breaking news
-
TS: కాంగ్రెస్ ఎప్పటికీ మారదా.. ఇంతకీ ఏం జరిగింది?
కాంగ్రెస్ అనేది ఓ విచిత్రమైన పార్టీ. ఆ పార్టీలో ఎప్పుడేం జరుగుతుందో..? పార్టీలోకి ఎవరు వస్తారో? ఎవరు బయటకు వెళ్లిపోతారో ఎవ్వరూ చెప్పలేరు. ఎన్నికల సమయంలో అభ్యర్థుల ఎంపిక కూడా గందరగోళంగానే ఉంటుంది. ప్రతిపక్షంలో ఉన్నా అంతే.. అధికారం వచ్చినా అంతే.. తాజాగా తెలంగాణలో ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థుల ఎంపిక కూడా అలాగే జరిగింది. నేతల మనోభావాలను ఎవరూ పట్టించుకోరు. కాంగ్రెస్ ఎప్పటికీ మారదా అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇంతకీ టీ.కాంగ్రెస్‌లో ఏం జరిగింది? తెలంగాణలో ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీల ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ ఇద్దరు అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే అభ్యర్ధుల ఎంపికలో ఎన్నో నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. నామినేషన్ల గడువు ముగిసే రోజు వరకు ఎన్నో ట్విస్టులు, మరెన్నో మలుపులు అన్నట్లుగా ఆసక్తికరంగా సాగింది. రెండు ఎమ్మెల్సీలకు అద్దంకి దయాకర్, మహేష్ కుమార్ గౌడ్లకు అవకాశం కల్పించాలని మొదట అనుకున్నారు. కాని రాత్రికి రాత్రే కాంగ్రెస్ విద్యార్థి విభాగం NSUI అధ్యక్షుడు బల్మూరి వెంకట్ పేరు తెరమీదకు వచ్చింది. ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలు యువతకు అవకాశం కల్పించాల్సిందే అని తేల్చిచెప్పడంతో బల్మూరికి టికెట్ కన్ఫ్మామ్ అయ్యింది. దీంతో అద్దంకి దయాకర్.. మహేష్ గౌడ్‌లలో ఒకరిని తప్పించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎంతో తర్జన భర్జనల అనంతరం మొదట మహేష్ గౌడ్‌ను తప్పించాలనుకున్నారు. కానీ బీసీలు ఇప్పటికే బీజేపీ వైపు మళ్ళుతున్న నేపధ్యంలో బీసీ నేత అయిన మహేష్గౌడ్ను తప్పిస్తే.. పార్లమెంటు ఎన్నికల్లో కాంగ్రెష్కి నష్టం తప్పదనే అభిప్రాయానికి వచ్చిన కాంగ్రెస్ నాయకత్వం అద్దంకి దయాకర్‌ను తప్పించడానికి నిర్ణయించింది. సామాజిక సమీకరణాల నేపథ్యంలో కొందరికి ఆఖరి నిమిషంలో ఛాన్స్ చేజారిపోవడాన్ని అర్దం చేసుకొవచ్చు. కాని అభ్యర్ధుల ఎంపిక ప్రక్రియనే సరిగా జరగలేదనే అభిప్రాయం కాంగ్రెస్ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. అభ్యర్ధుల ఎంపికను చివరి నిమిషం వరకు తేల్చకుండా ఎందుకు నాన్చాల్సి వచ్చింది అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన జోష్ కాంగ్రెస్ లో ఇంకా కొనసాగుతోంది. అలాంటప్పుడు టికెట్లు ఆశించిన నేతలతో పార్టీ పెద్దలు చర్చించి.. అవకాశం దక్కని నేతలను బుజ్జగిస్తే సరిపోయేది. అసెంబ్లీ ఎన్నికల్లో అదే చేసారు. టికెట్లు దక్కని నేతల రాజకీయ భవిష్యత్తుకు భరోసా ఇచ్చారు. దీంతో అసెంబ్లీ టికెట్ల కేటాయింపు సజావుగా జరిగి కాంగ్రెస్ పార్టీ చేతికి అధికారం అందింది. కాని ఎమ్మెల్సీ ఎన్నికల విషయంలో.. అభ్యర్ధులను చివరి నిమిషంలో మార్చడం వల్ల ఎంతో గందగోళం తలెత్తింది. వివిధ కారణాల వల్ల అద్దంకి దయాకర్ కి అవకాశం కల్పించలేని పరిస్తితి వస్తే.. కనీసం ఆయనకు పరిస్తితి వివరించి భరోసా ఇస్తే బాగుండేదనే అభిప్రాయం పార్టీ నేతల్లో వ్యక్తం అవుతోంది. పార్టీ పెద్దలు ఆయనతో మాట్లాడి ఒప్పించి.. నామినేషన్ పర్వంలో ఆయన్ను భాగస్వామిని చేస్తే బాగుండేదని నేతలు భావిస్తున్నారు. పార్టీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని అద్దంకి ప్రకటించిన తర్వాత కూడా కాంగ్రెస్ పెద్దలు ఆ పని చేయకపోవడం అద్దంకి అభిమానుల్ని బాధిస్తోంది. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పెద్దల తీరు మారకపోతే ఎలా అని పార్టీ నేతలే ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా అందరిని కలుపుకుని పోయేలా పార్టీ పెద్దలు వ్యవహరించాలని కోరుతున్నారు. -
రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతారా? మంత్రి పదవి అందుకేనా?
సాక్షి, నల్గొండ: కాంగ్రెస్ 420 హామీలు ఇచ్చిందని, మహాలక్ష్మి అమలు చేసి మహిళమధ్యే పంచాయతీ పెట్టారని మండిపడ్డారు. కేసీఆర్ కాలి గోటికి సరిపోని వాళ్లంతా మాట్లాడుతున్నారని తీవ్రంగా విమర్శించారు. రైతుబంధు అడిగితే చెప్పుతో కొడతారా? మంత్రి పదవి ఇచ్చింది అందుకేనా? అని సూటిగా ప్రశ్నించారు. నల్లగొండలో బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులకు డబ్బులు ఇవ్వలేనపుడు కాళ్లు పట్టుకుని చెప్పుకోవాలన్నారు. రైతుబంధు పడట్లేదు.. కరెంట్ పోతుందని మండిపడ్డారు. రెండు లక్షల రుణమాఫీ సోనియా పుట్టినరోజు నుంచి ఇస్తా అన్నారు ఏమైంది? అని నిలదీశారు. వారం పది రోజుల్లోనే కేసీఆర్ బయటకు వస్తారని చెప్పారు. తొందరలోనే నల్లగొండ వస్తానని చెప్పారని తెలిపారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుదామని అన్నారు. చదవండి: Amit Shah's Telangana Tour: అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు -
అమిత్ షా తెలంగాణ పర్యటన రద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటన రద్దు అయింది. అత్యవసర పనుల కారణంగా ఆయన పర్యటన రద్దు అయినట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి వెల్లడించారు. ఆదివారం కరీంనగర్, హైదరాబాద్, మహబూబ్‌నగర్ జిల్లాల్లో నిర్వహించాల్సిన సమావేశాలను రద్దు చేసినట్లు కిషన్ రెడ్డి పేర్కొన్నారు. -
ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్ ఘటన.. ఎమ్మెల్సీ కవిత ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పాలనలో విద్యార్థినిల భద్రత గాల్లో దీపంగా మారుతుందని చెప్పేందుకు సికింద్రాబాద్ ఉస్మానియా పీజీ లేడీస్ హాస్టల్ ఘటనే నిదర్శనమంటూ ఎమ్మెల్సీ కవిత ట్వీట్ చేశారు. ‘‘మొన్న ఓయూ పరిధిలోని అమ్మాయిల వసతి గృహాల వద్ద ఆగంతకుల అల్లర్లు మితిమీరుతున్నాయని వార్తలు వచ్చినా ప్రభుత్వం మేల్కోలేదు. ఫలితంగా ఆగంతకులు రెచ్చిపోయి నిన్న సికింద్రాబాద్ అమ్మాయిల వసతి గృహంలోకి చొరబడ్డారు. అమ్మాయిలు అప్రమత్తంగా ఉండి ఒకరిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. వారి ధైర్య సాహసాలను అభినందిస్తున్నా.. ఇలాంటి ఘటనలు మరోసారి పునరావృత్తం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నా’’ అంటూ ఆమె ట్వీట్ చేశారు. సికింద్రాబాద్‌లోని ఉస్మానియా మహిళా పీజీ కాలేజీ హాస్టల్లో కలకలం చోటుచేసుకుంది. శుక్రవారం అర్ధరాత్రి గర్ల్స్ హాస్టల్ బాత్రూమ్లోకి ఇద్దరు ఆగంతకులు చొరబడ్డారు. గమనించిన విద్యార్ధులు.. ఓ వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకొని బంధించారు. మరో వ్యక్తి పరారయ్యాడు. విద్యార్ధుల చేతికి చిక్కిన దుండగుడికి దేహశుద్ది చేశారు. హాస్టల్లో భద్రతా లోపంపై విద్యార్ధులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు. తమకు సరైన రక్షణ లేదంటూ నిరనస వ్యక్తం చేశారు. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇదీ చదవండి: బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు -
కేసీఆర్, మమతా, విజయన్ లాంటివారే మోదీని గద్దె దించగలరు: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: మోసం చేయడమే కాంగ్రెస్ నైజమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శించారు. బస్సు ఉచితం, బంగారం ఇస్తాం అని చెప్పి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామన్నారని.. హామీలు అమలు చేయలేక కాంగ్రెస్ ప్రభుత్వం విమర్శలు చేస్తోందని మండిపడ్డారు. నేరవేరని, తప్పుడు హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేయాల్సిందేనని అన్నారు. ఈ మేరకు హైదరాబాద్‌లో శనివారం కేటీఆర్ మాట్లాడుతూ.. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపుతో సమాధానం చెప్పాలని తెలిపారు. బీజేపీని ఓడించాలంటే కాంగ్రెస్‌తో కాదని.. అందుకే కూటమిలో నుంచి నేతలు బయటకు పోతున్నారని అన్నారు. దేశంలోని పార్టీలన్నింటిని కూడగట్టి కూటమి పెడతామని కాంగ్రెస్ బిల్డప్ ఇచ్చిందని మండిపడ్డారు. కూటమికి బిహార్‌లో నితీష్ కుమార్ కూడా బైబై చెప్పారని ప్రస్తావించారు. కేసీఆర్, మమతా బెనర్జీ, పినరయి విజయన్ లాంటివారే నరేంద్ర మోదీని గద్దె దించగలరని అన్నారు. చదవండి: Delhi: బీజేపీపై కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు పథకాలు తెచ్చే ముందు అన్నీ ఆలోచించుకోవాలని కాంగ్రెస్‌కు చురకలంటించారు. కాంగ్రెస్ బీజేపీ రెండు కలిసి పనిచేస్తున్నాయని, వారికి ఫెవికాల్ బంధమని విమర్శలు గుప్పించారు. ఎదో ఒక షరతుపెట్టి పథకాలు రాకుండా చేస్తారని.. పార్లమెంట్ ఎన్నికల గండాన్ని ఎలా దాటలనేదే కాంగ్రెస్ ఆలోచన అని తెలిపారు. తాము ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు పంపిస్తే రాజకీయ సంబంధాలు ఉన్నాయని గవర్నర్ తిరస్కరించారన్నా కేటీఆర్.. రేవంత్ రెడ్డి వెళ్లి గవర్నర్‌ను కలవగానే ఇద్దరు ఎమ్మెల్సీలను ఖరారు చేశారని గుర్తు చేశారు. ‘అసెంబ్లీ ఎన్నికల్లో స్వల్ప తేడాతో కొన్ని జిల్లాలో ఓటమి చెందాం. రాష్ట్రం బాగుంటుందని జీహెచ్ఎంసీలో బీఆర్ఎస్ క్లీన్ స్వీప్ చేసింది. హైదరాబాద్‌లో వచ్చిన ఫలితాలు జిల్లాల్లో ఎందుకు రాలేదని పార్టీ క్యాడర్ అనుకుంటుంది. ఇవాళ మనకు జరిగింది కేవలం స్పీడ్ బ్రేకర్ మాత్రమే. ఏ మాత్రం నిరాశ చెందకూడదు. కేసీఆర్ బలంగా ఉన్నారని తెలియాలంటే పార్లమెంట్ ఎన్నికల్లో మంచి పలితాలు సాధించాలి. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కేసీఆర్‌పై అవాకులు చెవాకులు పెలుతున్నారు. బంగారు పళ్లెంలో తెలంగాణ అభివృద్ది చేసి కాంగ్రెస్ చేతిలో పెట్టాం. రాహుల్ జోడో యాత్ర అని తిరుగుతుంటే, ఇండియా కూటమి రాహుల్‌ను కాదని చోడో అని వెళ్లిపోతున్నారు. ఒక్కొక్కరుగా ఇండియా కూటమి నిర్వీర్యం అవుతోంది. మహాలక్ష్మి పథకం పెట్టి మహిళల మధ్య గొడవలు పెట్టారు. ఫ్రీ బస్సు మంచిదే కానీ బస్సుల సంఖ్య పెంచాలి. రాష్టంలో కోటి 57 లక్షల మంది మహిళలకు 2500/- రూపాయలు ఇస్తామన్నారు. ఆ డబ్బులు ఎప్పుడు ఇస్తారో చెప్పాలి. కరెంటు బిల్లులు సోనియా గాంధీ కడుతుంది అని చెప్పారు. మరి ఇప్పుడు కడుతుందా ఆలోచించాలి. కిషన్ రెడ్డి అంబర్ పేటలో ఎమ్మెల్యేగా ఓడిపోయి సానుభూతితో ఎంపీగా గెలిచారు. ఎంపీగా గెలిచిన ఆయన కేంద్ర మంత్రి అయ్యాక ఒక బస్తీకి అయినా మంచి పనిచేశారా’ అని మండిపడ్డారు కేటీఆర్.... చదవండి: కామారెడ్డి ఎమ్మెల్యే మరో సంచలన నిర్ణయం.. -
కమలం కసరత్తు తెలంగాణ నుంచే
సాక్షి, హైదరాబాద్: బీజేపీ పార్లమెంటు ఎన్నికల కసరత్తు తెలంగాణ నుంచే ప్రారంభం కానుంది. దేశవ్యాప్తంగా ఎంపీ సీట్లను 143 క్లస్టర్లు (మూడు, నాలుగేసి సీట్ల చొప్పున)గా, రాష్ట్రంలోని 17 సీట్లను 5 క్లస్టర్లుగా పార్టీ విభజించింది. ఈ నేపథ్యంలో దేశంలోనే మొట్టమొదటిసారిగా మహబూబ్ నగర్లో ఆదివారం నిర్వహించనున్న క్లస్టర్ (మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నల్లగొండ ఎంపీ సీట్లు) ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశానికి బీజేపీ అగ్రనేత, కేంద్ర హోంమంత్రి అమిత్ షా హాజరుకానున్నారు. అలాగే కరీంనగర్ క్లస్టర్ (కరీంనగర్, జహీరాబాద్, మెదక్, చేవెళ్ల స్థానాలు)కు చెందిన కరీంనగర్ ఎంపీ నియోజకవర్గ పరిధిలోని పోలింగ్ బూత్, ఆ పైస్థాయి కార్యకర్తలు దాదాపు 20 వేల మందితో భేటీ కానున్నారు. గ్రేటర్ హైదరాబాద్‌లో మహిళా వృత్తి నిపుణులు, వివిధ రంగాల ప్రముఖులు, మేధావులతోనూ సమావేశం కానున్నారు. 29న భేటీలకు ఛుగ్, మీనన్ వచ్చే ఏప్రిల్ లేదా మేలో లోక్‌సభ ఎన్నికలు జర గొచ్చుననే అంచనాల నేపథ్యంలో పూర్తిస్థాయి సన్న ద్ధతపై పార్టీ నాయకత్వం దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా ఆదివారం అమిత్ షా పాలమూరులో వచ్చే ఎన్నికల్లో పార్టీ అనుచరించాల్సిన కార్యాచరణ, వ్యూహంపై నాయకులు, కార్యకర్తలకు వివరించనున్నారు. కరీంనగర్లో.. పోలింగ్ బూత్ కమిటీ, ఆ పైస్థాయి కార్యకర్తలు ఇంటింటికీ (జనసంపర్క్ అభియాన్) వెళ్లి పదేళ్లలో మోదీ సర్కార్ సాధించిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ప్రచారం నిర్వహించి, కమలం గుర్తుకు ఓటేయాల్సిందిగా కోరేలా దిశానిర్దేశం చేయనున్నారు. హైదరాబాద్‌లో జరిగే మహిళా వృత్తినిపుణుల సమ్మేళనంలోనూ బీజేపీ అధికారంలోకి వచ్చాక చేపట్టిన కార్యక్రమాలు వివరించడం ద్వారా మహిళల మద్దతును కూడగట్టే ప్రణాళికను అమలు చేయనున్నారు. దీనికి కొనసాగింపుగా ఈ నెల 29న జరిగే కరీంనగర్ క్లస్టర్ ఎన్నికల మేనేజ్మెంట్ కమిటీ సమావేశానికి పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి, రాష్ట్ర ఇన్చార్జి తరుణ్‌ఛుగ్ హాజరుకానున్నారు. అదేరోజు ఆదిలాబాద్ ఎంపీ క్లస్టర్ (ఆదిలాబాద్, పెద్దపల్లి, నిజామాబాద్ సీట్లు) పరిధిలో నిర్వహించనున్న ఎన్నికల నిర్వహణ కమిటీ భేటీలో జాతీయ కార్యదర్శి, రాష్ట్ర సహ ఇన్చార్జి అర్వింద్ మీనన్ పాల్గొననున్నారు. టికెట్లకు పోటీ ఒకవైపు పార్టీ ఎన్నికలకు సమాయత్తం అవుతుంటే మరో టికెట్ల కోసం పారీ్టలో తీవ్ర పోటీ నెలకొంది. అయితే సికింద్రాబాద్, కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్‌లో సిట్టింగ్ ఎంపీలనే మళ్లీ పోటీకి దింపే అవకాశాలున్నాయని తెలుస్తోంది. మిగతా 13 స్థానాల్లో వివిధ రూపాల్లో నిర్వహించే సర్వేల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారని సమాచారం. మోదీ ఆకర్షణ, అభివృద్ధి నినాదం పనిచేస్తుందన్న అంచనాల నేపథ్యంలో.. తెలంగాణలో మెజారిటీ ఎంపీ సీట్లలో బీజేపీ గెలిచే అవకాశాలున్నాయని పార్టీ నాయకత్వం ధీమా వ్యక్తం చేస్తోంది. రాష్ట్రంలోని అయిదారు మంది సిట్టింగ్ ఎంపీలు బీజేపీ వైపు చూస్తున్నట్టు బీజేపీ నేతలు చెబుతున్నారు. వారు ఇప్పటికే పార్టీ నాయకత్వంతో టచ్‌లోకి వచి్చనట్టు ప్రచారం జరుగుతోంది. ఇలావుండగా రాష్ట్రంలోని మొత్తం 17 సీట్లలో 5 బీసీలకు, 3 రెడ్డి, 5 ఎస్సీ.. ఎస్టీ, వెలమ, కమ్మ, బ్రాహ్మణ, లింగా యత్ లేదా వైశ్య సామాజిక వర్గాలకు ఒక్కొక్కటి చొప్పున కేటాయించే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం. అమిత్ షా పర్యటన షెడ్యూల్ ఆదివారం ఢిల్లీ నుంచి ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో బయలుదేరి మధ్యాహ్నం 1.05 నిమిషాలకు బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకుంటారు. అక్కడి నుంచి బీఎస్ఎఫ్ హెలికాప్టర్లో 1.40కి మహబూబ్‌నగర్‌కు చేరుకుంటారు. 2.40 దాకా సుదర్శన్ ఫంక్షన్ హాల్లో జరిగే క్లస్టర్ మీటింగ్‌లో పాల్గొంటారు తర్వాత హెలికాప్టర్లో మధ్యాహ్నం 3.55కు కరీంనగర్‌కు చేరుకుంటారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య ఎస్ఆర్ఆర్ కాలేజీలో జరిగే సమావేశంలో పాల్గొంటారు. 6 గంటలకు హైదరాబాద్ చేరుకుని, 6.15 నుంచి 7.05 వరకు జేఆర్సీ కన్వెన్షన్ హాలు లో మహిళా వృత్తి నిపుణులు, ఇతరులతో భేటీ అవుతారు. రాత్రి 7.45 గంటలకు ప్రత్యేక విమానంలో ఢిల్లీకి వెళతారు. -
విభజన హామీలపై నిలదీయండి
సాక్షి, హైదరాబాద్: వచ్చే పార్లమెంటు సమావేశాల్లో పార్టీ ఎంపీలు విభజన హామీల అమలుతో పాటు రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీయాలని భారత్ రాష్ట్ర సమితి అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు సూచించారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ ఒక్కటేనని, వారం రోజుల పాటు జరిగే సమావేశాల్లో ఎంపీలు ఆయా అంశాలపై మాట్లాడా లని చెప్పారు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ)కు తెలంగాణ ప్రాజెక్టుల అప్పగింతపై గళం విప్పాలని ఆదేశించారు. తెలంగాణ నీటి వనరులను గుప్పిట పెట్టుకునేందుకు కేంద్రం చేస్తు న్న ప్రయత్నాలు, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫ ల్యాలను ఎండగట్టాలని ఆదేశించారు. శుక్రవారం ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రంలో కేసీఆర్ అధ్యక్ష తన సుమారు మూడు గంటల పాటు బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. పార్టీ నేతలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్రావు, కేటీ రామారావు, హరీశ్‌రావు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లొద్దు పార్లమెంటు సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలు, చర్చించాల్సిన విధానాలపై ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగులో వున్న రాష్ట్ర విభజన హామీల సాధన కోసం ఇప్పటికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత బీఆర్ఎస్ ఎంపీల పైనే ఉందని స్పష్టం చేశారు. పునర్విభజన చట్టంలో ఇచ్చిన హామీకి అనుగుణంగా తెలంగాణలోని వెను కబడిన జిల్లాలకు ఐదో ఇన్స్టాల్మెంట్ కింద రూ.450 కోట్ల విడుదల, ఎన్హెచ్ఏఐ సాయంతో ఆదిలాబాద్ సీసీఐ పునరుద్దరణ, రాష్ట్రంలో ఐఐఎం, 23 నవోదయ విద్యాలయాల ఏర్పాటు గురించి ప్రస్తావించాలని కేసీఆర్ చెప్పారు. అలాగే పెండింగులో ఉన్న రైల్వే పనులు వేగవంతం చేసేందుకు నిధుల విడుదల, నీతి ఆయోగ్ సిఫారసు మేరకు మిషన్ కాకతీయకు రూ.5 వేల కోట్లు, మిషన్ భగీ రథకు రూ.19,205 కోట్ల మంజూరు, బయ్యారంలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు, జహీరాబాద్ నిమ్జ్‌కు నిధులు, ఎస్సీల వర్గీకరణ, బీసీ రిజర్వేషన్ల పెంపు తదితర అంశాలు లేవనెత్తాలని సూచించారు. త్వరలో అన్ని కార్యక్రమాలకు..! ఎంపీలు పి.రాములు, బీబీ పాటిల్, పసునూరి దయాకర్, మన్నె శ్రీనివాస్ రెడ్డి, కేఆర్ సురేష్‌రెడ్డి, వెంకటేష్ నేతకాని, బడుగుల లింగయ్య యాదవ్, వద్దిరాజు రవిచంద్ర, మాలోత్ కవిత, పార్థసారథి రెడ్డి, జోగినపల్లి సంతోష్ కుమార్, దేవకొండ దామోదర్ రావు, గడ్డం రంజిత్ రెడ్డి కూడా ఈ భేటీలో పాల్గొన్నారు. తుంటి ఎముక చికిత్స అనంతరం కోలుకుంటూ తొలిసారిగా పార్టీ కార్యక్రమంలో పాల్గొన్న కేసీఆర్, మునుపటి తరహాలో చురుగ్గా ఉన్నారని పలువురు ఎంపీలు తెలిపారు. త్వరలో పార్టీ పరంగా జరిగే అన్ని కార్యక్రమాలకు తాను స్వయంగా హాజరవుతానని కేసీఆర్ చెప్పినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. కాగా లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులకు సంబంధించి ఈ భేటీలో ఎలాంటి ప్రస్తావన రాలేదని సమాచారం. లోక్‌సభ ఎన్నికలపై దిశా నిర్దేశం లోక్‌సభ ఎన్నికల దిశగా పార్టీ పరంగా జరుగు తున్న సన్నద్ధతపైనా కేసీఆర్ సుదీర్ఘంగా మాట్లా డారు. నియోజకవర్గాల వారీ సన్నాహక సమావే శాల్లో కేడర్ నుంచి వచ్చిన ఫీడ్‌బ్యాక్, పార్టీ పరంగా చేపట్టబోయే దిద్దుబాటు చర్యలు, కార్యక్రమాల గురించి తెలియజేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల సరళిని విశ్లేషిస్తూ లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించా ల్సిన వ్యూహాలు, ఎత్తుగడలను వివరించారు. శని వారం నుంచి తిరిగి ప్రారంభమయ్యే లోక్‌సభ ఎన్ని కల సన్నాహక సమావేశాల గురించి ప్రస్తావిస్తూ, పార్లమెంటు సమావేశాల్లో పాల్గొంటూనే ఈ భేటీ లకు ఎంపీలు హాజరుకావాలని ఆదేశించారు. -
ఇది ద్వంద్వ నీతి కాదా?
సాక్షి, హైదరాబాద్/గజ్వేల్: రాజకీయ పార్టీల్లో కొన సాగుతున్నారనే కారణంతో గత బీఆర్ఎస్ ప్రభు త్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి నిరాకరించిన గవర్నర్ తమిళిసై సౌందరరాజన్.. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సిఫారసు చేస్తే, ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడినే ఎమ్మెల్సీగా ఆమోదించారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు విమర్శించారు. ‘ఇది ద్వంద్వ నీతి కాదా? గవర్నర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా వ్యవహరించినట్టు కాదా?’ అని శుక్రవారం ‘ఎక్స్’లో నిలదీశారు. కాంగ్రెస్, బీజేపీల రహస్య మైత్రి మరోసారి బయటపడిందని అన్నారు. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్టబయలైందని చెప్పారు. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై బీఆర్ఎస్ను అణగదొక్కాలని చూస్తున్నాయని ధ్వజమెత్తారు. ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరమని పేర్కొన్నారు. గతంలో కూడా క్రీడా, సాంస్కృతిక, విద్య, సామాజిక, సేవా రంగాల్లో కృషి చేసిన వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసిందని, అప్పుడు కూడా గవర్నర్ రాజకీయ కారణాలతో వాటిని ఆమోదించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సంప్రదాయాలు అన్ని పార్టీల విషయంలో ఒకే రకంగా ఉండాలని, కానీ గవర్నర్ బీఆర్ఎస్కు, కాంగ్రెస్‌కు తేడా చూపిస్తున్నారని విమర్శించారు. ప్రాజెక్టుల అప్పగింత గొడ్డలిపెట్టు లాంటిదే.. కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు (కేఆర్ఎంబీ)కు సాగునీటి ప్రాజెక్టులను అప్పగించాలనే నిర్ణయం తెలంగాణకు గొడ్డలిపెట్టు లాంటిదని హరీశ్‌రావు ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ, మహబూబ్‌నగర్, ఖమ్మం, హైదరాబాద్ జిల్లాలకు తాగు, సాగునీరు, విద్యుత్ అవసరా లకు ఆటంకం కలుగుతుందని చెప్పారు. జల విద్యుత్ ఉత్పత్తిలో రాష్ట్ర ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉండదని అన్నారు. ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో జరి గిన బీఆర్ఎస్పీపీ సమావేశం తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం.. తెలంగాణ నీటి వాటా తేల్చేవరకు, ఇతర మార్గదర్శకాలపై స్పష్టత ఇవ్వకుండా ప్రాజెక్టులను కేఆర్ఎంబీకి అప్పగించే ప్రసక్తే లేద ని తేల్చి చెప్పిందని గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కొత్తగా వచ్చిన కాంగ్రెస్ ప్రభు త్వం.. ఢిల్లీలో సంతకాలు పెట్టిందంటూ కేంద్రం మినిట్స్ విడు దల చేయగా, రాష్ట్ర మంత్రులు మేం సంతకాలు పెట్టలేదని మాట్లాడటం శోచనీయమని అన్నా రు. రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంలో కాంగ్రెస్ ఘోరంగా విఫలమైందని విమర్శించారు. దీనిపై కేంద్ర జలవనరుల శాఖామంత్రిని తమ పార్టీ పార్లమెంటరీ బృందం కలిసి వినతిపత్రం ఇవ్వాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపా రు. కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్పై బురద చల్లడం మానుకొని రాష్ట్ర ప్రయోజనాలను కాపాడటంపై దృష్టి పెట్టాలని అన్నారు. ఆదిలాబాద్‌కు వచ్చిన ప్పుడు సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాను పునరుద్ధరిస్తామని మాట ఇచ్చిన బీజేపీ అగ్రనేత అమిత్‌షా తన మాటను నిలబెట్టుకోవాలని, బీసీ గణన చేపట్టాలని ఈ సందర్భంగా హరీశ్‌రావు డిమాండ్ చేశారు. -
గవర్నర్ వ్యవస్థను అవమానించిన చరిత్ర బీఆర్ఎస్దే
కరీంనగర్ టౌన్: బీఆర్ఎస్ను ప్రజలు రద్దు చేశారని, గవర్నర్ వ్యవస్థను అవమానపర్చిన మూర్ఖత్వపు పార్టీ బీఆర్ఎస్ అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ విరుచుకుపడ్డారు. శుక్రవారం ఆయన కరీంనగర్లో మీడియాతో మాట్లాడారు. ఒక మహిళా గవర్నర్‌ను అసెంబ్లీలో మాట్లాడనీయకుండా అవమానించారని, గవర్నర్ పర్యటనకు ప్రొటోకాల్ పాటించలేదని మండిపడ్డారు. గవర్నర్ అంటే రబ్బర్ స్టాంపులా ఉండాలనుకున్నారని పేర్కొన్నారు. ప్రపంచంలో అనేక దేశాలు తమ తమ రాజ్యాంగాలను మార్చుకున్నాయని, భారత్ మాత్రం రాజ్యాంగాన్ని 105 సార్లు సవరించినా మౌలిక స్వరూపాన్ని మాత్రం మార్చలేదని సంజయ్ గుర్తుచేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ది మూడో స్థానమేనని, ఇంకా గూండాగిరి చేస్తాం.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడతామంటే ప్రజలు బీఆర్ఎస్ నేతలపై తిరుగుబాటు చేస్తారని హెచ్చరించారు. -
ఆ మాటలు గవర్నర్‌కు తగవు
సాక్షి, హైదరాబాద్: ప్రజాస్వామ్యంగా ఎన్నికై పదేళ్లపాటు పనిచేసిన ప్రభుత్వాన్ని నియంతృత్వమని, ప్రజాస్వామ్య విలువలు లేవని చెప్పడం గవర్నర్ స్థాయికి తగదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కె.తారకరామారావు మండిపడ్డారు. బీజేపీ, కాంగ్రెస్ ఫెవికాల్ బంధానికి ఇది నిదర్శనమన్నారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేటీఆర్ తెలంగాణ భవన్లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘తెలంగాణ కోసం కొట్లాడిన దాసోజుశ్రవణ్, కుర్రా సత్యనారాయణ పేర్లను ఎమ్మెల్సీలుగా గవర్నర్ కోటాలో నామినేట్ చేస్తూ డిసెంబర్ 3వ తేదీ ముందు అప్పటి ప్రభుత్వం ప్రతిపాదించింది. అయితే గవర్నర్ రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కి.. ఈ ఇద్దరు రాజకీయ సంస్థలతో సంబంధం కలిగి ఉన్నారనే సాకు చూపుతూ అభ్యరి్థత్వాన్ని తిరస్కరించారు. కానీ ప్రస్తుతం ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడుగా ఉన్న కోదండరాంను కాంగ్రెస్ అదే గవర్నర్ కోటాలో ప్రతిపాదిస్తే గవర్నర్ ఎలా ఆమోదించారు? గవర్నర్ పక్షపాత వైఖరిని తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారు. ఎమ్మెల్యే కోటాలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు అమిత్ షా ఆదేశాల మీద వేర్వేరు నోటిఫికేషన్లు విడుదల చేశారు. దీంతో మాకు రావాల్సిన ఒక ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ సీటు కాంగ్రెస్‌కి వెళ్లింది. తెలంగాణలో కాంగ్రెస్‌ను బలోపేతం చేసేందుకు బీజేపీ కంకణం కట్టుకుని.. కాంగ్రెస్, బీజేపీ తెలంగాణలో క్విడ్ ప్రోకో రాజకీయాలకు పాల్పడుతున్నాయి. ఓవైపు రాహుల్ గాంధీ ఆదానీని విమర్శిస్తే రేవంత్ మరోవైపు అతనితో ఒప్పందాలు చేసుకుంటున్నారు. గవర్నర్ గతంలో తమిళనాడు బీజేపీ అధ్యక్షురాలుగా పనిచేసి ఇప్పుడు కూడా బీజేపీ కార్యకర్తలా వ్యవహరిస్తున్నారు. కానీ ఆమె కాంగ్రెస్‌కు మద్దతు పలకడమే ఆశ్చర్యకరం’’ అని కేటీఆర్ విమర్శించారు. సర్పంచ్ల పదవీ కాలాన్ని పొడిగించాలి గ్రామ పంచాయతీల పాలన ప్రత్యేక ఇన్చార్జిలకు అప్పగించకుండా సర్పంచ్ల పదవీ కాలం పొడిగించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కరోనా మూలంగా రెండేళ్ల పాటు సర్పంచ్‌లు పరిపాలన సాగించలేక పోయారని, ఈ నేపథ్యంలో వారి పదవీ కాలాన్ని కనీసం ఆరు నెలల నుంచి ఏడాది పాటు లేదా తిరిగి ఎన్నిక నిర్వహించేంత వరకు పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు. కాగా, తెలంగాణ భవన్లో జరిగిన రిపబ్లిక్ డే వేడుకల్లో పాల్గొనేందుకు వచి్చన హోం శాఖ మాజీ మంత్రి మహమూద్ అలీ స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. అక్కడే ఉన్న కేటీఆర్ చొరవతో సమీపంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం తిరిగి కోలుకున్న మహమూద్ అలీ తాను క్షేమంగా ఉన్నట్లు ఓ ప్రకటన విడుదల చేశారు. -
బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ.. ఎంపీలకు కేసీఆర్ దిశా నిర్దేశం
సాక్షి, సిద్ధిపేట: కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ భేటీ జరిగింది. ఎర్రవల్లిలోని ఆయన ఫాంహౌస్‌లో జరిగిన ఈ సమావేశంలో పార్లమెంటు ఉభయ సభల్లో, పలు అంశాలపై అనుసరించాల్సిన వ్యూహాలు, చర్చించాల్సిన విధానాలపై ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. సమావేశంలో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు, మాజీ మంత్రి తన్నీరు హరీశ్‌రావు, పార్టీ పార్లమెంటరీ నేతలు కే కేశవరావు, నామా నాగేశ్వరరావు తదితరులు హాజరయ్యారు. తెలంగాణ హక్కుల కోసం పోరాడే దళం బీఆర్ఎస్ పార్టీ ఒక్కటేనని కేసీఆర్ అన్నారు. రాబోయే పార్లమెంటు సమావేశాల్లో బీఆర్ఎస్ ఎంపీలు తెలంగాణ హక్కుల సాధన కోసం గళం విప్పాలన్నారు. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లో తెలంగాణ తరపున బలమైన వాదనలు వినిపించాలి. నదీ జలాల కేటాయింపులు, ఉమ్మడి ఆస్తుల పంపకాలతో పాటు పెండింగ్‌లో వున్న రాష్ట్ర విభజన హామీల సాధన కోసం ఇప్పడికే ఎన్నో పోరాటాలు చేసిన చరిత్ర బీఆర్ఎస్ పార్టీదని ఆయన పేర్కొన్నారు. నాడైనా నేడైనా తెలంగాణ హక్కులకు భంగం వాటిల్లే సందర్భాల్లో అడ్డుకుని కాపాడలవలసిన బాధ్యత మరోసారి బీఆర్ఎస్ ఎంపీలదేనన్నారు. కాగా, కేసీఆర్‌కు ఇటీవల తుంటి మార్పిడి శస్త్ర చికిత్స జరిగిన విషయం తెలిసిందే. శస్త్రచికిత్స అనంతరం హైదరాబాద్‌లోని తన నివాసంలో కొన్ని రోజులు విశ్రాంతి తీసుకున్న ఆయన ప్రస్తుతం పార్టీ కార్యక్రమాలపై దృష్టి పెట్టారు.. సర్జరీ అనంతరం నేడు తొలిసారిగా పార్టీ నేతలతో సమావేశమయ్యారు. లోక్ సభ ఎన్నికల్లో అధిక స్థానాల్లో విజయం సాధించేలా బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. శాసనసభ ఎన్నికల్లో ఎదురైన ప్రతికూల ఫలితాలను అన్ని కోణాల్లో పోస్ట్‌మార్టం చేసిన బీఆర్ఎస్.. త్వరలో జరిగే లోక్‌సభ ఎన్నికల ప్రణాళికపై దృష్టి సారించింది. లోక్‌సభ ఎన్నికలను కాంగ్రెస్, బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న నేపథ్యంలో మెజారిటీ సీట్లను కైవసం చేసుకోవడం ద్వారా రెండు జాతీయ పార్టీలపై పైచేయి సాధించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఓ వైపు ఎన్ని కల సన్నద్ధతను వేగవంతం చేస్తూనే, మరోవైపు అభ్యర్థుల ఎంపిక ప్రక్రియపైనా దృష్టి సారించారు. -
తెలంగాణ నుంచే బీజేపీ ఎన్నికల శంఖారావం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ నుంచే బీజేపీ ఎన్నికల శంఖారావం పూరించనుంది. దేశ వ్యాప్తంగా పార్లమెంట్ నియోజక వర్గాలను 143 క్లస్టర్స్‌గా విభజించగా, తెలంగాణలోని 17 పార్లమెంట్ స్థానాలను 5 క్లస్టర్స్‌గా విభజన చేశారు. దేశంలోనే మొదటి క్లస్టర్ మీటింగ్ ఈ నెల 28న పాలమూరులో ఏర్పాటు చేయనున్నారు. క్లస్టర్ మీటింగ్‌కు కేంద్ర హోంశాఖ మంత్రి, బీజేపీ అగ్రనేత అమిత్ షా హాజరుకానున్నారు. ఈ నెల 28న అమిత్ షా తెలంగాణ పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 28న ఆయన మూడు జిల్లాల్లో పర్యటించనున్నారు. మధ్యాహ్నం ఒంటి గంటకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు రానున్న అమిత్ షా.. 1.10కి బేగంపేట నుంచి మహబూబ్‌నగర్ బయలుదేరానున్నారు. మధ్యాహ్నం 1.50కి మహబూబ్ నగర్ సుదర్శన్ ఫంక్షన్ హాలులో జరగనున్న క్లస్టర్ మీటింగ్‌లో షా పాల్గొననున్నారు. అనంతరం 2.55 గంటలకు మహబూబ్‌నగర్ నుంచి కరీంనగర్ బయలుదేరతారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు కరీంనగర్ క్లస్టర్ మీటింగ్‌లో పాల్గొంటారు. 5 గంటల 15 నిమిషాలకు కరీంనగర్ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్న షా.. 6.15 నుంచి 7.05 నిమిషాల వరకు హైదరాబాద్ జేఆర్సీ కన్వెన్షన్ హాలులో మీటింగ్‌లో పాల్గొనున్నారు. అనంతరం 7.45 గంటలకు బేగంపేట నుంచి ఆయన తిరిగి వెళ్లనున్నారు. -
తల్లిగా కవితకు ఆ బాధ తెలియదా..? జీవన్ రెడ్డి ఫైర్
జగిత్యాల జిల్లా: నిరుపేద నిరుద్యోగ యువకుడి బలవన్మరణం కేసులో ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యలపై ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. యువకుడి బలవన్మరణానికి కారణం అయిన వ్యక్తి జైల్లో ఉంటే వాస్తవాలు తెలియకుండా కవిత ఆరోపణలు చేయడం విడ్డూరమని అన్నారు. బీఆర్ఎస్ నేతలను కాంగ్రెస్ ప్రభుత్వం భయపెడుతుందని భావించడం వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తున్నామని చెప్పారు. గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చేసినట్టే అందరూ చేస్తారనుకోవడం విచారకరమని అన్నారు. 'సారంగాపూర్ మండలం బట్టపల్లిలో శివ నాగేశ్వర్ అనే యువకుడు ఉరి వేసుకొని చనిపోతే A4గా ఉన్న సర్పంచ్ రాజేశ్వర్ రెడ్డిని సైతం అరెస్ట్ చేయాలని రిపోర్ట్ లో ఉంది. అప్పుడు రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఫ్రెండ్లీ పోలీస్ కాబట్టే నేర నిర్ధారణ జరిగినా కూడా నిందితుడైన సర్పంచును పరారీలో చూపెట్టారు. రెండున్నర మాసాలు బీఆర్ఎస్ అభ్యర్థి గెలుపు కొరకు ఎన్నిక ప్రక్రియలో బిజీగా ఉన్నాడు. సర్పంచ్ ఊరిలో ఉన్నా పోలీసులకు తెలియకపోవడం విచారకరం. ఎన్నికల్లో వెసులుబాటు కల్పించడానికి ఈ కుట్రకు తెరలేపారు. వాస్తవంగా పోలీసులపైనే చర్యలు తీసుకోవాలి. ఎవరు ఎవరికీ ఫ్రెండ్లి పోలీసో కవిత సమాధానం చెప్పాలి.' అని జీవన్ రెడ్డి అన్నారు. చట్టం, పోలీస్ వ్యవస్థ పట్ల విశ్వాసం కోల్పోయి శివనాగేశ్వర్ ప్రాణం అర్పించుకున్నాడని జీవన్ రెడ్డి తెలిపారు. కొడుకును కోల్పోయిన తల్లి హృదయం ఏ విధంగా ద్రవించిందో ఒక తల్లిగా కవితకు తెలియదా..? అని ప్రశ్నించారు. ఆ బాధిత మృతుని తల్లిని కవిత పరామర్శిస్తే సంతోషించే వాడినని అన్నారు. ఎంతవరకు రాజకీయ కోణం తప్ప మానవత్వం లేదా..? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీకి పోలీసులు ఫ్రెండ్లీ కాబట్టి సర్పంచును అబ్ స్క్యాండింగ్ గా చూపించారని ఆరోపించారు. ఈ ఘటనపై ఎస్పీ స్థాయిలో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: వారానికి రెండు ఢిల్లీ టూర్లు -
తమిళిసై.. ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి: కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారని అన్నారు. అలాగే, గవర్నర్ వ్యవహరిస్తున్న పక్షపాత తీరును తెలంగాణ రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ ఉద్యమం కోసం కొట్లాడిన దాసోజు శ్రవణ్, ఎరుకల సామాజికవర్గానికి చెందిన సత్యనారాయణను గత ప్రభుత్వం నామినేట్ చేస్తే రాజకీయ సంబంధాలున్నాయని చెప్పి అభ్యర్థిత్వాలను తిరస్కరించారు. కానీ, నేడు ఒక పార్టీ అధ్యక్షులుగా ఉన్న కోదండరామ్‌ను ఎలా ఆమోదిస్తున్నారు. ప్రభుత్వం నుంచి లేఖ రాగానే గవర్నర్ తమిళిసై ఆగమేఘాల మీద స్పందించారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చే జీతంతో గవర్నర్ పనిచేస్తున్నారు. రాజభవన్ నడుస్తుంది.. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి. మీరు రేవంత్ రెడ్డికి కాదు బాధ్యులు కాదు.. రాష్ట్ర ప్రజలకి బాధ్యులు అనే విషయం గుర్తుంచుకోవాలి. ఆనాడు కనిపించిన రాజకీయ నేపథ్యం.. ఈరోజు ఎందుకు కనిపించడం లేదు. కాంగ్రెస్, బీజేపీకి ఉన్న ఫెవికాల్ బంధం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారా? అనే విషయం చెప్పాలి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అహంకారం, చేష్టలు చూస్తుంటే వాళ్లు ఇంకా ప్రతిపక్షంలో ఉన్నామనుకుంటున్నారు. రాజకీయాల్లో ఇలాంటి కుసంస్కారం ఉన్న వ్యక్తులు ఉన్నప్పుడు ఇలాంటి విమర్శలు తప్పవు. ఒకటే రోజు రాజీనామా చేసిన ఎమ్మెల్సీలకు ఒకటే బులిటిన్ ద్వారా రాజీనామా ఆమోదించారు. రేవంత్ రెడ్డి వెళ్లి అమిత్ షాను కలవగానే ఒకే ఎన్నిక కాకుండా వేరువేరుగా ఎన్నికలు జరిగేటట్టు నిర్వహించారు. ఒకేసారి ఎన్నిక జరిగితే ఒకటి బీఆర్ఎస్కు, మరొకటి కాంగ్రెస్‌కు వచ్చేవి. కాంగ్రెస్ పార్టీకి బీజేపీ జాకీలు పెట్టి మద్దతుగా నిలుస్తోంది. బండి సంజయ్ కూడా మొన్న కాంగ్రెస్, బీజేపీ కొట్లాడుకోవద్దు బీఆర్ఎస్ అంతం చూద్దామని చెప్పారు. నిన్న గుంపు మేస్త్రి కూడా ఇదే మాట చెప్పారు అంటూ కీలక వ్యాఖ్యలు చేశారు. -
ఇది ద్వంద్వ నీతి కాదా?.. తమిళిసైపై హరీష్ రావు సీరియస్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్, బీజేపీపై మాజీ మంత్రి హరీష్‌రావు సీరియస్ కామెంట్స్ చేశారు. అలాగే, తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్‌పై కూడా హరీష్ ఫైరయ్యారు. ద్వంద్వ నీతి కాదా? అని గవర్నర్‌ను ప్రశ్నించారు. దీంతో, తెలంగాణలో మరోసారి రాజకీయం రసవత్తరంగా మారింది. మాజీ మంత్రి హరీష్ రావు ట్విట్టర్ వేదికగా..‘కాంగ్రెస్, బీజేపీల రహస్యమైత్రి మరోసారి బయటపడింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలైంది. బీజేపీ ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ తమిళిసై వ్యవహరిస్తున్నారు. రాజకీయ పార్టీల్లో కొనసాగుతున్నారనే కారణంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వం సిఫారసు చేసిన అభ్యర్థులను ఎమ్మెల్సీలుగా నియమించడానికి ఈ గవర్నర్ నిరాకరించారు. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏకంగా ఓ రాజకీయ పార్టీ అధ్యక్షుడినే సిఫారసు చేస్తే గవర్నర్ ఆమోదించారు. ఇది ద్వంద్వ నీతి కాదా?. కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా గవర్నర్ వ్యవహరించడం కాదా? గతంలో కూడా క్రీడా, సాంస్కృతిక, విద్యా సామాజిక, సేవా రంగాల్లో కృషి చేసిన వారిని బీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్సీలుగా సిఫారసు చేసింది. అప్పుడు కూడా గవర్నర్ రాజకీయ కారణాలతో వాటిని ఆమోదించలేదు. మరి ఇప్పుడు ఎందుకు ఆమోదించారు?. రాష్ట్రంలో కాంగ్రెస్, రెండు పార్టీలు ఒక్కటై బీఆర్ఎస్ పార్టీని అణగదొక్కాలని చూస్తున్నాయి. ఈ కుట్రలో గవర్నర్ స్వయంగా భాగస్వామి కావడం అత్యంత దురదృష్టకరం. న్యాయ సూత్రాలు, రాజ్యాంగ సాంప్రదాయాలు అన్ని పార్టీలకు ఒకే రకంగా ఉండాలి. కానీ బీఆర్ఎస్కు, కాంగ్రెస్‌కు తేడా చూపిస్తున్నారు’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. కాంగ్రెస్ , బిజెపిల రహస్యమైత్రి మరోసారి బయటపడింది. గవర్నర్ కోటా ఎమ్మెల్సీల నియామకంలో రెండు పార్టీల మధ్య ఉన్న అవగాహన బట్ట బయలు అయింది. బిజెపి ఎజెండాకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీకి మేలు చేసే విధంగా గవర్నర్ గారు వ్యవహరిస్తున్నారు. రాజకీయ పార్టీల్లో… — Harish Rao Thanneeru (@BRSHarish) January 26, 2024 -
స్పీకర్ గడ్డం ప్రసాద్, తమ్మినేనిని పరామర్శించిన సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. స్పీకర్ గడ్డం ప్రసాద్, సీపీఎం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రాన్ని పరామర్శించారు. వారి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివరాల ప్రకారం.. నాంపల్లిలోని పబ్లిక్ గార్డెన్స్‌లో రిపబ్లిక్ డే వేడుకలు జరిగాయి. ఈ వేడుకలకు సీఎం రేవంత్ రెడ్డి హాజరయ్యారు. అనంతరం, సీఎం రేవంత్.. న్యూ ఎమ్మెల్యే క్వార్టర్స్‌కు వెళ్లారు. ఈ క్రమంలో శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌ను కలిసి పరామర్శించారు. కాగా, ఇటీవలే స్పీకర్ ప్రసాద్ అనారోగ్యానికి గురయ్యారు. మరోవైపు.. తమ్మినేని వీరభద్రాన్ని కూడా సీఎం రేవంత్ పరామర్శించారు. గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రికి వెళ్లిన సీఎం రేవంత్.. తమ్మినేనిని పరామర్శించారు. కాగా, తమ్మినేనికి ఇటీవల స్ట్రోక్ రావడంతో ఆసుపత్రిలో చేరిన విషయం తెలిసిందే. దీంతో, ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. -
అహంకారంతో ఇష్టానుసారం వ్యాఖ్యలు
వేములవాడ: అధికారం కోల్పోయి కూడా కేటీఆర్ అహంకారంతో బుద్ధిలేకుండా మాట్లాడుతున్నారని, తమ ప్రభుత్వంపై లేనిపోని వ్యాఖ్యలు చేస్తున్నారని పంచాయతీరాజ్, స్త్రీ, శిశుసంక్షేమశాఖ మంత్రి సీతక్క ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్నసిరిసిల్ల జిల్లా వేములవాడ రాజన్నను గురువారం దర్శించుకున్న అనంతరం మంత్రి సీతక్క విలేకరులతో మాట్లాడారు. తొమ్మిదేళ్ల గడీల పాలన నుంచి విముక్తి పొందేందుకు రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్‌కు అధికారం కట్టబెట్టారని స్పష్టం చేశారు. కేసీఆర్ ఎమ్మెల్యేగా గెలిచి కూడా ఇంకా ప్రమాణస్వీకారం చేయడం లేదని, అధికారం ఉంటేనే ప్రజల్లోకి వచ్చే ఆలోచనలో తండ్రీకొడుకులు ఉన్నారని ఎద్దేవా చేశారు. ప్రజలు ఇచ్చిన ప్రతిపక్ష హోదాలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలని హితవు పలికారు. వంద రోజుల్లో ఆరు గ్యారంటీలు అమలు చేస్తామని ప్రకటిస్తే.. ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. సర్పంచ్‌లకు పెండింగ్ బిల్లులు పెట్టింది గత ప్రభుత్వం కాదా?.. అని సీతక్క ప్రశ్నించారు. ప్రజాసంక్షేమాన్ని గాలి కొదిలేసి తమకిష్టమైన పనులు చేసుకుంటూ రాష్ట్రా న్ని దివాళా తీయించారని మండిపడ్డారు. వేముల వాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై సీఎం రేవంత్‌రెడ్డి ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం నిర్వహించబోతున్నట్లు మంత్రి ప్రకటించారు. ప్రతి నెల 5వ తేదీలోగా ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలు అందేలా చూస్తున్నట్లు తెలిపారు. -
మోదీ ఓటమే లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: పదేళ్లుగా దేశ ప్రజలను మోసం చేస్తూ, ఏదో ఒక అంశాన్ని తీసుకొని ఎన్నికలకు వెళ్లి లబ్ధి పొందే ప్రధాని మోదీని గద్దె దించడమే లక్ష్యంగా కాంగ్రెస్ కార్యకర్తలు పనిచేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే పిలుపునిచ్చారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చిన 6 గ్యారంటీలను అమలు చేస్తుంటే, మోదీ ఎన్నికల ముందు తన గ్యారంటీ పేరిట ఇచ్చిన ఒక్క హామీని కూడా అమలు చేయలేదని విమర్శించారు. మోదీ ప్రధాని అయ్యాక దేశంలో ప్రజాస్వామ్యం సర్వనాశనం అయిందని, పార్లమెంటులో ప్రశ్నించిన 140 మంది ఎంపీలను సస్పెండ్ చేశారని ధ్వజమెత్తారు. గురువారం హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్ బూత్ స్థాయి నాయకుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమానికి ఖర్గే ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. దేశంలోని ప్రతి ఇంట్లో దేవుడు ఉన్నాడు ‘దేశంలో యువశక్తి నిరుద్యోగంతో సతమతమవుతోంది. రైతులు కనీస మద్దతు లేక ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. కార్మీకులు, మహిళలు, అణగారిన వర్గాల ప్రజలు తీవ్ర కష్టాలను అనుభవిస్తోంటే.. మోదీ భగవంతుని పేరిట పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారు. యువతకు పని దొరికితే, ఉద్యోగాలు ఉంటే ఉపయోగం తప్ప భగవంతుని ఫొటోతో కడుపు నిండుతుందా? దేశంలోని ప్రతి ఇంట్లో దేవుడు ఉన్నాడు. కానీ మోదీ దేవుడు తమ దగ్గరే ఉన్నట్టు ప్రచారం చేసుకుంటారు. ఆకలి అయినవాడికి అన్నం పెట్టాలి.. ఉపాధి లేని వారికి ఉద్యోగం ఇవ్వాలి..కానీ మోదీ ఎన్నికల రాజకీయాలు, ప్రచారంతోనే కాలం గడుపుతున్నారు. ప్రజల సొమ్ముతో ఆయన ప్రచారం చేసుకుంటున్నారు. మొన్న అయోధ్యలో మోదీ ఒక్కరే గర్భ గుడిలో పూజలు చేశారు. చివరకు అద్వానీ, మనోహర్ జోషిలను కూడా రానివ్వలేదు. ఎన్నికలకు ముందు ఏదైనా సమస్యను సృష్టించి ఆ అంశాన్ని వాడుకొని లబ్ధి పొందడం మోదీకి అలవాటే. పాకిస్తాన్, చైనా, భగవంతుడు..ఇలా ఏదో ఒక అంశాన్ని తెరపైకి తెస్తారు..’అని ఖర్గే విమర్శించారు. మనకు మోదీతోనే యుద్ధం: రేవంత్‌రెడ్డి తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించాలని ముఖ్యమంత్రి, టీపీసీసీ అధ్యక్షుడు ఎ.రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభ సీట్లలో 14 గెలిచి, రాహుల్‌గాం«దీని ప్రధానమంత్రిని చేయడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. మనకు మోదీతోనే యుద్ధం అని, గల్లీలో ఉన్న బిల్లా, రంగాలతో కాదని ఎద్దేవా చేశారు. జనాలు బీఆర్ఎస్ను ఊరికే ఓడగొట్టలేదని, ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదు కాబట్టే ఇంటికి పంపారని అన్నారు. ప్రభుత్వం ఏర్పడ్డ వంద రోజుల లోపు ఇచ్చిన హామీలు అమలు చేసేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. ఇప్పటికే రెండు గ్యారంటీలు అమలు చేసిన తాము ఫిబ్రవరిలో మరో రెండు గ్యారంటీలు అమలు చేయనున్నట్లు తెలిపారు. ఫిబ్రవరి నెలాఖరు వరకు రైతుభరోసా ద్వారా నగదు బదిలీ జరుగుతుందని చెప్పారు. ‘నన్ను మేస్త్రీ అని ట్రోల్ చేస్తున్నారు. రేవంత్‌రెడ్డి నిజంగానే మేస్త్రీనే.. మీరు విధ్వంసం చేసిన రాష్ట్రాన్ని సరిచేసే మేస్త్రీని నేను. మీకు 100 మీటర్ల లోతులో ఘోరీ కట్టే మేస్త్రీని..’అని అన్నారు. పులిని రమ్మనండి..బోను రెడీగా ఉంది ఈ నెలాఖరులో ఇంద్రవెల్లి నుంచి తన లోక్‌సభ ఎన్నికల ప్రచారం ప్రారంభిస్తానని రేవంత్‌రెడ్డి చెప్పారు. వారంలో మూడు రోజులు కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి జిల్లాల్లో పర్యటిస్తానని తెలిపారు. ‘లోక్‌సభ ఎన్నికల్లో గెలిచి బిల్లా, రంగాలను తెలంగాణ సరిహద్దులను దాటిస్తాం. వాళ్లు ఎక్కువ తక్కువ మాట్లాడుతున్నారు. చార్లెస్ శోభరాజ్ ఇంట్లో దుప్పటి పట్టుకుని పడుకున్నాడు. పులి బయటికి వస్తుంది అంటున్నారు కదా.. రమ్మని చెప్పండి. బోను పట్టుకుని రెడీగా ఉన్నాం’అని వ్యాఖ్యానించారు. మోదీ, కేడీ రెండూ ఒక్కటేనని, నాణేనికి మోదీ ఒకవైపు, కేసీఆర్ మరోవైపు అని ధ్వజమెత్తారు. ఇక్కడ గెలిచిన ఒకటో రెండో సీట్లు కూడా కేసీఆర్ మోదీకి తాకట్టు పెడతారని వ్యాఖ్యానించారు. ప్రతి ఒక్కరూ ప్రతినబూనాలి: దీపాదాస్ మున్షీ రాహుల్‌గాం«దీని ప్రధానిని చేయడమే లక్ష్యంగా బూత్ లెవల్ నాయకులు పని చేయాలని పార్టీ రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షీ పిలుపునిచ్చారు. తెలంగాణలో ప్రభుత్వం ఏర్పాటైన విధంగా ఢిల్లీలో కూడా కాంగ్రెస్‌ను అధికారంలోకి తెస్తామని ప్రతి ఒక్కరూ ప్రతిజ్ఞ తీసుకోవాలని కోరారు. అసెంబ్లీ ఎన్నికల్లో బూత్ స్థాయిలో అధిక ఓట్లు తీసుకొచ్చిన ఏజెంట్లకు ఈ సందర్భంగా ప్రశంసాపత్రాలు అందజేశారు. చేతగానితనంగా భావిస్తే తడాఖా చూపిస్తాం: భట్టి రాష్ట్రంలో ప్రతిపక్ష పారీ్టలను ప్రజాస్వామ్యయుతంగా గౌరవించాలనే ఆలోచనతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు వెళ్లడాన్ని చేతగానితనంగా భావిస్తే తడాఖా చూపిస్తామని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క హెచ్చరించారు. ప్రజాతీర్పును జీర్ణించుకోలేక బీఆర్ఎస్ నేతలు నోటికి వచ్చినట్టు అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండిపడ్డారు. బట్టలు ఊడదీసి కొడతామంటే ఎవరూ చేతులు ముడుచుకొని లేరని, కాంగ్రెస్ కార్యకర్తలు కన్నెర్ర చేస్తే రాష్ట్రంలో బీఆర్ఎస్ మిగలదని అన్నారు. బట్టలు విప్పి చూపించేందుకు సిద్ధం: మంత్రి పొన్నం కరీంనగర్ జిల్లాలో ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఎమ్మెల్యేలుగా గెలిస్తే ఓర్వలేకనే మాజీ మంత్రి కేటీఆర్ బట్టలు ఊడదీస్తానని అంటున్నాడని మంత్రి పొన్నం ప్రభాకర్ విమర్శించారు. బట్టలు విప్పడం ఎందుకు, ఆయనకు చూడాలనిపిస్తే తనతో పాటు కవ్వంపల్లి సత్యనారాయణ, ఆది శ్రీనివాస్, మేడిపల్లి సత్యం బట్టలు ఇప్పి చూపించేందుకు సిద్ధమని అన్నారు. కల్వకుంట్ల కుటుంబం దోచుకొని, దాచుకున్న సొమ్ము కక్కాల్సిందేనని మాజీ ఎంపీ మధుయాష్కీ గౌడ్ అన్నారు. అధికారుల దగ్గరే అన్ని కోట్ల రూపాయలు దొరికితే, వారిపై పెత్తనం చేసిన కల్వకుంట్ల ఫ్యామిలీ ఇళ్లల్లో సోదాలు నిర్వహిస్తే మరెన్ని వేల కోట్లు బయటపడతాయో అని వ్యాఖ్యానించారు. మోదీ, అమిత్ షాలతో అప్రమత్తంగా ఉండాలి ‘ఎక్కడ బలహీనంగా ఉంటే అక్కడి ప్రభుత్వాలను మోదీ, అమిత్ షాలు పడగొడతారు. కానీ తెలంగాణ లో గతంలో ఉన్న కాంగ్రెస్ లేదు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో చాలా పటిష్ట మైన కాంగ్రెస్ ఉంది. ఎన్నికల్లో బీజే పీ, బీఆర్ఎస్ రెండింటినీ కాంగ్రెస్ ఓడించింది. దీన్నిబట్టి ఇక్కడ కాంగ్రెస్ ఎంత బలంగా ఉందో అర్ధం చేసుకోవాలి. తెలంగాణలో వచ్చిన ఫలితాలే లోక్‌సభ ఎన్నికల్లోనూ రావాలి. తెలంగాణలో ప్రభుత్వ, రేవంత్‌రెడ్డి పనితీరు ఆదర్శంగా ఉంది. అయితే బీజేపీ భయపెట్టే ప్రయత్నం చేస్తోంది. కానీ బీజేపీకి తెలంగాణలో ఎవరూ భయపడరు. మోదీ, షాలు ఈడీ, సీబీఐ, ఐటీలను ప్రయోగించే ప్రమాదం ఉంది. రేవంత్‌తో పాటు కాంగ్రెస్ నేతలంతా చాలా అప్రమత్తంగా ఉండాలి..’అని ఖర్గే అన్నారు. -
ఎమ్మెల్సీగా కోదండరాం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ జన సమితి రాష్ట్ర అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం రాష్ట్ర శాసన మండలి సభ్యునిగా నియమితులయ్యారు. ఆయనతో పాటు సియాసత్ ఉర్దూ దిన పత్రిక అసిస్టెంట్ ఎడిటర్ మీర్ ఆమేర్ అలీఖాన్‌ను కూడా సభ్యుడిగా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం పంపిన ప్రతిపాదనను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదించారు. గవర్నర్ కార్యాలయం గురువారం ఈ మేరకు ప్రకటన చేసింది. ప్రొఫెసర్ కోదండరాంను విద్యావేత్తల కోటాలో, ఆమేర్ అలీఖాన్‌ను జర్నలిస్టుల కోటాలో మండలి సభ్యులుగా ప్రభుత్వం సిఫారసు చేసింది. గత ప్రభుత్వం దాసోజు శ్రావణ్, కుర్రా సత్యనారాయణలను గవర్నర్ కోటా కింద ఎమ్మెల్సీలుగా సిఫారసు చేయగా..వారి రాజకీయ నేపథ్యం కారణంగా ఆ ప్రతిపాదనను తమిళిసై తిరస్కరించిన విషయం విదితమే. ప్రస్తుతం వీరి స్థానంలోనే కోదండరాం, మీర్ ఆమేర్ అలీ ఖాన్‌ను నియమించారు. పెద్దల సభకు ఉద్యమ సారథి కోదండరాం సార్‌గా సుపరిచితుడైన ముద్దసాని కోదండరాం స్వగ్రామం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని నెన్నెల మండలం జోగాపూర్. 1955 సెప్టెంబర్ 5న ముద్దసాని వెంకటమ్మ, ఎం.జనార్దన్ రెడ్డి దంపతులకు జన్మించారు. హనుమకొండ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో డిగ్రీ , ఓయూలో పీజీ (పొలిటికల్ సైన్స్), జేఎన్‌యూలో ఎంఫిల్ పూర్తి చేశారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పీహెచ్డీ కోసం చేరగా.. 1981లో ఉస్మానియా విశ్వ విద్యాలయంలో ఉద్యోగం రావడంతో పీహెచ్డీ మధ్యలో ఆపేశారు. ఆదివాసీల సమస్యలపై దివంగత హక్కుల నేత బాలగోపాల్, ప్రొఫెసర్ బియ్యాల జనార్దన్‌రావుతో కలిసి పని చేశారు. ఓయూలో ప్రొఫెసర్‌గా సుదీర్ఘ కాలం పనిచేసిన కోదండరాం..దివంగత ప్రొఫెసర్ జయశంకర్, ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సహా అనేక మంది ప్రముఖ తెలంగాణవాదులతోనూ కలిసి పనిచేశారు. ఉద్యమ సమయంలో రాజకీయ జేఏసీ చైర్మన్‌గా అన్ని పార్టీలను తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏకం చేయడంలో క్రియాశీలంగా పని చేశారు. రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఇప్పటి బీఆర్ఎస్ విధానాలతో విభేదించారు. ప్రజాస్వామిక తెలంగాణ పేరిట 2018 మార్చి 31వ తేదీన తెలంగాణ జన సమితిని ఏర్పాటు చేశారు. ఆ ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టీజేఎస్ కాంగ్రెస్‌తో కలిసి పని చేసింది. అదే క్రమంలో ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాంగ్రెస్‌తో జత కట్టారు. దీనితో పాటు ఉద్యమ నేపథ్యం, ప్రొఫెసర్‌గా ఆయన అందించిన సేవలను పరిగణనలోకి తీసుకొని ప్రభుత్వం ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. జర్నలిజంలో విశేష కృషి జర్నలిజంలో విశేష సేవలందించిన ఆమేర్ అలీఖాన్ (సియాసత్ ఉర్దూ దినపత్రిక రెసిడెంట్ ఎడిటర్ జాహెద్ అలీఖాన్ కుమారుడు) ఉస్మానియా యూనివర్సిటీ నుంచి బీసీఏ, తరువాత సుల్తాన్–ఉల్–ఉలూమ్ కాలేజీ ఆఫ్ బిజినెస్ అడ్మిని్రస్టేషన్ నుంచి ఎంబీఏ చేశారు. ప్రస్తుతం సియాసత్‌లో న్యూస్ ఎడిటర్‌గా ఉన్న ఆయన..ప్రతిక కర్ణాటక రాష్ట్రానికి విస్తరించేందుకు విశేష కృషి చేశారు. పలు అంతర్జాతీయ ఈవెంట్లను కవర్ చేయడానికి ప్రధానమంత్రి, రాష్ట్రపతిల వెంట విదేశీ పర్యటనలకు వెళ్లారు. మైనారిటీల్లో విద్య, నైపుణ్యాన్ని వృద్ధి చేయడానికి, నిరుద్యోగుల కోసం కోచింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసి ఉచితంగా శిక్షణ ఇప్పించేవారు. హైదరాబాద్ కేంద్రంగా ఉన్న సియాసత్ ప్రస్తుతం ఖతర్ దేశానికి కూడా విస్తరించింది. 1973 అక్టోబర్ 18న హైదరాబాద్‌లో జన్మించిన అమేర్ అలీ ఖాన్‌కు ఉర్దూతో పాటు ఇంగ్లి‹Ù, హిందీ, అరబిక్, తెలుగు భాషలు తెలుసు. హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో ప్రాథమిక విద్యను అభ్యసించారు. -
వారానికి రెండు ఢిల్లీ టూర్లు
సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి పదవి చేపట్టిన 45 రోజుల్లో రేవంత్ రెడ్డి సాధించింది.. వారానికి రెండు సార్లు ఢిల్లీ పర్యటనలు చేయడం మాత్రమేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు విమర్శించారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఢిల్లీ నుంచి పాలన జరుగుతుందని తాము చెప్పిందే నిజమవుతోందని అన్నారు. గురువారం ఆయన తెలంగాణ భవన్లో మీడియాతో ఇష్టాగోష్టి నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, దావోస్ పర్యటనలో ప్రపంచ ఆర్థిక వేదికపై రైతుభరోసా ఇచ్చామని పచ్చి అబద్ధాలు చెప్పిన రేవంత్‌రెడ్డి.. తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పేరు మార్పుపై చర్చిస్తున్నాం.. పార్లమెంట్ నియోజకవర్గాల వారీగా నిర్వహించిన సమీక్షా సమావేశంలో వచ్చిన అభిప్రాయాల మేరకు బీఆర్ఎస్ పార్టీ పేరును మార్చే అంశంపై చర్చిస్తున్నామని కేటీఆర్ వెల్లడించారు. తాను వచ్చే లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తానంటూ జరుగుతున్న ప్రచారాన్ని ఆయన ఖండించారు. తాను లోక్‌సభకు పోటీ చేసేది లేదని స్పష్టం చేశారు. సీఎం, మంత్రులు.. పరస్పర విరుద్ధ ప్రకటనలు ‘అంతర్జాతీయ సంస్థలు, బహుళ జాతి కంపెనీలతో సామాజిక న్యాయం, సమానత్వం, ఉద్యోగ, ఉపాధి కల్పన సాధ్యం కాదని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అంటున్నారు. దేశంలో ఆర్థిక సంస్కరణల పేరిట బహుళ జాతి కంపెనీలకు ద్వారాలు తెరిచిందే కాంగ్రెస్. గతంలో నేను దావోస్ పర్యటనకు వెళితే స్విస్ బ్యాంకుల్లో డబ్బు దాచుకునేందుకు వెళ్లానని విమర్శించారు. ఉత్తమ్ లాంటి నేతలు దావోస్ బోగస్ అన్నారు. ఇప్పుడు రేవంత్ అదే పనిచేశారా? అని కేటీఆర్ ప్రశ్నించారు. అటెన్షన్ డైవర్షన్ పనులు ‘ప్రభుత్వం ఏర్పడిన కొద్ది కాలంలోనే అన్ని వర్గాల నుంచి విపరీతమైన వ్యతిరేకతను కాంగ్రెస్ ఎదుర్కొంటోంది. హామీల అమలు నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకు ప్రభుత్వం అటెన్షన్ డైవర్షన్ పనులకు పాల్పడుతోంది. ఎన్నికల కోడ్‌ను సాకుగా చూపి తప్పించుకునేందుకు చూస్తే మేము వదిలేది లేదు. కృష్ణా నదీ యాజమాన్య బోర్డు (కేఆర్ఎంబీ) అంశంలో తెలంగాణ ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి శాశ్వతంగా తాకట్టు పెట్టింది’అని కేటీఆర్ దుయ్యబట్టారు. కేసీఆర్‌పై జాతీయ పార్టీల కుట్ర ‘లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కై కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టేందుకు కుట్ర పన్నిన విషయం స్పష్టంగా తెలుస్తోంది. రేవంత్, బండి సంజయ్‌ల వ్యాఖ్యలు దీనికి అద్దం పడుతున్నాయి. గత పార్లమెంటు ఎన్నికల తరహాలోనే ఈ రెండు పార్టీలు ఈసారి కూడా కుమ్మక్కయ్యాయి. పార్లమెంటు ఎన్నికలు త్వరగా వస్తాయనే సమాచారం మాకు ఉంది. ఈ నెల 27 నుంచి ఫిబ్రవరి 10లోపు రోజుకు సగటున పది అసెంబ్లీ నియోజకవర్గాల చొప్పున పార్లమెంటు ఎన్నికల సన్నద్ధత సమావేశాలు జరుగుతాయి. త్వరలో 31వేలకు పైగా పోలింగ్ బూత్‌లకు సంబంధించి 31వేలకు పైగా సోషల్ మీడియా కార్యకర్తలతో ‘తెలంగాణ బలగం’పేరిట నెట్వర్క్ ఏర్పాటు చేస్తాం. సోషల్ మీడియాను కూడా బలోపేతం చేస్తూ క్షేత్ర స్థాయి సమాచారం పార్టీకి అందేలా యూ ట్యూబ్ చానెళ్లు.. ఇతరత్రా వేదికలు ఏర్పాటు చేస్తాం’అని కేటీఆర్ పేర్కొన్నారు. కేంద్రంలో ఏర్పడే ప్రభుత్వంలో ప్రాంతీయశక్తులే కీలకం మోసం కాంగ్రెస్ నైజమని, నయవంచనకు నిలువెత్తు రూపం అయినందునే ఆదిలోనే ఇండియా కూటమికి బీటలు ఏర్పడ్డాయని కేటీఆర్ ‘ఎక్స్’లో పేర్కొన్నారు. మోదీ, బీజేపీని ఎదుర్కొనే సత్తా కాంగ్రెస్‌కుగానీ, ఇండియాకూటమికి గానీ లేదన్నారు. మిత్రపక్షాలు దూరం కావడమే ఇందుకు నిదర్శనంగా పేర్కొన్నారు. తెలంగాణలో కేసీఆర్, బెంగాల్లో మమతాబెనర్జీ, పంజాబ్, ఢిల్లీలో కేజ్రీవాల్ అయినా పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటేది రాష్ట్రాల్లోని బలమైన పార్టీలేనని చెప్పారు. -
బీఆర్ఎస్.. మళ్లీ టీఆర్ఎస్ కానుందా?
\హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి బాధ్యతలు చేపట్టి 45 రోజులైనా సాధించింది ఏమీ లేదని మండిపడ్డారు. సీఎం రేవంత్ సాధించింది ఏమైనా ఉందంటే అది వారానికి రెండు ఢిల్లీ టూర్లు మాత్రమేనని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కాంగ్రెస్ పాలనంతా ఢిల్లీ నుంచే సాగుతుందని కేటీఆర్ విమర్శించారు. దావోస్‌కు వెళ్లి ప్రపంచవేదికపై పచ్చి అబద్ధాలే మాట్లాడారన్నారు. ‘అనేక విషయాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం అడ్డగోలుగా నిర్ణయాలు తీసుకుంటుంది. కేఆర్ఎంబీ విషయంలో ప్రాజెక్లులు కేంద్రం చేతుల్లోకి వెళ్లాయి. మహబూబ్‌నగర్, ఖమ్మం, నల్గొండ జిల్లాలు తీవ్రంగా నష్టపోతాయి. రేవంత్‌రెడ్డి, బండి సంజయ్ మాటలు ఒకేలా ఉన్నాయి. బీఆర్ఎస్ ప్రభుత్వం కొత్త సచివాలయం కడితే గగ్గోలు పెట్టిన కాంగ్రెస్.. ఇప్పుడు కొత్త క్యాంపు ఆఫీసు, కొత్త హైకోర్టు ఎట్లా కడుతున్నారు?, సీఎం మారినప్పుడల్లా కొత్త క్యాంపు ఆఫీసులు వస్తాయా?, మేము కట్టిన ప్రగతి భవన్‌ను ఈగోతో డిప్యూటీ సీఎం భట్టికి రేవంత్‌రెడ్డి ఇచ్చారు. క్యాబినెట్లో చర్చించకుండానే రేవంత్‌రెడ్డి నిర్ణయాలు తీసుకుంటున్నారు. భేషజాల వల్లే ప్రగతిభవన్‌ను సీఎం రేవంత్‌రెడ్డి వాడటం లేదు. మేము దావోస్ పర్యటనలకు వెళ్తే బోగస్ అన్న ఉత్తమ్‌కుమార్‌రెడ్డి.. సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనపై సమాధానం చెప్పాలి. సీఎం రేవంత్‌రెడ్డి దావోస్ పర్యటనకు ఎందుకు వెళ్లారని భట్టి ప్రశ్నించినట్లు ఉంది. రేవంత్‌రెడ్డిపై భట్టి యుద్ధం చేస్తున్నట్లు అనిపిస్తోంది. కాంగ్రెస్ ప్రభుత్వం టైంపాస్ ప్రభుత్వంగా మారింది. బెల్టు షాపులు ఎత్తివేస్తామని, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ హామీ ఇచ్చింది. కాళేశ్వరం ద్వారా చుక్క నీరు రాలేదన్నారు. మంత్రి కొండా సురేఖ లక్షా పదివేల ఎకరాలకు రంగనాయక సాగర్ నీళ్లను విడుదల చేసిందుకు ధన్యవాదాలు. తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలి. కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే వంద రోజుల్లో హామీల అమలును నిలబెట్టుకోవాలి.కోటీ 57 లక్షల మంది మహిళలకు మహాలక్ష్మి ఎప్పటి నుండి ఇస్తారో చెప్పాలి. ఆరు గ్యారెంటీల అమలుకు జీవోలు ఇవ్వండి. ఎన్నికల కోడ్ పేరుతో తప్పించుకోవాలని చూస్తున్నారు’ అని కేటీఆర్ ఆరోపించారు. ఫిబ్రవరి 10లోగా అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ పార్టీ భేటీలు ఉంటాయన్న కేటీఆర్.. కేఆర్ఎంబీపై తెలంగాణ ప్రయోజనాల తాకట్టు, పార్టీ అంతర్గత నిర్మాణంపై దృష్టి కేంద్రీకరించామన్నారు. ఇక బీఆర్ఎస్ పేరు మార్పు అంశంపై చర్చిస్తున్నట్లు కేటీఆర్ స్పష్టం చేశారు.దాంతో బీఆర్ఎస్.. మళ్లీ టీఆర్ఎస్ కానుందా? అనే చర్చ మొదలైంది. -
ఆ విషయంలో మోదీ దిట్ట.. ప్రధానిపై ఖర్గే నిప్పులు
సాక్షి, హైదరాబాద్: హామీలు ఇచ్చి తప్పించుకునే రోజులు పోయాయని.. ప్రధాని మోదీ ఎన్నో హామీలు ఇచ్చారు.. కానీ అమలు చేయలేదంటూ ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. మోదీ హమీలపై వచ్చే పార్లమెంటు బడ్జెట్ సమావేశాల్లో ప్రశ్నిస్తానన్నారు. ఎల్బీ స్టేడియంలో తెలంగాణ కాంగ్రెస్ బూత్ కన్వీనర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆరు గ్యారెంటీల్లో రెండు హమీలు అమల్లోకి తెచ్చామని, మిగిలిన హామీలు కూడా త్వరలోనే అమల్లోకి తెస్తామని పేర్కొన్నారు. సమరోత్సహంతో కార్యకర్తలు వచ్చే లోక్‌సభ ఎన్నికల కోసం పనిచేయాలంటూ ఖర్గే పిలుపునిచ్చారు. సమస్యలు ఎదురైనప్పుడు మోదీ ఏదో ఒక ఇష్యూతో డైవర్ట్ చేస్తుంటారని.. సమస్యల నుంచి దృష్టి మళ్లించడంలో మోదీ దిట్ట అంటూ ఆయన విమర్శలు గుప్పించారు. మోదీ, షా రాష్ట్రాల్లో ప్రభుత్వాలను కూల్చి వేసే కుటిల రాజకీయం చేస్తుంటారు. ఈడీ,ఐటీ, సీబీఐలను ఉసిగొలిపి.. ప్రతిపక్ష నేతలను బెదిరిస్తున్నారు. బీజేపీ బెదిరింపులకు కాంగ్రెస్ నేతలు ఎవరూ భయపడరు. కేసీఆర్ ఎప్పుడూ బీజేపీని నిలదీయలేదు.. కాంగ్రెస్‌పైనే ఎప్పుడూ విమర్శలు చేసేవారు’’ అంటూ ఖర్గే దుయ్యబట్టారు. ‘‘ఒకసారి పాకిస్తాన్ బూచీ చూపిస్తారు.. మరోసారి దేవుడ్ని వాడుకుంటారు. మోదీ నేతృత్వంలో ధరలు పెరిగిపోయాయి. సామాన్యుల ప్రజల కష్టాలు తెలుసుకునేందుకు రాహుల్ న్యాయ యాత్ర చేస్తున్నారు. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కార్యకర్తలు అదే జోష్‌తో పనిచేసి పార్టీని గెలిపించాలి’’ అని ఖర్గే పేర్కొన్నారు. ఇదీ చదవండి: అలా మాట్లాడే వాళ్లను చెప్పుతో కొట్టే రోజులొస్తాయ్: కిషన్‌రెడ్డి -
అలా మాట్లాడే వాళ్లను చెప్పుతో కొట్టే రోజులొస్తాయ్: కిషన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: పార్లమెంట్ అభ్యర్థుల ఎంపిక పూర్తవుతుందని, వచ్చే వారంలోనే బీజేపీ అభ్యర్థుల ప్రకటన ఉండే అవకాశం ఉందని కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్‌రెడ్డి తెలిపారు. 28న అమిత్ షా తెలంగాణలో పర్యటించనున్నారు. హైదరాబాద్ పార్లమెంట్‌పై బీజెపి సన్నాహాక సమావేశం నిర్వహించనున్నట్లు వెల్లడించారు. పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధం కావాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు మజ్లీస్ పార్టీని బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నాయంటూ కిషన్‌రెడ్డి మండిపడ్డారు. బీఆర్ఎస్ ప్రభుత్వ అవినీతిపై విచారణ చేయడంపై కాంగ్రెస్ ప్రభుత్వానికి స్పష్టమైన అవగాహన లేదన్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్‌లను దోపిడీ దొంగల పార్టీలుగా అభివర్ణించిన కిషన్‌రెడ్డి.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో దోషులకు శిక్ష పడుతుందనే విశ్వాసం ప్రజలకు లేదన్నారు. బీఆర్ఎస్ అవినీతిని కాంగ్రెస్ బయటకు తీస్తుందని ఆశిస్తే అది భంగపడ్డట్లే అవుతుందని కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. బీజేపీ అగ్గిలాంటి పార్టీ. బీజేపీపై మాట్లాడేటప్పుడు ఒళ్లు దగ్గరపెట్టుకోవాలని సూచిస్తున్నా. బీఆర్ఎస్-బీజేపీ ఒకటేనని, కాంగ్రెస్–బీజేపీ ఒక్కటేనని మాట్లాడే వాళ్లను చెప్పుతో కొట్టే రోజులు వస్తాయి. తాము ఏ పార్టీతో కలవాల్సిన అవసరం లేదు. హైదరాబాద్ పార్లమెంట్లో పోటీ చేయడం కోసం కాదు.. అసదుద్దీన్‌ను ఓడించడం కోసమే పనిచేయాలి. హైదరాబాద్‌లో ఉన్న ముస్లిం సోదరులు మజ్లీస్ పార్టీని ఓడించాలని చూస్తున్నారు. మజ్లీస్ పార్టీని వ్యతిరేకించే ప్రతిఒక్కరూ బీజేపీ వైపు రావాలి. లక్షమంది అసదుద్దీన్లు వచ్చినా... మోదీ మూడోసారి ప్రధాని కావడం ఖాయం’’ అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. ఇదీ చదవండి: TS: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు వీరే! -
TS: గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు వీరే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గవర్నర్ కోటాలో ఇద్దరు ఎమ్మెల్సీలను గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఎంపిక చేశారు. ఎమ్మెల్సీలుగా ప్రొఫెసర్ కోదండరామ్, మీర్ అమీర్ అలీఖాన్‌ను ఎంపిక చేస్తూ గవర్నర్ ఆమోదం తెలిపారు. వారం రోజుల క్రితం ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్ పేర్లను గవర్నర్‌కు ప్రభుత్వం పంపింది. దావోస్ పర్యటనకు ముందు పేర్లను గవర్నర్‌కు పంపగా, నిన్న గవర్నర్ తో భేటీ సందర్భంగా ఎమ్మెల్సీల అంశం చర్చకు వచ్చింది. ఇవాళ లేదా రేపు గవర్నర్ అధికారిక ప్రకటన చేయనున్నారు. కాగా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్(TSPSC) చైర్మన్‌గా ఎం. మహేందర్‌రెడ్డిని నియామకం ఖరారైంది. మాజీ డీజీపీ అయిన మహేందర్‌రెడ్డి నియామకాన్ని ఆమోదిస్తూ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ గురువారం నిర్ణయం తీసుకున్నారు. అలాగే టీఎస్పీఎస్సీ సభ్యులుగా రిటైరర్డ్ ఐఏఎస్ అనిత రాజేంద్ర, పాల్వాయి రజనీ కుమారి, అమీర్ ఉల్లా ఖాన్, యాదయ్య, వై రాంమోహన్‌రావు నియమితులయ్యారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ పోస్టింగ్ కోసం మొత్తంగా 370 వరకు దరఖాస్తులు అందాయి. ప్రభుత్వం సెర్చ్ కమిటీని నియమించి.. దరఖాస్తుల పరిశీలన, అర్హులను సూచించే బాధ్యతలను అప్పగించింది. కమిటీ వేగంగా దరఖాస్తుల పరిశీలన చేపట్టింది. చైర్మన్ పదవి కోసం దరఖాస్తు చేసినవారిలోంచి మాజీ డీజీపీ మహేందర్‌రెడ్డి పేరును ప్రభుత్వానికి సూచించింది. ప్రభుత్వం ఆ పేరును గవర్నర్‌కు పరిశీలనకు పంపింది. చివరకు గవర్నర్ ఆయన నియామకానికి ఆమోదం తెలిపారు. ఇదీ చదవండి: బాలకృష్ణ అక్రమార్జన.. అధికారులే కంగుతినేలా..! -
కాంగ్రెస్ పాలన ఎక్కువకాలం నిలబడదు.. ప్రజలే తిరగబడతారు: ఎమ్మెల్సీ కవిత
సాక్షి, జగిత్యాల: తెలంగాణలో ఉన్నది ఖాకీ రాజ్యమా? కాంగ్రెస్ రాజ్యమా? అని మండిపడ్డారు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగినన అభివృద్ధిని ఓర్వలేక అధికారం మారడంతో పార్టీ కార్యకర్తలపై అన్యాయంగా కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అక్రమ కేసులు పెడితే సహించేదే లేదని, చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు. కాంగ్రెస్ పాలన ఎక్కువకాలం నిలబడదడని.. ఇలానే కక్షపూరితంగా వ్యవహరిస్తే ప్రజలే తిరగబడతారని అన్నారు. జగిత్యాల జైలులో ఉన్న హబ్సీపూర్ బీఆర్ఎస్ సర్పంచ్ గంగారెడ్డిని ఎమ్మెల్సీ కవిత గురువారం పరామర్శించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం చేస్తుందని విమర్శించారు. అభివృద్ధిని పక్కనపెట్టి, సాధ్యం కానీ హామీలిచ్ఛి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ కుట్రలను రాజకీయంగా, చట్టపరంగా ఎదుర్కొంటామని తెలిపారు. యూనివార్సిటీ భూముల విషయంలో విద్యార్థిని జుట్టు పట్టుకొని లాక్కెళ్తున్న పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎన్నడూ తెలంగాణలో లేదని పేర్కొన్నారు. ఈ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నామని చెప్పారు. బీఆర్ఎస్ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామన్నారు. కార్యకర్తలకు, నాయకులకు పార్టీ అండగా నిలుస్తుందని భరోసా కల్పించారు. చదవండి: రేపు కేసీఆర్ అధ్యక్షతన బీఆర్ఎస్ పార్లమెంటరీ సమావేశం