధిలో నిలోఫర్ ఆస్పత్రిలో ఐదుగురు బాలింతలు, 2022లో డీపీఎల్ పద్ధతిలో చేసిన కుటుంబ నియంత్రణ ఆపరేషన్లతో నలుగురు మహిళలు, 2019లో జూన్, జూలై నెలల్లో డెంగీతో 100 మంది చనిపోవడం.. ఇవన్నీ గుర్తులేవా కేటీఆర్? గత ప్ర భుత్వం శాశ్వత పరిష్కారాన్ని చూపకనే పేదలకు వైద్యం అందని ద్రాక్షగా మారింది..’’ అని వైద్యారో గ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ విమర్శించారు. ఈ మేరకు సోమవారం ఒక ప్రకటన జారీచేశారు.గత పదేళ్లలో నిర్వీర్యమైన వైద్య రంగాన్ని తాము గాడిలో పెడుతున్నామని దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. బీఆర్ఎస్ రాజకీయం కోసం ఆస్పత్రులను వేదికగా వాడుకోవడం సరికాదని మండిపడ్డారు. గత ప్రభుత్వంలో అనేక దుర్ఘటనలు జరిగాయని.. అవన్నీ బీఆర్ఎస్ నిజనిర్ధారణ కమిటీ తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. గాంధీ ఆస్పత్రిపై బురదజల్లే ప్రయత్నాలను మానుకోవాలని డాక్టర్లు విజ్ఞప్తి చేసినా.. కేటీఆర్‌కు తలకు ఎక్కడం లేదని మంత్రి మండిపడ్డారు. ఖాళీలకు బాధ్యులు ఎవరు? ‘‘తప్పుడు సమాచారంతో ట్వీట్ చేసి, అడ్డంగా దొరికిపోయిన కేటీఆర్.. తప్పును కవర్ చేసుకునేందుకు ఫ్యాక్ట్ ఫైండింగ్ పేరిట డ్రామాలు చేస్తున్నారు. గత పదేళ్ల పాలనా వైఫల్యాలను పది నెలల ప్రభుత్వానికి ఆపాదిస్తున్నారు. గాంధీ ఆస్పత్రి మరణాలను ప్రభుత్వ వైద్యుల వైఫల్యంగా చిత్రీకరించడం బీఆర్ఎస్ అజ్ఞానానికి నిదర్శనం. అసలు వైద్యారోగ్యశాఖలో ఖాళీలకు బాధ్యులు ఎవరు?’’ అని దామోదర రాజనర్సింహ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో మూడేళ్లలో హడావుడిగా 25 మెడికల్ కళాశాల ఏర్పాటుకు జీవోలు ఇచ్చి చేతులు ఎత్తేశారని.. 3,368 మంది టీచింగ్ స్టాఫ్ అవసరమైతే, కేవలం 1,078 మందిని భర్తీ చేశారని మండిపడ్డారు. స్టాఫ్, సదుపాయాలు లేకుండా మొక్కుబడిగా మెడికల్ కాలేజీలను ఏర్పాటు చేసిన ఘనత బీఆర్ఎస్కే దక్కుతుందని విమర్శించారు. త్వరలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ రాష్ట్రంలోని అన్ని ప్రధాన ఆస్పత్రులలో అడ్మిని్రస్టేషన్ కోసం ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేయబోతున్నామని మంత్రి దామోదర తెలిపారు. త్వరలోనే 612 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ చేపట్టబోతున్నామని వెల్లడించారు. కొత్త వైద్య కళాశాలల్లో డీఎంఈ కింద 19,530 పోస్టులకు ఆర్థికశాఖ అనుమతి ఇస్తే.. గత ప్రభుత్వం భర్తీ చేసింది 1,500 లోపేనని విమర్శించారు. తమ ప్రభుత్వం ఇప్పటికే అన్ని విభాగాల్లో కలిపి 7,308 పోస్టులు భర్తీ చేసిందని తెలిపారు. మరో 5,660 పోస్టుల భర్తీకి చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. గాంధీ ఆస్పత్రిలో మాతాశిశు మరణాలు 2022లో 500 జరిగితే.. 2023లో 542 ఉండగా, 2024లో ఇప్పటివరకు 309 మరణాలు జరిగాయని వెల్లడించారు. నెలవారీ సగటు చూస్తే 2022లో 42 చొప్పున, 2023లో 45 చొప్పున, 2024లో 39 చొప్పున జరిగాయని వివరించారు. -
భగీరథ, కాళేశ్వరం పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకున్నారు: మంత్రి పొంగులేటి
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్త గూడెం/నేలకొండపల్లి: గత ప్రభుత్వం మిషన్ భగీరథ, కాళే శ్వరం పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకుందని మంత్రి పొంగు లేటి శ్రీనివాస రెడ్డి ఆరోపించారు. ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో మార్కెట్ క మిటీ నూతన పాలక వర్గ ప్ర మాణస్వీకారం సోమ వారం సాయంత్రం జరగగా, ఆయ న పాల్గొని మాట్లాడారు. ము ఖ్యమంత్రి ఎంఐయూడీలో అమృత్ స్కీంలో అవినీతికి పాల్పడ్డారని, సృజన్‌రెడ్డికి పనులు ఇచ్చారని కేటీఆర్ చెబుతుండగా.. ఈ విషయమై చర్చకు ఎక్కడైనా వస్తానని, ఆరోప ణలు నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని చెబితే సమాధానం ఇవ్వలేదన్నారు.ఎంతో అనుభవం ఉందని చెప్పుకునే కేటీఆర్ ఎవరో చెప్పిన విమర్శలు చేసే ముందుకు ఆలో చించాలని సూచించారు. పాలేరులో తనపై బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన కందాళ ఉపేందర్‌రెడ్డి అల్లుడే సృజన్‌రెడ్డి అని.. ఆయనకు బీఆర్ఎస్ హయాంలో సబ్ కాంట్రాక్టర్లు ఇప్పించారని తెలిపారు. ఇప్పుడు సృజన్‌రెడ్డిని సీఎం రేవంత్‌రెడ్డి బావమరిదిగా చిత్రీకరించే పనిచేస్తు న్నారని చెప్పారు. సీఎంను దించడానికి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుట్ర చేస్తు న్నారని చెబుతు న్నారని.. కానీ కేటీఆర్ – హరీశ్ రావు మధ్యే అంతర్గత వివాదాలు ఉన్నాయని తెలిపారు. అధికారులు పద్ధతి మార్చుకోవాలిపేదవారి కోసం తమ ప్రభుత్వం పనిచేస్తోందని.. సర్కారు ఆలోచన లకు అనుగుణంగా అధి కా రులు పనిచేయాలని రాష్ట్ర రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి సూచించారు. అలా కాకుండా సొంత ఆలోచనలను పాలనలో జొప్పించాలని చూస్తే ఏ స్థాయి అధికారుల పైనైనా చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని స్పష్టం చేశారు. భద్రాద్రికొత్తగూడెం జిల్లా ఇల్లెందులో మంగళవారం పర్యటించిన ఆయన వివిధ అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత నిర్వహించిన సమీక్షలో ఎంపీ బలరాంనాయక్, ఎమ్మెల్యే కనకయ్య, కలెక్టర్ పాటిల్, ఎస్పీ సునీల్‌దత్, ఐటీడీఏ పీఓ రాహుల్ సహా అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం తరహాలో ధరణిని అడ్డుపెట్టుకొని ప్రజలను ఇబ్బంది పెట్టాలని చూస్తే ఊరుకోబోమన్నారు. -
తెలంగాణలో గూండారాజ్!
శివ్వంపేట (నర్సాపూర్): తెలంగాణలో ప్రజా పాలన కాకుండా గూండారాజ్ నడుస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి స్వగ్రామం గోమారంలోని ఆమె ఇంటిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేయడం దారుణమని మండిపడ్డారు. ఆదివారం అర్ధరాత్రి గోమారంలోని సునీతారెడ్డి నివాసం వద్ద బాణసంచా కాలుస్తూ, ఇటుకలు విసురుతూ కాంగ్రెస్ శ్రేణులు దాడికి పాల్పడటం, ఆ సమయంలో బీఆర్ఎస్ నేతలకు, కాంగ్రెస్ నేతలకు మధ్య గొడవ జరగడం నేపథ్యంలో.. హరీశ్‌రావు సోమవారం ఆ గ్రామానికి వెళ్లారు. సునీతారెడ్డి నివాసాన్ని పరిశీలించి, స్థానిక నేతల నుంచి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడారు.రేవంత్ రెచ్చగొట్టే వ్యాఖ్యలతోనే..సీఎం రేవంత్‌రెడ్డి రెచ్చగొట్టే వ్యాఖ్యల వల్లే రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఇళ్లపై దాడులు జరుగుతు న్నాయని హరీశ్‌రావు ఆరోపించారు. సిద్దిపేటలోని తన కార్యాలయంపై, హైదరాబాద్‌లో ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డి ఇంటిపై, ఇప్పుడు ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ శ్రేణులతో దాడులు చేయించారని మండిపడ్డారు. గోమారంలో బీఆర్ఎస్ వారిపై కాంగ్రెస్ నాయకులు దాడి చేస్తున్న విషయం వీడియో లో స్పష్టంగా కనిపిస్తోందన్నారు. దాడికి పాల్పడిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే మానవ హక్కుల కమిషన్ దృష్టికి తీసుకెళ్తామన్నారు. ఇలాంటి దాడులతో తెలంగాణ కు ఉన్న మంచి పేరును చెడగొడుతున్నారని మండిపడ్డారు.బాణసంచా పేల్చి.. ఇటుకలు విసిరి!నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతారెడ్డి స్వగ్రామమైన శి వ్వంపేట మండలం గోమారంలో ఆదివారం రాత్రి వినాయక శోభాయాత్ర నిర్వహించారు. అర్ధరాత్రి సమయంలో ఈ యాత్ర ఎమ్మెల్యే సునీతారెడ్డి ఇంటి వద్దకు చేరుకుంది. ఈ సమయంలో కొందరు బాణసంచా కాల్చుతూ ఆమె ఇంటిపైకి విసిరారు. కొందరు ఇటుకలు విసిరారు. ఆ సమయంలో ఎమ్మెల్యే ఇంట్లో లేరు. అక్కడ కాపలాగా నిద్రిస్తున్న పలువురు యువకులు బాణసంచా, ఇటుకలు విసురుతున్నవారిని అడ్డుకోవడానికి ప్రయత్నించా రు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు వెంటనే సునీతారెడ్డి నివాసం వద్దకు చేరుకున్నారు. ఈ సమయంలో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాటతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు అక్కడికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు.పథకం ప్రకారమే దాడి: సునీతారెడ్డికాంగ్రెస్ నాయకుల ప్రోత్సాహంతోనే ఆదివారం అర్ధరాత్రి తన ఇంటిపై దాడి జరిగిందని ఎమ్మెల్యే సునీతారెడ్డి ఆరోపించారు. తన ఇంటి వద్దకు వినా యక శోభాయాత్ర రాగానే.. పథకం ప్రకారం ఇంటిపైకి బాణసంచా విసురుతూ, రాళ్లతో దాడి చేశా రని చెప్పారు. ఇంట్లో పడుకున్న వారిని కొట్టారని.. అడ్డువచ్చిన బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారని పేర్కొన్నారు. దాడులకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
కాంగ్రెస్ నేతలు నన్ను అభినందిస్తున్నారు
సాక్షి, హైదరాబాద్: అమృత్ టెండర్లలో రేవంత్‌రెడ్డి మోసాన్ని బయటపెట్టినందుకు కొందరు సీనియర్ కాంగ్రెస్ నేతల నుంచి తనకు అభినందన సందేశాలు వచ్చినట్టు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. కానీ రేవంత్‌రెడ్డి అక్రమాలపై బీజేపీ నేతల మౌనం తనకు ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో పరిస్థితు లను అధ్యయనం చేసేందుకు వెళ్లిన పార్టీ అధ్య యన బృందం సభ్యులను పోలీసులు అరెస్టు చేయ డాన్ని కేటీఆర్ ఖండించా రు. రాజకీయాలకు అతీ తంగా ప్రజాసంక్షేమం కోసమే స్వయంగా డాక్ట ర్లతో కూడిన తమ పార్టీ ప్రతినిధి బృందం ఆస్పత్రు లను సందర్శిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు ఎన్ని పిరికిపంద చర్యలకు పాల్పడినా, ప్రజారోగ్య వ్యవస్థ లోపా లను ఎత్తిచూపుతామని ప్రకటించారు. ప్రభుత్వం నిజాలు దాచని పక్షంలో బీఆర్ఎస్ నిజ నిర్ధారణ కమిటీ దర్యాప్తునకు సహకరించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. పట్టణ పేదలకు ఉచిత వైద్యం అందుబాటులోకి తెచ్చేందుకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 400కు పైగా బస్తీ దవాఖానాలను నడపడం రేవంత్ ప్రభుత్వానికి చేతకావడం లేద న్నారు. ఓ వైపు విష జ్వరాలతో నగరవాసులు నరక యాతన పడుతుంటే, అసమర్థ పాలనలో ఆదుకో వాల్సిన బస్తీ దవాఖానాలకే సుస్తీ చేసిందన్నారు.కాంగ్రెస్ గూండాలను అరెస్టు చేయాలినర్సాపూర్ ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డిని కేటీఆర్ ఫోన్లో పరామర్శించారు. ఎమ్మెల్యే ఇంటిపై కాంగ్రెస్ గూండాలు దాడి చేసి విధ్వంసం చేసే ప్రయ త్నం చేశారని, సంఘటన వివరాలు, సునీతాలక్ష్మా రెడ్డి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ గుండాలపై పోలీసులు కేసులు నమోదు చేసి కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇలాంటి చిల్లర ప్రయత్నాలతో సునీతాలక్ష్మారెడ్డి లాంటి బలమైన నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేమనే విషయాన్ని కాంగ్రెస్ పార్టీ గుర్తుంచుకోవాలన్నారు. కాంగ్రెస్ ఎన్ని అరాచకాలకు పాల్పడినా, 60 లక్షల మంది కేడర్ కలిగిన బీఆర్ఎస్ కుటుంబం ప్రతీ ఒక్కరికి అండగా ఉంటుందన్నారు. -
కేటీఆర్, పొంగులేటికి మహేశ్వర్‌రెడ్డి సవాల్
సాక్షి,హైదరాబాద్:బీఆర్ఎస్ను కాంగ్రెస్‌లో కలిపేందుకు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఢిల్లీ పెద్దలతో మాట్లాడుతున్నాడని బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి అన్నారు.కాంగ్రెస్‌కు బీఆర్ఎస్కు చీకటి ఒప్పందం లేకుంటే ఎందుకు బీఆర్ఎస్ నేతల మీద సీబీఐ,ఈడీ ఎంక్వైరీని కాంగ్రెస్ కోరడం లేదని ప్రశ్నించారు. మహేశ్వర్‌రెడ్డి సోమవారం(సెప్టెంబర్23) మీడియాతో మాట్లాడారు.‘కేటీఆర్ ఇప్పుడు కళ్ళు తెరుచుకొని మేము బతికే ఉన్నామనే ప్రయత్నం చేస్తున్నారు.బీజేపీ ఎప్పుడో అమృత్ పథకం అవకతవలపై మాట్లాడింది.కేసీఆర్ కుటుంబాన్ని కాపాడుతున్నదే కాంగ్రెస్ పార్టీ.కేటీఆర్,హరీష్ ఢిల్లీ వెళ్లి కేసి వేణుగోపాల్‌తో కలిసి పని చేస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా? పొంగులేటి శ్రీనివాసరెడ్డితో ఒప్పందం కుదిరి మీకు అనుకూలంగా ఉన్న మాట వాస్తవం కదా?అమృత్ టెండర్ల విషయంలో కేంద్రానికి నివేదిక ఇచ్చా.సుజన్‌రెడ్డి సీఎంకు బామ్మర్దో,బీఆర్ఎస్కు అల్లుడో అని రెండు పార్టీలు ఆరోపించికుంటున్నాయి.గ్లోబల్ టెండర్ల పేరుతో అమృత్ టెండర్లు కట్టబెట్టారు.పొంగులేటి శ్రీనివాసరెడ్డి కుటుంబానికి చెందిన సంస్థకు కాంట్రాక్టు ఇవ్వడం అధికార దుర్వినియోగమే.మంత్రిగా కొనసాగడానికి పొంగులేటికి నైతిక అర్హత లేదు.మంత్రి పొంగులేటి,కేటీఆర్‌కు నేను సవాలు చేస్తున్నా.నేను చేసిన అరోపణలు వాస్తవమని తేల్చకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.లేదంటే మీరు రాజకీయాల నుంచి తప్పుకుంటారా?’అని మహేశ్వర్‌రెడ్డి ఛాలెంజ్ చేశారు.ఇదీ చదవండి: ఎల్వోపీ సీటు కోసం కేటీఆర్,హరీశ్ ఫైట్ -
బస్తీ దవాఖానాలకు సుస్తీ: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్: పట్టణ పేదలకు వైద్యం అందుబాటులో ఉండాలనే ఉదాత్త సంకల్పంతో బీఆర్ఎస్ 400పైగా బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేసి అందుబాటులోకి తీసుకువచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు. ఈ మేరకు ఎక్స్(ట్విటర్)లో సోమవారం(సెప్టెంబర్23) కేటీఆర్ ఒక ట్వీట్ చేశారు. అయితే తాము ఏర్పాటు చేసిన బస్తీదవాఖానాలను కూడా కాంగ్రెస్ సర్కారుకు సరిగా నడపడం చేతకావడం లేదని కేటీఆర్ విమర్శించారు. అనేక రకాల విష జ్వరాలతో నగరవాసులు నరకయాతన పడుతుంటే ఆదుకోవాల్సిన బస్తీ దవాఖానాలకే ఈ అసమర్ధ ప్రభుత్వంలో సుస్తీ చేసిందన్నారు. ప్రజారోగ్యంపై మాజీ డిప్యూటీ సీఎం డాక్టర్ రాజయ్య నేతృత్వంలో బీఆర్ఎస్ వేసిన కమిటీ సోమవారం గాంధీ ఆస్పత్రిని సందర్శించకుండా పోలీసులు అడ్డుకున్న విషయం తెలిసిందే. రాష్ట్రంలో డెంగ్యూ, చికున్ గున్యా, మలేరియా, టైఫాయిడ్ వంటి విషజ్వరాలు ప్రబలుతున్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని బీఆర్ఎస్ విమర్శలు గుప్పిస్తోంది. ఇదీ చదవండి: ఎల్వోపీ సీటు కోసం కేటీఆర్,హరీశ్ ఫైట్ -
ఏపీలో రౌడీ రాజ్యం: జూపూడి ప్రభాకర్
సాక్షి,తాడేపల్లి: ఏపీలో రౌడీరాజ్యం కొనసాగుతోందని, రౌడీలు,రాజకీయ నాయకులు కలిసి జనానికి చుక్కలు చూపిస్తున్నారని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి జూపూడి ప్రభాకర్‌రావు అన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ ప్రధాన కార్యాలయంలో జూపూడి సోమవారం(సెప్టెంబర్23) మీడియాతో మాట్లాడారు.‘కాకినాడ టౌన్లో ఉన్న మెడికల్ కాలేజీలో ఎమ్మెల్యే నానాజి రాద్దాంతం చేశారు.నానాజీ మీద పదకొండు కేసులున్నాయి.అలాంటి రౌడీని పవన్ కళ్యాణ్ ఎందుకు వెనుకేసుకు వస్తున్నారు?రంగరాయ మెడికల్ కాలేజీకి ఎంతో గొప్ప చరిత్ర ఉంది.అలాంటి కాలేజీలో ప్రొఫెసర్లను,అమ్మాయిలను ఎమ్మెల్యే మనుషులు వేధిస్తున్నారు.దీనిపై ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు ప్రశ్నిస్తే ఆయనపై దాడి చేశారు.రౌడీ ఎమ్మెల్యేని పార్టీ నుండి సస్పెండ్ చేయాలని పవన్ కళ్యాణ్‌కు స్టూడెండ్స్ డిమాండ్ చేస్తున్నారు.ఒక ఎస్సీ డాక్టర్‌ను పచ్చి బూతులతో ఎమ్మెల్యే దూషించారు.దళితులు కన్నెర్ర చేస్తే కొట్టుకుపోతారు జాగ్రత్త.కలెక్టర్,ఎస్పీ కలిసి ఈ కేసును రాజీ చేస్తున్నారు.ఆ అధికారులు ఇలాంటి పనులు చేయడడానికే ఉన్నారా?దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం.వైద్యశాఖ మంత్రి సత్యకుమార్ ఏం చేస్తున్నారు?మంత్రి సత్యకుమార్ కూడా ఒకప్పుడు రౌడీనే.డాక్టర్ ఉమామహేశ్వరరావు ఆత్మగౌరవానికి భంగం కలిగింది.దానికి తిరిగి ఎవరు తెచ్చిస్తారు? ప్రజలు ఆగ్రహిస్తే నానాజీ లాంటి తురుమ్ఖాన్లు కనుమరుగు అవుతారు.జనం నిలదీసేసరికి ప్రాయచ్చితదీక్ష చేస్తున్నానని ఎమ్మెల్యే అంటున్నారు.రాష్ట్ర వ్యాప్తంగా డాక్టర్లు చేసే ఉద్యమానికి దళిత సంఘాలు మద్దతిస్తాయి.రఘురామకృష్ణంరాజు అంబేద్కర్ ఫ్లెక్సీని తగులపెట్టారు.రఘురామకృష్ణంరాజు దళితులకు క్షమాపణలు చెప్పాలి.దళితులంతా ఇప్పటి వరకు ఎంతో సహనంతో ఉన్నారు.దళితులంతా వైసీపికి మద్దతు ఇస్తున్నందుకు కక్ష కట్టారు.ప్రజలను తక్కువ అంచనా వేయొద్దు.ఏం సాధించారని వంద రోజుల పండుగ చేసుకుంటున్నారు?ప్రొఫెసర్ ఉమామహేశ్వరరావు కేసును సుమోటోగా తీసుకుని విచారించాలి.దళిత ఉద్యోగులకు సరైన పోస్టింగులు కూడా ఇవ్వడం లేదు.టీటీడీ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్ స్టార్ట్ అయింది’అని జూపూడి హెచ్చరించారు.ఇదీ చదవండి: పవన్ ప్రాయశ్చిత్తం అసలు దేనికోసం -
‘ఎల్ఓపీ’ సీటు కోసం కేటీఆర్, హరీశ్ ఫైట్: విప్ ఐలయ్య
సాక్షి,హైదరాబాద్: ప్రతిపక్షహోదా కోసం బావబామ్మర్దులు హరీశ్‌రావు,కేటీఆర్ కొట్టుకుంటున్నారని ప్రభుత్వవిప్ బీర్ల ఐలయ్య విమర్శించారు. సోమవారం(సెప్టెంబర్23) ఐలయ్య మీడియాతో చిట్‌చాట్ మాట్లాడారు.‘కేసీఆర్ రైతులను ముంచాడు.హరీష్ డెయిరీలను నాశనం చేశాడు.ప్రతిపక్ష నాయకుడి హోదా కోసం బావబామ్మర్ధులు కొట్టుకుంటున్నారు. ప్రజారోగ్యంపై కేటీఆర్ కమిటీ వేయడం సిగ్గుమాలిన పని.ప్రజాపాలనకి వస్తున్న ఆదరణ చూసి రంగా,బిల్లాలు ఓర్వలేకపోతున్నారు.గాంధీ హాస్పిటల్ సిబ్బంది మనోధైర్యం దెబ్బతీసేలా కేటీఆర్ వ్యవహరిస్తున్నారు.పడేండ్లలో ఒక్కసారైనా గాంధీ హాస్పిటల్ గురించి ఆలోచించారా? డీప్యూటీ సీఎం గా పనికిరాని రాజయ్య ఈరోజు అవసరం వచ్చారా? దళితున్ని ముందు పెట్టి డ్రామాలాడుతున్నారు. పదేండ్లలో ఉస్మానియా హాస్పిటల్ ఎందుకు కట్టలేకపోయారు?స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు మరోసారి బుద్ధి చెప్తారు.హరీశ్‌రావు డెయిరీ కోసం విజయ డైరీ,మదర్ డైరీని గత పదేళ్లలో పూర్తిగా నిర్వీర్యం చేశారు.గత పదేళ్లలో డెయిరీల్లో బీఆర్ఎస్ నాయకులు పంది కొక్కుల్లా మెక్కారు.డెయిరీల్లో జరిగిన అవినీతిపై విచారణ చేపిస్తాం’అని తెలిపారు.ఇదీ చదవండి.. హైడ్రా పేరుతో హైడ్రామాలు: హరీశ్‌రావు -
కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయకపోతే, డీజీపీ ఆఫీస్ ముట్టడిస్తాం: హరీష్ రావు
సాక్షి, మెదక్ : తన ఇంటిపై దాడి జరిగిందని నర్సాపూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి తెలిపారు. 30 ఏళ్లుగా తమ గ్రామంలో మెలాంటి ఫ్యాక్షన్ రాజకీయాలు లేవని తెలిపారు. గొడవ జరుగుతుందని తెలిసి ముందే పోలీసులకు చెప్పిన పట్టించుకోలేదని విమర్శించారు. గ్రామంలోని కొంతమందికి మద్యం తాగించి దాడులకు ఉసిగొల్పారని ఆరోపించారు. ఇంటి గేట్లు తన్నుకుంటూ వచ్చి తమ అనుచరులపై కాంగ్రెస్ గుండాలు దాడి చేశారని తెలిపారు. ఇంటి లోపలికి టపాసులు వేసి రాళ్లు, కర్రలతో ఇంట్లో ఉన్నవారిపై దాడికి దిగారని పేర్కొన్నారు.దాడి చేసిన వారితో పాటు ఘటనను ప్రోత్సహించిన వారిపై కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. తానును ఎమ్మెల్యేగా గెలవడాన్ని కాంగ్రెస్ జీర్ణించుకోలేకే దాడులకు దిగుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ నాయకులు రెచ్చగొడితే తాము రెచ్చిపోమని.. తమ సహనాన్ని పరీక్షించొద్దని సూచించారు. పోలీసులు ఈ కేసును నిష్పక్షపాతంగా విచారణ చేయాలని కోరారు.ఈ నేపథ్యంలో ఎమ్మెల్యేను పరామర్శించేందుకు మాజీ మంత్రి హరీష్ రావు హైదరాబాద్ నుంచి నర్సాపూర్‌కు వెళ్లారు. గోమారంలోని ఎమ్మెల్యే నివాసంలో హరీష్ రావు మాట్లాడుతూ.. ‘సీనియర్ శాసనసభ్యులు, మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి ఇంటి మీద కాంగ్రెస్ గూండాలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రాష్ట్రంలో ప్రజా పాలన కాదు గూండా రాజ్యం నడుస్తుంది. ప్రజల యొక్క హక్కులు పూర్తిగా కాలరాయబడ్డాయి. మొన్న సిద్దిపేటలో నా కార్యాలయం మీద దాడి కావచ్చు, హైదరాబాదులో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి మీద దాడి కావచ్చు, నిన్న సునీత లక్ష్మారెడ్డి గారి ఇంటి మీద దాడి కావచ్చు, రాష్ట్రంలో గుండు రాజ్యాన్ని తలపించే విధంగా పరిపాలన సాగుతుంది.తెలంగాణకున్న మంచి పేరును మంటగలిపి ఈరోజు బిహార్‌లాగా తెలంగాణను మారుస్తున్నారు. నిన్న సునీత లక్ష్మారెడ్డి గారి మీద జరిగిన దాడి కాంగ్రెస్ నాయకత్వం ప్రోత్సాహంతో జరిగిన దాడి. రేవంత్ రెడ్డి రెచ్చగొట్టే మాటలు రాష్ట్రంలోని కాంగ్రెస్ కార్యకర్తలను ప్రతిపక్షాల మీద దాడి చేసే విధంగా ప్రోత్సహించినట్లు ఉన్నాయి. ఎమ్మెల్యే నివాసంలో లేనప్పుడు ఉద్దేశపూర్వకంగా దాడి చేయాలని, ఎమ్మెల్యే ఇంటి ముందు పటాకాయలు కాల్చడం, ఇంట్లోకి పటాకాయలు విసరడం ఇంట్లో ఉన్న వారిపై దాడి చేయడం హేయమైనది.ఇప్పుడే ఎస్పీ, ఐజీతో మాట్లాడాను వెంటనే కాంగ్రెస్ గూండాలను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశాం. కాంగ్రెస్ నాయకులు దాడి చేశారన్న విషయం వీడియోలో స్పష్టంగా కనిపిస్తుంది. అంతే కాకుండా విధులు నిర్వహిస్తున్న హెడ్ కానిస్టేబుల్ పై కూడా దాడి చేసే ప్రయత్నం చేశారు. హెడ్ కానిస్టేబుల్ చేతులోని ఫోన్ లాక్కోని నెట్టేస్తే ఆయన కింద పడిపోయాడు. పోలీసులపై దాడి జరిగినా కేసు తీసుకోవడం లేదు.కాంగ్రెస్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తున్నారు. దేశంలో తెలంగాణ పోలీసులు అంటే మంచి పేరు ఉండేది కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి పోలీసులను చెడగొడుతున్నారు. పోలీసు అధికారులు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ రెడ్డి శాశ్వతం కాదు. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది ఏనాడైనా ఎమ్మెల్యేల ఇంటిపైన దాడి జరిగిందా?ఫిర్యాదు ఇచ్చిన 24 గంటల్లో ఎఫ్ఐఆర్ చేసిన సందర్భాలు ఉన్నాయి. కాంగ్రెస్ గుండాల రాజ్యంలో ఎఫ్ఐఆర్ ఫైల్ చేయరు దాడి చేసిన వారిని అరెస్ట్ చేయరు.వెంటనే గోమారంలో దాడి చేసిన కాంగ్రెస్ గుండాలను అరెస్ట్ చేయాలి . దాడిని ప్రోత్సహించిన వారిపై కూడా కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తున్నాం. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్ కి కూడా వెళ్తాం. దాడి చేసిన వారికి శిక్ష పడేదాకా వదిలిపెట్టం. ఇది ప్రజా పాలన కాదు గూండాల పాలన. మా ఓపికకు కూడా ఒక హద్దు ఉంటది. పోలీసులు ఇలాంటి దాడులను కట్టడి చేయడంలో విఫలమైతే రాయలసీమ లాంటి ఫ్యాక్షన్ పరిస్థితులు తెలంగాణలో కూడా వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ ప్రాంతంతో తెలంగాణ ప్రజలతో మాది పేగు బంధం ఎక్కడ ఎలాంటి హింసాత్మక ఘటనలు జరగకుండా మేము చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాం. అదేవిధంగా ప్రభుత్వం, పోలీసులు కూడా వ్యవహరిస్తే మంచిది.ఇంట్లో చొరబడి దాడి చేసిన వారిని అరెస్టు చేసి రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉందని నిరూపించుకోవాలి. డీజీపీ ఉన్నతమైన పదవిలో ఉన్నారు మీరు ఆ పదవికి గౌరవం తెచ్చే విధంగా చట్టానికి వ్యతిరేకంగా ఎవరు వెళ్లిన వారిని ఉపేక్షించవద్దు అని సూచిస్తున్నాను. రాష్ట్ర డిజిపి వెంటనే ఈ ఘటన పై స్పందించి దాడి చేసిన వారిని అరెస్ట్ చేయవలసిందిగా డిమాండ్ చేస్తున్నాను. ఒకవేళ అరెస్టు చేయనట్టయితే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కలిసి డీజీపీ కార్యాలయాన్ని ముట్టడిస్తాం’ అని పేర్కొన్నారు.సునీతా లక్ష్మారెడ్డితో అటు బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ కూడా మాట్లాడారు. ఘటన వివరాలు, ఆమె యోగక్షేమాలు తెలుసుకున్నారు. దాడికి పాల్పడిన కాంగ్రెస్ గూండాలపై పోలీసులు కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇలాంటి చిల్లర ప్రయత్నాలతో సునీతా లక్ష్మారెడ్డి లాంటి బలమైన నాయకుల మనోస్థైర్యాన్ని దెబ్బతీయలేరన్నారు.కాగా మెదక్ జిల్లా నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి ఇంటిపై కాంగ్రెస్ కార్యకర్తలు దాడికి పాల్పడ్డారు. ఇటుకలు, రాళ్లతో విధ్వంసం సృష్టించారు. మెదక్ జిల్లా శివ్వంపేట మండలం గోమారం గ్రామంలోని ఎమ్మెల్యే నివాసం వద్ద ఆదివారం అర్ధరాత్రి హంగామా చేశారు. వినాయక నిమజ్జనం అడ్డుపెట్టుకుని గ్రామంలోని కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే ఇంటి గేటు ముందు పటాకులు కాల్చారు. ఇంటి లోపలికి వచ్చి ఇద్దరిపై దాడి చేశారు.అంతటితో ఆగకుండా ఇంటిపైకి ఇటుకలు విసిరారు. దీంతో బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యే ఇంటి వద్దకు చేరుకొని కాంగ్రెస్ నాయకులతో వాగ్వాదానికి దిగారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు. రాత్రిపూట దాడులు చేయడం కాంగ్రెస్ నాయకుల పిరికిపంద చర్య బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. దాడికి నిరసనగా ఎమ్మెల్యే అనుచరులు, బీఆర్ఎస్ కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. -
కాంగ్రెస్‌ను గెలిపించడమే ఖమ్మం ప్రజలకు శాపమైంది: హరీష్‌రావు
సాక్షి, తెలంగాణ భవన్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ అంటే రైతుల కన్నీళ్లు తుడిచేది కాదు.. కన్నీరు పెట్టించేది అంటూ తీవ్ర విమర్శలు చేశారు. అలాగే, సీఎం రేవంత్.. హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారని ఆరోపించారు.మాజీ మంత్రి హరీష్ సోమవారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో హైడ్రా పేరుతో హైడ్రామా చేస్తున్నారు. సీఎం రేవంత్.. హైడ్రా పేరుతో ప్రజలను పక్కదోవ పట్టిస్తున్నారు. తెలంగాణలో గూండాగిరి పెరిగిపోయింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక హత్యాచారాలు పెరిగిపోయాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్ఢర్ లేదు. నర్సాపూర్ ఎమ్మెల్యే సునీతా రెడ్డి ఇంటిపై దాడిని ఖండిస్తున్నాం. దాడి చేసిన వారిని అరెస్ట్ చేయాలి.ఇదే సమయంలో ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపులపై..‘ఇప్పటికైనా ఫిరాయింపులపై కాంగ్రెస్ బదలాయింపులు మానుకోవాలి. అబద్దం చెబితే అతికేటట్టు ఉండాలని మంత్రి శ్రీధర్ బాబు తెలుసుకోవాలి. ఫిరాయింపులపై మంత్రి శ్రీధర్ బాబు తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు. మర్యాదపూర్వకంగా అయితే సీఎంను కాంగ్రెస్ పార్టీ మీటింగ్‌లో కలుస్తారా?. అరికెపూడి గాంధీ సొంత నియోజకవర్గానికి సీఎం వస్తే.. ప్రకాష్ గౌడ్ ఎందుకొచ్చినట్లు?. కాంగ్రెస్ నీతిని ప్రజలు గమనిస్తున్నారు. ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్‌కు శిక్ష తప్పదు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు.ఖమ్మం ప్రజలకు శాపంగా కాంగ్రెస్.. సాగునీరు లేకపోవడంతో ఖమ్మం జిల్లాలో పంటలు ఎండిపోతున్నాయి. సీఎం రేవంత్ నిర్లక్ష్యం, ముగ్గురు మంత్రుల సమన్వయలోపం కారణంగా రైతులు ఇబ్బంది పడుతున్నారు. 22రోజుల నుండి ఆయకట్ట గండి పూడ్చడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోంది. సాగర్ నిండు కుండలా ఉన్నప్పటికీ ఆయకట్టు పొలాలు ఎండిపోతున్నాయి. గత ఏడాది ప్రకృతి కరువు వస్తే.. ఈసారి కాంగ్రెస్ కరువు తెచ్చింది. మూడు లక్షల ఎకరాల పంటపై మంత్రులకు శ్రద్ధ లేదు.ఖమ్మం ప్రజలు తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే అవసరానికి ఒక్క హెలికాప్టర్ రాదు. సాగు నీరు ఇవ్వరు. ఇదేనా ఖమ్మం ప్రజలకు మీరు ఇచ్చే బహుమతి. మంత్రులు తిరిగేందుకు హెలికాప్టర్లు ఉంటాయి కానీ.. వరదల్లో చిక్కుకున్న వారిని కాపాడేందుకు హెలికాప్టర్ ఉండదా?. మిమ్మల్ని గెలిపించడమే ఖమ్మం ప్రజలు చేసిన శాపమా?. వరదల్లో నష్టపోయిన రైతుకు ఎకరాకు 25వేల నష్ట పరిహారం ఇవ్వాలి. నష్ట పరిహారం తక్షణమే చెల్లించాలి. ఇది కూడా చదవండి: హైడ్రా కూల్చివేతలు.. యజమానుల తప్పిదం.. సామాన్యులు బలి! -
అమృత్ టెండర్లలో అక్రమాలపై కేటీఆర్ డిమాండ్
సాక్షి, హైదరాబాద్: అమృత్ టెండర్లలో అక్రమాలపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు డిమాండ్ చేశారు. ఈ మేరకు విజ్ఞప్తి చేసేందుకు హైకోర్టు సిట్టింగ్ జడ్జి లేదా కేంద్ర విజిలెన్స్ కమిషనర్ దగ్గరికైనా వెళ్దామని అన్నారు. అమృత్ టెండర్లలో తప్పు జరిగిందని తేలిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సవాల్ విసిరిన నేపథ్యంలో ఆదివారం తెలంగాణ భవన్లో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. పొంగులేటి సవాల్‌ను స్వీకరిస్తున్నానని స్పష్టం చేశారు. ‘ఒక మంత్రి తప్పు జరిగిందని నిరూపిస్తే రాజీనామా చేస్తానని బిల్డప్ ఇచ్చారు. మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఇద్దరం కలిసి హైకోర్టు సీజే దగ్గరకి పోదాం. వెంటనే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించమని కోరదాం. సిట్టింగ్ జడ్జి గనుక ఇందులో తప్పు జరగలేదని అంటే.. నేను రాజకీయ సన్యాసం చేస్తా. హైకోర్టు సీజే దగ్గరికి రావడానికి మంత్రిగారికి ఇబ్బంది ఉందంటే డేట్, టైం ఫిక్స్ చేస్తే ఇద్దరం కలిసి కేంద్రంలో ఉండే సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ (సీవీసీ) దగ్గరికి పోదాం. ఒకవేళ మీరు రాకపోయినా వచ్చే వారంలో సీవీసీకి ఆధారాలు సమర్పిస్తా. సీఎం రేవంత్‌రెడ్డికి, మంత్రికి ఒకటే చెప్తున్నా.. ఇప్పటికైనా టెండర్లు రద్దు చేయాలి..’ అని కేటీఆర్ అన్నారు. సోదరుడు, బావమరిది ఆ స్థాయికి ఎలా ఎదిగారో సీఎం చెప్పాలి ‘సీఎంను పొంగులేటి ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి పొంగులేటి రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. సీఎం రేవంత్ రాజీనామా చేయాలి. ఈ ప్రభుత్వంలోని మంత్రులకు చట్టాలు మాత్రమే కాదు చుట్టరికాలు కూడా తెలిసినట్టు లేదు. భార్య తమ్ముడు బావమరిది కాకుండా ఇంకేమి అవుతాడో పొంగులేటి చెప్పాలి. సొంత బావమరిది కంపెనీకి లాభం చేకూరిస్తే బంధువని అనడమేంటి?. ఆఫీస్ ఆఫ్ ప్రాఫిట్‌తో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్లను కూడా నేను ప్రస్తావించిన నేపథ్యంలో పొంగులేటి ఆగమేఘాల మీద ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కానీ రూ.1,137 కోట్ల అవినీతి జరిగినా, ఒక్క రూపాయి అవినీతి జరిగినా ఈ చట్టం వర్తిస్తుందనే విషయం ఆయన తెలుసుకోవాలి. ఢిల్లీకి కప్పం కట్టేందుకే అవినీతి కేవలం రూ.2 కోట్ల లాభం ఉన్న బావమరిది కంపెనీకి రూ.1,137 కోట్ల కాంట్రాక్టు ఇచ్చి అవినీతి జరగడం లేదు అంటే ఎవరైనా నమ్ముతారా? కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 9 నెలల్లోనే సీఎం సోదరుడు జగదీశ్‌రెడ్డి రూ.వెయ్యి కోట్లుం, బావమరిది సూదిని సృజన్‌రెడ్డి రూ.వెయ్యి కోట్లు పెట్టుబడి పెట్టే స్థాయికి ఎలా ఎదిగారనే విషయాన్ని రేవంత్‌రెడ్డి చెప్పాలి. పొంగులేటి సంస్థకు దక్కిన కొడంగల్ ఎట్టిపోతల కాంట్రాక్టుల గురించి త్వరలో మాట్లాడతా. ప్రజల తరఫున మంత్రులు, ముఖ్యమంత్రి అవినీతిని నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటాం. ఢిల్లీకి కప్పం కట్టేందుకు ప్రభుత్వం ఈ భారీ అవినీతికి తెగబడుతోంది. కేంద్ర ప్రభుత్వ నిధులకు సంబంధించిన అంశంలో కేంద్రమంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ మొదలు ఆ పార్టీకి చెందిన ఏ ఒక్క ఎంపీ కూడా మాట్లాడటం లేదు..’అని కేటీఆర్ విమర్శించారు. సింగరేణి కార్మికుల పొట్ట కొడుతున్నారు సింగరేణి కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది.. ‘దసరా బోనస్ కాదు బోగస్’అని కేటీఆర్ విమర్శించారు. ఆదివారం తెలంగాణ భవన్లో సింగరేణి ప్రాంత ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ‘సింగరేణి లాభాల్లో 33 శాతం కార్మికులకు పంచుతున్నట్లు గొప్పలు చెప్పుకుని కేవలం 16.9% మాత్రమే ఇచ్చారు. కార్మికుల కష్టాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం దోచుకుంటోంది., పండుగ వేళ ప్రభుత్వం కార్మికుల పొట్ట కొడుతోంది. ప్రతి కార్మికుడికి రూ.1.8 లక్షల నష్టం జరుగుతుంది. సింగరేణి నికర లాభం రూ.4,701 కోట్లు. ఇందులో కార్మికులకు 33 శాతం వాటా కింద రూ.1,551 కోట్లు పంచాలి. ఒక్కో కార్మికుడికి రూ.3.7 లక్షల చొప్పున అందాలి. కానీ కేవలం రూ.796 కోట్లను మాత్రమే కార్మికులకు పంచుతున్నారు..’అని కేటీఆర్ ధ్వజమెత్తారు. సింగరేణి లాభాల్లో వాటాపై కార్మికులు స్థానిక కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై ఒత్తిడి తీసుకురావాలన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో సింగరేణి అద్భుతమైన ప్రగతి సాధించిందని, ఒక్కో కార్మికుడికి అత్యధికంగా 32 శాతం వాటా ఇచ్చామని చెప్పారు. -
ఎమ్మెల్యేలూ.. జర జాగ్రత్త!
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గాల్లో జాగ్రత్తగా పనిచేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అవినీతికి తావు ఇవ్వొద్దని, ముఖ్యంగా అధికారుల పోస్టింగ్‌ల విషయంలో జోక్యం చేసుకోకుండా ఉంటే మంచిదని స్పష్టం చేసినట్టు తెలిసింది. గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడటం, పోస్టింగుల విషయంలో జోక్యం చేసుకోవడం వల్లే ఓటమి పాలయ్యారని వ్యాఖ్యానించినట్టు సమాచారం. అందువల్ల ఎలాంటి ఆరోపణలు, విమర్శలకు అవకాశం ఇవ్వకుండా జాగ్రత్తగా పనిచేసుకుంటే.. రెండోసారి కూడా అధికారంలోకి వస్తామని పేర్కొన్నట్టు తెలిసింది. టీపీసీసీ నూతన అధ్యక్షుడిగా మహేశ్‌కుమార్‌గౌడ్ బాధ్యతల స్వీకారం నేపథ్యంలో.. ఆయనకు అభినందనలు తెలిపేందుకు ఆదివారం రాత్రి హైదరాబాద్‌లోని ఓ హోటల్లో సీఎల్పీ సమావేశమైంది. ఈ కార్యక్రమంలో మహేశ్‌కుమార్‌గౌడ్‌ను పార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు సన్మానించారు. మహేశ్‌గౌడ్ నియామకంపై పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, సోనియాగాం«దీ, రాహుల్ గాం«దీలకు ధన్యవాదాలు తెలుపుతూ ఏకగ్రీవ తీర్మానాన్ని ఆమోదించారు. అనంతరం రాష్ట్ర రాజకీయాలు, ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు, పారీ్టలో సమన్వయం తదితర అంశాలపై చర్చించారు. సమన్వయంతో ముందుకు వెళ్లాలి సమావేశంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ.. పార్టీ, ప్రభుత్వం సమన్వయంతో ముందుకెళ్లాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం గత తొమ్మిది నెలల్లో అమలు చేసిన సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను విస్తృతంగా ప్రజలకు తీసుకెళ్లే బాధ్యతలను పార్టీ నేతలు తీసుకోవాలని కోరారు. ‘‘పీసీసీ అధ్యక్షుడిగా నా ఆధ్వర్యంలో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చాం. లోక్‌సభ సీట్లు గెలిచాం. పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పనిచేసిన వారికి పదవులు ఇచ్చాం. కష్టపడి పనిచేసిన వారికి కాంగ్రెస్ పార్టీలో కచి్చతంగా అవకాశాలు వస్తాయి. నిబద్ధత కలిగిన నాయకుడు కాబట్టే మహేశ్ గౌడ్‌కు పీసీసీ అధ్యక్ష పదవి వచి్చంది. బీసీల కులగణన చేయాలన్నది రాహుల్ గాంధీ బలమైన ఆలోచన. ఆయన ఆలోచన మేరకు రాష్ట్రంలో బీసీ కమిషన్ చైర్మన్, సభ్యులను నియమించాం. బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలంటే వారి జనాభాను లెక్కించాల్సిందే. ఎస్సీ వర్గీకరణ అమలుపై ఉత్తమ్ నాయకత్వంలో మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేశాం. ఈ కమిటీ సుప్రీం తీర్పును పూర్తిగా అధ్యయనం చేసి నివేదిక ఇస్తుంది. దేశంపై నాలుగోసారి పట్టు సాధించడానికి మోదీ ప్రయత్నాలు చేస్తున్నారు. నాలుగోసారి గెలవడం కోసమే జమిలి ఎన్నికలు తీసుకువస్తున్నారు. ఈ ప్రతిపాదన పట్ల ఎమ్మెల్యేలు అప్రమత్తంగా ఉండాలి..’’ అని రేవంత్ పేర్కొన్నారు. ప్రజల్లో ఉండేవారికే డీసీసీల బాధ్యతలు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన ఈ తొమ్మిది నెలల కాలంలో తాను ఒక్కరోజు కూడా సెలవు తీసుకోకుండా పనిచేశానని సీఎం రేవంత్ చెప్పారు. అధికారం కోల్పోయిన అసహనంతో ప్రతిపక్షం తప్పుడు ప్రచారాలు చేస్తోందని, ఆ ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 27 రోజుల్లో రూ.18 వేల కోట్ల రైతు రుణమాఫీ చేయలేదని.. తెలంగాణలో చేసి చూపించామని చెప్పారు. రాష్ట్రంలో ప్రతి ఒక్కరికీ హెల్త్ ప్రొఫైల్ డిజిటల్ కార్డు ఇస్తామని, రాష్ట్రంలో ఎక్కడున్నా రేషన్ తీసుకునే అవకాశం కలి్పస్తామని చెప్పారు. ప్రజల్లో ఉన్న వారికే కాంగ్రెస్ జిల్లా అధ్యక్ష పదవులు వస్తాయన్నారు. ఇన్చార్జ్ మంత్రులు వారానికి రెండు సార్లు తమ జిల్లాలో పర్యటించాలని సూచించారు. కార్యకర్తల రుణం తీర్చుకోవాలి: మహేశ్‌గౌడ్ తాను పీసీసీ అధ్యక్ష పదవిని బాధ్యతగా భావిస్తానని.. పారీ్టకి, ప్రభుత్వానికి మధ్య సమన్వయకర్తగా ఉంటానని పీసీసీ చీఫమహేశ్కుమార్గౌడ్ తెలిపారు. పార్టీని ముందుకు నడపడంలో సమష్టి బాధ్యత అవసరమన్నారు. కార్యకర్తలు, నేతలకు నిత్యం అందుబాటులో ఉంటానని చెప్పారు. క్షేత్రస్థాయి కార్యకర్తలు కష్టపడి పనిచేసినందుకే అధికారంలోకి రాగలిగామన్న విషయాన్ని మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు గుర్తించాలని.. ఆ కార్యకర్తల రుణం తీర్చుకోవాలని పేర్కొన్నారు. అధికారాన్ని కట్టబెట్టిన ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయకుండా పనిచేయాలని పార్టీ ప్రజాప్రతినిధులను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 90% స్థానాలను గెలిపించుకోవడం ద్వారా పార్టీ కార్యకర్తలను గ్రామం నుంచి జిల్లాస్థాయి వరకు పదవుల్లో కూర్చోబెట్టాలన్నారు.సీఎం రేవంత్ నాయకత్వంలోని ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలను అందిస్తోందని.. కార్యకర్తలను సమాయత్తం చేసి వాటిని ప్రజల్లోకి తీసుకెళ్లడమే తన లక్ష్యమని మహేశ్‌గౌడ్ చెప్పారు. రాహుల్ గాం«దీని ప్రధాని చేయడమే ధ్యేయంగా అంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలను ఎమ్మెల్యేలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు. పార్టీని మరింత బలోపేతం చేయడం కోసం పనిచేయాలని కోరారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని వివరించిన సీఎం సీఎం రేవంత్ సీఎల్పీ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక పరి స్థితి గురించి ఎమ్మెల్యేలకు వివరించారు. రాష్ట్ర ఖ జానాకు నెలకు సగటున రూ.18 వేలకోట్ల ఆదా యం వస్తోందని.. అందులో రూ.6 వేలకోట్లు ప్రభు త్వ ఉద్యోగుల జీతాలకే పోతాయని, మరో రూ.6 వేలకోట్లు గత ప్రభుత్వం చేసిన అప్పులు, వాటి వడ్డీలకు చెల్లిస్తున్నామని చెప్పారు. మిగతా రూ.6 వేలకోట్లలో రూ.3 వేలకోట్లు ప్రభుత్వ పథకాల అమలు కోసం ఖర్చవుతున్నాయని, ఇంకో రూ.3 వేల కోట్లతో కొత్త పథకాల అమలు, ప్రభుత్వ నిర్వహణ జరుగుతోందని వివరించారు. ఆర్థిక పరిస్థితి కష్టతరంగా ఉండటంతో దుబారా ఖర్చులు తగ్గించుకుని ప్రభుత్వాన్ని నడుపుతున్నామని చెప్పారు. ⇒ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. కొత్త రేషన్‌కార్డుల జారీ ప్రక్రియ, ఫ్యామిలీ హెల్త్ కార్డుల అంశాలను ఎమ్మెల్యేలకు సుదీర్ఘంగా వివరించారు. పాత రేషన్‌కార్డులు తొలగించడం లేదని.. ఈ విషయంలో ప్రతిపక్షం చేస్తున్న ఆరోపణలను తిప్పి కొట్టాలని సూచించారు. ⇒ రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు నిర్మించేలా చొరవ తీసుకోవాలని ఎమ్మెల్యేలకు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సూచించారు. ⇒ ఇక ఈ సమావేశంలో మంత్రులు దామోదర రాజనర్సింహ, పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్యేలు బాలూ నాయక్, పరి్ణకారెడ్డి, అమీర్ అలీఖాన్ తదితరులు మాట్లాడారు.సీఎల్పీ సమావేశానికి ‘ఫిరాయింపు’ ఎమ్మెల్యేలు! ఆదివారం రాత్రి జరిగిన సీఎల్పీ సమావేశానికి బీఆర్ఎస్ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు కూడా హాజరవడం గమనార్హం. పీఏసీ చైర్మన్ అరెకపూడి గాం«దీతోపాటు ఇటీవల కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యేలంతా సమావేశంలో పాల్గొన్నారు. ఇక మంత్రి సీతక్క, ఇద్దరు, ముగ్గురు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అనివార్య కారణాలవల్ల సీఎల్పీ సమావేశానికి హాజరుకాలేకపోయారు.గాంధీ నియోజకవర్గమనే వచ్చారు: మంత్రి శ్రీధర్‌బాబు పీఏసీ చైర్మన్ అరెకపూడి గాంధీ బీఆర్ఎస్ నేత అయినప్పుడు సీఎల్పీ సమావేశానికి ఎందుకు వచ్చారనే ప్రశ్నలకు.. సమావేశం అనంతరం మంత్రి శ్రీధర్‌బాబు సమాధానమిచ్చారు. ఏదైనా నియోజకవర్గానికి సీఎం వచి్చనప్పుడు స్థానిక ఎమ్మెల్యే మర్యాదపూర్వకంగా కలవడం సాధారణమేనని చెప్పారు. సీఎల్పీ సమావేశం జరిగిన హోటల్ శేరిలింగంపల్లి నియోజకవర్గంలో ఉందని.. స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ మర్యాదపూర్వకంగా సీఎంను కలిసేందుకు వచ్చారని పేర్కొన్నారు. సిద్దిపేటలో సీఎం కార్యక్రమం జరిగితే హరీశ్‌రావు వెళ్లరా? అని ప్రశ్నించారు.