breaking news
-
TS: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు వీరే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎంపిక చేశారు. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్‌ను ఎంపిక చేస్తూ గవర్నర్ ఆమోదం తెలిపారు. వారం రోజుల క్రితం ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను గవర్నర్‌కు ప్రభుత్వం పంపింది. దావోస్ పర్యటనకు ముందు పేర్లను గవర్నర్‌కు పంపగా, నిన్న గవర్నర్ తో భేటీ సందర్భంగా ఎమ్మెల్సీల అంశం చర్చకు వచ్చింది. ఇవాళ లేదా రేపు గవర్నర్ అధికారిక ప్రకటన చేయనున్నారు. కాగా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) చైర్మన్‌గా ఎం. మహేందర్‌రెడ్డిని నియామకం ఖరారైంది. మాజీ డీజీపీ అయిన మహేందర్‌రెడ్డి నియామకాన్ని ఆమోదిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం నిర్ణయం తీసుకున్నారు. అలాగే టీఎస్పీఎస్సీ సభ్యులుగా రిటైరర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, వై రాంమోహన్‌రావు నియమితులయ్యారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టింగ్ కోసం మొత్తంగా 370 వరకు దరఖాస్తులు అందాయి. ప్రభుత్వం సెర్చ్ కమిటీని నియమించి.. దరఖాస్తుల పరిశీలన, అర్హులను సూచించే బాధ్యతలను అప్పగించింది. కమిటీ వేగంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసినవారిలోంచి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి పేరును ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం ఆ పేరును గవర్నర్‌కు పరిశీలనకు పంపింది. చివరకు గవర్నర్ ఆయన నియామకానికి ఆమోదం తెలిపారు. ఇదీ చదవండి: బాలకృష్ణ అక్రమార్జన.. అధికారులే కంగుతినేలా..! -
కాంగ్రెస్ పాలన ఎక్కువకాలం నిలబడదు.. ప్రజలే తిరగబడతారు: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో ఉన్నది ఖాకీ రాజ్యమా? కాంగ్రెస్ రాజ్యమా? అని మండిపడ్డారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినన అభివృద్ధిని ఓర్వలేక అధికారం మారడంతో పార్టీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు పెడితే సహించేదే లేదని, చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలన ఎక్కువకాలం నిలబడదడని.. ఇలానే కక్షపూరితంగా వ్యవహరిస్తే ప్రజలే తిరగబడతారని అన్నారు. జగిత్యాల జైలులో ఉన్న హబ్సీపూర్ బీఆర్ఎస్ సర్పంచ్ గంగారెడ్డిని ఎమ్మెల్సీ కవిత గురువారం పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. అభివృద్ధిని పక్కనపెట్టి, సాధ్యం కానీ హామీలిచ్ఛి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కుట్రలను రాజకీయంగా, చట్టపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. యూనివార్సిటీ భూముల విషయంలో విద్యార్థిని జుట్టు పట్టుకొని లాక్కెళ్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ తెలంగాణలో లేదని పేర్కొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కార్యకర్తలకు, నాయకులకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. చదవండి: రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం -
అయ్.. పాయె! ఎన్నికలకు ముందే బాబు ఓటమి! సాక్ష్యం ఇదే..
'2024 ఎన్నికల నోటిఫికేషనింకా రాకముందే చంద్రబాబు ఓటమి ఖరారైపోయింది!! అదెలా? ఎవరన్నారు? ఎవరో అనడం కాదు. చంద్రబాబు చేతికింది రెండు న్యూస్ పేపర్లు రాసింది అదే. బాబు పనైపోయిందని! ‘‘ఏడాదిలో 30 లక్షల ఓట్లు తొలగించేశారు’’ – అని ‘ఛీనాడు’ రాసింది. ‘‘జడ్జికి వజ్రాలు పొదిగిన బంగారు వాచ్’’ – అని బాధాకృష్ణ రాశాడు. వీటికి చంద్రబాబుకు సంబంధమేంటీ? మరి చంద్రబాబు ఓటమి ఖాయం అవడం ఏమిటి? సమాధానం సింపుల్.' చంద్రబాబు ఓటమి ఖాయం అని డిసైడ్ చేసుకున్నప్పుడే ‘ఛీమోజీ’ గానీ, ‘బాధాకృష్ణ’గాని ఇలాంటి కుళ్లు, కక్కుళ్ల వార్తలు మొదలుపెడతారు. 2019 ఎన్నికలకు ముందు కూడా వీళ్లద్దరు చేసింది ఇదే. ఆనాడు ఛీమోజీ తప్పుడు వార్తలు రాస్తే, బాధాకృష్ణ చిల్లర వార్తలు రాశాడు. చంద్రబాబును లేపడానికి వీళ్లు ఎన్ని కట్టెలు పెట్టి, ఎన్ని కట్టుకథలు అల్లినా చివరికి జనం జగన్మోహన్రెడ్డికే పట్టం కట్టటం, చంద్రబాబు పార్టీకి పటం కట్టి పూలదండ వేయటం ఈ కళ్లతోనే చూశాం కదా. ఏపీ సీఎంగా జగన్మోహన్రెడ్డి 2019 మే 30న ప్రమాణ స్వీకారం చేసిన తొలి రోజు నుంచి, ఇప్పటి వరకు.. గత ఐదేళ్లుగా జగన్మోహన్రెడ్డిపై తప్పుడు రాతలు, చిల్లర కథనాలు కక్కుతున్న ఛీమోజీ, బాధాకృష్ణ.. ఇప్పుడు మరింతగా దిగజారి దగుల్బాజీ రాతలు రాయడం ప్రారంభించారంటే.. చంద్రబాబును ఎంత లేపి ప్రయోజనం లేదని వాళ్లకు లేటెస్టుగా ఉప్పో, టిప్పో అందిందని అర్థం. అయినా ‘దింపుడుకల్లం’ ఆశ ఎక్కడికిపోతుంది. ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డి ప్రతిష్టను దెబ్బతీయడం ద్వారా చంద్రబాబుకు వెంటిలేటర్ పై ఊపిరి ఎక్కించే వృధా ప్రయత్నాలు ప్రారంభించారు ఛీమోజీ, బాధాకృష్ణ. ‘బాధాకృష్ణ’వి చెల్లని చిల్లర కథనాలు. వాటిని పట్టించుకునే పని లేదు. ‘ఛీమోజీ’ కల్పనలు చిరిగిపోయిన కాగితాలు. అవీ చెలామణి అయ్యేవి కావు. కానీ ఆ చిరుగులకు సెలో టేప్ అంటించి ప్రజల్లోకి తోసేశాలని ఛీమోజీ చూస్తున్నారు కాబట్టి.. ఆయన ఇవాళ రాసిన 'ఓట్ల తొలగింపు’ ఏడుపుగొట్టు వ్యథపై మనం మాట్లాడుకోవలసిందే. చంద్రబాబు ‘బోగస్’ బతుకు ఏంటో కూడా తెలుసుకోవలసిందే. చంద్రబాబు పెద్ద బ్లఫ్ మాస్టర్. తను ఓడిపోతున్నాని తెలిస్తే, లేదా తను గెలవలేనని తెలిస్తే ఎన్నికలకు ముందు నకిలీ ఓట్లతో తన బలం పెంచేసుకుంటారు. అందులో ఆయన ఎక్స్పర్ట్. అందుకు సాక్ష్యాధారాలు రాష్ట్ర ఎన్నికల కమిషన్ పాత ఫైళ్లలో దొరుకుతాయి. ఓటమి ఖాయం అని ఇప్పుడు తేలిపోయినట్లే.. (కొత్త మలుపు తిరిగిన ఛీమోజీ, బాధాకృష్ణల దిగజారుడు కథనాలను బట్టి), 2004 ఎన్నికలకు ముందూ.. చంద్రబాబు ఓడిపోయేది ఖాయం అని సర్వేలు తేల్చేశాయి. వెంటనే చంద్రబాబు ‘ఓట్ల జోడింపు’ వ్యూహం మొదలైంది. అంటే బోగస్ ఓటర్లను చేర్చడం! ఆ చేర్పులపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. ప్రదర్శనలు జరిపాయి. ‘‘బాబు ప్రకటించిన ప్రోగ్రెస్ రిపోర్టులే కాదు, ఆయన హయాంలో స్టాంపులు, మెడికల్ కాలేజీలు, ఆఖరికి ఓట్ల జాబితాలు కూడా నకిలీవే.. ’’ అని ప్రతిపక్షనేత వై.ఎస్.రాజశేఖర రెడ్డి ఎద్దేవా చేశారు. ‘‘అధికారాన్ని అంటిపెట్టుకుని ఉన్న తెలుగుదేశం పార్టీ, గద్దె మీద కొనసాగడానికి ఎంతకైనా దిగజారేందుకు సిద్ధంగా ఉంది..’’ అని నాటి టీఆర్ఎస్ నేత కేసీఆర్.. బోగస్ ఓట్లపై చంద్రబాబును తూర్పారా పట్టారు. ‘‘ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని గాడి తప్పించింది. ఎన్నికలు జరపడానికి ముందే ఈ అక్రమాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది..’’ అని బోగస్ ఓట్ల పై నాటి రాష్ట్ర సీపీఐ ప్రధాన కార్యదర్శి సుధాకర్ రెడ్డి హెచ్చరించారు. చంద్రబాబుపై వాళ్ల విమర్శలను కానీ, ఎద్దేవాలను కానీ, హెచ్చరికలను ఛీనాడు లోపలి పేజీలలో నామ మాత్రంగా తప్ప ప్రముఖంగా ఎక్కడా ప్రచురించలేదు. ఎందుకంటే ‘తమవాడు’ మళ్లీ సీఎం అవడం కావాలి ఛీమోజీరావుకు. ప్రతిపక్షాలన్నీ కలసికట్టుగా ఆరోపణ చేస్తుంటే కేంద్ర ఎన్నికల సంఘానికి చంద్రబాబు మీద డౌట్ వచ్చి, రాష్టంలో ఓటర్ల జాబితా సవరణ కార్యక్రమం జరపటంతో చంద్రబాబు దొంగ ఓట్ల వ్యవహారం బయటపడింది! ఓటు నమోదు కోసం ఎన్నికల కమిషన్‌కు అందిన 53,95,550 ల దరఖాస్తులలో 19,40,387 దరఖాస్తులు నకిలీవని తెలిసి, తెల్లబోయి, కమిషన్ వాటిని తొలగించింది. అంతేకాదు, పాత జాబితాలోని 1.21 కోట్ల ఓటర్ల నుంచి 55,32,713 మంది ఓటర్ల పేర్లను తొలగించింది. పాత, కొత్త బోగస్ ఓటర్ల సంఖ్య 74.13 లక్షలకు చేరుకున్నట్లు ఎన్నికల సంఘం గుర్తించి తొలగించింది! అప్పుడు తొలగించినట్లే కమిషన్ ఇప్పుడూ తొలగించింది. అందుకే ఛీనాడు పెడబొబ్బలు. బాధాకృష్ణ ‘వజ్రాల వాచీ’ అంటూ బూడిద రాతలు. 2003లో చంద్రబాబు చేసిన బోగస్ ఓట్ల స్కామ్ చిన్న సంగతి కాదు. అందుకే ఎన్నికల కమిషన్ కూడా ఆ లెవల్లో బోగస్ ఓట్ల తొలగింపు ప్రక్షాళనను చేపట్టాల్సి వచ్చింది. కమిషన్‌కు ఎంతో శ్రమ, ఖర్చు అయ్యాక 2004 జనవరి మూడో వారానికి జిల్లా కలెక్టర్లు పూర్తిగా బోగస్ ఓట్లను తొలగించగలిగారు. బోగస్ ఓటర్లకు కారణమైన ఐదుగురు మండల రెవెన్యూ అధికారుల మీద చర్యలకు కమిషన్ సిఫారసు చేసింది. ఓటర్ల జాబితాలో అవకతవకలేమీ లేవని ఆపద్ధర్మ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదట బుకాయించినప్పటికీ కమిషన్ దర్యాప్తులో బోగస్ ఓట్ల సంఖ్య 75 లక్షలకు పైగా ఉన్నట్లు తేలడంతో ఆయనేమీ మాట్లాడలేకపోయారు. ఆయనే కాదు.. ‘ఛీమోజీ’ కూడా కుక్కిన పేనులా ఉండిపోయారు. ఇప్పుడేమో.. 30 లక్షల ఓట్లు తొలగించారని గుండెలు బాదుకుంటూ తీరూతెన్నూ లేని ఆంబోతు కథనాలు అచ్చోసి వదులుతున్నారు. ఇంతకీ ఛీమోజీ ఏమిటంటాడూ.. తటస్థులు, ప్రతిపక్ష పార్టీ మద్దతుదారులు, సానుభూతిపరుల ఓట్లను తొలగించేందుకు తప్పుడు వివరాలతో వై.ఎస్.ఆర్.సీపీ ఫామ్–7 దరఖాస్తు చేసిందట! కమిషన్ అంత గుడ్డిగా తొలగిస్తుందా? ఏపీ సీఎం జగన్మోహన్రెడ్డితో పాటుగా, కేంద్ర ఎన్నికల సంఘాన్ని కూడా ఆడిపోసుకోడానికి ఛీమోజీ అండ్ చంద్రబాబు తయారైనట్లే ఉంది. వారికి వంతగా బాధాకృష్ణ!! (అన్నట్లూ.. ‘అపద్ధర్మ ముఖ్యమంత్రి’ అనే మాట బాబుగారికి నచ్చదు. ఆ మాటను తీసేయించడానికి రాజ్యాంగాన్నే మార్పించే ఆలోచన కూడా 2003లో చేశారు!! ఇవి చదవండి: అజ్ఞాతవాసిగా నారా లోకేష్? -
కేటీఆర్.. బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పని చేయ్: సీతక్క వార్నింగ్
రాజన్న సిరిసిల్ల, సాక్షి: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌పై తెలంగాణ మంత్రి సీతక్క ధ్వజమెత్తారు. కేటీఆర్‌కు మైండ్ బ్లాకైందని విమర్శలు గుప్పించారు. తమ అహంకారమే బీఆర్ఎస్ ఓటమికి కారణమైందని దుయ్యబట్టారు. అధికారం లేకుండా కేటీఆర్ ఉండలేకపోతున్నారని, అందుకే విధ్వంస రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. సిరిసిల్లలోని వేములవాడ రాజరాజేశ్వర ఆలయాన్ని గురువారం మంత్రి సీతక్క దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం తొమ్మిదేళ్లు గడీల పాలన చేసిందని విమర్శించారు. ఇప్పుడు కూడా కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచినా ఇంకా ప్రమాణ స్వీకారం చేయడం లేదని అన్నారు. కాంగ్రెస్‌పై విమర్శలు చేసేందుకు కేటీఆర్‌కు బుద్దుందా అని ప్రశ్నించిన సీతక్క ఆయన కుళ్లు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. ‘ప్రజలు మావైపే ఉన్నారు. మహిళలకు ఉచిత బస్సు ఏర్పాటు చేస్తే జీర్ణించు కోలేకపోతున్నారు. సోషల్ మీడియా వేదికగా తప్పుడు ప్రచారం చేస్తే ప్రజలు గమనిస్తారు. సర్పంచుల వేల బిల్లులు పెండింగ్ పెట్టింది ఎవరు..? గత ప్రభుత్వం కాదా..? మేము సక్రమంగా పని చేస్తేనే మళ్ళీ అధికారం ఇస్తారు. చేయకపోతే అవకాశం ఇవ్వరు. కేటీఆర్ బుద్ధిగా ప్రతిపక్ష హోదాలో పని చేయ్. ప్రజలు గుర్తిస్తారు. లేదంటే మిమ్మల్ని ఎప్పటికీ ప్రజలు తిరస్కరిస్తూనే ఉంటారు. రాజన్న మా ఇలా వేల్పు. కుటుంబ సమేతంగా వచ్చి దర్శనం చేసుకున్నాం. ఆదివాసీ కుటుంబాలకు సమ్మక్క కంటే ముందు రాజన్నను దర్శించుకోవడం ఆనవాయితీ. బీఆర్ఎస్ ప్రభుత్వంలో రాజన్న ఆలయం అభివృద్ధిలో వివక్షకు గురైంది. మా ప్రభుత్వంలో తప్పకుండా అభివృద్ధి చేస్తాం.’ అని సీతక్క పేర్కొన్నారు. చదవండి: పాతిక కేసులు పెట్టుకోండి: రాహుల్ -
బట్టలూడదీసి ఉరికిస్తాం.. కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ హెచ్చరిక
సాక్షిప్రతినిధి, కరీంనగర్: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు అడ్డగోలు హామీలు ఇచ్చిందని, ఆరు గ్యారంటీలతో పాటు వివిధ డిక్లరేషన్ల పేరిట 420 హామీలు ఉన్నాయని, వాటిని అమలు చేయకుంటే కాంగ్రెస్ నేతలను బట్టలూడదీసి ఉరికించే రోజులు వస్తాయని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ హెచ్చరించారు. బుధవారం కరీంనగర్‌లోని ఓ ఫంక్షన్ హాల్లో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ సోషల్ మీడియా వారియర్స్ సమావేశంలో ఆయన మాట్లాడారు. రెండుసార్లు అధికారమిచ్చిన ప్రజల ఆకాంక్షలకు అను గుణంగా పాలన సాగించామని, మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సానుభూతితో, అబద్ధపు వాగ్దానాలతో అధికారంలోకి వచ్చిందన్నారు. ఓటమితో నైరాశ్యం వద్దని, కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఓట్ల శాతం తేడా 1.85 శాతమేనని చెప్పారు. ప్రతిపక్ష నేత తరహాలో సీఎం పాలన గుంపుమేస్త్రీ రేవంత్‌రెడ్డి సీఎంగా కాకుండా ప్రతిపక్ష నేతగా వ్యవహరిస్తూ పాలన సాగిస్తున్నారని, రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి మరో ఏక్నాథ్ షిండేగా మారడం ఖాయమని కేటీఆర్ జోస్యం చెప్పారు. రైతుబంధు పడలేదని రైతులు అంటుంటే చెప్పుతో కొడుతామంటూ మంత్రి వెంకట్‌రెడ్డి మాట్లాడటం సిగ్గుచేటని మండిపడ్డారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలను రైతుబంధు పడని రైతులు చెప్పుతో కొడుతారో..? ఓటుతో కొడుతారో ఆలోచించుకోవాలన్నారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయ్యేలా క్యాడర్ పనిచేయాలి బీజేపీ, కాంగ్రెస్ పార్టీల చిల్లర రాజకీయాలను సోషల్ మీడియా ద్వారా ఎండగట్టి, గుంపుమేస్త్రీ రేవంత్‌రెడ్డికి తగిన బుద్ధి చెప్పి రానున్న రోజుల్లో కేసీఆర్‌ను తిరిగి సీఎం చేసేలా కార్యకర్తలు పనిచేయాలని కేటీఆర్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీజేపీ ఒక్కటేనని, బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అయితే మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో కరీంనగర్, గజ్వేల్, దుబ్బాక, హుజూరాబాద్‌లో బీఆర్ఎస్ ఎవరిమీద గెలిచిందో తెలుసుకోవాలని హితవు పలికారు. ఎవరు ఎవరితో ఉన్నారు..? ఎవరు ఎవరికి బీటీమ్..? ఎవరు ఎవరితో అంటకాగుతున్నారో అర్థమయ్యేలా ప్రజాక్షేత్రంలో వివరించాలని ఆయన బీఆర్ఎస్ శ్రేణులకు సూచించారు. ప్రతి మండలంలో వార్‌రూం పెట్టుకుని సోషల్ మీడియా ద్వారా ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలని పిలుపునిచ్చారు. వినోద్‌తో చర్చకు బండి రావాలి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఐదేళ్లలో చేసిన అభివృద్ధి ఏమీ లేదని, చేతనైతే మాజీ ఎంపీ వినోద్‌కుమార్‌తో చర్చకు రావాలని కేటీఆర్ సవాల్ చేశారు. తేదీ, సమయం, వేదిక ఎక్కడో చెబితే తామే బహిరంగ వేదిక ఏర్పాటు చేస్తామని కేటీఆర్ స్పష్టం చేశారు. సంజయ్ తెచ్చిన నిధులూ లేవు, గుడి కట్టిందీ లేదు.. బడి కట్టిందీ లేదని ఎద్దేవా చేశారు. సమావేశంలో మాజీమంత్రి, కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్, హుజూరాబాద్, జగిత్యాల ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, డాక్టర్ సంజయ్, మాజీ ఎమ్మెల్యేలు రసమయి బాలకిషన్, సుంకె రవిశంకర్, వొడితెల సతీశ్‌బాబు, కోరుకంటి చందర్, పార్టీ ఇన్చార్జీలు చల్మెడ లక్ష్మీనర్సింహారావు, కరీంనగర్ మాజీ ఎంపీ వినోద్‌కుమార్, నగర మేయర్ వై.సునీల్‌రావు, మాజీ మేయర్ రవీందర్‌సింగ్, నాయకులు గెల్లు శ్రీనివాస్‌యాదవ్, జీవీ.రామకృష్ణారావు, సోషల్ మీడియా వారియర్స్ పాల్గొన్నారు. -
గవర్నర్‌తో సీఎం, డిప్యూటీ సీఎం భేటీ
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌తో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టివిక్రమార్క బుధవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో భేటీ అయ్యారు. 75వ గణతంత్ర వేడుకలకు హాజరుకావాలని గవర్నర్‌ను వారు సాదరంగా ఆహ్వానించారు. అలాగే ముఖ్యమంత్రి ప్రపంచ ఆర్థిక వేదికలో పాల్గొని అక్కడ భారీఎత్తున పెట్టుబడులను ఆకర్షించిన విషయాలను గవర్నర్‌కు ఈ సందర్భంగా వివరించినట్లు సమాచారం. అలాగే లండన్ పర్యటన, అక్కడి ప్రతినిధులతో జరిపిన చర్చల సారాంశాన్ని కూడా రేవంత్‌రెడ్డి ఈ సందర్భంగా గవర్నర్ దృష్టికి తీసుకుని వచ్చినట్లు తెలిసింది. ఈ సమావేశంలోనే టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకం అంశాన్ని కూడా ముఖ్యమంత్రి గవర్నర్‌తో ప్రస్తావించినట్లు చెబుతున్నారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ నియామకం త్వరగా జరిగితే ఉద్యోగ నోటిఫికేషన్లతోపాటు, ఇదివరకే నిర్వహించిన పరీక్షల ఫలితాల వెల్లడికి వీలవుతుందని తెలిపినట్లు తెలిసింది. -
‘రీజనల్’కు రాష్ట్ర నిధులు త్వరగా ఇవ్వండి
సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: రీజనల్ రింగ్ రోడ్డు భూసేకరణ విషయంలో తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని.. భూసేకరణకు సంబంధించి రాష్ట్ర వాటా నిధులు వెంటనే విడుదల చేయాలని కేంద్ర పర్యాటక శాఖ మంత్రి జి.కిషన్‌రెడ్డి కోరారు. వెంటనే భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్హెచ్ఏఐ)కు రూ.2,585 కోట్లను జమ చేయాలని.. హైవే నిర్మాణం వేగంగా సాగేందుకు సహకరించాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్‌రెడ్డికి విజ్ఞప్తి చేశారు. దీనితోపాటు తెలంగాణలో మరో 11 జాతీయ రహదారి ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి 4,048 హెక్టార్ల భూమిని వెంటనే సేకరించి ఇవ్వాలన్నారు. ఈ మేరకు సీఎం రేవంత్‌రెడ్డికి కిషన్‌రెడ్డి బుధవారం రెండు లేఖలు రాశారు. ప్రాజెక్టు ఆలస్యమైతే సమస్యలు కేంద్రం భారత్‌మాల పరియోజనలో భాగంగా రూ.26 వేల కోట్లకుపైగా అంచనా వ్యయంతో హైదరాబాద్ నగరం చుట్టూ 350 కిలోమీటర్లకుపైగా రీజనల్ రింగ్ రోడ్డు (ఆర్ఆర్ఆర్)ను నిర్మి స్తోందని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. నిర్మాణ వ్యయా న్ని పూర్తిగా కేంద్రమే భరిస్తుండగా, భూసేకరణకు అయ్యే వ్యయాన్ని కేంద్రం, రాష్ట్రం చెరో సగం భరించేలా ఒప్పందం జరిగిందని గుర్తుచేశారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగం భూసేకరణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.2,585 కోట్లను వెంటనే ఎన్హెచ్ఏఐకి జమ చేసి నిర్మాణ పనుల ప్రారంభానికి సహకరించాలని పేర్కొన్నారు. దీనికి సంబంధించి గతేడాది ఫిబ్రవరి 3న తాను స్వయంగా రాష్ట్ర సర్కారుకు లేఖ రాశానని, ఎన్హెచ్ఏఐ ప్రాంతీయ, కేంద్ర కార్యాలయాల అధికారులు కూడా పలుమార్లు లేఖలు రాశారని.. అయినా ఆశించిన స్పందన రాలేదని వివరించారు. రాష్ట్రవాటా నిధుల జమలో ఆలస్యం కారణంగా ప్రాజెక్టు జాప్యమై ట్రాఫిక్ సమస్యలు పెరుగుతాయన్నారు. భూసేకరణ త్వరగా చేయండి 66 ఏళ్లలో తెలంగాణలో 2,500 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారుల నిర్మాణం జరిగితే.. తెలంగాణ ఏర్పాటయ్యాక గత తొమ్మిదిన్నర ఏళ్ల కాలంలోనే ఎన్డీయే సర్కారు మరో 2,500 కి.మీ జాతీయ రహదారులను నిర్మించిందని కిషన్‌రెడ్డి తెలిపారు. తెలంగాణ అభివృద్ధి పట్ల ప్రధాని మోదీ ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ఇది తెలియజేస్తోందన్నారు. రాష్ట్రంలో రూ.32,383 కోట్ల అంచనా వ్యయంతో 751 కిలోమీటర్ల పొడవున 11 జాతీ య రహదారుల ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయని కిషన్‌రెడ్డి తెలిపారు. -
బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి ఆస్తులు 100 కోట్ల పైనే
నిజామాబాద్‌నాగారం: గతేడాది నవంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్నికై న ఎమ్మెల్యేల ఆస్తుల వివరాలను ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ వెల్లడించింది. ఎన్నికల అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తుల వివరాలను సేకరించి బుధవారం విడుదల చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో నలుగురు ఎమ్మెల్యేల ఆస్తులు, కేసులు, విద్యార్హతలు ప్రకటించారు. ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రకటించిన ప్రకారం జిల్లాలో అత్యధికంగా ఆస్తి బోధన్ ఎమ్మెల్యే పొద్దుటూరి సుదర్శన్‌రెడ్డికి ఉంది. ఆయన తన ఎన్నికల అఫిడవిట్లో రూ. 109.97కోట్ల ఆస్తి ఉన్నట్లు తెలిపారు. బీఏ చదువును మధ్యలోనే నిలిపివేసినట్లు పేర్కొన్నారు. ఇక మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్‌రెడ్డి ఆస్తి గత ఐదేళ్లలో 238 శాతం పెరిగింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల అఫిడవిట్లో రూ. 34.76 కోట్ల ఆస్తులున్నట్లు పేర్కొన్నారు. 2018లో రూ. 10.27 కోట్లుగా చూపించారు. బీఈ చదివినట్లు.. తనపై ఒక్క కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. నిజామాబాద్‌రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి తన అఫిడవిట్లో రూ. 59.94కోట్లు ఆస్తి ఉన్నట్లు తెలిపారు. ఎంఎస్ ఆర్థో చదివానని.. తనపై రెండు కేసులు నమోదై ఉన్నట్లు తెలిపారు. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్‌రెడ్డి తనకు రూ. 18.5 కోట్ల ఆస్తి ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో వెల్లడించారు. ఏడో తరగతి చదివినట్లు.. ఆయనపై ఒక కేసులు ఉన్నట్లు తెలిపారు. నిజామాబాద్‌అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణగుప్తా తన అఫిడవిట్లో రూ. 27.25కోట్ల ఆస్తులు ఉన్నట్లు తెలిపారు. బీకాం వరకు అభ్యసించినట్లు పేర్కొన్నారు. కామారెడ్డి జిల్లాలో.. సాక్షి, కామారెడ్డి: కామారెడ్డి జిల్లాకు సంబంధించి బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి ఆస్తి 2018 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం రూ. 4.94 కోట్లు కాగా.. 2023 కు వచ్చేసరికి పది శాతం తగ్గింది. తాజా ఎన్నికల అఫిడవిట్లో ఆయన తన ఆస్తుల విలువను రూ. 4.40 కోట్లుగా చూపించారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న నలుగురు ఎమ్మెల్యేలలో తక్కువ ఆస్తి ఉన్న ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి కావడం గమనార్హం. ఆయనపై ఒక్క కేసూ లేదని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రకటించింది. ► జిల్లాలో అత్యధిక ఆస్తులు ఎల్లారెడ్డి ఎమ్మెల్యే కే.మదన్‌మోహన్‌రావుకు ఉన్నాయి. ఎన్ఆర్ఐ అయిన మదన్మోహన్రావు ఎంఎస్ చదివి, పలు దేశాల్లో సాఫ్ట్వేర్ కంపెనీలను స్థాపించారు. ఆయన ఎన్నికల అఫిడవిట్లో తన మొత్తం ఆస్తి విలువను రూ.72.65 కోట్లుగా చూపించారు. ఆయనపై రెండు కేసులున్నాయి. ► కామారెడ్డిలో అటు కేసీఆర్‌ను, ఇటు రేవంత్‌రెడ్డిని ఓడించి వార్తల్లో వ్యక్తిగా నిలిచిన జెయింట్ కిల్లర్ కాటిపల్లి వెంకటరమణారెడ్డికి రూ.49.71 కోట్ల విలువైన ఆస్తులున్నాయి. ఆయనపై పదకొండు కేసులు ఉన్నట్లు ఎన్నికల అఫిడవిట్లో చూపించారు. ఇంటర్ వరకు చదువుకున్నారు. ► ఎస్సీ రిజర్వుడ్ స్థానమైన జుక్కల్‌లో విజయం సాధించిన తోట లక్ష్మీకాంతారావు ఆస్తుల విలువ రూ. 8.11 కోట్లు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. ఆయనపై రెండు కేసులున్నాయి. -
కేటీఆర్ వ్యాఖ్యలకు బండి సంజయ్ కౌంటర్
సాక్షి, కరీంనగర్: కేసీఆరే సీఎం అనుకుంటూ కేటీఆర్ అహంకారంగా మాట్లాడుతున్నాడని బీజేపీ ఎంపీ బండి సంజయ్ ధ్వజమెత్తారు. పదేళ్లు అబద్ధాలతో మోసం చేస్తూ కాలం గడిపారని దుయ్యబట్టారు. పార్లమెంటు ఎన్నికల్లో కరీంనగర్లో బీఆర్ఎస్కు మూడోస్థానం. కేసీఆర్ ఎన్నిసార్లు పార్లమెంట్‌కు ఎన్నికయ్యారో కేటీఆర్ చెప్పాలి. యాదిగిరిగుట్టను వ్యాపార కేంద్రంగా మార్చిన ఘనత కేసీఆర్‌ది. కేసీఆర్ కొడుకుతోనే పార్టీ భ్రష్టుపట్టింది’’ అంటూ బండి సంజయ్ నిప్పులు చెరిగారు. పక్క జిల్లా నుంచి ఓ మేధావి ఇక్కడికొచ్చి మొరుగుతుంటడంటూ మాజీ ఎంపీ వినోద్‌పై మండిపడ్డారు. వినోద్ టిప్పర్ లోడు దరఖాస్తులు పంపడం తప్ప.. కరీంనగర్లో ఒక తట్టెడు మట్టి కూడా పోయలే అంటూ ఆయన ఎద్దేవా చేశారు. సిద్ధిపేట ఎల్కతుర్తి రోడ్డు పనులు ఎవరు చేయించారు? మేధావి వినోదా.. నేనా..?. శాతవాహన యూనివర్సిటీకి 12 బీ గుర్తింపు తెచ్చింది నేను కాదా..?’’ అని బండి సంజయ్ పేర్కొన్నారు. -
రేవంత్‌రెడ్డిపై కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు
సాక్షి, కరీంనగర్: కరీంనగర్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏక్నాథ్ షిండే రేవంత్‌రెడ్డినే అవ్వొచ్చని అన్నారు. తెలంగాణ ప్రజలు మైనార్టీలు జాగ్రత్తగా ఉండాలన్నారు. బీజేపీ-కాంగ్రెస్ ఒప్పందంలోనే ఎమ్మెల్సీ ఎన్నికలకు వేర్వేరు నోటిఫికేషన్లు ఇచ్చాయని తెలిపారు. కాంగ్రెస్ వైపు చూసే మైనార్టీలు ఒక్కసారి ఆలోచించాలన్నారు. బీజేపీని ఓడించేది బీఆర్ఎస్ మాత్రమేనని తెలిపారు. ఆయన బుధవారం కరీంనగర్ పార్లమెంటరీ సోషల్ మీడియా వారియర్స్ మీటింగ్‌లో పాల్గొని మాట్లాడారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాతో పాటు, చాలా చోట్ల బీఆర్ఎస్పై గెల్చిన ఎమ్మెల్యేలంతా కేవలం నాలుగైదుసార్లు ఓడిపోయిన సానుభూతితో మాత్రమే గెల్చారని అన్నారు. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు తగిలింది చాలా చిన్న దెబ్బ మాత్రమేనని, అయినా ప్రజులు 39 మంది ఎమ్మెల్యేలను గెలిపించారని గుర్తుచేశారు. చాలా స్వల్ప మెజార్టీతో 14 స్థానాలను కోల్పోయామని అన్నారు. కార్యకర్తలు ఢీలా పడిపోవాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు. గతంలో కరీంనగర్ పార్లమెంట్లో కేసీఆర్‌ను భారీ మెజార్టీతో గెలిపించి ఢిల్లీకి పంపిన చరిత్ర ఇక్కడి ఓటర్లదని తెలిపారు. తెలంగాణా ఉద్యమానికి ఊపిరులూదిన గడ్డ కరీంనగర్ అని చెప్పారు. 2009లో అల్గనూరులో అగ్గిపుట్టించి తెలంగాణ రావడానికి కారణమైందని చెప్పారు. రేవంత్‌రెడ్డి పెద్ద పెద్ద మాటలు చెప్పారని, కానీ, ఇవాళేంటి పరిస్థితి? అని ప్రశ్నించారు. కరెంట్ బిల్లులు కట్టొద్దని సోనియా కడుతుందని రేవంతే అన్నారు, బిల్లులు కట్టొద్దని మంత్రి వెంకట్ రెడ్డి అన్నరని గుర్తుచేశారు. దాన్నే తాను చెప్పుకొచ్చానని అన్నారు. వంద అబద్ధాలు చెప్పైనా ఒక్క పెళ్లి చేయాలంటారు.. అలా అబద్ధాలను నమ్ముకునే రేవంత్ సీఎం, కేంద్రంలో మోడీ ప్రధాని అయ్యారని ఎద్దేవా చేశారు. వాళ్లవన్నీ 420 హామీలని మండిపడ్డారు. ముఖ్యమంత్రి పదవి చేసేందుకు అనుభవముందా అని అడిగితే రేవంతేమన్నాడు? అదేం ఉంది అన్నారు. ఇప్పుడు తెలుస్తోంది అనుభవం ఎంత అవసరమో? అని కేటీఆర్ మండిపడ్డారు. రైతుబంధు పేరు మార్చి రైతుభరోసా అని రేవంత్‌రెడ్డి దావోస్‌లో చెప్పారని విర్శించారు. మరి రైతుబంధు వచ్చిందా? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. రైతుబంధు పడలేదంటే మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పుతో కొడతానన్నాడు. మరి రైతుబంధు రాని రైతులు ఇప్పుడు ఆలోచించాలి. వారిని చెప్పుతోని కొట్టాలా? లేదా ఓటుతోని కొట్టాలా అనేది ఆలోచన చేయాలన్నారు. చదవండి: ధరణి: కలెక్టర్ల మొర.. మమ్మల్ని బాధ్యులను చేయడం సరికాదు! -
‘BRS ఎమ్మెల్యేలది బలవంతపు ప్రెస్‌మీట్’
హైదరాబాద్, సాక్షి: సీఎం రేవంత్ రెడ్డిని కలవడంపై బీఆర్ఎస్ మెదక్ ఎమ్మెల్యేలు మీడియా ద్వారా వివరణ ఇచ్చిన వేళ.. బీజేపీ నేత రఘునందన్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. మెదక్ ఎంపీ సీటు కోసం కేసీఆర్ కుటుంబంలో గొడవలు జరుగుతున్నాయని.. ఇవాళ బలవంతంగా మీడియా ముందుకు వచ్చిన ఎమ్మెల్యేంతా బీఆర్ఎస్ను వీడడం ఖాయమని అన్నారాయన. తాజా పరిణామలపై దుబ్బాక మాజీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు బుధవారం మీడియాతో మాట్లాడారు. ‘‘మెదక్ ఎంపీ సీటు కోసం కేసీఆర్ కుటుంబంలో చిచ్చు రగిలింది. మెదక్ ఎంపీ సీటు కోసం కవిత పట్టుబట్టుతోంది. అందుకే హరీష్ రావు బ్లాక్‌మెయిలింగ్‌కు దిగారు. హరీష్‌రావుకు తెలియకుండానే ఆ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు సీఎం రేవంత్‌ను కలిశారా?. ఆయన అనుమతితోనే వాళ్లు కలిశారు. ఇవాళ బలవంతంగా వాళ్లతో ప్రెస్‌మీట్ పెట్టించారు. కానీ, మెదక్ జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లోకి జంప్ కావడం ఖాయం’’ అని అన్నారాయన. బీఆర్ఎస్ పార్టీలో ఆధిపత్య పోరు జరుగుతోందని.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఆ పార్టీ జీరో కాబోతోందని రఘునందన్ అన్నారు. ప్రోటోకాల్ కోసం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అంటున్నారు. మరి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ప్రోటోకాల్ పాటించారా? అని నిలదీశారాయన. హిస్టరీ రిపీట్ అవుతది ఇప్పుడున్న కాంగ్రెస్ ఎమ్మెల్యేలు 26 మంది అయిన తర్వాత కాంగ్రెస్ కండువా కప్పుకుంటారు. గతంలో గులాబీ పార్టీ కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేలను ఎలా లాక్కుందో.. ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ అలాగే గుంజుకుంటుంది అని రఘనందన్ జోస్యం పలికారు. -
‘సీఎం రేవంత్‌ను వంద సార్లైనా కలుస్తాం’
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని ఇటీవల మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కలిశారు. ఈ క్రమంలో వారు కాంగ్రెస్‌లో చేరుతున్నారనే ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు స్పందించారు. ఇవన్నీ తప్పుడు ప్రచారం అంటూ వారు ఖండించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి మీడియాతో మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి రేవంత్‌ను మర్యాదపూర్వకంగానే కలిశాం. ప్రజా సమస్యలపై చర్చించేందుకే రేవంత్‌ను కలిశాం. సెక్యూరిటీ, ప్రొటోకాల్ సమస్యలపై కలిసి మాట్లాడాం. మేము శ్రమశిక్షణతో పనిచేసే నాయకులం. మా పరువుకు భంగం కలిగేలా ప్రవర్తిస్తే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. మాకు పార్టీ మారే ప్రసక్తే లేదు. అలాంటి ఆలోచన కూడా మాకు లేదు. మాపై అసత్య కథనాలు ప్రచారం చేస్తున్నారు. మేము కేసీఆర్ వెంటే ఉంటాం. కేసీఆర్ నాయకత్వంలోనే పనిచేస్తాం. మా నాయకుడు ఎప్పుడూ కేసీఆరే. రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో బీఆర్ఎస్ గెలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురవేస్తాం. ఆమ నియోజకవర్గాల్లో సమస్యలు, అభివృద్ధి అంశాల్లో సహకరించాలని సీఎం రేవంత్‌ను కోరాం. కొందరు వ్యక్తులు ఈ విషయాన్ని రాజకీయం చేశారు. రేవంత్ రెడ్డి కేవలం కాంగ్రెస్ పార్టీ కాదు.. తెలంగాణ ప్రజలందరికీ ముఖ్యమంత్రి. ప్రతిపక్షంలో ఉంటే సీఎంను, మంత్రులను కలవకూడదా?. సీఎం రేవంత్.. ప్రధాని, కేంద్ర మంత్రులను కలవడం లేదా?. ఈ అంశంపై మేము వివరణ ఇవ్వడం లేదు.. మా కార్యకర్తలకు క్లారిటీ ఇస్తున్నాం. నేను నాలుగు సార్లు ఎమ్మెల్యే, మంత్రిగా చేసినా ఇబ్బందులు పడుతున్నాం. కళ్యాణలక్ష్మి చెక్కులను ఎమ్మెల్యేలు కాకుండా కాంగ్రెస్ నాయకులు పంచుతున్నారు. ప్రజల ఓట్లతో మేము ఎమ్మెల్యేలుగా గెలిచాం. నిన్నటి నుంచి వస్తున్న వార్తలను చూస్తే బాధ వేస్తోంది’ అంటూ కామెంట్స్ చేశారు. దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ మాట్లాడుతూ..‘ముఖ్యమంత్రి పదవి కాంగ్రెస్ పార్టీకా? రాష్ట్రానికా?. మాకు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం ఏముంది?. సీఎంను మాత్రమే కాదు, ప్రజా సమస్యల కోసం మంత్రులను సైతం కలిశాము. కలుస్తూనే ఉంటాం. సమస్యల పరిష్కారం కోసం ఇంకా వందసార్లు అయినా ముఖ్యమంత్రిని కలుస్తాం. ఉత్తమ్ కుమార్ రెడ్డిని కలిసి 15 రోజులు అవుతున్నా మాకు నీళ్ళు ఇవ్వలేదు. నేడు కొండా సురేఖ మాజిల్లా పర్యటనకు వస్తున్నారు.. ఎమ్మెల్యేలు లేకుండా ఓడిపోయిన అభ్యర్థికి ప్రోటోకాల్ ఇస్తున్నారు. ఆరు గ్యారెంటీ పథకాలు కాదు.. 13 గ్యారెంటీ పథకాలు హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీలు అమలు చేస్తే మేమే సన్మానం చేస్తాం. దుబ్బాకలో మొన్నటి వరకు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఉంటే ఆయనకు ప్రోటోకాల్ మేము ఇచ్చాము. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిచేది గులాబీ జెండానే. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ధర్నాలు చేస్తాం. మేమున్నంత వరకు కేసీఆర్, గులాబీ జెండాను వదులం’ అని కామెంట్స్ చేశారు. -
టచ్‌లో ఉన్నారా?
ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ కావడంపై సర్వత్రా హాట్‌హాట్‌గా చర్చ జరుగుతోంది. వీరంతా ‘హస్తం’వైపు చూస్తున్నట్లు వార్తలు గుప్పుమన్నాయి. ఇటీవలే దావోస్ పర్యటన ముగించుకుని నగరానికి చేరుకున్న సీఎంతో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు భేటీ కావడం.. అదికూడా రేవంత్ ఇంట్లో కలవడంపై తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. ఎమ్మెల్యేలు మాత్రం అభివృద్ధి పనుల కోసం కలిశామంటున్నా తెరపైకి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తాజాగా చేసిన వ్యాఖ్యలు సైతం ఇందుకు దోహదం చేస్తున్నాయి. సాక్షిప్రతినిధి, సంగారెడ్డి: సీఎం రేవంత్ రెడ్డిని నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మర్యాదపూర్వకంగా కలిశారు. నర్సాపూర్, దుబ్బాక, పటాన్చెరు, జహీరాబాద్ ఎమ్మెల్యేలు సునీతారెడ్డి, కొత్త ప్రభాకర్ రెడ్డి, గూడెం మహిపాల్ రెడ్డి, మాణిక్ రావు మంగళవారం సీఎం నివాసానికి వెళ్లి కలిశారు. వీరు సీఎంను కలవడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. వీరు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారా? అనే అనుమానాలు మొదలయ్యాయి. సునీతా లక్ష్మారెడ్డి గతంలో కాంగ్రెస్ నుంచే బీఆర్ఎస్లో చేరారు. కొత్త ప్రభాకర్‌రెడ్డి మొదటి నుంచి గులాబీ బాస్ కేసీఆర్‌కు సన్నిహితుడు. మిగతా ఇద్దరు నేతలు కూడా కేసీఆర్ వెన్నంటి నడుస్తున్న వారే. రేవంత్‌రెడ్డితో పాటు, ఇంటెలిజెన్స్ చీఫ్ బి.శివధర్‌రెడ్డిని కూడా వీరు కలిసినట్లు సమాచారం. రాష్ట్రంలో ఒకవైపు బీఆర్ఎస్, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రుల మధ్య మాటల యుద్ధం నడుస్తున్న నేపథ్యంలో ఈ నలుగురు సీఎం రేవంత్‌రెడ్డిని కలవడం చర్చకు దారితీస్తోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలు విషయంలో బీఆర్ఎస్ అగ్రనేతలు కేటీఆర్, హరీశ్‌రావులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఇటు కాంగ్రెస్‌కు చెందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి తదితర మంత్రులు అదే స్థాయిలో తిప్పికొడుతున్నారు. ఆరు నెలల్లో ప్రభుత్వం పడిపోతుందంటూ బీఆర్ఎస్ విమర్శలపై స్పందించిన కోమటిరెడ్డి.. తమతో సుమారు 30 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారంటూ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో వీరు భేటీ కావడం హాట్‌టాపిక్‌గా మారింది. మోదీని రేవంత్‌రెడ్డి కలిసినట్లుగానే..: ఎమ్మెల్యేలు ‘సీఎం రేవంత్‌రెడ్డిని మర్యాదపూర్వకంగానే కలిశా.. ఇందులో ప్రత్యేకమేమీ లేదు.. పటాన్చెరు నియోజకవర్గంలో నిలిచిపోయిన అభివృద్ధి పనులను కొనసాగించాలని కోరాం. ఇందుకు ప్రతిపాదనలు సీఎం దృష్టికి తీసుకెళ్లాం. ప్రధానిని రేవంత్‌రెడ్డి కలిసినట్లుగానే తాము కూడా నియోజకవర్గం అభివృద్ధి కోసం కలిశాం..’’ అని ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి ‘సాక్షి’తో అన్నారు. జహీరాబాద్లోనూ అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేయాలని కోరాం.. తమ నియోజకవర్గంలో ప్రొటోకాల్ పాటించడం లేదనే అంశంపైనా సీఎంతో చర్చించాం.. తాము నియోజకవర్గంలో పర్యటిస్తుంటే పైలెట్ వెహికిల్ కూడా ఇవ్వడం లేదు.. ఈ అంశాలను సీఎం దృష్టికి తీసుకెళ్లాం.. అని జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు ‘సాక్షి’తో అన్నారు. ప్రొటోకాల్ వివాదం.. ఉమ్మడి మెదక్ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ప్రొటోకాల్ వివాదం తలెత్తుతోంది. ప్రధానంగా నర్సాపూర్, సంగారెడ్డి, జహీరాబాద్ నియోజకవర్గాల్లో జరుగుతున్న అభివృద్ధి, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రొటోకాల్ పాటించడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు విమర్శిస్తున్నారు. కాంగ్రెస్ నేతలు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని తెలి పారు. ఈ విషయంలో నర్సాపూర్‌లో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య ఈ ప్రొటోకాల్ విషయంలో గొడవలకు దారితీసింది. ఈ ప్రొటోకాల్ వివాదాలు తలెత్తుతున్న నేపథ్యంలో ఎమ్మెల్యేలు రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్ శివధర్‌రెడ్డిని కూడా కలిశామని తెలిపారు. -
బీసీల ఓట్లకు ‘కులగణన’ అస్త్రం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా వెనుకబడిన వర్గాల ఓట్ల కోసం కాంగ్రెస్ పార్టీ ‘కులగణన’అస్త్రాన్ని ప్రయోగించనుంది. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించడంలో కులగణన కీలకపాత్ర పోషిస్తుంది. ఈ వర్గాల ఓటర్లను ఆకర్షించడమే ధ్యేయంగా మేనిఫెస్టో రూపకల్పనకు కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతోంది. కులగణనకు అనుకూలంగా ఇప్పటికే రాహుల్‌గాంధీ పలు సందర్భాల్లో ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఈ గణన ఇప్పటికే ప్రారంభించడం, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఈ హామీని మేనిఫెస్టోలో చేర్చిన విషయం విదితమే. దీంతో వచ్చే లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టోలో ఈ అంశాన్ని ప్రధానంగా చేర్చనున్నారన్న చర్చ జరుగుతోంది. తాము అధికారంలోకి వస్తే దేశవ్యాప్తంగా కులగణన చేపడతామని చెప్పడం ద్వారా బీసీవర్గాల ఓట్లు రాబట్టుకునే అంశంపై మంగళవారం టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశంలో కూడా చర్చ జరగడం గమనార్హం. అన్ని రాష్ట్రాల్లోనూ అధ్యయనం లోక్‌సభ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో భాగంగా అన్ని రాష్ట్రాలకు ఏఐసీసీ ప్రతినిధులు వెళుతున్నా రు. అందులో భాగంగానే జాతీయ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్, మేనిఫెస్టో కమిటీ సభ్యుడు ప్రవీణ్ చక్రవర్తి మంగళవారం తెలంగాణకు వచ్చారు. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టో తయారీకి టీపీసీసీ నియమించిన కమిటీతో ఆయన గాందీభవన్‌లో భేటీ అయ్యారు. టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, మరో మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్ దీపాదాస్మున్షీ, కమిటీ సభ్యులు రాంరెడ్డి దామోదర్‌రెడ్డి, ఒబేదుల్లా కొత్వాల్, తాహెర్‌బిన్ హందాన్, లింగంయాదవ్, రవళిరెడ్డి, కోట నీలిమ, పోట్ల నాగేశ్వరరావు, సామా రామ్మోహన్‌రెడ్డి, గాల్‌రెడ్డి హర్షవర్దన్‌రెడ్డి, రియాజ్, కత్తి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో రూపకల్పనలో రాష్ట్ర నేతల ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ ఎన్నికల మేనిఫెస్టో పీపుల్స్ ఫ్రెండ్లీగా ఉందని, క్షేత్ర స్థాయిలోని అంశాలనూ టచ్ చేశారని అభినందించారు. ఈ సందర్భంగా మేనిఫెస్టో కమిటీ సభ్యులు మాట్లాడుతూ రాజకీయ పారీ్టలు విస్మరించే వర్గాలను కూడా మేనిఫెస్టోలో చేర్చామని చెప్పారు. ట్రాన్స్జెండర్లు, ఇళ్లలో పనిచేసే వారి గురించి అధ్యయనం చేసి, వారి సమస్యలను కూడా ప్రస్తావించామని వివరించారు. మంత్రి శ్రీధర్‌బాబు మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజల ముందు ఒక మేనిఫెస్టో ఉంచగలిగామని చెప్పారు. ప్రజలు తమపై విశ్వాసంతో అధికారం అప్పగించారని, ఈ హామీలు నెరవేర్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోందని చెప్పారు. ఒకట్రెండు ఆలోచనలు ప్రధాన మేనిఫెస్టోకు వెళతాయి – ప్రవీణ్ చక్రవర్తి సమావేశ అనంతరం దీపాదాస్ మున్షీ, ఇతర తెలంగాణ నేతలతో కలిసి ప్రవీణ్‌చక్రవర్తి గాంధీభవన్‌లో విలేకరులతో మాట్లాడారు. దేశ ప్రజల ఆలోచనలను తెలుసుకునేందుకు అన్ని రాష్ట్రాలకు వెళ్లి ప్రజలు, నిపుణులు, పార్టీ నేతల నుంచి సలహాలు, సూచనలు తీసుకుంటున్నామన్నారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల మేనిఫెస్టో ముఖ్య సాధనమని కాంగ్రెస్ పార్టీ నమ్ముతుందని చెప్పారు.తెలంగాణ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సభ్యులతో పాటు పౌర సంఘాలు, కొందరు ప్రజలతో సమావేశమయ్యామన్నారు. ఈ చర్చల్లో వచి్చన ఫీడ్‌బ్యాక్ నుంచి ఒకట్రెండు ఆలోచనలు లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ప్రకటించే ప్రధాన మేనిఫెస్టోకు వెళతాయని ప్రవీణ్ చక్రవర్తి చెప్పారు. -
భువనగిరి, నేరేడుచర్లలో నెగ్గిన అవిశ్వాసం
భువనగిరిటౌన్/నేరేడుచర్ల: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మంగళవారం రెండు మున్సిపాలిటీల్లో అవిశ్వాసాలు నెగ్గాయి. భువనగిరి, నేరేడుచర్ల మున్సిపాలిటీల చైర్మన్ పదవులను బీఆర్ఎస్ కోల్పోయింది. భువనగిరి మున్సిపాలిటీలో 16 మంది బీఆర్ఎస్ కౌన్సిలర్లు బీజేపీ, కాంగ్రెస్ సభ్యులతో కలిసి సొంత పార్టీ చైర్మన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టారు. ఎక్స్ అఫీషియో సభ్యులతో కలిపి 36 మంది సభ్యులుండగా మంగళవారం నిర్వహించిన అవిశ్వాస ప్రత్యేక సమావేశానికి 31 మంది హాజరయ్యారు. 16 మంది బీఆర్ఎస్, 9 మంది కాంగ్రెస్, ఆరుగురు బీజేపీ కౌన్సిలర్లు ఓటింగ్‌లో పాల్గొన్నారు. వీరంతా చైర్మన్, వైస్ చైర్మన్‌పై అవిశ్వాసానికి మద్దతుగా చేతులెత్తారు. దీంతో అవిశ్వాసం నెగ్గింది. నేరేడుచర్ల మున్సిపల్ చైర్మన్‌పై పెట్టిన అవిశ్వాసం కూడా నెగ్గింది. ఈ మున్సిపాలిటీలో 15 మంది కౌన్సిలర్లు ఉండగా అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వైస్ చైర్పర్సన్ తన పదవికి రాజీనామా చేశారు. మొదట బీఆర్ఎస్కు ఏడుగురు కౌన్సిలర్లు ఉండగా.. వైస్ చైర్పర్సన్ రాజీనామా చేయడంతోపాటు ముగ్గురు కౌన్సిలర్లు కాంగ్రెస్‌లో చేరారు. ప్రస్తుతం బీఆర్ఎస్కు చైర్మన్‌తో కలిసి ముగ్గురు, సీపీఎంకు ఒకరు, కాంగ్రెస్‌కు పది మంది సభ్యులున్నారు. మంగళవారం జరిగిన అవిశ్వాస సమావేశానికి చైర్మన్ మినహా అందరూ హాజరయ్యారు. చైర్మన్‌పై అవిశ్వాసానికి మద్దతుగా 13 మంది కౌన్సిలర్లు చేతులెత్తారు. దీంతో అవిశ్వాసం నెగ్గింది. -
సీఎంతో మెదక్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేల భేటీ
సాక్షి, హైదరాబాద్: ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మంగళవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీ అయ్యారు. సునీతా లక్ష్మారెడ్డి (నర్సాపూర్), గూడెం మహిపాల్‌రెడ్డి (పటాన్చెరు), మాణిక్‌రావు (జహీరాబాద్), కొత్త ప్రభాకర్‌రెడ్డి (దుబ్బాక) జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో ఆయన్ను కలిసారు. నియోజకవర్గంలో తాము ఎదుర్కొంటున్న ప్రొటోకాల్, పోలీసు ఎస్కార్ట్, వ్యక్తిగత భద్రత తదితర అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లు వారు ‘సాక్షి’కి తెలిపారు. అయితే ప్రధాన ప్రతిపక్షానికి చెందిన నలుగురు ఎమ్మెల్యేలు సీఎంను కలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యింది. మీడియాలోనూ వీరి భేటీ వైరల్ అయ్యింది. దీంతో ఎమ్మెల్యేలు స్పందించారు. తమ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మంజూరైన పనులు కొనసాగేలా చూడాలని సీఎంను కోరినట్లు కొత్త ప్రభాకర్‌రెడ్డి చెప్పారు. గతంలో పూర్తయిన అభివృద్ధి పనులకు బిల్లుల చెల్లింపు అంశాన్ని కూడా ఆయన దృష్టికి తీసుకెళ్లామని వివరించారు. రేవంత్‌తో కేవలం మర్యాదపూర్వకంగానే భేటీ అయినట్లు మాణిక్‌రావు తెలిపారు. తాము ముఖ్యమంత్రిని కలవడంపై విపరీతార్థాలు తీయొద్దని, ప్రధాన మంత్రి మోదీని రేవంత్‌రెడ్డి ఎలా అభివృద్ధి పనుల కోసం కలిశారో తాము కూడా అదే విధంగా కలిసినట్లు మహిపాల్‌రెడ్డి వివరించారు. తమ భేటీకి ఎలాంటి రాజకీయ ప్రాధాన్యత లేదని, తప్పుడు ప్రచారాలను నమ్మొద్దని సునీతా లక్ష్మారెడ్డి అన్నారు. కాగా వీరు బుధవారం తెలంగాణ భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి సీఎంతో భేటీపై వివరణ ఇవ్వనున్నట్లు సమాచారం. ఇలావుండగా తమ భద్రతకు సంబంధించిన అంశాలపై ఈ నలుగురు ఎమ్మెల్యేలు మంగళవారం ఇంటెలిజెన్స్ ఏడీజీ శివధర్‌రెడ్డిని కూడా కలిశారు. -
బీఆర్ఎస్పై అసంతృప్తి లేదు
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ అధిష్టానంపై తాను అసంతృప్తిగా ఉన్నట్లు వస్తున్న వార్తల్లో వాస్తవం లేదని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. తాను పార్టీ మారుతున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వస్తున్నవి వదంతులు మాత్రమేనని, కాంగ్రెస్ పార్టీకి తాను గతంలో ఎంత దూరంలో ఉన్నానో ఇప్పుడు కూడా అంతే దూరం పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. శాసనమండలిలోని చైర్మన్ ఛాంబర్లో గుత్తా మంగళవారం మీడియాతో ఇష్టాగో ష్టిగా మాట్లాడారు. నల్లగొండ జిల్లాలో మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డితో సహా తనకు ఎవరితోనూ విభేదాలు లేవన్నారు. తనకు మరో నాలుగేళ్ల పదవీ కాలం ఉందని, ప్రత్యక్ష రాజకీయాలకు కూడా దూరంగా ఉన్నట్లు పేర్కొన్నారు. కష్టకాలంలో పార్టీ కేడర్‌ను కాపాడి పార్టీకి అండగా నిలబడేందుకు తన కుమారుడు గుత్తా అమిత్‌రెడ్డి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు సుఖేందర్‌రెడ్డి వెల్లడించారు. నల్లగొండ, భువనగిరి లోక్‌సభ ఎన్నికల్లో పార్టీ ఎక్కడ అవకాశమిచ్చినా తన కుమారుడు పోటీ చేస్తాడని, అతనిది అందరినీ కలుపుకుపోయే మనస్తత్వం అని పేర్కొన్నారు. తన కుమారుడికి పార్టీ టికెట్ అంశంపై ఒకటి రెండు రోజుల్లో స్పష్టత వస్తుందని గుత్తా వెల్లడించారు. నల్లగొండ, భువనగిరిలో బీసీలకు అవకాశ మిచ్చినా గెలుపు కోసం సహకరిస్తామన్నారు. నల్ల గొండ నుంచి సోనియా గాంధీ పోటీ చేసినా ఆమె పై పోటీకి తన కుమారుడు అమిత్ సిద్ధంగా ఉన్నా డని చెప్పారు. తన కుమారుడికి టికెట్ ఇవ్వకున్నా పార్టీ మారే ప్రసక్తే లేదని గుత్తా స్పష్టం చేశారు. ఫిర్యాదులు ప్రివిలేజ్ కమిటీకి.. ముఖ్యమంత్రిపై సభ్యులు చేస్తున్న ఫిర్యాదులను ప్రివిలేజీ కమిటీకి పంపిస్తానని గుత్తా వెల్లడించారు. కేటీఆర్ తన నివాసానికి రావడం సాధారణ రాజకీ య ప్రక్రియలో భాగమని పేర్కొన్నారు. నీటిపారు దల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి తన సొంత జిల్లాలో పెండింగ్‌లో ఉన్న పనులపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. వచ్చే శాసన మండలి సమావేశా లను పాత భవనంలో జరిపేందుకు ఏర్పాట్లు జరు గుతున్నాయన్నారు. కమ్యూనిస్టుల ఓట్ల శాతం తగ్గి నా ఎంతో కొంత బలం ఉందన్నారు. -
రేపు హైదరాబాద్‌కు ఖర్గే
సాక్షి, హైదరాబాద్: ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గురువారం హైదరాబాద్‌కు రానున్నారు. పార్టీకి చెందిన పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్లతో ఎల్బీ స్టేడియం వేదికగా జరిగే సమావేశంలో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పార్లమెంటు ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన పోలింగ్ బూత్ ఏజెంట్లకు దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, ఈ సమావేశం ఏర్పాట్లపై టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్‌కుమార్‌గౌడ్‌తో సీఎం రేవంత్‌రెడ్డి మంగళవారం సమీక్షించారు. తన నివాసంలో మహేశ్‌తో సమావేశమైన రేవంత్ కార్యక్రమ ఏర్పాట్లు జరుగుతున్న తీరును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో క్రియాశీలకంగా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చేసిన పోలింగ్ బూత్ స్థాయి ఏజెంట్స్ అందరూ సమావేశానికి హాజరు కావాలని ఈ సందర్భంగా రేవంత్ పిలుపునిచ్చారు. సీఎంను కలిసిన సలహాదారులు, ఎమ్మెల్సీలు కాగా, కొత్తగా నియమితులైన సలహాదారులు, ఢిల్లీలో ప్రత్యేక ప్రతినిధి, ఇద్దరు ఎమ్మెల్సీలు మంగళవారం సీఎం రేవంత్‌ను కలిశారు. సీఎం సలహాదారుడు వేం నరేందర్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్‌అలీ, హర్కర వేణుగోపాల్‌రావు, ఢిల్లీలో ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి మల్లురవితో పాటు కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్సీలు మహేశ్‌కుమార్‌గౌడ్, బల్మూరి వెంకట్లు జూబ్లీహిల్స్‌లోని సీఎం నివాసంలో రేవంత్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారిని సీఎం రేవంత్ అభినందించారు. అదే విధంగా దావోస్ పర్యటనలో భాగంగా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు చేసుకోవడం పట్ల సలహాదారులు, ఎమ్మెల్సీలు సీఎం రేవంత్‌కు అభినందనలు తెలిపారు. -
త్వరలోనే 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే గృహ వినియోగదారులకు 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ హామీ నెరవేరబోతోందని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి చెప్పారు. హామీల అమలుపై సమీక్షలు జరిపి వంద రోజుల్లో అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు. మంగళవారం గాంధీభవన్‌కు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రాన్ని కేసీఆర్ సర్కారు గుల్ల చేసిందని, అందుకే హామీల అమలులో కొంత జాప్యం జరుగుతోందని చెప్పారు. ఇక, కరెంటు బిల్లులు కోమటిరెడ్డి ఇంటికి పంపాలన్న మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి వ్యాఖ్యలపై మంత్రి కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందాల్లో జగదీశ్‌రెడ్డి పాత్ర కూడా ఉందని, ఆయన జైలుకెళ్లడం ఖాయమని, ఆయన తోపాటు కేటీఆర్, కవితలకూ జైలు తప్పదన్నారు. 200 యూ నిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వకపోతే కరెంటు బిల్లులు తమకు పంపాలని బీఆర్ఎస్ ప్రజలను రెచ్చగొడుతోందని, రూ.3,016 నిరుద్యోగ భృతి ఇస్తానని చెప్పిన కేసీ ఆర్ ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని, తాము నిరుద్యోగులను ఇలాగే రెచ్చగొట్టి ఉంటే కేసీఆర్ ఫాంహౌస్ నుంచి బయటకు వచ్చేవారా అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం అక్రమాల నిగ్గు తేల్చే పనిలో ఉన్నామని, కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అన్ని అక్రమాలపై విచారణ జరుగుతోందని చెప్పారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ చీలికలు, పీలికలు అవుతుందని, ఒక్క పార్లమెంట్ స్థానంలో కూడా బీఆర్ఎస్ గెలవదని కోమటిరెడ్డి జోస్యం చెప్పారు. -
సీఎం రేవంత్‌తో భేటీపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివరణ
సంగారెడ్డి: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో భేటీపై పఠాన్‌చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి వివరణ ఇచ్చారు. పటాన్చెరు నియోజకవర్గ అభివృద్ధి కోసమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మంగళవానం మర్యాదపూర్వకంగా కలిశానని అన్నారు. ఈ అంశంపై అనవసరంగా ఊహగానాలు సృష్టించవద్దని మహిపాల్‌రెడ్డి అన్నారు. మాజీ సీఎం, బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కేసీఆర్ నాయకత్వంలో రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మెదక్ స్థానంలో గులాబీ జెండా ఎగరవేయబోతున్నామని మహిపాల్‌రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. తనపై అవాస్తవ ప్రచారాలు, ఊహగానాలకు పుల్‌స్టాప్ పెట్టాలని కోరారు. చదవండి: ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీ అమలు: మంత్రి కోమటిరెడ్డి -
ఫిబ్రవరి నుంచి 200 యూనిట్ల ఉచిత కరెంట్ హామీ అమలు: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కేసీఆర్ సర్కార్ నిర్వాకం వల్ల తెలంగాణ అప్పులపాలైందన్నారు రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. అందువల్లే ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలులో జాప్యం జరుగుతోందన్నారు. ఫిబ్రవరి నెల నుంచి 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు హామీ అమలు చేస్తామని చెప్పారు. నిరుద్యోగ భృతి మొదలుకొని డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల వరకు అన్ని హామీలను గత ప్రభుత్వం విస్మరించిందని మండిపడ్డారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్కు ఒక్క సీటు కూడా రాదన్న మంత్రి.. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు అన్ని అక్రమాలపై విచారణ కొనసాగుతుందని తెలిపారు. కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ భేటీ మంగళవారం గాంధీభవన్‌లో కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ సమావేశమైంది. మ్యానిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపదాస్ మున్శి , ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ కమిటీ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు పాల్గొన్నారు. ఏఐసీసీ మ్యానిఫెస్టోలో తెలంగాణ నుంచి చేర్చాల్సిన అంశాలపై చర్చించారు. అన్ని రాష్ట్రాల్లో తిరిగి అభిప్రాయాలను సేకరిస్తున్న కేంద్ర మేనిఫెస్టో కమిటీ.. తెలంగాణ మేనిఫెస్టో కమిటీ నుంచి కూడా అభిప్రాయాలను సేకరించింది. నాలుగైదు కామన్ స్కీములతో పాటు.. రాష్ట్రాల కోసం ప్రత్యేక అంశాలను మేనిఫెస్టోలో పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయం నిర్ణయించింది. చదవండి: కేటీఆర్, హరీశ్‌రావుపై బీజేపీ నేత రఘునందన్ రావు ఫైర్ ప్రతిపక్షాలవి తొందరపాటు విమర్శలు మేనిఫెస్టోతోనే తెలంగాణ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలించిందని అన్నారు పరిశ్రమలశాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలను అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు. ఎన్నికల్లో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని చెప్పారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీపై ఎంతో విశ్వసాన్ని చూపారని అన్నారు. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు చాలా తొందరపాటుగా ఉన్నాయని విమర్శించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. ఏఐసీసీ మ్యానిఫెస్టోకు టీ కాంగ్రెస్ సాయం తీసుకుంటాం మేనిఫెస్టో అంటే ప్రజలకు దగ్గరగా, అమలుకు నోచుకునే విదంగా ఉండాలని ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి తెలిపారు. తెలంగాణలో మంచి మేనిఫెస్టో అందించారని.. అందుకే రాష్ట్ర ప్రజలు విశ్వసించారని పేర్కొన్నారు. ఏఐసీసీ మేనిఫెస్టో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం నేతృత్వంలో రూపొందుతుందని చెప్పారు. మ్యానిఫెస్టో పబ్లిక్ ఫ్రెండ్లీగా, క్రోని కాపిటల్కు దూరంగా ప్రజావసరాలకు దగ్గరకు ఉండాలన్నారు. ఏఐసీసీ మ్యానిఫెస్టోకు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సహకారం తీసుకుంటామన్నారు. -
కేటీఆర్, హరీశ్‌రావుపై బీజేపీ నేత రఘునందన్ రావు ఫైర్
సాక్షి, హైదరాబాద్: బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కేటీఆర్, హరీశ్‌రావుపై ఫైరయ్యారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లు బీఆర్ఎస్ నేతల మాటల ఉన్నాయని ఎద్దేవా చేశారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లడారు. వ్యక్తులు అనుకుంటే పార్టీలు ఖతం కావన్నారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ గుండు సున్నాగా మిగులుతుందని అన్నారు. బీజేపీపై అవాకులు, చవాకులు మాట్లాడితే సహించేది లేదని హెచ్చరించారు. చదవండి: జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి కోమటిరెడ్డి -
జగదీష్ రెడ్డి జైలుకు వెళ్లడం ఖాయం: మంత్రి కోమటిరెడ్డి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలుచేశారు. భూ దోపిడీదారుడు జగదీష్ రెడ్డికి తనను విమర్శించే స్థాయి లేదని అన్నారు. యాదాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అక్రమాలతో పాటు ఛత్తీస్‌గఢ్‌లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న అక్కసుతోనే తనపై మాజీ మంత్రి ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.. జగదీష్ రెడ్డి అవినీతిపై విచారణ జరిపిస్తామని తెలిపారు. ఈ మేరకు హైదరాబాద్‌లో మంగళవారం ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో బీఆర్ఎస్ ఖాళీ అవడం ఖాయమని మంత్రి కోమటిరెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ మూడు ముక్కలవుతుందని జోస్యం చెప్పారు. కేసీఆర్ కుటుంబం తర్వాత జైలుకు పోయేవ్యక్తి జగదీష్రెడ్డేనని అన్నారు. సిట్టింగ్ జడ్జితో విచారణ తర్వాత జగదీష్ రెడ్డి జైలుకు పోవడం ఖామమని తెలిపారు. చదవండి: రాహుల్ యాత్రను అడ్డుకున్న పోలీసులు.. అస్సాంలో ఉద్రిక్తత -
పొలిటికల్ వార్!
వికారాబాద్: చేవెళ్ల బీఆర్ఎస్ ఎంపీ గడ్డం రంజిత్‌రెడ్డి, బీజేపీ మాజీ ఎంపీ కొండా విశ్వశ్వర్‌రెడ్డి మధ్య నెలకొన్న వివాదం చినికిచినికి గాలివానలా మారుతోంది. ఇన్నాళ్ల పాటు నివురుగప్పిన నిప్పులా ఉన్న ఈ వ్యవహారం ఇటీవల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసుకునే వరకూ వెళ్లింది. ఇది కాస్తా కార్యకర్తల మధ్య చిచ్చు రాజేస్తోంది. సోషల్ మీడియా వేదికగా ఒకరిపై ఒకరు విమర్శలు గుప్పించుకుంటున్నారు. త్వరలో పార్లమెంట్ ఎన్నికల నగారా మోగనున్న నేపథ్యంలో ఈ నేతల మధ్య వివాదం మరింత ముదిరేలా ఉందనే చర్చ సాగుతోంది. అసలేం జరిగిందంటే.. ఎంపీ వర్సెస్ మాజీ ఎంపీ ఎంపీ రంజిత్‌రెడ్డి, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి ఇద్దరూ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గం నుంచి టీఆర్ఎస్ తరఫున ఎంపీలుగా గెలిచిన వారే. 2014 ఎన్నికల్లో కొండా టీఆర్ఎస్ నుంచి గెలుపొంది ఆ తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో చేవెళ్ల నుంచి కాంగ్రెస్ తరఫున కొండా, టీఆర్ఎస్ నుంచి రంజిత్‌రెడ్డి పోటీ చేయగా రంజిత్‌రెడ్డి గెలుపొందారు. అనంతరం విశ్వేశ్వర్‌రెడ్డి కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు. నాటి నుంచి వీరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోంది. త్వరలో జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ ఇద్దరు నేతలూ పోటీ పడే అవకాశం ఎక్కువగా ఉంది. దీంతో ఎవరి గ్రూపులను వారు బలోపేతం చేసుకోవడంలో నిమగ్నమయ్యారు. ప్రత్యర్థి పార్టీ నాయకులపైనా గురిపెట్టారు. ఇందులో భాగంగానే ఇటీవల కొండా విశ్వేశ్వర్‌రెడ్డి.. రంజిత్‌రెడ్డి అనుచరులైన కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలతో మాట్లాడినట్లు సమాచారం. ఈ విషయం తెలుసుకున్న ఎంపీ రంజిత్‌రెడ్డి నేరుగా విశ్వేశ్వర్‌రెడ్డికే ఫోన్ చేసి ‘నా అనుచరులతో నువ్వెలా మాట్లాడతావు’ అని నిలదీసినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో రంజిత్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ విశ్వేశ్వర్‌రెడ్డి బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. -
రసవత్తరంగా తాండూరు మున్సిపల్ రాజకీయం
తాండూరు: మున్సిపల్ రాజకీయం మరోసారి వేడెక్కుతోంది. ఒప్పందం ప్రకారం ఇద్దరు చైర్పర్సన్లు కొనసాగాలని బీఆర్ఎస్ పార్టీ అధిష్టాన నేతలు నాలుగేళ్ల క్రితం నిర్ణయించారు. దీంతో రెండున్నరేళ్ల పాటు చైర్‌పర్సన్‌గా తాటికొండ స్వప్నపరిమళ్ కొనసాగారు. గడువు ముగిసిన తర్వాత కూడా చైర్పర్సన్ స్వప్న పదవికి రాజీనామా చేయలేదు. వైస్ చైర్పర్సన్ పట్లోళ్ల దీపనర్సింహులు చైర్పర్సన్ పదవి కట్టబెట్టాలని ఏడాది కాలంగా బీఆర్ఎస్ పార్టీ నేతల చుట్టూ తిరుగుతున్నారు. గతేడాది అసెంబ్లీ ఎన్నికల వల్ల మున్సిపాలిటీలపై పార్టీ జోక్యం తీసుకొలేదు. ప్రస్తుతం ఎన్నికలు ముగియడంతో ఒప్పందం ప్రకారం చైర్పర్సన్ పదవి ఇవ్వాలని దీపనర్సింహులు డిమాండ్ చేస్తున్నారు. సేకరించిన సంతకాలు గతంలో పట్నం మహేందర్‌రెడ్డి వర్గానికి చెందిన వ్యక్తి చైర్‌పర్సన్‌గా ఉన్నారు. పట్నం శిబిరంలో ఉన్న పలువురు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలో చేరారు. దీంతో చైర్పర్సన్ తాటికొండస్వప్నకు మెజార్టీ కౌన్సిలర్లు కరువయ్యారు. అధికారప్రతిపక్ష పార్టీల కౌన్సిలర్ల మద్దతులో ఎలాగైనా చైర్పర్సన్ తాటికొండస్వప్నపై అవిశ్వాసం ప్రవేశపెట్టి పదవి నుంచి దింపాలని మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి వర్గీయులు సిద్ధమయ్యారు. మున్సిపల్ కౌన్సిల్లో మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. అవిశ్వాస తీర్మానానికి నోటిసు అందించాలంటే మొత్తంలో మూడో వంతు సభ్యులు సంతకాలు పెట్టాల్సి ఉంది. ఇప్పటికే 15 మంది కౌన్సిలర్ల సంతకాలు సేకరించినట్లు సమాచారం. కాంగ్రెస్ పార్టీకి అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు ముగ్గురు కౌన్సిలర్లు మాత్రమే ఉన్నారు. ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి కొందరు కౌన్సిలర్లు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్లారు. దీంతో మున్సిపల్ కౌన్సిల్లో బలం పెరిగింది. అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న కౌన్సిలర్ల మద్దతు లభిస్తోందా.. లేదా అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. మరోవైపు బీజేపీ కౌన్సిలర్లు అవిశ్వాసం పెట్టేందుకు సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. అన్నదమ్ముల పంచాయితీ సాయిపూర్ ప్రాంతంలో మూడు వార్డులలో ఒకే కు టుబానికి చెందిన వారే కౌన్సిలర్లుగా కొనసాగుతున్నా రు. దాయాదులుగా ఉన్న వారు ఒకరంటే ఒకరికీ పొసగడం లేదు. సాయిపూర్లోని 9వ వార్డు కౌన్సిలర్ అయిన వైస్ చైర్పర్సన్ దీపనర్సింహులు చైర్పర్సన్ పదవికోసం ఆశపడుతున్నారు. అయితే సోదరులు అయిన కౌన్సిలర్లు నీరజాబాల్‌రెడ్డి, పట్లోళ్ల రత్నమాలనర్సింహులు వైస్ చైరపర్సన్కు మద్దతు ఇవ్వడం లేదు. దీంతో అన్నదమ్ముల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరుకున్నాయి. ఎమ్మెల్యేకు విషమ పరీక్ష మున్సిపల్ అవిశ్వాస తీర్మానం విషయంలో తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్‌రెడ్డికి విషమ పరీక్ష ఎదురుకానుంది. కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానానికి పాల్గొనకుండా ఉంటే ఎమ్మెల్సీ పట్నం మహేందర్‌రెడ్డితో జత కట్టారనే ప్రచారం సాగుతోంది. అవిశ్వాసంలో పాల్గొంటే కాంగ్రెస్ పార్టీలో చేరిన పట్నం మహేందర్‌రెడ్డి వర్గీయులతో విభేదాలు ఎదురవుతాయి. దీంతో అవిశ్వాసం విషయంలో ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి పట్టించుకోవడం లేదంటూ పార్టీ వర్గాలు అంటున్నాయి.