breaking news
-
హాయ్ చెప్తే..అంత డ్రామా చేస్తారా: మంత్రి పొంగులేటి ఫైర్
సాక్షి,హైదరాబాద్: తాను వ్యాపారవేత్త అదానీతో హైదరాబాద్‌లోని ఓ హోటల్లో భేటీ అయ్యానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేస్తున్న ఆరోపణలపై మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పందించారు.ఈ విషయమై పొంగులేటి మంగళవారం(నవంబర్26) ‘సాక్షి’ టీవీతో ప్రత్యేకంగా మాట్లాడారు.‘అదానీ నేను హైదరాబాద్‌లోని ఒక హోటల్లో లిఫ్ట్ దగ్గర కలిశాం. పాత పరిచయంతో అదానీకి హాయ్ చెపితే దానికి ఇంత డ్రామా చేస్తారా? అదానీతో పదేండ్లు అంటకాగింది బీఆర్ఎస్ పార్టీ. గత పది సంవత్సరాల్లో బీఆర్ఎస్ ప్రభుత్వం అదానీతో చాలా ఒప్పందాలు చేసుకుంది. అదానీకి బీఆర్ఎస్ ఇచ్చిన కాంట్రాక్టులు రద్దు చేయాలా వద్దా క్లియర్‌గా చెప్పండి.మనసులో ఏదో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వంపై అదానీ మార్క్ వేస్తారా?మా నాన్న తర్వాత మీ నాన్ననే ఎక్కువగా నమ్మాను.ఐదేళ్లు తడిబట్టతో నా గొంతు కోశారు’అని పొంగులేటి ఆవేదన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: సీఎం రేవంత్‌కు కేటీఆర్ గట్టి కౌంటర్ -
సీఎం రేవంత్‌కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
సాక్షి,హైదరాబాద్: రాహుల్ గాంధీ మొట్టికాయలు వేయడం వల్లే సీఎం రేవంత్ అదానీ ఇచ్చిన వంద కోట్లు తిరస్కరించాడని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చెప్పారు. మంగళవారం(నవంబర్ 26) కేటీఆర్ తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు.‘కొసరు మాత్రమే తిరిగిస్తే సరిపోదు. 12,400కోట్లు ఒప్పందాల సంగతేంటి?రాహుల్,రేవంత్‌రెడ్డిలలో ఎవరు పిచ్చోళ్ళో వాళ్లే తేల్చుకోవాలి.ఇకపై అనుముల రేవంత్ రెడ్డి కాదు..అబద్దాల రేవంత్ రెడ్డి. మైక్రోసాఫ్ట్ డేటా ప్రాజెక్టును అదానీ డేటా సెంటర్ అని రేవంత్ అనడం హాస్యాస్పదం.తనకంటే చిన్నవాడిని కాబట్టి తిట్టినా పడతాను. కానీ కేసీఆర్‌ను అనడానికి రేవంత్‌కు ఎంత ధైర్యం?ఈడీ కేసు కోసం రేవంత్,అతని మంత్రుల లెక్క మేం అదానీ కాళ్ళు పట్టుకోలేదు.బ్యాగులు మోసిన గజ దొంగ రేవంత్‌రెడ్డి.చిట్టినాయుడికి చిప్ దొబ్బిందని నిన్నటి రేవంత్ కామెంట్స్ చూస్తే అర్థమవుతోంది.నేను సైకో అయితే..సీఎం రేవంత్ సన్నాసినా? శాడిస్టా? ఎనిమిది మంది బీజేపీ ఎంపీలు ఢిల్లీ నుంచి 8 రూపాయలు కూడా తీసుకురాలేదు.28సార్లు ఢిల్లీ వెళ్ళి..రేవంత్ 28 రూపాయలు కూడా తీసుకురాలేదు.అదానీ జాతీయ రహదారులు,రక్షణ శాఖ పనులు చేస్తే మాకేం సంబంధం?రేవంత్‌లో సబ్జెక్టు,సరుకు ఉండదు. ఎవరైనా చెప్తే వినడు. దావోస్‌లో నేను అదానీని బరాబర్ కలిసిన. మీ మాదిరి కోహినూరులో కాళ్ళు పట్టుకోలేదు. కేసీఆర్ హాయాంలో అదానీని ఎప్పుడు ప్రోత్సహించలేదు.అదానీకి రేవంత్ రెడ్ కార్పెట్ వేస్తే..మేం రెడ్ సిగ్నల్ చూపించాం.మాజీ సర్పంచ్ సాయిరెడ్డిది సీఎం రేవంత్ సోదరులు చేసిన హత్యే. ఏడాదిగా అదానీ,అల్లుడు, అన్న,బావమరిదికి అమృతం పంచటం కోసమే రేవంత్ పనిచేస్తున్నాడు.రేవంత్‌రెడ్డి అసహనం,నిరాశ, నిస్పృహలో ఉన్నారు.ముఖ్యమంత్రి అయ్యాక కూడా రేవంత్‌కు కేసీఆర్,మా మీద ఫ్రస్టేషన్ ఎందుకు?కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక 48 మంది గురుకుల విద్యార్థులు చనిపోయారు.వాంకిడి గురుకుల విద్యార్థి శైలజది ప్రభుత్వం చేసిన హత్యే.తల్లిదండ్రుల మాదిరి చూసుకోవాల్సిన ప్రభుత్వమే విద్యార్థులను చంపేస్తోంది.గురుకుల విద్యార్థుల హత్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని చీల్చి చెండాడుతాం’అని కేటీఆర్ హెచ్చరించారు.ఇదీ చదవండి: అదానీ నిధులు వద్దన్నాం: సీఎం రేవంత్ -
అదానీ నిధులు వద్దన్నాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర స్కిల్స్ యూనివర్సిటీ కోసం అదానీ సంస్థ ఇస్తామని ప్రకటించిన రూ. 100 కోట్లను తీసుకోవడం లేదని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అదానీ గ్రూపు విషయంలో వివాదాలు, జరుగుతున్న పరిణామాల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. అయితే పక్క రాష్ట్రాల్లో జరుగుతున్న వివాదాలకు, తెలంగాణ ప్రభుత్వానికి సంబంధం లేదని పేర్కొన్నారు. సోమవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మంత్రులు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే మందుల సామేల్, సీఎం సలహాదారు వేం నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్ నేతలు జంగా రాఘవరెడ్డి, రోహిణ్‌రెడ్డి, సామా రామ్మోహన్‌రెడ్డిలతో కలిసి రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడారు. జర్నలిస్టులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానమిచ్చారు. సదుద్దేశంతో ప్రారంభించిన స్కిల్ వర్సిటీ వివాదాలకు లోనుకావడం తమకు ఇష్టం లేదని.. అనవసర వివాదాల్లోకి రాష్ట్ర ప్రభుత్వాన్ని, తమను లాగొద్దని విజ్ఞప్తి చేశారు. రాజకీయ పార్టీలు ఈ వ్యవహారాన్ని రాజకీయ కోణంలో చూడటం ద్వారా నిరుద్యోగులకు నష్టం చేసే వైఖరిని అవలంబించవద్దని విజ్ఞప్తి చేశారు. ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి కార్పస్ ఫండ్ కింద నిధులు ఇచ్చేందుకు చాలా సంస్థలు ముందుకొచ్చాయని సీఎం రేవంత్ చెప్పారు. అలాగే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్) కింద రూ.100 కోట్లు ఇచ్చేందుకు అదానీ సంస్థ ముందుకొచ్చిందని తెలిపారు. కానీ అదానీ సంస్థ అదేదో తెలంగాణ రాష్ట్రానికో, ముఖ్యమంత్రికో అప్పనంగా రూ.100 కోట్లు ఇచ్చినట్టు చర్చ జరుగుతోందన్నారు. ‘‘అదానీ సహా ఇప్పటివరకు ఏ సంస్థ నుంచి తెలంగాణ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా తీసుకోలేదు. అదానీ సంస్థ నుంచి నిధులు తీసుకున్నారంటూ వ్యక్తిగతంగా నా గురించి చర్చ జరగడం నాకు, కేబినెట్ సహచరులకు ఇష్టం లేదు. అందుకే మా అధికారి జయేశ్‌రంజన్ ద్వారా అదానీ సంస్థకు లేఖ రాశాం. ఆ సంస్థ ప్రకటించిన రూ.100 కోట్లు స్వీకరించడానికి సిద్ధంగా లేమని, ఆ నిధులు ప్రభుత్వానికి బదిలీ చేయవద్దని ఆ లేఖలో స్పష్టం చేశాం’’ అని రేవంత్ తెలిపారు. ఒప్పందాల రద్దు అంత సులువుకాదు అదానీ గ్రూపుతో గతంలో చేసుకున్న ఒప్పందాలను రద్దు చేసుకుంటారా? అని మీడియా ప్రశ్నించగా.. అది అంత సులువైనది కాదని, అలా రద్దు చేసుకుంటే వారు కోర్టులకు వెళ్లే అవకాశం ఉంటుందని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ‘‘అయినా అదానీ ఫ్లైట్‌లో ఆడంబరంగా తిరిగింది వాళ్లు. కేసీఆర్‌లా మేం అదానీ నుంచి అప్పనంగా తీసుకోలేదు. అదానీతో ఎన్నో ఒప్పందాలు చేసుకున్నవారు మాపై ఆరోపణలు చేస్తున్నారు. అసలు పెట్టుబడుల విషయంలో వారి విధానమేంటి? పెట్టుబడులు రాకపోతే తీసుకురాలేదంటారు. తెస్తే రద్దు చేసుకోవాలంటారు. అంటే గత ప్రభుత్వం అదానీ గ్రూపుతో జాతీయ రహదారులు, డేటా సెంటర్ల ఏర్పాటు కోసం ఒప్పందాలు చేసుకున్నందుకు కేసీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయాలా? వారి మీద కూడా కేసులు పెట్టాలా?’’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. వాళ్ల కాకిగోలను పట్టించుకోబోం పెట్టుబడుల విషయంలో తాము ఎవరికీ ఆయాచిత లబ్ధి చేకూర్చబోమని సీఎం రేవంత్ పేర్కొన్నారు. ‘‘2023లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. 2024లో డిపాజిట్లు కోల్పోయింది. ఇప్పుడు మెదడు కోల్పోయింది. మీ కడుపు మంట మాకు తెలుసు. మీ దుఃఖం మాకు తెలుసు. మీ కాకిగోలను పట్టించుకోం. మీలాంటి వాళ్లు అరుస్తుంటే మాకు ఉత్సాహం వస్తుంది. మా కార్యకర్తలు సంతోషపడతారు. మీ క్షోభను చూస్తుంటే అప్పుడప్పుడు కోపం వస్తుంది. అయినా ఏకాగ్రత, కార్యదీక్షతో మేం ముందుకెళుతున్నాం’’ అంటూ బీఆర్ఎస్ నేతలను ఎద్దేవా చేశారు. ఆ ఎన్నికల్లో వచ్చింది లేదు.. పోయింది లేదు జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు, లోక్‌సభ ఉప ఎన్నికలపై రేవంత్‌రెడ్డి స్పందిస్తూ... ఆ ఎన్నికల వల్ల ఎవరికీ వచ్చింది లేదని, ఎవరికీ పోయింది లేదని పేర్కొన్నారు. ‘‘మహారాష్ట్రలో బీజేపీ కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయి. జార్ఖండ్‌లో ఇండియా కూటమికి ఎక్కువ సీట్లు వచ్చాయి. కర్ణాటక అసెంబ్లీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిచింది. బెంగాల్లో బీజేపీ డిపాజిట్లు కోల్పోయింది. దేశంలోని రెండు లోక్‌సభ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ప్రజలు మోదీని ఓడించి రాహుల్, ఖర్గేల నాయకత్వాన్ని బలపర్చారు. కేరళలోని వాయనాడ్ నుంచి ప్రియాంకా గాంధీ భారీ మెజార్టీతో గెలిచారు. మహారాష్ట్రలోని నాందేడ్ లోక్‌సభ స్థానాన్ని మేమే గెలిచాం. దీన్నిబట్టి దేశ ప్రజలు మోదీ నాయకత్వాన్ని, కిషన్‌రెడ్డిని ఛీ కొట్టారని అర్థమవుతోంది. అయినా కిషన్‌రెడ్డి ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడుతున్నారు. ఆయనను కేంద్ర మంత్రిగా చేయడం తెలంగాణ దురదృష్టం..’’ అని రేవంత్ విమర్శించారు. పైరవీల కోసం కాదు.. పెళ్లి కోసం ఢిల్లీ వెళ్తున్నా.. తాను ఢిల్లీ వెళ్లినప్పుడల్లా మంత్రివర్గ విస్తరణ గురించి వార్తలు వస్తున్నాయని సీఎం రేవంత్ అన్నారు. ఇప్పుడు తాను ఢిల్లీకి వెళ్తోంది లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా కుమార్తె వివాహం కోసమని చెప్పారు. సోమవారం రాత్రి వివాహానికి హాజరై... మంగళవారం ఉదయం తెలంగాణ ఎంపీలతో సమావేశమవుతామన్నారు. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులు, దీర్ఘకాలం నుంచి పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల గురించి పార్లమెంటు సమావేశాల్లో ప్రస్తావించే వ్యూహంపై చర్చిస్తామని చెప్పారు. అందుబాటులో కేంద్ర మంత్రులెవరైనా ఉంటే కలుస్తామన్నారు. అయితే తాము బీఆర్ఎస్ నేతల్లా పైరవీలు చేసేందుకు, కాళ్లు పట్టుకునేందుకు, కేసుల నుంచి తప్పించుకునేందుకో, మోదీ ముందు మోకరిల్లేందుకో ఢిల్లీకి వెళ్లడం లేదని పేర్కొన్నారు. కేంద్రాన్ని నిలదీసి అయినా నిధులు తెచ్చుకునేందుకు వెళుతున్నామని.. ఎన్నిసార్లయినా వెళ్తామని రేవంత్ చెప్పారు. కేంద్రం సమాఖ్య స్ఫూర్తితో ప్రభుత్వ ఖజానా నుంచి నిధులు ఇవ్వాలని ఇవ్వాలని... అదేమీ బీజేపీ ఖజానా కాదని వ్యాఖ్యానించారు. ఏ ఎన్నికలైనా బ్యాలెట్ పేపర్ ద్వారా నిర్వహించాలనేది కాంగ్రెస్ పార్టీ విధానమని, తనది కూడా అదే అభిప్రాయమని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కేటీఆర్ జైలుకెళ్లినా సీఎం అయ్యే చాన్స్ లేదు! ఎప్పుడెప్పుడు జైలుకు పోదామా అని కేటీఆర్ ఎదురుచూస్తున్నారని సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ‘‘జైలుకు వెళ్లినవారంతా ముఖ్యమంత్రులు అయ్యారని పేపర్లలో వార్తలు చూసి తాను కూడా జైలుకెళితే ముఖ్యమంత్రి అవుతానని కేటీఆర్ అనుకుంటున్నారు. కానీ కేటీఆర్ కన్నా ముందు ఆయన చెల్లెలు కవిత జైలుకు వెళ్లింది. ఇప్పుడిక సీఎం అవకాశం కూడా కేటీఆర్‌కు లేదు. సీఎం పోస్టు కోసం కేసీఆర్ కుటుంబంలో పోటీ ఎక్కువైంది. పదేళ్లు మంత్రిగా పనిచేసిన వ్యక్తి తెలివిని వాడాలి. చిల్లర ఆలోచనలు మానాలి. ఏ ఎల్లయ్యో, పుల్లయ్యో, బోడిగాడో చెప్పినట్టు ప్రభుత్వం వ్యవహరించదు. ఇక నుంచి ఆయన పేరును సైకో రామ్‌గా ఫిక్స్ చేయండి’’ అని ఎద్దేవా చేశారు. -
‘‘100 కోట్లు వెనక్కి సరే.. ఒప్పందాల మాటేమిటి రేవంత్?’’
సాక్షి,హైదరాబాద్ : రూ.100 కోట్ల నిధులు వెనక్కి ఇస్తున్నారు సరే.. అదానీతో కుదుర్చుకున్న రూ.12,400 కోట్ల ఒప్పందాల సంగతి ఏంటని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీష్ రావు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన రూ.100 కోట్ల నిధులను వెనక్కి ఇస్తున్నట్లు సీఎం రేవంత్‌రెడ్డి అధికారికంగా ప్రకటించారు. రేవంత్ సర్కార్ నిర్ణయంపై హరీష్ రావు ఎక్స్ వేదికగా స్పందించారు. ‘‘యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన 100 కోట్ల నిధులను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న రేవంత్‌రెడ్డి .. మరి, రాహుల్ గాంధీ అదాని అవినీతి మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్న సమయంలో దావోస్ లో మీరు ఆదానితో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల సంగతేమిటి?అదానీకి రాష్ట్రంలోని డిస్కంలను అప్పగించి వాటిని ప్రైవేటీకరించేందుకు మీరు చేస్తున్న కుట్రల మాటేమిటి?. 20 వేల మెగావాట్ల థర్మల్ ప్లాంట్ పెడుతామనే ప్రతిపాదనతో వస్తే, మర్యాదపూర్వకంగా కలిసి చాయ్ తాగించి పంపించేశాం. కానీ కాంగ్రెస్ ద్వంద్వ ప్రమాణాలు పాటించింది. రాహుల్ గాంధీ అవినీతి పరుడు అన్న వ్యక్తికే గల్లీ కాంగ్రెస్ రెడ్ కార్పెట్ పరిచింది.ఢిల్లీలో రాహుల్ వ్యతిరేకంగా పోరాటం చేస్తున్న ఆదానితో రేవంత్ రెడ్డి దోస్తీ చేసి ఒప్పందాలు చేసుకున్నాడు. ఇప్పుడు ఆదాని అవినీతి బయటికిరాగానే మాట మార్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అదానీతో చేసుకున్న ఒప్పందాలన్నింటినీ రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నాం’’ అని ఎక్స్ వేదికగా చేసిన ట్వీట్లో హరీష్ రావు స్పష్టం చేశారు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి ఆదాని ఇచ్చిన 100 కోట్ల నిధులను వెనక్కి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్న రేవంత్ రెడ్డి గారూ...మరి, రాహుల్ గాంధీ గారు అదాని అవినీతి మీద జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలని నినదిస్తున్న సమయంలో దావోస్ లో మీరు ఆదానితో చేసుకున్న 12,400 కోట్ల ఒప్పందాల… pic.twitter.com/XuxVIF7IgM— Harish Rao Thanneeru (@BRSHarish) November 25, 2024 -
‘పెండ్లికి పోతున్నావో.. పేరంటానికే పోతున్నావో..’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సెటైర్లు సంధించారు. తాజా ప్రెస్మీట్లో ఢిల్లీ పర్యటనలపై రేవంత్ మాట్లాడుతూ.. కేటీఆర్‌ను, బీఆర్ఎస్ను ఉద్దేశించి వ్యంగ్యంగా మాట్లాడారు. ఈ నేపథ్యంలో ఎక్స్ ద్వారా కేటీఆర్ స్పందించారు.పదే పదే ఢిల్లీకి ఎందుకు వెళ్తున్నారో తెలియదని.. కనీసం ఒక్క రూపాయి కూడా తేలేకపోయారని, దీనిపై నిలదీయాల్సిన అవసరం తెలంగాణ పౌరులుగా తమకు ఉందని అన్నారాయన. అలాగే.. బడేభాయ్, చోటామియాలు ఈడీ దాడులు బయటపడకుండా ఉన్నారంటూ తీవ్ర ఆరోపణలే చేశారు కేటీఆర్. పెండ్లికి పోతున్నవో పేరంటానికి పోతున్నావోసావుకు పోతున్నావో తెలంగాణ పౌరులుగా 28 సార్లు పోయినవ్28 రూపాయలు తీస్కరాలేదు అని అడగడం మా బాధ్యతరాజ్యాంగబద్ధంగా మినహాఈ ఏడాదిలో అదనంగా కేంద్రం నుండి ఒక్క రూపాయి తెచ్చింది లేదుఈడీ దాడుల నుండి తప్పించుకోవడానికి ఫైవ్ స్టార్ హోటల్లో…— KTR (@KTRBRS) November 25, 2024తామేం రేవంత్‌లా ఢిల్లీ గులాములం కాదని.. పోరాటం తమ రక్తంలోనే ఉందని, మా జెండా మా ఎజెండా ఎన్నటికీ తెలంగాణ అభివృద్ధే అంటూ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారాయన. ఇదీ చదవండి: ‘ఢిల్లీకి వెళ్లేది వాళ్లలా కాళ్లు పట్టుకోవడానికి కాదు’ -
అదానీ నిధులను నిరాకరిస్తున్నాం: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: గత కొన్ని రోజులుగా చెలరేగుతున్న అదానీ అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం స్పందించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ కోసం ఎంతోమంది నిధులు ఇచ్చారని తెలిపారు. అదానీ సంస్థ కూడా కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్‌బిలిటీ కింద రూ. 100 కోట్ల రూపాయలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి విరాళం ఇచ్చారని పేర్కొన్నారు.అయితే స్కిల్ యూనివర్సిటీకి అదానీ ఇస్తానన్న వంద కోట్లను తెలంగాణ ప్రభుత్వం స్వీకరించడానికి సిద్ధంగా లేదని సీఎం రేవంత్ వెల్లడించారు. 100 కోట్లు స్వీకరించవద్దని నిర్ణయించుకున్నామని, డబ్బులు ట్రాన్స్ఫర్ చేయవద్దని అదానీ గ్రూప్‌కు లేఖ రాశామన్నారు. అదానీ నుంచి తెలంగాణ ప్రభుత్వం నిధులు సేకరించినట్లు తప్పుగా ప్రచారం చేస్తున్నారని రేవంత్ మండిపడ్డారు. అనవసర వివాదాల్లోకి తెలంగాణ ప్రభుత్వాన్ని లాగొద్దని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి నష్టం చేకూర్చేలా వార్తలు రాయవద్దని మీడియా మిత్రులను కోరుతున్నట్లు చెప్పారు.రేవంత్ ఇంకా మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి అదాని వంద కోట్లు ఇచ్చిన విషయాన్ని మీడియా రాహుల్ గాంధీ దగ్గర ప్రస్తావించింది. రాహుల్ కూడా స్పష్టంగా సమాధానం చెప్పారు.అదానీకే కాదు ఏ సంస్థలకైనా రాజ్యాంగ బద్దంగా పెట్టుబడులు పెట్టడానికి హక్కు ఉంటుందని రాహుల్ చెప్పారు చట్టబద్దంగా నిర్వహించే టెండర్లలో అందరికీ సమాన అవకాశాలు ఉంటాయి.గొప్ప ఉద్ధేశంతో స్కిల్ యూనివర్సిటీ ప్రారంభించాంస్కిల్స్ యూనివర్సిటీ కి వంద కోట్లు కార్పస్ ఫండ్ ఇస్తామని అదాని కంపెనీ లేఖ ఇచ్చింది.ఇప్పటి వరకు ఓక్క రూపాయి కూడా స్కూల్ యూనివర్సిటీ నిధులు తీసుకోలేదు.అదాని నుంచి వంద కోట్లు తీసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.ఈ విషయాన్ని నిన్ననే అదాని కంపెనీకి లేఖ ద్వారా తెలియజేశాం.తెలంగాణను వివాదాలకు లాగొద్దనే అదాని వంద కోట్లు వద్దన్నాంఢిల్లీ పర్యటన మంత్రివర్గ విస్తరణ కోసం కాదు.ఢిల్లీ వెళ్లిన ప్రతిసారీ కేబినెట్ విస్తరణ అని అంటున్నారు. అది తప్పుఢిల్లీ పర్యటన మంత్రివర్గ విస్తరణ కోసం కాదు.ఈరోజు ఓంబిర్లా కూతురు వివాహానికి వెళ్తున్నాం.రేపు ఢిల్లీలో కాంగ్రెస్ లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలతో భేటీ అవుతాను.తెలంగాణ ప్రయోజనాలను సభలో మాట్లాడాలని సూచిస్తా.ఫామ్‌హౌజ్‌లో పడుకుంటే ప్రయోజనం ఉండదు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ఢిల్లీకి ఎన్నిసార్లైనా వెళ్తాంవాళ్లలాగా గవర్నర్ అనుమతి ఇవ్వకుండా పైరవీలు కోసం వెళ్లంఅరెస్ట్కు గవర్నర్ అనుమతి ఇవ్వకుండా ఒత్తిడి తీసుకురావడానికి ఢిల్లీ వెల్లడం లేదు10 ఏళ్లు మా కార్యకర్తలపై కేసులు పెట్టి వేధించారు.తెలంగాణకు నిధులు ఇవ్వాలని పార్లమెంటులో ఒత్తిడి చేస్తాంబీజేపీ ఖజానా నుంచి నిధులు ఇవ్వడం లేదుమన హక్కుల కోసం ఢిల్లీ వెళ్లాలి, నిధులు తెచ్చుకోవాలిమీ కడుపుమంట మాకు తెలుసు. మీ కాకి గోల పట్టించుకోంబీఆర్ఎస్ కూడా అదానీతో చేసుకున్న ఒప్పందాలు చాలా ఉన్నాయి.జైలుకు పోయినవారు సీఎం అయ్యారని, కేటీఆర్ మాటిమాటికి జైలుకు వెళ్తా అని అంటున్నాడుకేటీఆర్ కంటే ముందు జైలుకు చెల్లిపోయింది.. ఆ అవకాశం కూడా లేదు.విచారణ అంటే కేసులు పెడుతున్నారని అంటున్నారుఅలా అయితే అదానీకి ప్రాజెక్టులు ఇచ్చిన కేసీఆర్‌ను ప్రాసిక్యూట్ చేయాలా?కేసీఆర్ లాగా అదానీ నుంచి మేమేం నొక్కేయలేదు.అదానీ ఫ్లైట్లలో ప్రయాణించేది వాళ్లేఅదానీకి భూములు, కాంట్రాక్టులు ఇచ్చింది బీఆర్ఎస్ వాళ్లేగతంలో మీరు హేవేలు డేటా సెంటర్లు కేటాయించారు.మీరు కేటాయించిన వాటిపై కేసులు పెట్టాలిఒప్పందాలు రద్దు చేయాలంటే న్యాయ నిపుణులను సంప్రదించాల్సి ఉంటుంది.మేము ఎవరికి అప్పనంగా భూములు కట్టబెట్టంనోరు తెరిస్తే అబద్దాలు మాట్లాడటం బీఆర్ఎస్కు అలవాటైందిఅదానీ దగ్గర కేసీఆర్‌లా నేను ఇంత వంగి వంగి లేను2023లో అధికారం పోయింది2024 డిపాజిట్ కోల్పోయారు.ఇప్పుడు మెదడు కూడా లేకుండా పోయిందిబ్యాలెట్ పేపర్ ద్వారా ఎన్నికలు జరగాలనేది మా విధానంవయనాడ్, నాందేడ్‌లో కాంగ్రెస్‌ను గెలిపించారురెండు ఎంపీ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో మోదీ, నాయకత్వాన్ని ప్రజలు చీత్కరించారురాష్ట్రానికి సంబంధించి ఒక రకంగా కేంద్రానికి సంబంధించిన ఎన్నికల్లో ఒకరకంగా తీర్పు ఇచ్చారు’ అని రేవంత్ పేర్కొన్నారు. -
అదానీ, అల్లుడి కోసమే రేవంత్ పాలన: కేటీఆర్
సాక్షి,మహబూబాబాద్: ఏడాదిలో ఇరవైఎనిమిదిసార్లు ఢిల్లీ వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా తీసుకురాలేదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. లగచర్ల ఫార్మాసిటీ బాధితులకు న్యాయం చేయాలని సోమవారం(నవంబర్ 25) మహబూబాబాద్ పట్టణంలో జరిగిన బీఆర్ఎస్ మహాధర్నాలో కేటీఆర్ మాట్లాడారు.‘చిన్న సన్న కారు రైతులపై రేవంత్‌రెడ్డి జులుం ప్రదర్శిస్తున్నారు. లగచర్లలో సొంత అల్లుడి కోసం రేవంత్ పేదల భూములు లాక్కుంటున్నారు. రేవంత్‌రెడ్డికి బుద్ధి చెప్పాలి. లగచర్లలో పేదల భూములను వెంటనే తిరిగి ఇచ్చేయాలి’అని కేటీఆర్ డిమాండ్ చేశారు. మహాధర్నాలో కేటీఆర్ ఇంకా ఏమన్నారంటే.. లగచర్లలో 3 వేల ఎకరాల భూములను చెరబట్టాలని చూశారుసీఎం రేవంత్ రెడ్డి.. తన సొంత నియోజకవర్గంలో ఓటేసి గెలిపించిన ప్రజలను ఇబ్బంది పెడుతున్నారుఢిల్లీకి 28 సార్లు వెళ్లి 28 రూపాయలు కూడా తేలేదురేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గంలో తిరుగుబాటు ఎదుర్కొంటున్నాడులగచర్లకు అధికారులు పోతే నిరసన వ్యక్తం చేశారు.. రేవంత్ రెడ్డి పోతే ఉరికించి కొట్టేవాళ్ళుప్రధాని మోదీ.. రైతులు ఏడాది పాటు నిరసన తెలిపితే నల్ల చట్టాలు వెనక్కి తీసుకున్నారురేవంత్ రెడ్డి రైతులతో పెట్టుకున్నారుజైల్లో పెట్టిన 30 మందికి సంఘీభావంగా మానుకోటలో ధర్నా చేస్తామంటే.. అడ్డుకునే ప్రయత్నం చేశారుఎవరికోసం ఫార్మా విలేజ్..?.. అల్లుడి కోసం పేదవాళ్ల భూములు లాక్కుంటున్నారుముఖ్యమంత్రి పేదల కోసం పనిచేయడం లేదు..అదాని కోసం.. అల్లుడి కోసం.. అన్నదమ్ముల కోసం పనిచేస్తున్నారుపేద ప్రజల కోసం సీఎం రేవంత్ రెడ్డి పనిచేయడం లేదుఇంకా నాలుగు రోజులు అయితే ఈ ప్రభుత్వానికి ఏడాది పూర్తవుతుంది.. ఆరు గ్యారెంటీలు అన్నారు .. ఒక హామీ అయినా అమలైందారేవంత్ రెడ్డికి మహారాష్ట్ర ప్రజలు బుద్ధి చెప్పారు.. కాంగ్రెస్ పార్టీని తన్ని వెళ్ళగొట్టారునేను వస్తే రాళ్లతో కొడతామని కొంతమంది ఎమ్మెల్యేలు అంటున్నారు.అధికార కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు రాళ్లతో కొడతామంటే పోలీసులు ఏం చేస్తున్నారుమానుకోట రాళ్ల మహత్యం ఏంటో తెలంగాణ ఉద్యమంలో చూపించాంకోర్టు ద్వారా అనుమతి తెచ్చుకుంటే.. వెయ్యి మంది వస్తారు అనుకుంటే 20 వేల మంది వచ్చారుప్రభుత్వం మీద ఎన్నో వ్యతిరేకత ఉందో మానుకోట మహా ధర్నా చూస్తే అర్థమవుతుందినాలుగేళ్లు గట్టిగా కొట్లాడుదాం.. ఎక్కడ అన్యాయం జరిగినా అక్కడికి వస్తాంఢిల్లీకి వెళ్లి గిరిజనులు వివిధ కమిషన్లకు తమ బాధ చెప్తుంటే.. వాళ్లు కూడా ఎంతో బాధపడ్డారుగిరిజనుల రిజర్వేషన్ 6 శాతం నుంచి 10 శాతానికి పెంచారుమానుకోట మొదటి అడుగు మాత్రమే.. రాష్ట్రంలోని ప్రతి తండా, పల్లెకు వెళ్లి మద్దతు కూడా కడతాముఇదీ చదవండి: మహబూబాబాద్‌లో హైటెన్షన్..కేటీఆర్ ఫ్లెక్సీలు చింపివేత -
ఉద్యమ స్ఫూర్తిని మళ్లీ రగిలిస్తం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ స్ఫూర్తితో మరో మారు ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు తెలిపారు. కాంగ్రెస్ కబంధ హస్తాల నుంచి నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలను కాపాడేందుకు మరోసారి సంకల్ప దీక్ష చేపట్టాల్సిన సమయం ఆసన్నమైందని అన్నారు. తెలంగాణ భవన్లో పార్టీ ఎమ్మెల్యేలు, పలువురు మాజీ మంత్రులతో కలిసి కేటీఆర్ ఆదివారం మీడియా సమావేశంలో మాట్లాడారు.‘2009 నవంబర్ 29న నిరాహార దీక్ష ప్రారంభించి తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని కేసీఆర్ మలుపు తిప్పారు. తెలంగాణపై కేసీఆర్ వేసిన ముద్రను గుర్తు చేసుకుంటూ 33 జిల్లాల్లోని బీఆర్ఎస్ కార్యాలయాల్లో ఈ నెల 29న దీక్షా దివస్ నిర్వహిస్తాం. దీక్షా దివస్ నిర్వహణకు ఈ నెల 26న అన్ని జిల్లాల్లో సన్నాహక సమావేశాలు ఏర్పాటు చేస్తాం. సీనియర్ నాయకులకు జిల్లాల వారీగా దీక్షా దివస్ ఇన్చార్జిలుగా బాధ్యతలు అప్పగించాం’అని కేటీఆర్ వెల్లడించారు. డిసెంబర్ 9న మేడ్చల్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ కేసీఆర్ నిరాహార దీక్ష ముగించిన రోజును గుర్తు చేస్తూ డిసెంబర్ 9న మేడ్చల్‌లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ చేస్తామని కేటీఆర్ తెలిపారు. కేసీఆర్ నిరాహార దీక్ష చేసిన నిమ్స్ ఆసుపత్రిలో అన్నదానం, రోగులకు పండ్లు పంపిణీ చేస్తామని చెప్పారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ పాలనా కాలంలో తెలంగాణలోని ప్రతీ వర్గం, ప్రతీ మనిషి బతుకు చితికిపోయిందని, ఇప్పుడు తిరిగి అవే పరిస్థితులు కనిపిస్తున్నాయని అన్నారు. నిర్బంధాలు, అణచివేతలు, దుర్భర పరిస్థితులు దర్శనమిస్తున్నాయని.. కాంగ్రెస్‌కు అధికారమిస్తే తెలంగాణలో మళ్లీ అదే అంధకారం నెలకొని అట్టడుగు వర్గాలతో సహా అందరూ బాధపడుతున్నారని ధ్వజమెత్తారు. జాతీయ పార్టీలకు బుద్ధి చెప్పేలా.. ‘స్వరాష్ట్ర కలను నిజం చేసేందుకు ‘కేసీఆర్ సచ్చుడో...తెలంగాణ తెచ్చుడో’అని తెగువ చూపిన నాయకుడికి మూడు కోట్ల మంది ప్రజలు ముక్త కంఠంతో అండగా నిలబడ్డారు. ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ రాష్ట్రం సాధించిన కేసీఆర్ స్ఫూర్తితో ప్రస్తుతం మళ్లీ రెండు జాతీయ పారీ్టల మెడలు వంచాల్సిన బాధ్యత ప్రతీ పౌరుడిపై ఉంది. దుర్మార్గ కాంగ్రెస్, బీజేపీలకు బుద్ధి చెప్పాలనే సంకల్పంతో బీఆర్ఎస్ చేపడుతున్న కార్యక్రమాల్లో కార్యకర్తలు కలసికట్టుగా పనిచేయాలి’అని కేటీఆర్ పిలుపునిచ్చారు. సమావేశంలో మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, పద్మారావు గౌడ్, మహమూద్ అలీ, వేముల ప్రశాంత్‌రెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్, కేపీ వివేకానంద్, ముఠా గోపాల్ పాల్గొన్నారు. -
జార్ఖండ్‌లో భట్టి బిజీబిజీ
సాక్షి, హైదరాబాద్: జార్ఖండ్ అసెంబ్లీ ఫలితాల నేప థ్యంలో ఏఐసీసీ పరిశీలకు ని హోదాలో రాంచీలో మ కాం వేసిన తెలంగాణ ఉపముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క ఆదివారమంతా బిజీబిజీగా గడిపారు. తాజా ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన పోటీ చేసి గెలిచిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలతో జార్ఖండ్ పీసీసీ కార్యాలయంలో ఆయన భేటీ అయ్యారు. జేపీసీసీ అధ్యక్షుడు కేశవ్ మహతో కమలేశ్‌తో పాటు పార్టీ సీనియర్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గెలిచిన ఎమ్మెల్యేలకు అభినందనలు తెలిపిన భట్టి.. కొత్త ప్రభుత్వ ఏర్పాటు క్రమంలో పార్టీ వ్యూహాలను ఎమ్మెల్యేలకు వివరించారు.ఆ తర్వాత ఇండియా కూటమి ఎమ్మెల్యేలతో కలిసి జార్ఖండ్ గవర్నర్ సంతోశ్ గంగ్వార్‌ను కలిశారు. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్‌తో పాటు జేఎంఎం, కాంగ్రెస్, ఆర్జేడీ, సీపీఐఎంఎల్ పార్టీల ఎమ్మెల్యేలతో కలిసి రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను కలిసి ఇండియా కూటమి ప్రభుత్వ ఏర్పాటుకు అనుమతి కోరారు. కాగా, జార్ఖండ్ ఎన్నికల ప్రక్రియలో కీలకపాత్ర పోషించిన భట్టి ఫలితాల అనంతరం ప్రభుత్వ ఏర్పాటు, మంత్రివర్గ కూర్పు తదితర అంశాల్లో కాంగ్రెస్ పక్షాన కీలకంగా వ్యవహరిస్తుండటం గమనార్హం. ఎన్నుకున్న ప్రజల కోసం కష్టపడి పనిచేయండి దేశాన్ని ఓ వికృత పార్టీ పాలిస్తోందని, ఆ పార్టీని కాదని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నందున వారి కోసం కష్టపడి పనిచేయాలని జార్ఖండ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలకు భట్టి దిశానిర్దేశం చేశారు. రాంచీలోని హోటల్ చాణక్యలో జరిగిన కాంగ్రెస్ ఎమ్మెల్యేల భేటీలో ఆయన మాట్లాడారు. ‘ఇక్కడ కూర్చున్న వాళ్లు అదృష్టవంతులు. ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా పోటీ చేయాలనుకున్నారు. కానీ అందరికీ టికెట్లు దక్కలేదు. కాంగ్రెస్ పారీ్టలో పనిచేయడం అదృష్టం’ అని వ్యాఖ్యానించారు.తెలంగాణ ప్రభుత్వంతో పాటు రాష్ట్ర పార్టీ పక్షాన కొత్త ఎమ్మెల్యేలను అభినందించిన భట్టి, తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పక్షాన రాష్ట్రానికి రావాలని కోరుతూ జార్ఖండ్ ఎమ్మెల్యేలకు సాదర ఆహా్వనం పలికారు. ఈ సమావేశంలో జార్ఖండ్ పార్టీ ఇన్చార్జి సిరివెళ్ల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
Harishrao: అబద్ధాలు ఆడడంలో రేవంత్‌కు డాక్టరేట్ ఇవ్వాలి
సాక్షి, కరీంనగర్ జిల్లా: అబద్ధాలు చెప్పడంలో రాష్ట్ర సీఎం రేవంత్‌రెడ్డికి డాక్టరేట్ ఇవ్వాలని ఎద్దేవా చేశారు బీఆర్ఎస్ నేత హరీష్ రావు. హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ నేతల మీడియా సమావేశం జరిగింది.ఈ సమావేశంలో హరీష్ రావు మాట్లాడుతూ.. ‘అబద్ధాలు చెప్పడంలో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి డాక్టరేట్ ఇవ్వాలి. అందుకే ఇక్కడి ఆరు గ్యారంటీల మోసాన్ని గ్రహించే.. మహారాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ను ఓడించి బుద్ధి చెప్పారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు, సీఎం కళ్ళు తెరిచి బుద్ధి తెచ్చుకుని ఆరు గ్యారంటీలు అమలు చేయాలి.మీరు ఇచ్చిన ఏడో గ్యారెంటీ ప్రజాస్వామ్యం కూడా తెలంగాణాలో ఖూనీ అయిపోయింది. హుజూరాబాద్‌లో కొందరికి దళితబంధు ఆగింది. ఆగిపోయిన దళితబంధు రెండోవిడత డబ్బులిమ్మంటే పోలీసులతో దాడి చేయించారు.డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క దళితులకు చేసే మేలు ఇదేనా..? జులై 19, 2024 నాడు ఫార్మాసిటీ పేరిట గెజిట్ ఇచ్చి.. ఇప్పుడు ఫార్మాసిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ సీఎం మాట మారుస్తున్నారు. పచ్చని పంటలు పండే భూములను.. తొండలు గుడ్డు పెట్టని భూములుగా రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నారు.కాళేశ్వరం కూలిపోయిందని చెబుతున్న నీవు.. 20 టీఎంసీల నీటిని అదే ప్రాజెక్టు నుంచి హైదరాబాద్ కు ఎలా తీసుకెళ్తావు? మిషన్ భగీరథపై సాక్షాత్తు ప్రధానమంత్రి లోక్ సభలో మెచ్చుకున్నది నిజం కాదా..?. ఇవాళ కోటి 60 లక్షల ధాన్యం పండడానికి కాంగ్రెస్ ఘనత అని చెప్పుకుంటున్నాడు రేవంత్‌రెడ్డి.తెలంగాణ రావడానికి ముందు ఇక్కడ పండింది 30 లక్షల మెట్రిక్ టన్నులే.. కేసీఆర్ హయాంలోనే కోటి 56 లక్షల మెట్రిక్ టన్నుల పంట పండింది. వరంగల్‌లో రైతు డిక్లరేషన్ పేరిట ఇచ్చిన తొమ్మిది హామీల్లో ఒక్కటైనా అమలైందా..? హుజూరాబాద్‌లో దళిత సోదరులపై పెట్టిన అక్రమ కేసులను ఖండిస్తున్నాం. డిసెంబర్ 9 నుంచి జరిగే అసెంబ్లీలో దళితుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాం’ అని హరీష్‌రావు అన్నారు. -
‘దీక్షా దివస్’పై కేటీఆర్ కీలక ప్రకటన
సాక్షి,హైదరాబాద్: దీక్షా దివస్‌ను నవంబర్ 29వ తేదీన ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ శ్రేణులకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు.రేవంత్‌రెడ్డి పాలనలో ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న నిర్బంధాలు మళ్ళీ వచ్చాయన్నారు. తెలంగాణభవన్‌లో ఆదివారం(నవంబర్ 24) కేటీఆర్ మీడియాతో మాట్లాడారు.‘కేసీఆర్ స్పూర్తితో కాంగ్రెస్ కబంద హస్తాల నుంచి తెలంగాణ ప్రజలను కాపాడుకుంటాం. 2009 నవంబర్29 కేసీఆర్ దీక్షతో తెలంగాణ ఉద్యమం మలుపు తిరిగింది.నవంబర్ 29న 33జిల్లా కేంద్రాల్లో దీక్ష దివస్ కార్యక్రమం నిర్వహిస్తాం.దీక్షా దివస్‌లో కేసీఆర్ పాల్గొనడం లేదు. 26న అన్ని జిల్లా కేంద్రాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహిస్తాం.తెలంగాణపై కేసీఆర్ దీక్ష చెరగని ముద్ర వేసింది.కేసీఆర్ దీక్ష విమరణ రోజైన డిసెంబర్ 9న మేడ్చల్‌లో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది. దీక్షకు గుర్తుగా 29న నిమ్స్ లో రోగులకు అన్నదానం చేస్తాం.రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ మెడలు వంచుతాం.ఢిల్లీ మెడలు వంచి తెలంగాణ సాధించిన కేసీఆర్ స్పూర్తితో ముందుకు వెళతాం’అని కేటీఆర్ తెలిపారు. ఇదీ చదవండి: అది నోరైతే నిజాలు వస్తాయి: కేటీఆర్ -
అది నోరైతే నిజాలు వస్తాయి.. అదే మూసీ అయితే.. సీఎంపై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రేవంత్ రెడ్డి.. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుంది. అది నోరైతే నిజాలు వస్తాయి.. అదే మూసీ అయితే మాయమాటలే వస్తాయి’’ అంటూ సీఎం రేవంత్‌రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ‘‘పిల్ల చేష్టలు, గారడీ మాటలు, లక్ష్యం లేని చర్యలతో రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నావ్’’ అంటూ ఎక్స్ వేదికగా నిలదీశారు.‘‘నీ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ కొడంగల్ లో భూసేకరణ ఫార్మా విలేజ్ల కోసం అని స్పష్టంగా వెల్లడిస్తుంది. ఫార్మా క్లస్టర్ ఏర్పాటు చేస్తామని పలు మార్లు, పలు వేదికల మీద ప్రకటనలు చేస్తివి. తొండలు గుడ్లు పెట్టని భూములు అంటూ బాతాఖానీ కొడితివి. మీ అన్న తిరుపతి లగచర్ల చుట్టుపక్కల గ్రామాలలో తిరిగి ప్రైవేటు సైన్యంతో, పోలీసు బలగాలతో కలిసి భూములు ఇవ్వాలని రైతులను బెదిరించలేదా?. ఎదురు తిరిగిన రైతుల మీద అక్రమ కేసులు పెట్టి,జైళ్లకు పంపి అక్రమ నిర్భంధం, అణచివేత కొనసాగించడం లేదా?’’ అని కేటీఆర్ ప్రశ్నలు గుప్పించారు.‘‘ఇంత చేస్తూ ఇప్పుడు అక్కడ పెట్టేది ఫార్మా సిటీ కాదు.. ఇండస్ట్రియల్ కారిడార్ అంటూ మాటమార్చి ఎవర్నీ పిచ్చోళ్లను చేస్తున్నావ్. చెప్పెటోడికి వినేవాడు లోకువ అన్నట్లు అబద్దాలతో అధికారంలోకి వచ్చిన నువ్వు అబద్దాలతోనే కాపురం చేస్తూ కాలం వెల్లదీస్తున్నావు’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: కమలదళం.. ద్విముఖ వ్యూహం!రేవంత్ రెడ్డి .. నరం లేని నాలుక ఏదైనా మాట్లాడుతుందిఅది నోరైతే నిజాలు వస్తాయి-అదే మూసీ అయితే మాయమాటలే వస్తాయిపిల్ల చేష్టలు, గారడీ మాటలు,లక్ష్యం లేని చర్యలతో రాష్ట్రాన్ని ఆగం చేస్తున్నావ్నీ ప్రభుత్వం విడుదల చేసిన గెజిట్ నోటిఫికేషన్ కొడంగల్ లో భూసేకరణ ఫార్మా విలేజ్ ల కోసం అని… pic.twitter.com/gWGJl8GFjI— KTR (@KTRBRS) November 24, 2024 -
కమలదళం.. ద్విముఖ వ్యూహం!
సాక్షి, హైదరాబాద్: ఓవైపు పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూనే, మరోవైపు అధికార కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగడుతూ ఉద్యమబాట పట్టాలని బీజేపీ ముఖ్యనేతలకు కేంద్రమంత్రి, రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. రాష్ట్రంలో ఏడాది పాలనలో అన్ని రంగాల్లో ప్రభుత్వం విఫలమైన తీరు, హామీలు, వాగ్దానాల అమల్లో వైఫల్యాలను ఎత్తిచూపాలన్నారు. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న బీఆర్ఎస్ను కూడా లక్ష్యంగా చేసుకొని పదేళ్ల పాలనలో ప్రజా వ్యతిరేక కార్యకలాపాలు, అవినీతి ఆరోపణలు వంటి వాటిని ఎండగట్టేలా కార్యాచరణ రూపొందించి.. రెండు లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు. డిసెంబర్ మొదటివారంలో ఏడాది పాలన పూర్తి సందర్భంగా కాంగ్రెస్ సర్కారు సంబురాలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో అంతకంటె ముందుగానే రాష్ట్ర పార్టీ ఆధ్వర్యంలో చార్జిషీట్లు, వివిధ వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీల అమల్లో వెనుకబడడాన్ని ఎండగడుతూ ఇతర రూపాల్లో ఆందోళన, నిరసనలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని నిర్ణయించారు. డిసెంబర్ 1 నుంచి 5 దాకా రాష్ట్రవ్యాప్తంగా (అసెంబ్లీ నియోజకవర్గాల్లో) ‘ఆరు అబద్ధాలు’పేరిట హామీల అమల్లో కాంగ్రెస్ వైఫల్యాలను ఎత్తిచూపేలా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, ఇతర హామీలను అధికారంలోకి వచ్చాక వేటిని పూర్తిచేశారనే దానిపై డిసెంబర్ 1న రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ స్థాయిల్లో చార్జిషీట్లు విడుదల చేయాలని బీజేపీ నిర్ణయించిన విషయం తెలిసిందే. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా చార్జిషీట్ల విడుదలతోపాటు ఎక్కడికక్కడ బహిరంగసభల నిర్వహణకు కూడా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. యువమోర్చా ఆధ్వర్యంలో నిరుద్యోగ భృతి చెల్లించకపోవడం, పూర్తిస్థాయిలో ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టకపోవడంపై బైక్ ర్యాలీలు, మహిళామోర్చా ద్వారా మహిళలకు ఇచ్చిన ప్రధాన హామీల అమల్లో వైఫల్యాలు ఎండగట్టేలా, రైతాంగానికి చేసిన వాగ్దానాల్లో అమలు తీరును ఎత్తిచూపుతూ నిరసనలు, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మోర్చాల ద్వారా ఆయా వర్గాల ప్రజలకు ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడంపై ఆయా మోర్చాలు వివిధ రూపాల్లో కార్యక్రమాలు చేపట్టనున్నాయి. ఈ మేరకు యువ, మహిళ, కిసాన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ మోర్చాలకు కిషన్‌రెడ్డి దిశానిర్దేశం చేశారు. ఏడు మోర్చాల ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీలోగా ఒక్కో మండలంలో ఒక్కో మోర్చా పదిమంది చొప్పున కొత్తవారిని క్రియాశీల సభ్యులుగా చేర్పించాలని సూచించారు. ప్రస్తుతం పార్టీపరంగా చేపట్టిన సభ్యత్వ నమోదులో 36 లక్షల మంది సభ్యులుగా చేరారని, ఈ నెలాఖరులోగా ఆ సంఖ్యను 50 లక్షలకు పెంచేందుకు చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. డిసెంబర్ 1 నుంచి 15 దాకా పోలింగ్ బూత్ కమిటీలతో పాటు మండల కమిటీల ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాలని ఆదేశించారు. శనివారం పార్టీ కార్యాలయంలో అన్ని మోర్చాలు, రాష్ట్ర సంస్థాగత ఎన్నికల కమిటీలతో వేర్వురుగా కిషన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ సంస్థాగత ఎన్నికల ఇన్చార్జ్ అభయ్ పాటిల్ సమావేశమయ్యారు. ఈ రెండు భేటీల్లో పార్టీ నేతలు యెండల లక్ష్మీనారాయణ, ఎం.ధర్మారావు, గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి, బంగారు శ్రుతి, కాసం వెంకటేశ్వర్లుతోపాటు ఏడు మోర్చాల అధ్యక్షులు పాల్గొన్నారు. -
ఈవీఎంల ట్యాంపరింగ్ విమర్శలు సిగ్గుచేటు
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ప్రజాతీర్పును గౌరవించకుండా కాంగ్రెస్ నేతలు ఈవీఎంల ట్యాంపరింగ్ జరిగిందంటూ విమర్శించడం సిగ్గుచేటని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి. కిషన్‌రెడ్డి మండిపడ్డారు. కాంగ్రెస్ గెలిస్తే ఈవీఎంలు బాగున్నట్టు.. బీజేపీ గెలిస్తే ఈవీఎంలు ట్యాంపరింగ్ అయినట్లు మాట్లాడటం ఆ పార్టీ నేతలకు పరిపాటిగా మారిందని విమర్శించారు.శనివారం ఆయన హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ మహారాష్ట్రలో కాంగ్రెస్ ఎంత తప్పుడు ప్రచారం చేసినా ప్రజలు మోదీ నాయకత్వంలోని డబుల్ ఇంజిన్ సర్కార్కే అత్యధిక ఓట్లు, సీట్లతో మరోసారి పట్టం కట్టారన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రిజర్వేషన్లు పోతాయని.. మరాఠీలకు అన్యాయం జరుగుతుందని లోక్‌సభ ఎన్నికల్లో ప్రచారం చేసి విపక్షాలు కొంత లబ్ధి పొందాయని.. కానీ 5 నెలల్లోనే ప్రజలకు వాస్తవ పరిస్థితులు అర్థమై బీజేపీ కూటమికి భారీ విజయం అందించారని కిషన్‌రెడ్డి చెప్పారు.మహారాష్ట్ర, గుజరాత్ విడిపోయినప్పుడు జరిగిన ఎన్నికల తర్వాత మహాయుతి కూటమికి ఇంత పెద్ద విజయం లభించడం ఇదే తొలిసారని పేర్కొన్నారు. జార్ఖండ్, మహారాష్ట్రలలో కలిపితే కాంగ్రెస్ 30 సీట్లు కూడా దాటలేదంటే ఆ పార్టీ ఎంతటి ప్రజావ్యతిరేకతను మూటకట్టుకుందో స్పష్టమవుతోందని కిషన్‌రెడ్డి విమర్శించారు. -
‘రేవంత్‌రెడ్డి ప్రచారం మహారాష్ట్రలో పని చేయలేదు’
హైదరాబాద్: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్కడ ప్రజలు అద్భుతమైన తీర్పునిచ్చారని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. రాహుల్ గాంధీ దుష్ప్రచారాన్ని ప్రజలు నమ్మలేదని, కాంగ్రెస్‌పై ఎంత వ్యతిరేకతో ఉందో తాజా ఫలితాల్ని బట్టి అర్థమవుతోందన్నారు కిషన్‌రెడ్డి. మహారాష్ట్ర, జార్ఖండ్‌లో కలిపి కాంగ్రెస్‌కు 30 సీట్లు కూడా రాలేదని ఎద్దేవా చేశారు. మహారాష్ట్రలో విపక్షహోదా కూడా కాంగ్రెస్‌కు రాలేదని కిషన్‌రెడ్డి విమర్శించారు.‘రేవంత్ రెడ్డి ప్రచారం మహారాష్ట్రలో పనిచేయలేదు. ఆయన తెలంగాణ ప్రజల డబ్బును మహారాష్ట్రకు పంపించినా పనిచేయలేదు. తెలంగాణలో రాహుల్ ప్రచారం చేసిన ప్రాంతాల్లో బీఆర్ఎస్ పై కోపంతో వారు పోవాలని, అలాగే అబద్ధపు 6 గ్యారెంటీల కారణంగా కాంగ్రెస్‌కు ఓటేసి గెలిపించారు. మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి పూర్తిస్థాయిలో విజయం సాధించడం హర్షనీయం.ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ అనేక రకాలుగా తప్పుడు ప్రచారాలు చేసింది.అయినా ప్రజలు వారిని తిరస్కరించారు.మహారాష్ట్ర ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కార్ కావాలనుకున్నారు.గత పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ వస్తే రిజర్వేషన్లు పోతాయని, మరాఠీలకు అన్యాయం జరుగుతుందని ప్రచారం చేసి కాంగ్రెస్ లబ్ధి పొందింది. ఈ 5 నెలల్లో తిరిగి ప్రజలు ఆలోచించి పూర్తిస్థాయిలో ఎన్డీయే కూటమి వైపు మొగ్గుచూపారు’ అని కిషన్‌రెడ్డి స్పష్టం చేశారు. -
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ కామెంట్
సాక్షి, హైదరాబాద్: దేశ భవిష్యత్తుకు ప్రాంతీయ పార్టీలే బలమైన పునాదులని మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల ఫలితాలతో తేలిపోయిందన్నారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. బలమైన ప్రతిపక్షంగా కూడా నిలవలేని కాంగ్రెస్ పార్టీ...దేశంలో ప్రాంతీయ పార్టీలను నాశనం చేసే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. కాంగ్రెస్ చేతగానీ, అసమర్థత కారణంగానే బీజేపీ మనుగడ కొనసాగుతోందని విమర్శలు గుప్పించారు.ఈ మేరకు ఎక్స్‌లో కేటీఆర్ స్పందిస్తూ.. ‘ప్రాంతీయ పార్టీల కృషిని విస్మరిస్తూ జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు సిగ్గు లేకుండా విమర్శలు చేస్తున్నాయి. రేవంత్ రెడ్డి నీ స్పీచ్‌లు, బ్యాగులు, ఛాపర్లు కూడా మీ పార్టీని ఘోర ఓటమి నుంచి కాపాడలేకపోయాయి. ఆయన అసత్య ప్రచారాన్ని మరాఠా ప్రజలు నమ్మలేదుఇకనైనా తెలంగాణలో గెలిపించి ప్రజల కోసం.. వాళ్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చటం కోసం పనిచేయాలి. ఏడాది క్రితం ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారంటీలను అమలుపై దృష్టి పెట్టాలి. ప్రాంతీయ పార్టీలు లేకుండా చేయాలనే కుట్రలో కాంగ్రెస్ ఎక్కువ కాదు.. బీజేపీ తక్కువ కాదు’అని కేటీఆర్ పేర్కొన్నారు.హేమంత్ సోరేన్ కు శుభాకాంక్షలు: హరీష్ రావు‘మహారాష్ట్రలో 5 గ్యారంటీల పేరిట కాంగ్రెస్ చేసిన గారడీ ప్రజలు నమ్మలేదు అని స్పష్టం అయ్యింది. ెలంగాణలో కాంగ్రెస్ మోసాలను మహారాష్ట్ర ప్రజలు గుర్తించి గుణపాఠం చెప్పారు. తెలంగాణలో మహిళలకు ₹ 2,500 ఇస్తామన్న మహాలక్ష్మి పథకం అమలు చేయకుండా మహారాష్ట్ర లో రూ.3,000 ఇస్తామనడం, రైతు భరోసా ఎగ్గొట్టడం, ఆసారా ధోఖ, రైతు రుణమాఫీ ఏడాది గడుస్తున్నా పూర్తి చేయకపోవడం వంటివి మహారాష్ట్రలో తీవ్ర ప్రభావం చూపెట్టాయి. తెలంగాణ ప్రజలు మహారాష్ట్రలోని ముంబై, షోలాపూర్, పూణే, నాందేడ్ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా నివసిస్తుండడం వలన కాంగ్రెస్ మోసాలు విరివిగా మహారాష్ట్ర లో ప్రచారం అయ్యాయి అనేది సుస్పష్టం. బీజేపీ పార్టీ.. హేమంత్ సోరేన్ పై పెట్టిన అక్రమ కేసులు, అరెస్టులు, పార్టీ చీల్చే ప్రయత్నాలను జార్ఖండ్ ప్రజలు తిప్పి కొట్టారు. బీజేపీ కక్ష సాధింపు విధానాలని ప్రజలు హర్శించడం లేదని తేలిపోయింది. విజయం సాధించిన హేమంత్ సోరేన్ కు శుభాకాంక్షలు.’ అని తెలిపారు -
రేవంత్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు పరాభవం!
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్రలో తెలంగాణ సీఎం రేవంత్ ప్రచారం చేసిన నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాభవం ఎదురైంది. రేవంత్ ప్రచారం నిర్వహించిన షోలాపూర్ సిటీ నార్త్, షోలాపూర్ సౌత్, చంద్రాపూర్, భోకార్, నాయగావ్, నాందేడ్ నార్త్‌లో బీజేపీ అభ్యర్థులు విజయం దిశగా దూసుకెళ్తున్నారు. కాగా.. జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల వేళ ఏఐసీసీ సీనియర్ అబ్జర్వర్‌గా డిప్యూటీ సీఎం భట్టి పని చేసిన సంగతి తెలిసిందే. అయితే క్షేత్ర స్థాయిలో పార్టీ అనుసరించాల్సిన వ్యూహాలు, ఇతర అంశాలను ఎప్పటి కప్పుడు అధిష్టానానికి చేర్చుతూ.. కింది స్థాయిలో హైకమాండ్ నిర్ణయాలను అమలు పరిచారు. జార్ఖండ్‌లో ఇండియా కూటమి హవా సాగుతోంది. ఇక్కడ ఎన్డీయే కూటమికి గట్టి షాక్ తగిలింది. హేమంత్ సోరెన్ నేతృత్వంలోని జేఎంఎం స్పష్టమైన ఆధిక్యం దిశగా దూసుకెళ్తోంది.జార్ఖండ్ అసెంబ్లీ పోస్ట్ ఎలక్షన్ ఏఐసీసీ అబ్జర్వర్‌గా భట్టి విక్రమార్కకు కాంగ్రెస్ అధిష్టానం బాధ్యతలు అప్పగించింది. ఆయనతో పాటు పార్టీ సీనియర్ లీడర్లు తన్వీర్ అన్వర్, కృష్ణ అల్లవూర్ నియమించింది.జార్ఖండ్‌లో ఇండియా కూటమి ప్రభుత్వం ఏర్పాటు దిశగా దూసుకెళ్తున్న క్రమంలో రాంచీలో కాంగ్రెస్ నేతలతో భట్టి విక్రమార్క భేటీ అయ్యారు. ఫలితాల సరళిపై ఎప్పటికప్పుడు ఆరా తీస్తూ.. మంత్రి పదవులపై భట్టి విక్రమార్క సమాలోచనలు జరుపుతున్నారు. -
మహారాష్ట్రలో ఎన్డీఏ కూటమి హవా.. బండి సంజయ్ రియాక్షన్ ఇదే
సాక్షి, కరీంనగర్ జిల్లా: మహారాష్ట్రలో ఎన్డీయే కూటమి విజయదుందుభి మోగిస్తుందని.. కాంగ్రెస్ ఐరన్ లెగ్ పార్టీ అని రుజువైందని కేంద్రమంత్రి బండి సంజయ్ వ్యాఖ్యానించారు. బీజేపి ఒంటరిగా 125 స్థానాలు గెలవబోతుందని.. యూపీలో ఏడు స్థానాలలో ముందంజలో ఉందన్నారు. ఎన్ని అబద్దాల ప్రచారం చేసిన ఎన్డీయే కూటమినే మహారాష్ట్ర ప్రజలు నమ్మారన్నారు. మహారాష్ట్రలో హిందూ సమాజం ఐకమత్యాన్ని చాటారన్నారు.కర్ణాటక, తెలంగాణ నుంచి మహారాష్ట్రకి కాంగ్రెస్ డబ్బులు పంపింది. ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ వైఫల్యాలే మహారాష్ట్రలో గెలుపు వచ్చింది. రేవంత్ రెడ్డి ప్రచారం చేసిన అన్ని స్థానాలలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. వాస్తవాన్ని గ్రహించారు కాబట్టే కాంగ్రెస్ కూటమి ఓటమి చెందింది. మోదీ అభివృద్ధి మంత్రం పనిచేసింది. ఇండియా కూటమి చీలీపోవడం ఖాయం. తెలంగాణలో కూడా కాంగ్రెస్‌కి ఇదే గతి పడుతుంది’’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించారు.‘‘మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ మోసాలను మేము ప్రచారం చేశాం. ఇప్పటికైనా తెలంగాణలో ఇచ్చిన హామీ నెరవెర్చండి.. లేదంటే మహారాష్ట్రలో పట్టిన గతే పడుతుంది. ఇచ్చింది ముఫ్ఫై వేల నోటిఫికేషన్ లు.. చెప్పింది మాత్రం యాభై వేల ఉద్యోగాలు ఇచ్చామని.. ఇక్కడి డబ్బులతో మహారాష్ట్రలో యాడ్స్ ఇచ్చారు’’ అని బండి సంజయ్ మండిపడ్డారు. -
‘ది సబర్మతి రిపోర్ట్’కు ట్యాక్స్ మినహాయించాలి: బండి సంజయ్
సాక్షి,హైదరాబాద్: కాంగ్రెస్ చరిత్రను కనుమరుగు చేస్తోందని, ‘ది సబర్మతి రిపోర్ట్’ సినిమాకు ట్యాక్స్ మినహాయింపు ఇవ్వాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్ తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ చేశారు. శుక్రవారం(నవంబర్22) హైదరాబాద్ జీవీకేమాల్లో ‘ది సబర్మతి రిపోర్ట్’ మూవీని బండి సంజయ్ పలువురితో కలిసి వీక్షించారు.‘కాంగ్రెస్ కుట్రలను బట్టబయలు చేసిన సినిమా ఇది. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ కాంగ్రెస్ చరిత్రను కనుమరుగు చేస్తూనే ఉంది. క్రికెట్లో పాకిస్తాన్ గెలిస్తే ఇండియాలో సంబరాలు చేసుకునే వాళ్లను ఏమనాలి?ఇండియా గెలవొద్దని కోరుకునే వాళ్లను ఏమనాలి?ఇప్పటికీ మినీ పాకిస్తాన్,మినీ బంగ్లాదేశ్,మినీ ఆఫ్ఘనిస్తాన్ బస్తీలున్నాయి.సమాజంలో ఇకనైనా మార్పు రావాలి. సబర్మతి వంటి సినిమాలు మరెన్నో రావాలి. ప్రతి ఒక్కరూ ఈ సినిమాను చూడాలి. కాంగ్రెస్ కార్యకర్తలంతా ఈ సినిమా చూసి వాస్తవాలు తెలుసుకోవాలి’అని బండిసంజయ్ హితవు పలికారు. -
బీఆర్ఎస్పై మంత్రి కోమటిరెడ్డి ఫైర్
సాక్షి,యాదాద్రిభువనగిరిజిల్లా:బీఆర్ఎస్పార్టీ, కేసీఆర్, కేటీఆర్‌పై మంత్రి కోమటిరెడ్డివెంకట్‌రెడ్డి మరోసారి ఫైరయ్యారు. మేడిగడ్డ కూలినట్లు బీఆర్ఎస్ ప్రభుత్వం కూలిపోయిందన్నారు. యాదగిరిగుట్టలో శుక్రవారం(నవంబర్22) మిషన్ భగీరథ పైప్‌లైన్ పనులకు మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు,సీతక్కలతో కలిసి కోమటిరెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ‘ఆలేరు,భువనగిరి నియోజకవర్గాలకు తాగు నీరు ఇచ్చేందుకు కేసీఆర్‌కు చేతులు రాలేదు. కేసీఆర్ పాపాలు చేసిండు కాబట్టే యాదగిరి లక్ష్మీనరసింహస్వామి శపించి ఫాంహౌజ్‌కు పంపించాడు.కేసీఆర్ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదు రేవంత్ సీఎం అయ్యేవాడు కాదని హరీష్‌రావు అంటున్నాడు. హరీష్‌రావుకి బుద్ది ఉండే మాట్లాడుతున్నాడా? మతి భ్రమించి బీఆర్ఎస్ నేతలు ప్రజా ప్రభుత్వంపై మాట్లాడుతున్నారు’అని కోమటిరెడ్డి మండిపడ్డారు. -
ఎనుముల కాదు.. ‘ఎగవేతల’ రేవంత్‌రెడ్డి: హరీష్‌రావు సెటైర్లు
సాక్షి, ఖమ్మం జిల్లా: చింతకాని మండలంలోని మాజీ మంత్రులు తన్నీరు హరీష్ రావు, పువ్వాడ అజయ్ కుమార్, గంగుల కమలాకర్ పర్యటించారు. భూ వివాదంలో ఆత్మహత్యకు పాల్పడిన బోజెడ్ల ప్రభాకర్‌రావు కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం సభలో హరీష్ రావు మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక మార్పు వచ్చిందని.. అన్ని సంక్షేమ పథకాలు ఆగిపోయాయన్నారు.‘‘కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను మోసం చేసింది. ఆరు లక్షల తులాల బంగారం కళ్యాణలక్ష్మీకి బాకీ పడింది. భద్రాద్రి రాములోరి సాక్షిగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన రైతులకు రెండు లక్షల రుణమాఫీ పూర్తిగా అమలు కాలేదు. పాలకుడే మాట తప్పితే.. ప్రజలకు అన్యాయం జరుగుతుంది. యాదాద్రి లక్ష్మి నరసింహస్వామిని దర్శించుకుని ఈ ముఖ్యమంత్రికి మంచి బుద్ధి ప్రసాదించమని కోరుకున్నా.. కాంగ్రెస్‌లో పనిచేసేది తక్కువ.. లొల్లి మాత్రం ఎక్కువ’’ అంటూ హరీష్‌రావు ఎద్దేవా చేశారు.‘‘ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ఇంటింటికి బాండ్ పేపర్ ఇచ్చారు.. అమలు చేశారా?. ఏడాది పాలనలో ఆత్మ విమర్శలు చేసుకొని ప్రజలకు క్షమాపణ చెప్పాలి. కరోనా కష్టకాలంలో కూడా రైతులకు కేసీఆర్ రైతుబంధు ఇచ్చారు. ఏ ఒక్క హామీ అమలు చేయని మోసపూరిత పార్టీ కాంగ్రెస్. ముఖ్యమంత్రి పేరు ఎనుముల రేవంత్ రెడ్డి కాదు.. ఎగవేతల రేవంత్ రెడ్డి.’’ అంటూ హరీష్‌రావు వ్యంగ్యాస్త్రాలు సంధించారు.‘‘లచ్చగూడెంలో విద్యుత్ షాక్‌తో మరణించిన ప్రసాద్ అనే రైతుకు ఎక్స్‌గ్రేషియా అడిగినందుకు అక్రమ కేసులు బనాయించారు. అక్రమంగా బీఆర్ఎస్ కార్యకర్తలపై పోలీసులు కేసు పెడితే.. వడ్డీతో సహా చెల్లిస్తాం. ఆరు గ్యారంటీలు అమలు చేసేలా కాంగ్రెస్ పార్టీ మెడలు వంచైనా పనిచేపిస్తాం. అధికారం చేపట్టిన దగ్గర నుంచి అవ్వతాతలకు 4 వేల పెన్షన్ ఇవ్వాల్సిందే’’ అని హరీష్‌రావు డిమాండ్ చేశారు. -
అదానీ విషయంలో ఆ రెండు పార్టీలు ఒక్కటే: కేటీఆర్
సాక్షి,హైదరాబాద్:అదానీ విషయంలో కాంగ్రెస్ ఢిల్లీలో ఒకలా,గల్లీలో మరోలా మాట్లాడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఈ మేరకు కేటీఆర్ శుక్రవారం(నవంబర్22) తెలంగాణభవన్‌లో మీడియాతో మాట్లాడారు. ‘అదానీ అవినీతిపరుడైతే..రేవంత్‌రెడ్డి నీతిపరుడు ఎలా అవుతాడో రాహుల్‌గాంధీ చెప్పాలి. రాహుల్‌గాంధీకి చిత్తశుద్ధి ఉంటే..తెలంగాణ సర్కార్ అదానీతో చేసుకున్న ఒప్పందాలు రద్దు చేయించాలి.కెన్యా లాంటి చిన్న దేశాలే రద్దు చేసుకున్నప్పుడు..రేవంత్ రెడ్డి ఎందుకు రద్దు చేసుకోడు?మహారాష్ట్ర వెళ్ళి అదానీని గజదొంగ అన్న రేవంత్ తెలంగాణలో మాత్రం గజ మాల వేస్తున్నాడు. అదానీతో తెలంగాణ సర్కార్ ఒప్పందాలపై తెలంగాణ బీజేపీ వైఖరి చెప్పాలి. అదానీ వ్యవహరంతో కాంగ్రెస్,బీజేపీ ఒక్కటేనని మరోసారి రుజువైంది. మోదీ,అమిత్ షా,రాహుల్,రేవంత్,కిషన్‌రెడ్డి సమాధానం చెప్పాలి.అదానీతో దేశానికి నష్టమైతే తెలంగాణకు నష్టం కాదా? రాహుల్ గాంధీ చెప్పాలి.స్కిల్ యూనివర్శిటీకి వంద కోట్లు తీసుకోవడం తప్పా? కాదా? కోహినూరు హోటల్లో మంత్రి పొంగులేటి,అదానీ రహస్య సమావేశం అయిన మాట వాస్తవం. అదానీతో ఒప్పందాలు రేవంత్ సర్కార్ రద్దు చేసుకోవటం లేదు?అదానీ వేల కోట్ల ఒప్పందాలపై రోజూ విమర్శించే రాహుల్ గాందీ సమాధానం చెప్పాలి.రాహుల్ గాంధీకి తెలిసే రేవంత్‌రెడ్డి విరాళం తీసుకున్నారా? బీజేపీ డబుల్ ఇంజిన్ సర్కార్ అయితే..కాంగ్రెస్ డబుల్ స్టాండర్డ్ పార్టీనా?కేసీఆర్ హాయాంలో ఎంత ప్రయత్నం చేసినా తెలంగాణలో అదానీకి అవకాశం ఇవ్వలేదు. అదానీతో మేము ఫోటోలు దిగిన మాట వాస్తవం. అంతే మర్యాదగా బయటకు పంపించాం. రేవంత్‌రెడ్డి మాత్రం అదానీకి ఎర్ర తివాచీ పరచి స్వాగతం పలికాడు.అదానీతో రేవంత్ చేసుకున్న 12,400కోట్ల రూపాయల ఒప్పందాలను వెంటనే రద్దు చేయాలి. బడేబాయ్ మోదీ ఆదేశాలను చోటా బాయ్ రేవంత్ అమలు చేశాడు.తెలంగాణలో అదానీ వ్యాపార సామ్రాజ్యాన్ని ఏర్పాటుకు రేవంత్ సహకారం. అదానీ వ్యవహారంతో భారతదేశ ప్రతిష్ట మసకబారింది. అదానీ వ్యవహరంపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలి. రామన్నపేటలో అదానీ సిమెంట్ పరిశ్రమ వద్దని ఆందోళనా చేసినా రేవంత్ పట్టించుకోలేదు’అని కేటీఆర్ తెలిపారు.ఇదీ చదవండి: బీఆర్ఎస్లో మిగిలేది ఆ ఐదుగురే: హరీశ్‌రావు -
తప్పులు చేసి నీతులు చెబుతారా?: బీఆర్ఎస్పై రేణుకా చౌదరి ఫైర్
సాక్షి, ఖమ్మం జిల్లా: బీఆర్ఎస్ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తున్నారని రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి మండిపడ్డారు. ఖమ్మంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆమె మీడియా సమావేశంలో మాట్లాడుతూ, కొండలు.. గుట్టలు మింగిన వాళ్లు ఈ రోజు నీతులు చెబుతున్నారంటూ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో ఒక మాట, కేంద్రంలో ఓ మాట మాట్లాడుతున్నారని.. సీఎంని, మంత్రులను కావాలనే విమర్శిస్తున్నారని ఆమె దుయ్యబట్టారు.ఈ రోజు హరీశ్‌రావు 8 గంటలకే మార్కెట్‌కి వెళ్లి పర్యటన చేయడం హాస్యాస్పదం. వ్యవసాయం గురించి తెలిసివాళ్లకు రైతులు ఏ సమయానికి మార్కెట్‌కు వస్తారో తెలుస్తుంది. మీకు ప్రాజెక్టులు, వాటి మీద వచ్చే కమిషన్ల గురించి మాత్రమే తెలుసు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిద్రాహారాలు మాని పని చేస్తున్నారు. రైతులకు బేడీలు వేసిన వాళ్లు రైతుల గురించి మాట్లాడుతున్నారు.’’ అంటూ రేణుకా చౌదరి ధ్వజమెత్తారు. గత ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పులపాలు చేసింది. ఆ అప్పుల ఊబి నుంచి రాష్ట్రాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం బయటకు తీసుకొస్తుంది. ఉద్యోగులకు మొదటి తేదీ నాడే జీతాలు చెల్లిస్తోంది. సుజాతనగర్లో నకిలీ విత్తనాలు రైతులను నష్ట పరిచిన కంపెనీ యాజమాన్యంతో వారందరికీ పరిహారం చెల్లించేలా చేశాం. కొత్తగూడెం విమానాశ్రయం ప్రాసెస్ నడుస్తుంది. త్వరలోనే ఎయిర్పోర్ట్ రాబోతుంది’’ అని రేణుకా చౌదరి తెలిపారు. -
బీఆర్ఎస్లో మిగిలేది ఆ ఐదుగురే: ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
సాక్షి,హైదరాబాద్:ఎమ్మెల్యేల అనర్హతపై హైకోర్టు ఇచ్చిన తీర్పు బీఆర్ఎస్ పార్టీ నేతలకు చెంప చెళ్లుమనిపించేలా ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. ఈ మేరకు శుక్రవారం(నవంబర్ 22) ఆది శ్రీనివాస్ మీడియాతో మాట్లాడారు.‘హైకోర్టులో బీఆర్ఎస్ భంగపడింది. ఎమ్మెల్యేల అనర్హతపై సర్వాధికారాలు స్పీకర్‌కు ఉన్నాయని కోర్టు తేల్చింది.తగిన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని మాత్రమే కోర్టు సూచించింది. నిర్ణీత సమయాన్ని కూడా కోర్టు ప్రస్తావించలేదు. అన్ని విషయాలు తెలిసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కోర్టుకు వెళ్లి దెబ్బతిన్నారు. రాజ్యాంగం ప్రకారం స్పీకర్ నడుచుకుంటారు. కోర్టు తీర్పు రాకుండానే గతంలో కేటీఆర్ ఈ విషయంలో ఎగిరెగిరి పడ్డారు.అప్పుడే ఉప ఎన్నికలు వచ్చినట్లుగా హడావిడి చేశాడు. చేసిన పాపం గోచిలో పెట్టుకొని కాశీకి పోయినట్లు కేటీఆర్,బీఆర్ఎస్ నేతల తీరు ఉంది. పదేళ్లపాటు రాజ్యాంగాన్ని అపహస్యం చేసి ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన 60మందికి పైగా ఎమ్మెల్యేలు,ఎమ్మెల్సీలు,ఎంపీలను బీఆర్ఎస్ చేర్చుకుంది.ప్రతిపక్ష పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను క్యాబినెట్లో చేర్చుకొని నైతిక విలువలను తీసుకెళ్లి కాళేశ్వరంలో కలిపారు. పార్టీలకు పార్టీలను విలీనం చేసుకుని రాజ్యాంగాన్ని ఖూనీ చేశారు. ప్రతిపక్ష పార్టీలు ఎంత గగ్గోలు పెట్టినా కేసీఆర్ లెక్కచేయలేదు. తెలంగాణ పునర్ నిర్మాణం కోసం ఫిరాయింపులు చేసుకోవచ్చునని నిర్లజ్జగా చెప్పుకొని తిరిగారు.అధికారం పోయిన తర్వాత బీఆర్ఎస్కు రాజ్యాంగం,న్యాయస్థానాలు గుర్తుకు వచ్చాయి. భవిష్యత్తులో బీఆర్ఎస్ ఖాళీ కావడం ఖాయం.ఐదారుగురు తప్ప మిగిలిన ఎమ్మెల్యేలు ఆ పార్టీలో ఉండరు. కేసీఆర్ ఫామ్ హౌస్‌కు,కేటీఆర్ గెస్ట్‌హౌస్‌కు,హరీష్‌రావు నార్సింగిహౌస్కు పరిమితం కావాల్సిందే’అని ఆది శ్రీనివాస్ ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: ఎమ్మెల్యేల అనర్హతపై ట్విస్ట్ ఇచ్చిన హైకోర్టు -
బోనస్‌ను బోగస్ చేసిన కాంగ్రెస్ సర్కార్: హరీష్ రావు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల పరిస్థితి దారుణంగా మారిందన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. రైతులకు సాయం చేయలేని ప్రభుత్వం ఉన్నా లేకున్నా ఒక్కటేనని ఘాటు విమర్శలు చేశారు. అలాగే, ఈరోజు పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.మాజీ మంత్రి హరీష్ రావు గురువారం ఉదయం ఖమ్మంలోని పత్తి మార్కెట్‌ను సందర్శించారు. ఈ క్రమంలో రైతులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం, హరీష్ మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో అతిపెద్ద మార్కెట్లో ఒకటి ఖమ్మం పత్తి మార్కెట్. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత రైతుల పరిస్థితి దారుణంగా మారింది. వరంగల్ రైతు డిక్లరేషన్‌లో ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదు. పత్తికి రూ.500 బోనస్ ఇస్తామని చెప్పి, ఆ బోనస్‌ను బోగస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. కనీసం మద్దతు ధర వచ్చే పరిస్థితి కూడా లేదు.మార్కెట్ సెక్రటరీ ఇచ్చిన లెక్కల ప్రకారం రూ.6,500 మద్దతు ధర దాటడం లేదు. అకాల వర్షాలతో పంట దెబ్బతిని రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే, కనీసం మద్దతు ధరకు కూడా పండించలేని పరిస్థితి ఉంది. రూ.500 బోనస్ దేవుడే ఎరుగు, కానీ మద్దతు ధరకు వెయ్యి రూపాయలు రైతు నష్టపోతున్నారు. రైతులకు సాయం చేయడానికి ఎందుకు ఈ ప్రభుత్వానికి ఇబ్బంది?. రైతులను ఆదుకోలేదు, వ్యవసాయ కూలీలను ఆదుకోలేదు, ఏ ఒక్క వర్గాన్నీ ఆదుకోలేదు. పత్తి రైతులు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఏర్పడింది. పత్తి మద్దతు ధర రూ.7,500 ఉండాల్సి ఉండగా, కేవలం రూ.6,500 మాత్రమే రైతులకు అందిస్తున్నారు. ఇవి మార్కెట్ యార్డ్ సెక్రటరీ ఇచ్చిన లెక్కలే. ఖమ్మం పత్తి మార్కెట్లో సీసీఐ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయండి.శంకర్ రమాదేవి అనే రైతులు ఎనిమిది ఎకరాల్లో పత్తి పండిస్తే, కనీసం ఐదు క్వింటాళ్ల పంట కూడా రాలేదని, వచ్చిన దానికి కూడా మద్దతు ధర ఇవ్వడం లేదు. రాష్ట్రంలో ఎక్కడ కూడా పత్తి రైతులకు మద్దతు ధర రావడం లేదు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 2021లో రూ.11,000కు పత్తి కొనుగోలు చేయడం జరిగింది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఎందుకు సగానికి సగం పత్తి ధర పడిపోయింది? ఇది దళారుల దోపిడీ వల్లే. రూ.7,520 మద్దతు ధరను పత్తి రైతులకు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. రైతులకు కనీసం రూ.500 బోనస్ ఇవ్వాలని కూడా డిమాండ్ చేస్తున్నాం. దళారులు రూ.6,500కు పత్తి కొనుగోలు చేసి, సీసీఐ కేంద్రాలకు రూ.7,500కు అమ్ముతున్నారు.మిర్చి రైతులను కూడా ప్రభుత్వం తీవ్రంగా మోసం చేసింది. గత సంవత్సరం రూ.23,000 మద్దతు ధర వస్తే, ఈసారి రూ.13,000 కూడా రావడం లేదు. మాయమాటలు చెప్పి రైతులను నట్టేట ముంచడం మంచిది కాదు. రుణమాఫీ చేయకుండా రైతులను మోసం చేశారు. రూ.15,000 రైతు భరోసాను ఇవ్వకుండా మోసం చేస్తున్నారు. రూ.15,000 కౌలు రైతులకు ఇస్తామని ఇవ్వలేదు. జిల్లాలో ముగ్గురు మంత్రులు ఉన్నా, ప్రజా సమస్యలు పట్టించుకునే పరిస్థితిలో లేరు.ఒకరిపై ఒకరు పైచేయి కోసం పాకులాటమే తప్ప, ప్రజా సమస్యల కోసం పనిచేయడం లేదు. నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల సన్న వడ్లు ఖమ్మం జిల్లాలో పండితే, ఇప్పటివరకు 19 వేల మెట్రిక్ టన్నులు మాత్రమే కొనుగోలు చేశారు. ఒక రైతుకైనా వడ్లకు బోనస్ వచ్చిందా?. సకాలంలో మిల్లులు అనుసంధానం చేయకపోవడం, కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం, గన్నీ బ్యాగులు ఇవ్వకపోవడం వల్ల ధాన్యం దళారుల పాలైంది. సీసీఐ కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం పెట్టామని చెబుతున్నా, వాస్తవానికి సీసీఐ కేంద్రాలు కనబడటం లేదు.ముఖ్యమంత్రి పత్తి కొనుగోలుపై సమీక్ష చేయడం లేదు. మద్యం అమ్మకాలపై సమీక్ష సమావేశాలు నిర్వహిస్తున్నారు.. కానీ పత్తి, వరి కొనుగోళ్లపై సమీక్ష ఎందుకు చేయడం లేదు. మద్దతు ధరకు ధాన్యం కొనకపోతే, ఎవరికీ మెమోలు జారీ చేయడం లేదు. తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా చేయాలని ముఖ్యమంత్రి కంకణం కట్టుకున్నారేమో?. ఈరోజు పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా అన్ని రకాల పంటలకు మద్దతు ధరతో పాటు బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ పార్టీ డిమాండ్ చేస్తోంది అంటూ కామెంట్స్ చేశారు.