breaking news
-
బందిపోట్లలా కాంగ్రెస్ సర్కారు తీరు!: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు బందిపోట్లను తలపిస్తోందని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు వ్యాఖ్యానించారు. వందలాది బుల్డో జర్లను రంగంలోకి దించి యూనివర్సిటీ భూమిలో విధ్వంసానికి పాల్పడటం రేవంత్ మనస్తత్వానికి అద్దంపడుతోందని విమర్శించారు. ఇతర అంశాల్లోనూ రేవంత్ దూకుడు ఇదే తరహాలో ఉండ టాన్ని ప్రజలు తప్పు పడుతున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పతనం దిశగా వేగంగా పయనిస్తోందని, దానిని ఎవరూ రక్షించలేరని కేసీఆర్ పేర్కొన్నారు. కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వచ్చేది లేదని తెలుసుకునే సీఎంతోపాటు మంత్రులు వీలైనంత త్వరగా సొంత జేబులు నింపుకొనేందుకు పోటీ పడుతున్నారని ఆరోపించారు. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పతనానికి దారితీస్తుందని చెప్పారు. బుధవారం ఎర్రవల్లి నివాసంలో ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లాలకు చెందిన బీఆర్ఎస్ ముఖ్య నేతలతో కేసీఆర్ భేటీ అయ్యారు. ఈ నెల 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లు, దేశ, రాష్ట్ర రాజకీయ పరిస్థితులపై ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు జరిగిన ఈ భేటీలో పలు కీలక అంశాలు ప్రస్తావనకు వచ్చినట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, వేముల ప్రశాంత్‌రెడ్డి సహా 20కిపైగా మంది ముఖ్య నాయకులు పాల్గొన్నట్టు వెల్లడించాయి.మోదీ పట్ల ఆర్ఎస్ఎస్ అసంతృప్తి..‘‘దేశవ్యాప్తంగా బీజేపీ ప్రతిష్ట క్రమంగా మసకబారుతోంది. గత ఏడాది జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి సీట్లు తగ్గడమే దీనికి సంకేతం. ఆర్ఎస్ఎస్ కూడా ప్రధాని మోదీ పనితీరు పట్ల సంతృప్తిగా లేదు. ఆయన ఒంటెద్దు పోకడల పట్ల ఆర్ఎస్ఎస్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. పదవి కోసం ఆర్ఎస్ఎస్ను దేబిరించాల్సిన పరిస్థితిలో ప్రధాని మోదీ ఉన్నారు..’’ అని కేసీఆర్ పేర్కొన్నారు. కేంద్రంలో తొలి రెండు పర్యాయాలు ప్రజలను మభ్యపెట్టి మసిపూసి మారేడుకాయ చేయడం ద్వారానే బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. బీజేపీ రెండుసార్లు అధికారంలోకి వచ్చినా నిర్మాణాత్మకంగా దేశానికి చేసినది చెప్పుకునేందుకు ఏమీ లేదని.. దీంతో ప్రజలు మళ్లీ తమవైపు చూస్తున్నారని చెప్పారు. పదేండ్లలో బీఆర్ఎస్ చేసిన పనితో ఇతర పార్టీల పనితీరును ప్రజలు పోల్చి చూసుకుంటున్నారని.. రాష్ట్ర రాజకీయాల్లో నిరంతరం బీఆర్ఎస్ చేసిన పనులే ఇతర పార్టీల పనితీరుకు గీటు రాయిలా ఉంటాయని అభిప్రాయం వ్యక్తం చేశారు.లక్షలాదిగా సభకు తరలిరావాలి..ఏప్రిల్ 27న అన్ని గ్రామాల్లోనూ పార్టీ కార్యకర్తలు, నాయకులు బీఆర్ఎస్ జెండా ఎగరవేసి వరంగల్ సభకు బయలుదేరాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. వరంగల్‌కు దగ్గరలో ఉండే సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక, మెదక్ నియోజకవర్గాల నుంచి ఎక్కువ సంఖ్యలో పార్టీ శ్రేణులు తరలిరావాలన్నారు. ఒక్కో జిల్లా నుంచి కనీసం రెండు లక్షల మంది తరలివచ్చేలా వాహనాలు సమకూర్చుకోవాలని.. ఆర్టీసీ, ఇతర బస్సులను ఇప్పటి నుంచే సమీకరించడం ప్రారంభించాలని సూచించారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ ప్రచార పోస్టర్ రూపకల్పనకు సంబంధించి కేసీఆర్ పలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి ఎమ్మెల్సీలు దేశపతి శ్రీనివాస్, యాదవరెడ్డి, ఎమ్మెల్యేలు కొత్త ప్రభాకర్‌రెడ్డి, చింత ప్రభాకర్, మాణిక్‌రావు, సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు పద్మా దేవేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు క్రాంతి కిరణ్, భూపాల్‌రెడ్డి, పార్టీ నేతలు జైపాల్‌రెడ్డి, ఆదర్శ్‌రెడ్డి... ఉమ్మడి నిజామాబాద్ జిల్లా నుంచి మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేశ్ బిగాల, గంప గోవర్ధన్, జాజాల సురేందర్, హన్మంత్ షిండే, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, కామారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ముజీబుద్దీన్, మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్, పార్టీ రాష్ట్ర నాయకుడు కల్వకుంట్ల వంశీధర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
కుదిరితే సయోధ్య.. లేకుంటే ధర్మయుద్ధం: సీఎం రేవంత్
సాక్షి, న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు విద్య, ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు అమలు చేసే విషయంలో కేంద్ర ప్రభుత్వంతో సయోధ్య కుదుర్చుకునేందుకే ఢిల్లీకి వచ్చామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తెలిపారు. రిజర్వేషన్లు పెంచని పక్షంలో కేంద్రంతో ధర్మయుద్ధం తప్పదని స్పష్టంచేశారు. రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం జాప్యం చేస్తే ‘గద్దె దిగాల్సిందే.. లేకుంటే గ్రామాల్లో గద్దెలు కూలాల్సిందే’అని హెచ్చరించారు. బుధవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ అధ్యక్షతన జరిగిన బీసీ పోరు గర్జన ధర్నాలో సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొన్నారు. బీసీ రిజర్వేషన్ల పెంపుపై కేంద్రం జాప్యం చేస్తోందని విమర్శించారు. ‘కురుక్షేత్ర యుద్ధానికి ముందు అయిననూ పోయి రావలె హస్తినకు అన్నారు. ధర్మ యుద్ధం కోసం ఢిల్లీకి వచ్చాం. సంధిలో భాగంగానే ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశాం. సయోధ్య కుదుర్చుకుందాం.. ఐదు గ్రామాలు ఇవ్వమన్నా నాడు దుర్యోధనుడు ఇవ్వలేదు. తర్వాత కురుక్షేత్రంలో ఏం జరిగిందో చూశాం. ఇప్పుడు రాష్ట్రంలో 42 శాతం బీసీ రిజర్వేషన్లు మేము ఇచ్చుకుంటాం అని అడుగుతున్నాం. ఇకపై విజ్ఞప్తులు తీసుకొని ఢిల్లీకి రాం. గల్లీలకు వాళ్లు ఎట్లా వస్తారో చూస్తాం. ధర్మయుద్ధం ప్రకటించి మన సత్తా ఏంటో చూపుదాం’అని పిలుపునిచ్చారు. గద్దె దిగుడో.. గద్దెలు కూల్చుడో.. తెలంగాణలో బీసీ రిజర్వేషన్లు పెంచుకుంటామని అడిగితే ప్రధాని మోదీకి వచ్చిన నొప్పేంటని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. ఢిల్లీ కుర్చీ అడిగామా? లేక గుజరాత్లో అమలు చేయమన్నామా? అని నిలదీశారు. ‘బీజేపీకి హెచ్చరిక జారీ చేస్తున్నా. అయితే రిజర్వేషన్లు పెంచాలి. లేదంటే మీరు గద్దె దిగాల్సిందే.. గ్రామాల్లో గద్దెలు కూలాల్సిందే. ఇదే నినాదంతో ముందుకు పోతాం. ఇప్పుడు రాకుంటే రిజర్వేషన్లు ఎప్పుడూ రావు. మీకు సహకారం అందించే సీఎంగా నేనున్నా. రాహుల్‌గాంధీ మద్దతు ఉంది. గల్లీ నుంచి ఢిల్లీ వరకు అన్ని రాష్ట్రాలను ఏకం చేసి రిజర్వేషన్లు పెంచే బాధ్యత రాహుల్‌గాంధీ తీసుకుంటారు. మీరంతా ఏకమై ధర్మయుద్ధం ప్రకటించండి. మీ బలమేంటో పరేడ్ గ్రౌండ్లో చూపెట్టండి. మున్ముందు ఎర్రకోటపై మనమే జెండా ఎగురవేస్తాం. అందరం కలిసి రిజర్వేషన్లను సాధించుకుందాం’అని పిలుపునిచ్చారు. నరేంద్రమోదీ కమండల్ యాత్ర ప్రతినిధి రాహుల్‌గాంధీ స్ఫూర్తితోనే రాష్ట్రంలో కులగణన చేపట్టామని, బీసీల రిజర్వేషన్ల పెంపు తీర్మానం చేశామని సీఎం రేవంత్‌రెడ్డి తెలిపారు. బీసీ రిజర్వేషన్ల పెంపునకు బీజేపీ విధానపరంగా వ్యతిరేకమని విమర్శించారు. మొరార్జీ దేశాయ్ ప్రభుత్వం మండల్ కమిషన్‌ను నియమిస్తే, దానికి వ్యతిరేకంగా బీజేపీ కమండల్ యాత్ర మొదలుపెట్టిందని తెలిపారు. ఆ యాత్ర ప్రతినిధే నరేంద్ర మోదీ అని విమర్శించారు. బీసీల లెక్కలు తేల్చాల్సి వస్తుందనే 2021లో చేయాల్సిన జనాభా లెక్కలను బీజేపీ ప్రభుత్వం వాయిదావేసిందని ఆరోపించారు. ‘బీజేపీ అధికారంలో ఉన్న ఏ రాష్ట్రంలోనూ కులగణన చేపట్టలేదు. మేము బీజేపీ పాలిత రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలు చేయాలని కోరడం లేదు. తెలంగాణలో రిజర్వేషన్లు పెంచుకోవడానికి అనుమతి ఇస్తే 10 లక్షల మందితో సభ పెట్టి మోదీని సన్మానిస్తాం. అలా కాకుండా మాపై అధికారం చెలాయిస్తామంటే నాడు రజాకార్లకు పట్టిన గతే ఇప్పుడు బీజేపీకి పడుతుంది. జనగణనతోపాటు కులగణన నిర్వహించాల్సిందే. కేంద్ర మంత్రి బండి సంజయ్ బీసీల కోసం ప్రాణం ఇస్తామంటున్నారు. మాకు ప్రాణాలు అక్కర్లేదు. కేవలం రిజర్వేషన్లు పెంచితే చాలు’అని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగాలు భర్తీ చేయాలని గల్లీ నుంచి ఢిల్లీ వరకు యువత పోరాడినా గత దుర్మార్గ పాలకులు పట్టించుకోలేదని బీఆర్ఎస్పై విమర్శలు గుప్పించారు. ఉద్యోగాలు ఇవ్వనందుకే తండ్రీకొడుకుల ఉద్యోగాలను యువత ఊడగొట్టారని తెలిపారు. -
అప్పుడైనా,ఇప్పుడైనా తెలంగాణకు కేసీఆర్ శ్రీరామ రక్ష
హైదరాబాద్,సాక్షి: అప్పుడైనా,ఇప్పుడైనా తెలంగాణకి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ శ్రీరామ రక్ష అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత అన్నారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయాలపై కవిత ఎక్స్ వేదికగా స్పందించారు.అసెంబ్లీ ఆమోదించిన చట్టాలను కోల్డ్ స్టోరేజీకి పంపే స్క్రీన్ ప్లే.బీజేపీని కాపాడేందుకే సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ డ్రామా. మరో సారి బయటపడిన కాంగ్రెస్, బీజేపీ బంధం. బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లకుండా కుతంత్రం.అఖిలపక్షాన్ని తీసుకెళ్తే కేంద్రాన్ని నిలదీస్తారన్న జంకు. అందుకే ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నాకు హాజరు పేరిట మమ అనిపించే యత్నం.మోదీ సర్కారుకు ఎలాంటి ఇబ్బంది రాకుండా పకడ్బందీ స్కెచ్. తెలంగాణ ప్రజల ఓట్లే తప్ప.. వాళ్ల పాట్లు పట్టని కాంగ్రెస్ అగ్రనాయకత్వం. ఢిల్లీలో బీసీ సంఘాల ధర్నాకు కాంగ్రెస్ నేత, లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత హాజరవుతారని ప్రచారం. జంతర్ మంతర్‌కు కూతవేటు దూరంలోనే ఉన్నా ధర్నాకు రాకుండా బీసీలను అవమానించిన కాంగ్రెస్ అగ్రనాయకత్వం.అసెంబ్లీ ఆమోదించిన చట్టాలను కోల్డ్ స్టోరేజీకి పంపే స్క్రీన్ ప్లే...బీజేపీని కాపాడేందుకే సీఎం రేవంత్ రెడ్డి డైవర్షన్ డ్రామా...మరో సారి బయటపడిన కాంగ్రెస్, బీజేపీ బంధం...బీసీలకు రాజకీయ, విద్య, ఉద్యోగ రిజర్వేషన్లపై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లకుండా కుతంత్రం...…— Kavitha Kalvakuntla (@RaoKavitha) April 2, 2025 తెలంగాణ లో సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ సాగిస్తున్న ఏ ఒక్క దమనకాండపై ఇప్పటి వరకు నోరు విప్పని రాహుల్ గాంధీ. లగచర్ల రైతుల మీద, బంజారా మహిళలపై సర్కార్ అఘాయిత్యాలపై మాట్లాడరు. మూసి ప్రాజెక్టు పేరిట పేద ప్రజల ఇళ్లను కూలగొడితే స్పందించరు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులపై పోలీసులు లాఠీలు ఝుళిపించినా ఖండించరు.ఇప్పుడు ఢిల్లీ వేదికగా మా బీసీ బిడ్డల ధర్నాకు రాకుండా అవమానించారు. అందుకే మేము ముందే చెప్పాం.. ఆయన ఎన్నికల గాంధీ అని.రాహుల్ గాంధీకి తెలంగాణతో పేగుబంధం లేదు.. ఉన్నది కేవలం ఎన్నికల బంధం మాత్రమేనని. అప్పుడైనా,ఇప్పుడైనా తెలంగాణకి కేసీఆర్ మాత్రమే శ్రీరామ రక్ష’ అని వ్యాఖ్యానించారు. -
కాసుల కక్కుర్తితో HCU విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు
తెలంగాణ భవన్,సాక్షి: హెచ్‌సీయూ భూముల కోసం న్యాయ పోరాటం చేస్తున్న విద్యార్థులను.. పెయిడ్ బ్యాచ్ అని మంత్రులు మాట్లాడడం సిగ్గుచేటు’అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి ఆరోపించారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులపై జరిగిన లాఠీ ఛార్జీపై జగదీష్‌రెడ్డి మాట్లాడారు. తెలంగాణ భవన్లో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. హెచ్‌సీయూ భవిష్యత్తు కోసం ఆందోళన చేస్తున్న విద్యార్థులపై పోలీసుల జరిపిన లాఠీఛార్జ్‌ను బీఆర్ఎస్ ఖండిస్తోంది. 1969లో విద్యార్థుల పోరాట ఫలితం వల్లనే HCUను సాధించుకున్నాం. ఉద్యమ ఫలితంగా సాధించిన HCUను కాపాడుకునేందుకు విద్యార్థులు పోరాటం చేస్తున్నారు.న్యాయ పోరాటం చేస్తున్న విద్యార్థులను.. పెయిడ్ బ్యాచ్ అని మంత్రులు మాట్లాడడం సిగ్గుచేటు. ఈ రాష్ట్రంలో పెయిడ్ బ్యాచ్ ముఖ్యమంత్రి,మంత్రులు. బ్లాక్ దందా వల్ల వచ్చిన పైసలతో పదవులు తెచ్చుకున్నారు. సమాజ శ్రేయసు కొరకు విద్యార్థులు పాటుపడుతారు. విద్యార్థులకు మద్దతుగా మాట్లాడిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ కార్తి చిదంబరం, నటుడు ప్రకాష్ రాజ్ పేమెంట్ బ్యాచ్ నా. కేసీఆర్ హరితహారం చేస్తే , కాంగ్రెస్ హరితసంహారం చేస్తుంది.కేసీఆర్ వనసంరక్షణ చేస్తే రేవంత్ రెడ్డి హరిత భక్షణ చేస్తున్నారు. బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే హెచ్‌సీయూలో జరుగుతున్న పనులు ఆపొచ్చు. పోలీసులను బయటకు పంపొచ్చు. కాంగ్రెస్, బీజేపీలు నాటకం ఆడుతున్నాయి. వైస్ ఛాన్సలర్ పర్మిషన్ లేకుండా పోలీసులు ఎలా లోపటికి వెళ్తారు. డ్రోన్ కెమెరా ఎగరేస్తే 500 రూపాయలతో ఫైన్ వేయొచ్చు అని మాట్లాడిన రేవంత్ రెడ్డి. ఇవ్వాళ హెచ్‌సీయూ విద్యార్థులు డ్రోన్ ఎగరేశారని వారిని అరెస్ట్ చేసి కేసులు పెట్టారు.హెచ్‌సీయూ భూముల అమ్మక వ్యవహారం చీకటి దందాలో భాగమే.హెచ్‌సీయూ భూములను గురువు కోసం (చంద్రబాబు నాయుడు) అప్పనంగా రేవంత్ రెడ్డి చీకటి దందాకు తెరలేపారు. సేవ్ హెచ్‌సీయూ అని యూనివర్సిటీ విద్యార్థులకు సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే 5 లక్షల మంది మద్దతు పలికారు. వారందరూ పెయిడ్ బ్యాచ్చేనా. హెచ్‌సీయూ భూములను అమ్మిన మూటల కోసమే రాహుల్ గాంధీ మౌనంగా ఉంటున్నారు.యూనివర్సిటీనీ గౌరవించే మా హయంలో రోడ్లు వెయ్యలేదు. కమిషన్ల కొరకు కక్కుర్తి పడి రైతుల జీవితాలతో , విద్యార్థుల జీవితాలతో ఈ ప్రభుత్వం చెలగాటం ఆడుతుందని ఆరోపణలు గుప్పించారు. -
రేవంత్.. మై హోమ్ విహంగ కూల్చే దమ్ముందా?: కవిత సవాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారని సంచలన వ్యాఖ్యలు చేశారు బీఆర్ఎస్ ఎమ్మల్సీ కల్వకుంట్ల కవిత. ముఖ్యమంత్రి రేవంత్ చర్యల వల్ల హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయింది. అందుకే హెచ్‌సీయూ వద్ద 400 ఎకరాల భూమిని విక్రయించాలని చూస్తున్నారు అని ఘాటు విమర్శలు చేశారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా కవిత మీడియాతో మాట్లాడుతూ..‘సెంట్రల్ యూనివర్సిటీ భూములు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లకుండా 400 ఎకరాల భూమిని బీఆర్ఎస్ ప్రభుత్వం కాపాడింది. ఆ భూముల పరిరక్షణ కోసం కేసీఆర్ నిర్దేశం మేరకు న్యాయవాదులు కోర్టులో గట్టిగా వాదనలు వినిపించారు. ఇది యూనివర్సిటీ భూమి అని ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లవద్దన్న ఉద్దేశంతో బీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయ పోరాటం చేసింది.సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని నడపలేని స్థితిలో ఉన్నారు. రేవంత్ రెడ్డి దుశ్చర్య వల్ల హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్ పడిపోయింది కాబట్టి 400 ఎకరాల భూమిని విక్రయించాలని నిర్ణయించారు. యూనివర్సిటీ నుంచి తీసుకున్న భూమిని యూనివర్సిటీకే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. 397 ఎకరాలను ఇతర చోట యూనివర్సిటీకి ఇచ్చామని ప్రభుత్వం వితండవాదం చేస్తుంది. పరిశ్రమల ఏర్పాటు, భూముల విక్రయం ఆ 397 ఎకరాల్లో చేసుకోవచ్చు కదా?. ప్రభుత్వం పర్యావరణం, ప్రకృతి కోణంలో కూడా ఆలోచించాలి.ఇప్పటికే కాంక్రీట్ జంగిల్ లాగా మారిన గచ్చిబౌలి ప్రాంతంలో ఈ 400 ఎకరాల్లో కూడా పెద్ద ఎత్తున కంపెనీలు ఏర్పాటు అయితే వాతావరణంపై ఎంత ఒత్తిడి పెరుగుతుందో ఆలోచించాలి. బీఆర్ఎస్ హయాంలో మై హోమ్ విహంగ నిర్మాణానికి భూములు కేటాయించాం అనడంలో వాస్తవం లేదు. మై హోమ్ విహంగా ప్రభుత్వ భూముల్లో నిర్మించినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్లను పంపించాలి. కానీ, మై హోమ్ రామేశ్వరరావు బీజేపీ మనిషి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఆ ధైర్యం చేయలేరు. పేదలు, మూగజీవులు ఉంటేనే బుల్డోజర్లను ప్రయోగిస్తారు..పెద్దవాళ్లనేమో ముట్టుకోరు అంటూ విమర్శలు చేశారు. బీఆర్ఎస్ హయాంలో మై హోమ్ విహంగ నిర్మాణానికి భూములు కేటాయించామనడంలో వాస్తవం లేదుమై హోమ్ విహంగా ప్రభుత్వ భూముల్లో నిర్మించినట్లయితే సీఎం రేవంత్ రెడ్డి బుల్డోజర్లను పంపించాలిమై హోమ్ రామేశ్వరరావు బిజెపి మనిషి కాబట్టి సీఎం రేవంత్ రెడ్డి ఆ ధైర్యం చేయలేరుపేదలు, మూగజీవులు ఉంటేనేమో… pic.twitter.com/5oKO0iJCbg— Kalvakuntla Kavitha Office (@OfficeOfKavitha) April 2, 2025 -
బీజేపీ సర్కార్‌పై తీవ్ర వ్యతిరేకత
సాక్షి, హైదరాబాద్: ‘కేంద్రంలో బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆ పార్టీపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అన్ని రంగాల్లోనూ బీజేపీ విఫలం కావడంతోపాటు ఆ పార్టీ నిజ స్వరూపాన్ని ప్రజలు గ్రహిస్తున్నారు. బీజేపీలో 75 ఏళ్లు దాటినవారు అధికారిక పదవుల నుంచి తప్పుకోవాలంటూ ఆ పారీ్టలో ఒత్తిళ్లు వస్తున్నాయి. దీంతో బీజేపీ నాయకత్వం అనేక ఇబ్బందికర పరిస్థితులు ఎదుర్కొంటోంది. రాబోయే రోజుల్లో కేంద్రంలో సంకీర్ణ ప్రభుత్వాలు మాత్రమే ఏర్పడతాయి. సంకీర్ణ రాజకీయాల్లో మనం కీలకంగా మారుతాం’అని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ అన్నారు. పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌తోపాటు ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన 20 మంది ముఖ్య నేతలతో మంగళవారం ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ సుదీర్ఘంగా భేటీ అయ్యారు. ఉదయం 11.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు జరిగిన ఈ సమావేశంలో వరంగల్‌లో నిర్వహించే పార్టీ రజతోత్సవ సభ ఏర్పాట్లపై చర్చించారు. దేశ, రాష్ట్ర రాజకీయ స్థితిగతులపైనా కేసీఆర్ ఈ సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌కు తగినంత సమయం ఇచ్చాం ‘రాష్ట్రంలో అలవికాని హామీలతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ప్రజలు వందశాతం ప్రభుత్వ పనితీరుపై పూర్తి అసంతృప్తితో ఉన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏడాదిన్నరగా తగినంత సమయం ఇచ్చాం. ప్రభుత్వాన్ని ఎండగట్టి, హామీల అమలు వైఫల్యాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు భారీ బహిరంగసభ నిర్వహించడమే సరైన మార్గం. అందుకే వరంగల్‌లో జరిగే బహిరంగసభను విజయవంతం చేసేందుకు పార్టీ యంత్రాంగం పూర్తి స్థాయిలో కదలాలి. తెలంగాణ సోయి మనకు ఉన్నా ఏమరుపాటుతనంతోనే ఓటమి పాలయ్యాం. రాజకీయాల్లో గెలుపోటములు సహజమే అయినా, ప్రజలకు చేరువయ్యేందుకు మనం కృషి చేయాలి’అని కేసీఆర్ పిలుపునిచ్చారు. రజతోత్సవ సభ కేంద్రంగా దిశానిర్దేశం వరంగల్‌లో నిర్వహించే పార్టీ రజతోత్సవ సభ ఏర్పాట్లపై కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి నియోజకవర్గాల వారీగా జనం, వాహనాల సమీకరణపై పలు సూచనలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధి నుంచి రెండు లక్షల మంది జనసమీకరణ లక్ష్యంగా నిర్దేశించినట్టు సమాచారం. బుధవారం నుంచి జిల్లాల వారీగా ముఖ్య నేతలతో బహిరంగసభ సన్నాహాలపై కేసీఆర్ ఎర్రవల్లి నివాసంలో సమీక్షిస్తారు. బుధవారం ఉమ్మడి మెదక్, నిజామాబాద్ జిల్లా నేతల సమావేశం జరుగుతుంది. కేసీఆర్ వరుస సమీక్షల నేపథ్యంలో కేటీఆర్ జిల్లాల వారీగా బహిరంగసభ సన్నాహక సమావేశాలు రద్దయ్యే అవకాశమున్నట్టు తెలిసింది. బహిరంగసభ తర్వాతే సంస్థాగత నిర్మాణం వరంగల్ సభ నిర్వహణ సమన్వయ బాధ్యతలను ఎమ్మెల్సీలు పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్రావు, పార్టీనేత గ్యాదరి బాలమల్లుకు అప్పగించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన నేతలు జన సమీకరణపై దృష్టి పెట్టాల్సిందిగా కేసీఆర్ ఆదేశించారు. బహిరంగ సభ ముగిసిన తర్వాత పార్టీ సభ్యత్వ నమోదు, అన్ని స్థాయిల్లో పార్టీ సంస్థాగత కమిటీల ఏర్పాటు షెడ్యూలు విడుదల చేస్తామని కేసీఆర్ స్పష్టత ఇచ్చారు. -
వర్శిటీ భూములను మేం లాక్కోవడం లేదు: భట్టీ
సాక్షి, హైదరాబాద్: హెచ్‌యూసీ భూములపై విపక్షాలు దుష్ప్రచారం చేస్తున్నాయని.. ఆ భూములను ప్రభుత్వం తీసుకోవడం లేదని మంత్రి శ్రీధర్‌బాబు స్పష్టం చేశారు. హెచ్‌సీయూ వ్యవహారంపై తెలంగాణ మంత్రులు మీడియా సమావేశం నిర్వహించారు. కావాలనే బీజేపీ, బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తున్నాయని.. హెచ్‌సీయూ నుంచి ఒక ఇంచు భూమి కూడా ప్రభుత్వం తీసుకోలేదు.. వర్శిటీ భూమి వర్శిటీకే ఉంది.. కావాలనే విద్యార్థులను రెచ్చగొడుతున్నారు’’ అని మంత్రి శ్రీధర్‌బాబు మండిపడ్డారు. ఆ భూముల్లో చెరువు, రాక్‌ఫామ్‌లను కాపాడతామని.. జీవ వైవిధ్యానికి ఎలాంటి నష్టం కలగకుండా చూస్తామని మంత్రి అన్నారు.ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో ఉన్న భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుందని మంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ‘‘ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యను పరిష్కరిస్తున్నాం. అభివృద్ధిని అడ్డుకోవాలని కొన్ని పార్టీలు యత్నిస్తున్నాయి. కంచ గచ్చిబౌలి భూములపై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియాల్సిన అవసరం ఉంది. 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదే. ప్రభుత్వ పనికి అడ్డు తగిలితే ఉపేక్షించం’’ అని భట్టి హెచ్చరించారు. -
కాంగ్రెస్ పార్టీలో ఏముందోయ్.. నేనే బీఎస్పీలోకి వద్దామనుకున్నా!
జగిత్యాల జిల్లా: ‘కాంగ్రెస్ పార్టీలో ఏముందోయ్.. నేనే బీఎస్పీలోకి వద్దామనుకున్నా’ అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యాఖ్యానించడం మరోసారి చర్చకు దారి తీసింది.. కాంగ్రెస్ పార్టీలో చేరడానికి వచ్చిన ఓ కార్యకర్తతో జీవన్ రెడ్డి అన్న మాటలు హాట్ టాపిక్ అయ్యాయి. కాంగ్రెస్ పార్టీ వైఖరిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న జీవన్ రెడ్డి.. తన మనసులోని మాటను బయటపెట్టారు.ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ జన్మదిన వేడుకల్లో ఈ వ్యాఖ్యలు చేశారు జీవన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీలో చేరిన ధర్మపురి బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి విజయ్ తో అవాక్కయ్యేలా మాట్లాడారు జీవన్ రెడ్డి. ‘ నేనే మీ పార్టీలో వద్దామనుకున్నా.. ఏదో ఉందని నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చావ్’ అంటూ పార్టీ తీరుపై బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశాచు.‘మీ పార్టీకి.. మీకో దండం’ అంటూ ఆనాడే వ్యాఖ్యలుతన ముఖ్యఅనుచరుడైన గంగారెడ్డి గతేడాది హత్య గావించబడ్డ దగ్గర్నుంచీ జీవన్ రెడ్డి.. కాంగ్రెస్ పార్టీపై అసహనం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. అధికారంలో కాంగ్రెస్ ఉన్న సమయంలోనే తన అనుచరుడు హత్యకు గురి కావడంతో జీవన్ రెడ్డి బహిరంగంగానే పార్టీ తీరుపై నిరసన స్వరం వినిపిస్తున్నారు. ‘ ఏదైనా స్వచ్ఛంద సంస్థ పెట్టుకునైనా సేవ చేస్తా. మీ పార్టీకి మీకో దండం అంటూ గతంలో జీవన్ రెడ్డి వ్యాఖ్యానించారు. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ వద్ద ఈ వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఎన్నో అవనానాలు భరించామని. ఇక భౌతికంగా లేకుండా చేయలేని చూస్తే చేసేది ఏముంటుందటూ జీవన్ రెడ్డి ఆ సమయంలో మాట్లాడారు. -
కేబినెట్ విస్తరణ.. కాంగ్రెస్ హైకమాండ్‌కు జానారెడ్డి లేఖ
సాక్షి, హైదరాబాద్: త్వరలోనే మంత్రి వర్గ విస్తరణ ఉండే చాన్స్ ఉందనే ప్రచారం నేపథ్యంలో కాంగ్రెస్ అధిష్టానానికి ఆ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి లేఖ రాశారు. ఖర్గే, కేసీ వేణుగోపాల్‌కు లేఖ రాశారు. రంగారెడ్డి జిల్లా ఎమ్మెల్యేలకు మంత్రి వర్గంలో చోటు కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు మంత్రి పదవి ఇవ్వాలని ఆయన కోరారు. ఈ నిర్ణయంతో ప్రజలకు ప్రయోజనమే కాకుండా, కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి దోహద పడుతుందని ఆయన లేఖలో పేర్కొన్నారు.కాగా, తెలంగాణ కేబినెట్ విస్తరణకు రేవంత్ సర్కార్ రెడీ అవుతోంది. ఇప్పటికే ఆశాహుల జాబితాను హైకమాండ్‌కు పంపించినట్లు సమాచారం. ఇప్పటికే తమ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని కోరుతూ.. ఇటీవల మాదిగ, లంబాడి, బీసీ సామాజికవర్గ ఎమ్మెల్యేలు కూడా అధిష్టానానికి లేఖలు రాశారు. ఈ మేరకు ఏఐసీసీ నేతలు రాహుల్, ఖర్గే, కేసీ వేణుగోపాల్, పార్టీ ఇన్చార్జ్ మీనాక్షి నటరాజన్‌లకు తమ వినతులను పంపారు. ప్రస్తుతం రేవంత్‌రెడ్డి ప్రభుత్వంలో ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉండగా.. ఇందులో నాలుగింటిని భర్తీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది. -
పార్లమెంట్‌కు చేరిన HCU భూముల వ్యవహారం
న్యూఢిల్లీ, సాక్షి: హెచ్‌సీయూ భూముల వ్యవహారం పార్లమెంట్‌కు చేరింది. బడ్జెట్ సమావేశాల్లో భాగంగా.. మంగళవారం రాజ్యసభ జీరో అవర్‌లో బీజేపీ ఎంపీ లక్ష్మణ్ ఈ అంశాన్ని చర్చకు తీసుకొచ్చారు. భూముల వేలాన్ని తక్షణమే ఆపివేయాలని పెద్దల సభ వేదికగా ప్రభుత్వాన్ని ఆయన కోరారు. భూముల వేలాన్ని ఆపి పర్యావరణాన్ని రక్షించాలి. అరుదైన పక్షులు, వృక్షజాతులు అక్కడ ఉన్నాయి. ఉగాది పండుగ రోజున అర్ధరాత్రి హెచ్‌సీయూ భూముల్లో బుల్డోజర్లు నడిపించారు. భూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ విద్యార్థులు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారు. ఉచిత హామీల పథకం కోసం భూములను అమ్మవద్దు. తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదు. రాహుల్ రేవంత్ రాజ్యాంగ నడుస్తుంది అని మండిపడ్డారాయన.అంతకుముందు ఈ అంశంపై ఈటల రాజేందర్ మీడియాతో మాట్లాడారు. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను కలిశాం. తొలి దశ తెలంగాణ ఉద్యమంలో కేంద్ర ప్రభుత్వం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని మంజూరు చేసింది. ఈ భూములను ఎవరికి ధారధత్తం చేయవద్దని సుప్రీంకోర్టు గతంలోనూ తీర్పు చెప్పింది. కానీ, ఢిల్లీకి కప్పం కట్టేందుకు ప్రభుత్వ భూములను రేవంత్ పనిచేస్తున్నారు. ఈ ప్రభుత్వం జింకలను , నెమళ్లను చంపి భూములను నాశనం చేస్తుంది. రూ.40 వేల కోట్ల రూపాయల విలువైన భూములను అమ్మి.. తెలంగాణ ప్రజల నోట్లో మట్టి కొడుతున్నారు. విద్యార్థులపై రేవంత్ ప్రభుత్వం పాశవిక చర్యలు మానుకోవాలి అని అన్నారు. బీజేపీ ఎంపీ నగేష్ మాట్లాడుతూ.. హెచ్‌సీయూ యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దాలని కేంద్రం ఆలోచిస్తుందన్న విషయం మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ తమకు తెలియజేశారని, అలాంటి యూనివర్సిటీ భూములను అమ్మొద్దని తాము పోరాటం చేస్తామని అన్నారు. -
ప్రభుత్వమా? బుల్డోజర్ కంపెనీయా?
హైదరాబాద్, సాక్షి: హెచ్‌సీయూ భూముల వెనుక దాస్తున్న నిజం ఏంటో బయటపెట్టాలని తెలంగాణ ప్రభుత్వానికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సవాల్ విసిరారు. తాజా హెచ్‌సీయూ ఉద్రిక్తతల పరిణామాలపై స్పందించిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘పర్యావరణ పరిరక్షణ పేరిటి పేదల ఇళ్లు కూల్చారు. అభివృద్ధి పేరుతో గిరిజన తండాలపైకి వెళ్లారు. జంతువుల ప్రాంతాలకు వెళ్లి సామూహిక హత్య చేస్తున్నారు. పైగా అభివృద్ధి, ప్రభుత్వ భూమి అని సమర్థించుకుంటున్నారు. ఇది ప్రభుత్వమా? బుల్డోజర్ కంపెనీయా?. ఎన్నికైన ప్రజాప్రతినిధులా? రియల్ ఎస్టేట్ ఏజెంట్లా?.. విధ్వంసం ఒక్కటే మీ ఎజెండా… ఖజానాకు కాసులు నింపుకోవడమే మీ లక్ష్యం. సెలవు దినాల్లో, అర్ధరాత్రి మీ బుల్డోజర్లు ఎందుకు నడుస్తున్నాయి?. కోర్టులు అంటే ఎందుకు మీకు అంత భయం? అంటూ రేవంత్ సర్కార్‌పై కేటీఆర్ ధ్వజమెత్తారు. ఇదిలా ఉంటే.. హెచ్‌సీయూ విద్యార్థుల పోరాటానికి కేటీఆర్ ఇప్పటికే మద్దతు ప్రకటించారు. -
HCUలో భూ రగడ.. ఓయూలో ఉద్రిక్తత
హైదరాబాద్, సాక్షి: హెచ్‌సీయూలో ఉద్రికత్త నెలకొంది. యూనివర్సిటీ ముట్టడికి సీపీఎం, బీజేవైఎం నేతలు ముట్టడికి ప్రయత్నించారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ తరుణంలో హెచ్‌సీయూ భూములపై బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీధర్ బాబు, భట్టి విక్రమార్క ఇద్దరూ హెచ్‌సీయూ పూర్వ విద్యార్థులే. HCU వెళ్తే ఆ ఇద్దరు మంత్రులు ఏ ముఖం పెట్టుకొని వెళ్తారు? క్యాబినెన్‌లో మంత్రుల మధ్య ఏకాభిప్రాయం లేదని స్పష్టంగా తెలుస్తుంది. రాబర్ట్ వాద్రా కోసమే భూములు అమ్మకానికి పెడుతున్నట్లు చెప్పుకుంటున్నారు. ఏ ముఖం పెట్టుకొని కేటీఆర్.. హెచ్‌సీయూ గురించి మాట్లాడుతున్నారు. BRS, కాంగ్రెస్ కలిసి ఆడుతున్న నాటకం. BRS చేసిన మాదిరిగానే కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తోంది. భూముల వేలం ఆపడానికి ఉద్యమిస్తాం.అభివృద్ధి అంటే భూముల అమ్మకమా?’ అని ప్రశ్నించారు.పార్లమెంట్‌కు చేరిన హెచ్‌సీయూ భూముల రగడ :రాజ్యసభ జీరో అవర్‌లో బీజేపీ ఎంపీ డాక్టర్ లక్ష్మణ్హెచ్సీయూ భూముల వేలాన్ని వెంటనే ఆపివేయాలిపర్యావరణాన్ని కాపాడాలిఅరుదైన పక్షులు, వృక్షజాతులు అక్కడ ఉన్నాయిఉగాది పండుగ రోజున అర్ధరాత్రి హెచ్‌సీయూ భూముల్లో బుల్డోజర్లు నడిపించారుహెచ్సీయూ భూముల అమ్మకంపై పోరాడుతున్న బీజేపీ ఎమ్మెల్యేలను హౌస్ అరెస్ట్ చేశారుభూముల అమ్మకాన్ని వ్యతిరేకిస్తూ హెచ్‌సీయూ విద్యార్థులు ప్రభుత్వంపై యుద్ధం ప్రకటించారుఉచిత హామీల పథకం కోసం భూములను అమ్మవద్దు తెలంగాణలో అంబేద్కర్ రాజ్యాంగం అమలు కావడం లేదురాహుల్, రేవంత్ రాజ్యాంగం నడుస్తుందిమంత్రులతో సీఎం రేవంత్ రెడ్డి అత్యవసర సమావేశం:కమాండ్ కంట్రోల్ సెంటర్ కు చేరుకున్న 11మంది మంత్రులుసీఎం ఎందుకు మీటింగ్ పెట్టారనే దానిపై కొనసాగుతున్న సస్పెన్స్అధికారులపై విద్యార్థుల దాడి : డీసీపీ వినీత్హెచ్సీయూలో కొనసాగుతున్న విద్యార్థుల ఆందోళనలుఇటు ఉస్మానియాలో ఆందోళన బాట పట్టిన విద్యార్థులు హెచ్‌సీయూ భూములపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మొద్దని మాదాపూర్ డీసీపీ వినీత్ విజ్ఞప్తిప్రభుత్వం ఉత్తర్వుల ప్రకారం టీజీఐఐసీ ఆధ్వర్యంలో కంచ గచ్చిబౌలి సర్వే నెంబర్ 25లో అభివృద్ధి పనులు అభివృద్ధి పనులు అడ్డుకున్న విద్యార్థులు అధికారులు, కార్మికులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారని డీసీపీ వినీత్ వెల్లడిహెచ్సీయూ భూముల వివాదంపై హైకోర్టులో పిటిషన్ :కంచ గచ్చిబౌలి భూములపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేసిన వట ఫౌండేషన్కంచ గచ్చిబౌలి భూములను జాతీయ ఉద్యానవంగా ప్రకటించాలని పిటిషన్అత్యవసర పిటిషన్‌గా విచారణకు స్వీకరించాలని కోరిన వట ఫౌండేషన్ లాయర్రేపు విచారణకు స్వీకరిస్తామని తెలిపిన హైకోర్టు యూనివర్సిటీ భూముల్ని పరిశీలించేందుకు బయల్దేరిన బీజేపీ ఎమ్మెల్యేలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్, ధన్పాల్ సూర్యనారయణతోపాటు ఇతర బీజేపీ నేతలు యూనివర్సిటీకి వెళ్లకుండా అడ్డుకున్నారు. హెచ్‌సీయూ భూమల వేలం వ్యవహారంపై ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. దీంతో నిరసనల్ని ఉద్ధృతం చేయాలని విద్యార్థులు నిర్ణయించారు. బీజేపీ విద్యార్థి యువజన విభాగం హెచ్‌సీయూని ముట్టడిస్తారనే సమాచారంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. హెచ్‌సీయూ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద ఉద్రికత నెలకొంది. హెచ్‌సీయూ భూముల్ని పరిశీలించేందుకు వెళ్తున్న బీజేపీ శ్రేణుల్ని పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు. హెచ్‌సీయూ భూముల్ని పరిశీలించేందుకు బీజేపీ ఎమ్మెల్యేలు బయల్దేరారు. భూముల వద్ద వాస్తవ పరిస్థితుల్ని తెలుసుకోనున్నారు. ఈ తరుణంలో హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ వద్ద బీజేపీ నేతల్ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అటు బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. కంచె గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూమిపై నెలకొన్న వివాదంతో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (HCU) క్యాంపస్ అట్టుడికిపోతోంది. ఇవాళ్టి నుంచి పోరాటం ఉధృతం చేయాలని విద్యార్థి సంఘాలు నిర్ణయించాయి. ఈ క్రమంలో తరగతుల్ని బహిష్కరించి ఆందోళనకు సిద్ధమయ్యాయి. ఒకవైపు.. బీజేపీ ఎమ్మెల్యేలు HCU సందర్శన వేళ.. హైదరగూడ MLA క్వార్టర్స్ వద్ద భారీగా పోలీసులు మోహరించడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో యూనివర్సిటీ వద్దకు వెళ్లాలని బీజేపీ నిర్ణయించింది. ఎట్టి పరిస్థితుల్లో యూనివర్సిటీని సందర్శిస్తామని అంటోంది. ఇప్పటికే భూముల వేలం పై నిజ నిర్ధారణ కమిటీ వేయాలని బీజేపీ నిర్ణయించింది. తద్వారా వాస్తవాలను ప్రజల ముందు ఉంచాలని భావిస్తోంది. ఇప్పటికే యువ మోర్చా ఆధ్వర్యంలో HCU భూముల వేలానికి వ్యతిరేకంగా పోరాటం నడుస్తోంది.మరోవైపు.. వామపక్ష పార్టీలు సైతం సెంట్రల్ యూనివర్సిటీ వద్ద ఆందోళనకు సిద్ధమైంది. సెంట్రల్ యూనివర్సిటీ భూమి అమ్మకాన్ని ప్రభుత్వ వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌తో సీపీఐ, సీపీఎంలు నిరసన చేపట్టబోతున్నారు. హెచ్‌సీయూ భూముల పరిరక్షణ కోసం పాటుపడుతున్న విద్యార్థులపై రాష్ట్ర ప్రభుత్వం దుర్మార్గమైన అణచివేతకు పాల్పడుతోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపిస్తున్నారు. విద్యార్థుల పోరాటానికి బీఆర్ఎస్ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ క్రమంలో.. ఈ ఉదయం కేబీఆర్ పార్కు వద్ద బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. హెచ్‌సీయూ భూముల విషయంలో ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ.. ‘ప్రకృతిని కాపాడండి.. అది మనల్ని కాపాడుతుంది’.. ‘హెచ్‌సీయూ అడవి నరికితే.. హైదరాబాద్ ఊపిరి ఆగుతుంది‘ అంటూ ప్లకార్డుల ప్రదర్శనతో బీఆర్ఎస్వీ నిరసన చేపట్టింది. ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి ఎర్రబెల్లి, పలువురు ప్రకృతి ప్రేమికులు మద్దతు తెలిపారు.కంచె గచ్చిబౌలి భూములపై ఇప్పటికే టీజీఐఐసీ (TGIIC) కీలక ప్రకటన చేసింది. ఆ 400 ఎకరాల భూమి ప్రభుత్వానిదేనని స్పష్టం చేసింది. ప్రాజెక్టులో సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ)భూమి లేదని తెలిపింది. ఈ మేరకు టీజీఐఐసీ వెల్లడించింది. వేడెక్కిన క్యాంపస్ హెచ్‌సీయూలో 400 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం టీజీఐఐసీకి కేటాయించడాన్ని వ్యతిరేకిస్తూ కొద్ది రోజులుగా క్యాంపస్‌లో విద్యార్థులు ఆందోళన చేస్తున్నారు. సదరు స్థలాన్ని పొక్లెయిన్లతో చదును చేస్తున్న విషయం తెలుసుకున్న విద్యార్థులు అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. గత రెండురోజులుగా నెలకొన్న ఉద్రిక్తతలతో HCU మొత్తం ఇప్పుడు పోలీసు పహారాలో ఉంది. -
‘HCU విద్యార్థులపై లాఠీచార్జ్.. 400 ఎకరాలు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా?’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గత బీఆర్ఎస్ పాలన కంటే కాంగ్రెస్ పాలనలోనే అరాచకత్వం ఎక్కువైందని ఆరోపించారు కేంద్రమంత్రి బండి సంజయ్. హెచ్‌సీయూలో విద్యార్థులను కొట్టడం ఎంత వరకు కరెక్ట్?. అమ్మాయిలను మెడలు పట్టుకుని లాక్కెళ్లడం దారుణం. వర్సిటీలో 400 ఎకరాలు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా? అని ప్రశ్నించారు.హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ(HCU)లో విద్యార్థుల అరెస్ట్, అక్కడ ఉద్రిక్తతలపై కేంద్రమంత్రి బండి సంజయ్ స్పందించారు. తాజాగా బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ..‘హెచ్‌సీయూ ఘటన వీడియోలు చూసి తెలంగాణ సమాజం బాధ పడుతుంది. దొంగతనంగా రాత్రికి రాత్రికి చెట్లు కొట్టేశారు. 400 ఎకరాలు అమ్మి రాష్ట్రాన్ని పాలిస్తారా?. వర్సిటీలో భూములు అమ్మితే కానీ కాంగ్రెస్ ప్రభుత్వం నడిచే పరిస్థితి లేదు. గజం తావు కూడా లేకుండా కాంగ్రెస్ ప్రభుత్వం పాలన చేస్తోంది.ఎబీవీపీ కార్యకర్తను పోలీస్ స్టేషన్ లోపల వేసి కొట్టారు. బీఆర్ఎస్ కంటే ఎక్కువ అరాచకం కాంగ్రెస్ చేస్తోంది. విద్యార్థులపై లాఠీఛార్జ్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలి. విద్యా కమిషన్ పదవులు తీసుకున్న అర్బన్ నక్సల్స్ ఎందుకు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదు. భూముల వేలం ఆపాలని డిమాండ్ చేస్తున్నాం. భూములు అమ్మి పాలించమంటే ఎవరైనా పాలించగలరు. రేషన్ బియ్యానికి ఏడాదికి పది వేల కోట్ల రూపాయలు కేంద్రం కేటాయిస్తుంది. కిలోకు 40 రూపాయలు ఇస్తున్నది మోదీ ప్రభుత్వం. కిలోకి పది రూపాయలు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి హంగామా చేస్తుంది. బీజేపీ కార్యకర్తలు రేషన్ షాపుల వద్ద ప్రజలకు అవగాహన కల్పించాలి. రేషన్ షాపుల వద్ద మోదీ ఫోటో పెట్టాలి.Telangana was promised Mohabbat ki Dukaan but got Loot aur Lathi ki Sarkar.Rahul Gandhi speaks of Mohabbat, but show Lathi on students to Loot land. ABVP students are protesting against the auction of HCU lands, and I fully support them. Instead of addressing their concerns,… pic.twitter.com/LRoF0DDizh— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 30, 2025హైదరాబాద్ జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలో కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి ఎంఐఎంకు మద్దతు చెబుతున్నారు. బీఆర్ఎస్కి ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, ఎమ్మెల్సీలు ఉన్నా ఎందుకు పోటీ చేయడం లేదు?. కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసే ఎంఐఎంను గెలిపించాలని చూస్తున్నారు. తెలంగాణ సమాజాన్ని ఎంఐఎంకు అప్పగించాలని చూస్తున్నారు. గ్రూప్-1 అభ్యర్థుల ఫిర్యాదులను పరిగణనలోకి తీసుకోవాలి. మెరిట్ అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు.Green Murder in Telangana - BRS cut, Congress cuts deeper.BRS axed 25 lakh trees for Kaleshwaram, gifted Conocarpus mess in the guise of Haritha Haram.Congress joins the green destruction at Kancha Gachibowli.Same axe, new hands.Telangana isn’t governed, but held hostage by…— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) March 31, 2025 -
ఫ్యూచర్ సిటీ దేశానికి ఆదర్శం: రేవంత్ రెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున హైదరాబాద్‌లోని రవీంద్రభారతిలో ఉగాది వేడుకలను నిర్వహించారు. ఉగాది వేడుకల్లో సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు పాల్గొన్నారు. అనంతరం అర్చకులు భద్రాచలం రాములవారి కల్యాణానికి రావాలని ఆహ్వానిస్తూ కల్యాణ పత్రికను సీఎంకు అందజేశారు.ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..‘రాష్ట్రం సంక్షేమం దిశగా దూసుకెళ్తోంది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తూనే ఉంటాం. యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు కృషి చేస్తున్నాం. ప్రపంచస్థాయిలో హైదరాబాద్‌కు గుర్తింపు ఉండాలి. మూసీ ప్రక్షాళన, రీజనల్ రింగ్ రోడ్డు, ఫ్యూచర్ సిటీ ఇందులో భాగమే. శాంతి భద్రతలు అదుపులోకి ఉంటేనే పెట్టుబడులు వస్తాయి. నేను, భట్టి విక్రమార్క జోడెద్దుల్లా రాష్ట్రం కోసం శ్రమిస్తున్నాం. దేశ ప్రజలకు తెలంగాణ ఆదర్శంగా ఉండాలి. దేశంలో కొత్త నగరాల నిర్మాణం జరగాలి. ఫ్యూచర్ సిటీని నిర్మించి దేశానికి ఆదర్శంగా నిలుస్తాం. పెట్టుబడుల నగరంగా ఫ్యూచర్ సిటీ రూపకల్పన జరుగుతుంది. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతున్నాం’ అని తెలిపారు.భట్టి ప్రవేశపెట్టిన బడ్జెట్ ఈ ఉగాది పచ్చడిలా షడ్రుచుల సమ్మిళితం. వ్యవసాయ అభివృద్ధికి, పేదలకు విద్య అందిచేందుకు బడ్జెట్లో ప్రాధాన్యం ఇచ్చాం. విద్య, వైద్య, ఉద్యోగ, ఉపాధి, సంక్షేమం అన్నింటికీ బడ్జెట్ లో నిధులు కేటాయించాం. దేశంలోనే ఫుడ్ సెక్యూరిటీ యాక్ట్ ను తీసుకొచ్చి పేదలకు ఆకలి దూరం చేసేందుకు ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ఇప్పుడు పేదలకు సన్నబియ్యం అందించే పథకానికి ఉగాది రోజున శ్రీకారం చుడుతున్నాం.దేశంలోనే అత్యధికంగా వరి ఉత్పత్తి చేసిన రాష్ట్రాల్లో తెలంగాణ ముందు భాగంలో నిలిచింది. రైతులు పండించిన సన్న ధాన్యాన్ని పేదలకు అందించబోతున్నాం. ఆదాయం పెంచాలి.. పేదలకు పెంచాలన్నది మా ప్రభుత్వ విధానం. ఇది రాజకీయాలు చేసే సందర్భం కాదు.. ఇది అభివృద్ధి చేసే సందర్భం. మా ఆలోచనలో, సంకల్పంలో స్పష్టత ఉంది. తెలంగాణ రైజింగ్-2050 ప్రణాళికతో దేశానికే తెలంగాణను ఆదర్శంగా నిలబెడతాం’ అని చెప్పుకొచ్చారు. అంతకుముందు.. ఉగాది వేడుకల్లో భాగంగా రవీంద్రభారతిలో పండితులు బాచంపల్లి సంతోష్‌కుమార్ శాస్త్రి పంచాంగ శ్రవణం చేశారు. ఈ సందర్బంగా రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగం ఈ ఏడాది పరుగులు పెడుతుంది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఈ ఏడాది ప్రజలు మెచ్చే విధంగా పాలన చేస్తారు. తెలంగాణలో వర్షాలకు ఇబ్బంది లేదు. శాంతి భద్రతల విషయంలో నిరంతరం పోలీసులు పనిచేస్తారు’ అని చెప్పుకొచ్చారు. -
రేవంత్ వ్యాఖ్యలు.. న్యాయ వ్యవస్థకు సవాలే!
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి న్యాయ వ్యవస్థకు సవాల్ విసిరారా? బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పది మంది కాంగ్రెస్‌లోకి ఫిరాయించిన కేసు సుప్రీంకోర్టులో విచారణలో ఉన్న సమయంలో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు సహజంగానే అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేల పదవులు పోవని, ఉప ఎన్నికలు రావని ఆయన శాసనసభ సాక్షిగా వ్యాఖ్యానించారు. ఇది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ఒక విధంగా భరోసా ఇచ్చినట్లే. అదే టైమ్‌లో ఉప ఎన్నికలకు వెళ్లడానికి కాంగ్రెస్ వెనుకంజ వేస్తోందన్న సంకేతం కూడా ఇచ్చినట్లయింది. ప్రజలలో వ్యతిరేకత ఉందంటూ బీఆర్ఎస్, బీజెపిలు చేస్తున్న ప్రచారానికి ఊతమిచ్చినట్లవుతుంది.రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్న బలహీనతలు, న్యాయ వ్యవస్థ లోపాలను బహిర్గతం చేశాయి. గతంలో కాంగ్రెస్ నుంచి బీఆర్ఎస్లోకి ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్య తీసుకోని న్యాయ వ్యవస్థ ఇప్పుడు మాత్రం ఎలా తీసుకుంటుందన్నది ఆయన ప్రశ్న కావచ్చు. ఇది హేతుబద్దంగానే కనిపిస్తున్నా నైతికతే ప్రశ్నార్థకం. శాసనసభలో జరిగే చర్చలకు రక్షణ లేదా ఇమ్యూనిటి ఉన్నప్పటికీ, రేవంత్ వ్యాఖ్యల వీడియోని సుప్రీం కోర్టులో ప్రదర్శిస్తే న్యాయమూర్తులు ఎలా స్పందిస్తారన్నది అప్పుడే చెప్పలేం. వారు సీరియస్‌గా తీసుకోకపోతే ఫర్వాలేదు. లేకుంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి కొన్ని సమస్యలు వచ్చే ప్రమాదముంది.అత్యున్నత న్యాయస్థానం రేవంత్ వ్యాఖ్యలనే సాక్ష్యంగా తీసుకుంటే అది పెద్ద సంచలనమవుతుంది. బీఆర్ఎస్ అధినేత, గత ముఖ్యమంత్రి కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సహించిన మాట నిజం. వారిలో కొందరికి మంత్రి పదవులు ఇచ్చిన సంగతి అందరికి తెలిసిందే. తలసాని శ్రీనివాసయాదవ్ టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చి మంత్రి అయ్యారు. దానికి మూల కారణం ఓటుకు నోటు కేసు కావడం విశేషం. ఎమ్మెల్సీ ఎన్నికలలో ఒక నామినేటెడ్ ఎమ్మెల్యే ఓటును పొందడం కోసం ఆయనకు రూ.ఏభై లక్షలు ఇస్తూ రేవంత్ రెడ్డి పట్టుబడినట్లు కేసు నమోదు అయిన సంగతి విదితమే. టీడీపీ అధినేత చంద్రబాబు అప్పట్లో హైదరాబాద్ ఉమ్మడి రాజధానిలోనే ఉండేవారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ఆయన కుట్రపన్నారని బీఆర్ఎస్ నేతలు ఆరోపించే వారు.తొలి ఎన్నికలలో టీఆర్ఎస్కు 63 సీట్లే ఉండేవి. ఈ క్రమంలో రాజకీయంగా పొంచి ఉన్న ప్రమాదాన్ని గమనంలోకి తీసుకుని కేసీఆర్ ఇతర పార్టీల ఎమ్మెల్యేలను ఆకర్షించారు. దానిపై టీడీపీ పక్షాన రేవంత్ కాని, ఇతరత్రా మరికొందరు కాని హైకోర్టుకు వెళ్లారు. అయినా పెద్దగా ఫలితం రాలేదు. రెండో టర్మ్‌లో కూడా కేసీఆర్ 12 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లోకి తీసుకువచ్చారు. ఫలితంగా కాంగ్రెస్‌కు ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా పోయింది. కాంగ్రెస్ నుంచి వచ్చిన వారిలో సబితా ఇంద్రారెడ్డి మంత్రయ్యారు. శాసనసభ పక్షాల విలీనం పేరుతో కథ నడిపారు. మొత్తం ఎమ్మెల్యేలు ఒకసారి పార్టీ మారకపోయినా, స్పీకర్లు అధికార పార్టీ వారే కనుక ఇబ్బంది లేకుండా సాగిపోయింది.2014 టర్మ్‌లో ఏపీలో సైతం ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను టీడీపీలోకి చేర్చుకోవడమే కాకుండా, వారిలో నలుగురికి మంత్రి పదవులు ఇచ్చారు. అయినా స్పీకర్ వారెవ్వరిపై అనర్హత వేటు వేయలేదు. ఈ నేపథ్యంలో ఈ ఫిరాయింపులపై ఫిర్యాదులు అందినా, అసెంబ్లీ గడువు ముగిసే టైమ్‌కు కూడా న్యాయ స్థానాలు తేల్చలేదు. తెలంగాణలో అప్పటికి, ఇప్పటికి ఒక తేడా ఉంది. గతంలో కాంగ్రెస్ నుంచి మెజార్టీ ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ లేదా బీఆర్ఎస్లోకి జంప్ చేయడంతో విలీనం కథ నడిచింది. రాజ్యసభలో కూడా నలుగురు టీడీపీ ఎంపీలను బీజేపీ ఇలాగే విలీనం చేసుకుంది. నిజానికి న్యాయ వ్యవస్థ ఈ ఫిరాయింపుల మూలానికి వెళ్లి ఉంటే బాగుండేది.అలా చేయకపోవడంతో ఆయా రాష్ట్రాలలో ఇది ఒక అంతులేని కథగా మారింది. కేసీఆర్ జమానాలో జరిగిన దానికి, రేవంత్ హయాంలో జరిగిన ఫిరాయింపులకు తేడా ఉంది. ఆనాడు సామూహిక ఫిరాయింపులన్నట్లుగా బీఆర్ఎస్ చూపింది. కాని ఇప్పుడు ఆ పరిస్థితి లేకపోవడం కాంగ్రెస్‌కు బలహీన పాయింట్ కావచ్చు. మొత్తం 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉంటే పది మంది మాత్రమే పార్టీ మారారు. వీరి ఫిరాయింపులకు సంబంధించిన ఆధారాలు ఉన్నప్పటికీ, వాటిని కోర్టులలో నిగ్గు తేల్చేసరికి పుణ్యకాలం ముగిసి పోవచ్చు. తెలంగాణ శాసనసభ స్పీకర్‌కు నోటీసు ఇచ్చి ఏడాది అయిపోయినా దానికి సమాధానం ఇవ్వకపోవడంపై సుప్రీంకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.సుప్రీం వ్యాఖ్యల తర్వాత బీఆర్ఎస్ నేతలు కచ్చితంగా ఫిరాయింపు ఎమ్మెల్యేల పదవులు పోతాయని, ఉప ఎన్నికలు వస్తాయని ప్రచారం చేస్తున్నారు. స్టేషన్ ఘనపూర్ మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత టి.రాజయ్య ఏకంగా ఎన్నికల ప్రచారమే ఆరంభించారట. దాంతో రేవంత్ అసెంబ్లీలో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు ధైర్యం చెప్పడానికి ఈ వ్యాఖ్యలు చేసినట్లు కనిపిస్తుంది. కాని ఈ స్టేట్ మెంట్ ఆయనను ఆత్మరక్షణలోకి కూడా నెట్టినట్లయింది. ఉప ఎన్నికలకు వెనుకాడుతున్నారన్న సంకేతం కాంగ్రెస్‌కు ఎంతవరకు ప్రయోజనమన్న ప్రశ్న వస్తుంది. 2014-2023 వరకు బీఆర్ఎస్ ఏ సంప్రదాయాలు అమలు చేసిందో వాటినే తామూ పాటిస్తున్నామని ఆయన అంటున్నారు. గతంలో రాని ఉప ఎన్నికలు ఇప్పుడెలా వస్తాయని అడిగారు. దీనికి న్యాయ వ్యవస్థతో పాటు రాజకీయ పార్టీలు బదులు ఇవ్వవలసి ఉంటుంది. ఈ ఎమ్మెల్యేలు తాము పార్టీ మారలేదని అంటున్నారని కూడా రేవంత్ చెప్పారు. కాని కొందరు పార్టీ మారినట్లు ఆధారాలు స్పష్టంగా కనిపిస్తాయి. ఉదాహరణకు ఖైరతాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీచేశారు. స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి కుమార్తె కావ్య వరంగల్ నుంచి కాంగ్రెస్ పక్షాన పోటీ చేసినప్పుడు ఆయన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.అయితే పటాన్ చెరు ఎమ్మెల్యే గూడెం మహీపాల్ రెడ్డి, గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి వంటివారు తాము పార్టీ మారలేదని చెబుతున్నారు. అభివృద్ది పనుల కోసం సీఎంను కలిసి వచ్చామని కాంగ్రెస్ లో చేరినవాళ్లు అంటున్నారని కూడా రేవంత్ చెప్పారు. తాను మాట్లాడేది సబ్ జ్యుడీస్ అవుతుందన్న వాదనను ఆయన తోసిపుచ్చుతూ శాసనసభలో మాట్లాడితే రక్షణ ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఫిరాయింపుల విషయంలో గతంలో ఏ సీఎం కూడా ఇంత నేరుగా అసెంబ్లీలో ఈ విషయాలు మాట్లాడలేదు. బీఆర్ఎస్ చేసిన పనే తాము చేశామని, అప్పుడు లేని కొత్త నిబంధనలు ఇప్పుడు వస్తాయా అని ఆయన ప్రశ్నించారు. నిజమే. బీఆర్ఎస్కు ఈ వ్యవహారంలో నైతిక అర్హత లేదు. జాతీయ పార్టీగా కాంగ్రెస్ కూడా అదే రీతిలో ఫిరాయింపులను ఎంకరేజ్ చేయడాన్ని ఎలా సమర్థించుకుంటారో అర్థం కాదు. ఇప్పుడు న్యాయ వ్యవస్థ ఈ సవాల్‌ను ఎలా ఎదుర్కుంటున్నది చర్చనీయాంశం.కోర్టు నేరుగా ఎమ్మెల్యేలను అనర్హులుగా చేస్తూ తీర్పు ఇస్తే తప్ప, కేవలం స్పీకర్ ల నిర్ణయానికే వదలివేసే పరిస్థితి ఉంటే ఈ సమస్య పరిష్కారం అవుతుందని ఎవరూ అనుకోవడం లేదు. పూర్వం నుంచి ఈ ఫిరాయింపుల సమస్య ఉంది. దానిని అరికట్టాలని రాజ్యాంగ సవరణలు తెచ్చినా పెద్దగా ఫలితం ఉండడం లేదు. న్యాయ వ్యవస్థ కూడా ఆయా రాష్ట్రాలలో ఆయా రకాలుగా ఫిరాయింపులపై స్పందిస్తున్నదన్న అభిప్రాయం కూడా ఉంది. అధికారం ఎటు ఉంటే అటు వైపు పరుగులు తీసే ప్రజాప్రతినిధులు, వారిని ప్రోత్సహించే రాజకీయ పార్టీలు ఉన్నప్పుడు ఫిరాయింపుల గురించి మాట్లాడడం గొంగట్లో తింటూ వెంట్రుకలు ఏరుకుంటున్నట్లు అవుతుందేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
‘ప్లీజ్ సార్.. నాకూ అవకాశం ఇవ్వండి’
న్యూఢిల్లీ, సాక్షి: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ముగియడంతో.. తెలంగాణ రాజకీయం హైదరాబాద్ నుంచి హస్తినకు మారింది. త్వరలో కేబినెట్ విస్తరణ ఉండనున్న నేపథ్యంలో మంత్రి పదవుల కోసం ఆశావహులు ఢిల్లీకి క్యూ కడుతున్నారు. ఇప్పటికే ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్‌తో అధిష్టానం చర్చలు పూర్తి చేసినప్పటికీ ‘చివరి అవకాశం’గా భావిస్తున్న కొందరు తమ ప్రయత్నాలను ముమ్మరం చేశారు. అసెంబ్లీ సమావేశాలు ముగియడంతో.. మంత్రివర్గ విస్తరణపై రాష్ట్ర రాజకీయాల్లో వాడివేడిగా చర్చ నడుస్తోంది. తెలంగాణ కేబినెట్లో చోటు కోసం పెద్ద ఎత్తున లాబీయింగ్ నడుస్తోంది. ఎలాగైనా మంత్రిపదవిని ఖాయం చేసుకోవాలనే పట్టుదలతో కాంగ్రెస్ సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. పార్టీ పెద్దల ఇల్లు, కార్యాలయాల చుట్టూ కొందరు ఎమ్మెల్యేలు పదే పదే చక్కర్లు కొడుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి, దొంతి మాధవరెడ్డి, బాలు నాయక్ , మల్ రెడ్డి రంగారెడ్డి, ఎమ్మెల్సీ శంకర్ నాయక్ సహా పలువురు నేతలు ఢిల్లీలో మకాం వేసి తమ వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. తనకు కేబినెట్లో చోటు కల్పించాలని మాధవరెడ్డి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిశారు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ ఇప్పటికే ఢిల్లీలో ఉన్నారు. డీసీసీ అధ్యక్షుల సమావేశం తర్వాత ఆయన అధిష్టాన పెద్దలను కలుస్తారని సమాచారం. మరోవైపు.. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క కూడా శుక్రవారం ఉదయం ఢిల్లీ వెళ్లనున్నారు. ఏఐసీసీ ముసాయిదాపై జరగున్న సమావేశంలో పాల్గొననున్న భట్టి.. జాతీయ నేతలను కలసి మంత్రివర్గంలో తన వారి కోసం ప్రయత్నాలు చేస్తారనే ప్రచారం నడుస్తోంది. మంత్రివర్గంలో ఆరు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. వీటిలో నాలుగు నుంచి ఐదు భర్తీ చేస్తారని తెలుస్తోంది. అతిత్వరలోనే(ఏప్రిల్ 3వ తేదీ అని ప్రచారం) మంత్రివర్గ విస్తరణ ఉండనుందని కాంగ్రెస్ వర్గాలు చెబుతున్నాయి. -
ఢీ అంటే ఢీ.. సీఎం రేవంత్, కేటీఆర్ మధ్య మాటల తూటాలు
సాక్షి, హైదరాబాద్: ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీ రామారావు మధ్య మాటల యుద్ధానికి దారితీసింది. సవాళ్లు, ప్రతిసవాళ్లు, ఆరోపణలు, ప్రత్యారోపణలు, వ్యక్తిగత విమర్శలతో గురువారం శాసనసభ అట్టుడికింది. బిల్లుపై చర్చ ప్రారంభంలో కేటీఆర్ మాట్లాడుతూ తొలుత కేంద్రంపై ఆ తర్వాత రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేశారు. కాంగ్రెస్ సర్కారు ఏ ఒక్క ఎన్నికల హామీ నిలబెట్టుకోలేదని, కక్షపూరితంగా వ్యవహరిస్తోందని అన్నారు. ఈ వైఖరి వల్ల రాష్ట్రానికి నష్టం జరుగుతోందని వ్యాఖ్యానించారు. ఈ దశలో ముఖ్యమంత్రి జోక్యం చేసుకుని కేటీఆర్ విమర్శలను తిప్పికొట్టారు. ‘మేం కక్ష పూరితంగా వ్యవహరిస్తే కేసీఆర్ కుటుంబం అసెంబ్లీలో కాదు.. జైల్లో ఉండేది’ అని సీఎం అంటే.. ‘మీరు ఏం చేయాలనుకుంటున్నారో చేసుకోండి. ఏం ఫరక్ పడదు’ అంటూ కేటీఆర్ స్పందించారు. ‘ఏం చేసినా పెద్దాయన (కేసీఆర్) ఆయన సీటు ఇవ్వడు..’ అని ముఖ్యమంత్రి అంటే.. ‘రేవంత్‌లో అపరిచితుడు ఉన్నాడు’ అని కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణను బీఆర్ఎస్ అప్పుల రాష్ట్రంగా మార్చిందని రేవంత్ విమర్శించారు. ఆ తర్వాత మాట్లాడిన కేటీఆర్ అదే స్థాయిలో సీఎంపై ధ్వజమెత్తారు. పదేళ్ళ బీఆర్ఎస్ ప్రభుత్వం కన్నా మెరుగైన రైతు రుణమాఫీ చేశామన్న రేవంత్ వ్యాఖ్యలను ఖండించారు. ఏ ఊర్లోనైనా రుణమాఫీ వంద శాతం జరిగిందని నిరూపిస్తే రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని సవాల్ విసిరారు. కేటీఆర్ ప్రసంగానికి అధికార పక్ష సభ్యులు అనేకసార్లు అడ్డుపడ్డారు. దీనిపై ప్రధాన ప్రతిపక్షం అభ్యంతరాలు లేవనెత్తడంతో ఇరు పక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసకుంది. కేటీఆర్, సీఎం పరస్పర వ్యక్తిగత, రాజకీయ విమర్శలతో సభ వేడెక్కింది. విపక్షం ఆరోపణలకు సీఎం సుదీర్ఘ వివరణ ఇచ్చారు. కళ్లల్లో నిప్పులు పోసుకుంటున్నారు: రేవంత్ ‘రైతుల రూ.లక్ష లోపు పంట రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన బీఆర్ఎస్ ప్రభుత్వం నాలుగేళ్లలో రూ.16,143 కోట్లే మాఫీ చేసింది. మొదటి ఐదేళ్లల్లో వడ్డీ తీసివేస్తే జరిగిన రుణమాఫీ రూ.13,514 కోట్లు మాత్రమే. రెండోసారి నాలుగేళ్ళల్లో ఒక్క రూపాయి కూడా చేయలేదు. ఆఖరి ఏడాది 21,35,557 మంది రైతులకు రూ.11,909 కోట్లు మాత్రమే మాఫీ చేశారు. కానీ మేం రుణమాఫీ చేసి చూపించాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన పది నెలల్లోనే రూ.20,616,89 కోట్లు మాఫీ చేశాం. ఎన్నికల నిబంధనతో వారు రైతుబంధు ఇవ్వకపోతే..మేము వచ్చాక ఇచ్చాం. వరి వేస్తే ఉరి అని రైతులకు చెప్పి, కేసీఆర్ కుటుంబసభ్యుల ఫామ్‌హౌస్‌ల్లో పండిన వడ్లను క్వింటాల్‌కు రూ.4,500 చొప్పున కావేరి సీడ్స్‌కు అమ్ముకున్నారు. వారు పదేళ్లలో చేయలేని పనులు మేము చేస్తే కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు..’ అంటూ రేవంత్ ఫైర్ అయ్యారు. అప్పుల రాష్ట్రంగా మార్చారు.. ‘బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల పాల్జేసింది. 2014 నాటికి 16 మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు రూ.90,160 కోట్లయితే, పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ. 6,69,257 కోట్లు అప్పు చేశారు. వాళ్ళు పెట్టిన రూ.40,154 కోట్ల బకాయిలు కలిపితే, మొత్తం అప్పు రూ.7,19,151 కోట్లు. మేము అధికారంలోకి వచ్చిన 15 నెలల్లో రూ.1,58,041 కోట్లు అప్పు చేశాం. గత ప్రభుత్వం పదేళ్లలో చేసిన అప్పులకు అసలు, వడ్డీ కలిపి రూ.1,53,359 కోట్లు చెల్లించాం. ఇవి తీసేస్తే మేము చేసిన అప్పు రూ.4,682 కోట్లు మాత్రమే. విపక్షం అబద్ధాల పునాదులపై వెళ్తే లాభం లేదు. ఇప్పటికే కూలిపోయింది. ఇప్పటికైనా మర్యాదగా ఉండాలి..’ అని సీఎం ధ్వజమెత్తారు. ఫాంహౌస్‌ల కోసం ప్రాజెక్టులు కట్టారు.. ‘బీఆర్ఎస్ నేతల ఫాం హౌస్‌ల కోసమే ప్రాజెక్టులు కట్టారు. ప్రతి ప్రాజెక్టు పక్కన వందల ఎకరాలు కొన్నారు. కొండపోచమ్మ నుంచి ఎర్రవల్లి ఫాం హౌస్‌కు కాల్వలు తీసి నీళ్ళు తీసుకెళ్ళారా లేదా? చెప్పాలి. రంగనాయక సాగర్ దగ్గర హరీశ్‌రావుకు ఫాం హౌస్ ఉందా లేదా? దీనిపై కాంగ్రెసేతర శాసనసభ్యులతో కమిటీకి సిద్ధమా? మేడిగడ్డ దగ్గర కాళేశ్వరం కడితే కుప్పకూలిపోతుందని ఇంజనీర్లు చెప్పినా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదు. కమిషన్ నివేదిక వచ్చిన తర్వాత బాధ్యులను జైలుకు పంపుతాం. కాళేశ్వరంపై విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఇచ్చిన నివేదికను వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో సభ ముందు పెడతాం. కాళేశ్వరం లేకున్నా వ్యవసాయానికి నీళ్శివచ్చు. లగచర్లలో అధికారులను చంపమని విపక్షం రెచ్చగొట్టింది..’ అని సీఎం ఆరోపించారు. పెద్దాయనకు ప్రమాదం తెచ్చేలా ఉన్నారు.. ‘పెద్దాయన (కేసీఆర్) సీటు కోసం కుటుంబంలోని ఇద్దరూ ఆశ పడుతున్నారు. కానీ పెద్దమనిషి వదిలేట్లు లేడు. వీపు చింతపండు అవుతుందని పెద్దాయనే చెప్పాడు. పెద్దమనిషి ఉంటేనే బాగుంటుందని మేము అనుకుంటున్నాం. ఆయన వందేళ్ళు ఉండాలని, ప్రతిపక్షంలో ఉంటూ మంచి సలహాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. కానీ వీళ్ళిద్దరూ పోటీ పడి పెద్దాయనకు ప్రమాదం తెచ్చేలా ఉన్నారు. ఆయనకు రక్షణ కల్పించాలి. ‘ఈ సందర్భంగా నేపాల్ యువరాజు దీపేంద్ర అధికారం కోసం కుటుంబాన్ని ఏకే 47 తుపాకీతో కాల్చిన ఉదంతాన్ని ప్రస్తావించారు) మీరు జాతిపిత అని చెబుతున్న కేసీఆర్‌ను కామారెడ్డిలో బండకేసి కొట్టారు..’ అని రేవంత్ వ్యాఖ్యానించారు. ఫాంహౌస్ ఫొటోలు పత్రికలకిచ్చానని కేసులు పెట్టారు – తీవ్రవాదులు, నక్సల్స్ ఉండే డిటెన్షన్ సెల్లో ఉంచారు: రేవంత్ ‘కేటీఆర్ ఫాంహౌస్‌ను ఎవరో డ్రోన్‌తో చిత్రీకరించి నాకు ఫోటోలు ఇస్తే.. నేను వాటిని పత్రికలకు పంపిస్తే అక్రమ కేసులు పెట్టారు. అనుమతి లేకుండా డ్రోన్ ఎగురవేస్తే రూ.500 జరిమానా విధిస్తారు. కానీ నేను అప్పుడు పార్లమెంట్ సభ్యుడిని. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా ఉన్నా. నన్ను అరెస్టు చేసి నక్సల్స్, తీవ్రవాదులును నిర్బంధించే డిటెన్షన్ సెల్లో ఉంచారు. మరోఖైదీ కానీ, మరొక వ్యక్తి కానీ కనిపించని విధంగా కక్షసాధింపుగా ఆ గది కేటాయించారు. రాత్రిళ్లు పడుకోవడానికి కూడా సరిపోని గది అది. అందులోనే చిన్న బాత్రూమ్. బయటకు కనపడేలా ఉంటుంది. రాత్రి ఎలాగోలా పడుకుందామని అనుకున్నా. లైట్ ఆఫ్ చేశారు కాదు. ఏమిటంటే పైనుంచి ఆర్డర్ అనేవారు. ఆ ట్యూబ్‌లైట్ చుట్టూ పురుగులు.. వాటి కోసం వచ్చే 30 బల్లులు. ప్రతిరోజూ నిద్ర లేకుండానే గడిపా. ఉదయం పూట బయటకు వదిలినప్పుడు చెట్ల కింద పడుకున్నా. 16 రోజులు అలా నిర్బంధంలో ఉంచారు. నా కూతురు పెళ్లి పత్రిక రాసుకునే కార్యక్రమానికి కూడా వెళ్లడానికి వీల్లేదంటూ ఢిల్లీ నుంచి లాయర్‌ను తీసుకునివచ్చి వాదించారు. కోర్టు కండిషనల్ బెయిల్ ఇవ్వడంతో నేరుగా కార్యక్రమానికి వెళ్లి తిరిగి జైలుకు వచ్చా. ఇప్పుడు ఆ కోపాన్ని దిగమింగుకుని రాష్ట్ర ప్రయోజనాల కోసం పనిచేస్తున్నా. అంతకంతకు దేవుడే చూసుకుంటాడని అనుకున్నా. సరిగ్గా నేను ప్రమాణ స్వీకారం చేసే రోజునే నాపై కక్ష చూపించిన వాళ్లు ఆసుపత్రిపాలయ్యారు. కక్ష సాధింపు ఎవరిది? మీదా? నాదా?. ఆ కుటుంబానికి చర్లపల్లి జైల్లో డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తానంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని కూడా నేను అమలు చేయలేదు..’ అంటూ సీఎం వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. డ్రోన్ ఎగరేసి ఆడోళ్ల ఫొటోలు తీస్తారా – మీ భార్యాపిల్లల ఫొటోలు తీస్తే ఊరుకుంటారా?: కేటీఆర్ ‘సీఎం ఇంటి మీదికి డ్రోన్ పంపిస్తే ఆయన ఊరుకుంటాడా? ఆయన భార్యా పిల్లలను ఇష్టం వచ్చినట్టు ఫొటోలు తీస్తామంటే ఊరుకుంటాడా? మీకే భార్యా పిల్లలు ఉన్నారా? వేరే వాళ్లకు లేరా? వాళ్లకు కుటుంబాలు ఉండవా? లేని రంకులు అంటగట్టిం ఆనాడు ఇష్టమున్నట్టు మాట్లాడినప్పుడుం నీతులు గుర్తుకు రాలేదా? మా ఇంట్లో పిల్లల్ని తిట్టింది ఈ కాంగ్రెస్ నేతలు కాదా? మా ఇంట్లోని మైనర్ పిల్లల్ని పట్టుకొని బూతులు మాట్లాడింది ముఖ్యమంత్రి కాదా?..’ అని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనను జైల్లో పెట్టించారంటూ సీఎం చేసిన వ్యాఖ్యలకు ఆయన కౌంటర్ ఇచ్చారు. ‘మా ఇంటి మీదకు డ్రోన్ ఎగరేసి ఇంటివాళ్ల ఫొటోలు తీయటం సరైన పనేనా అన్నది సీఎం చెప్పాలి. రేవంత్‌రెడ్డిని ప్రభుత్వం జైల్లో పెట్టలేదు. కోర్టులు రిమాండ్ చేశాయి. నేను కూడా తెలంగాణ ఉద్యమంలో వరంగల్ జైల్లో ఉన్నా. అయినా రేవంత్‌రెడ్డి స్వాతంత్య్రం కోసం పోరాడాడా? ఏం గొప్ప పని చేసి జైలుకెళ్లాడు? ముఖ్యమంత్రి ఏమనుకున్నా మాకు ఫరక్ పడదు. ఏం చేసినా ఫరక్ పడదు. పదవి, అధికారం శాశ్వతం అని సీఎం అనుకుంటున్నారు కానీ అవి ఏవీ శాశ్వతం కాదు. ముఖ్యమంత్రికి అపరిమిత అధికారాలు ఉండవు. ఆయన ఎవరినీ జైలుకు పంపలేరు. కోర్టులు మాత్రమే ఆ పని చేయగలవు. రేవంత్ తిట్లన్నీ మాకు దీవెనలే.ం ఆయనకు తుపాకుల గురించి బాగా తెల్సుం. తెలంగాణపై గన్ను ఎక్కుపెట్టిన రైఫిల్‌రెడ్డి రేవంత్‌రెడ్డి. తెలంగాణ జాతి పిత ముమ్మాటికీ కేసీఆరే. తెలంగాణ బూతు పిత రేవంత్‌రెడ్డే..’ అని కేటీఆర్ అన్నారు -
నన్ను జైల్లో పెట్టి హింసించినా.. రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడలేదు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపులకు పాల్పడుతోందన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు వ్యాఖ్యలకు ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల చివరి రోజు.. గురువారం మధ్యాహ్నాం సెషన్లో తొలుత కేటీఆర్ ప్రసంగించగా.. ఆ ఆరోపణలపై సీఎం రేవంత్ స్పందించారు. రాజకీయ కక్ష సాధింపు ఎవరిది? మీదా? నాదా?.. ఎవరైనా అనుమతి లేకుండా డ్రోన్ ఎగరేస్తే రూ.500 ఫైన్ విధిస్తారు. కానీ, డ్రోన్ ఎగరేశానని బీఆర్ఎస్ హయాం(BRS Rule)లో నాపై కేసు పెట్టారు. అధికారం అడ్డుపెట్టుకుని ఎంపీగా ఉన్న నన్ను చర్లపల్లి జైల్లో పంపారు. నన్ను జైల్లో ఉంచి చిత్రహింసలకు గురి చేశారు. నక్సలైట్లు, దేశ ద్రోహులు ఉండె డిటెన్షన్ సెల్లో పార్లమెంట్ సభ్యుడినైన నన్ను వేశారు. నేను పడుకోకుండా రాత్రిళ్లు లైట్లు వేశారు. జైల్లో 16 రోజులు నిద్రలేని రాత్రులు గడిపా. .. చర్లపల్లి జైలు నుంచి నా బిడ్డ లగ్నపత్రిక రాసుకోవడానికి వెళ్లకుండా అడ్డుకున్నారు. నా బిడ్డ లగ్గానికి రాకుండా ఢిల్లీ నుంచి అడ్వకేట్లను తీసుకొచ్చారు. చర్లపల్లి జైలు నుంచి ఫంక్షన్ హాల్ కు వచ్చి.. మళ్ళీ జైలుకు పోయా. నా కుటుంబ సభ్యులను అసభ్యంగా తిట్టినా భరించా. సొంతపార్టీ ఆఫీసులో బూతులు తీయించి రికార్డు చేయించినా… చెంపలు వాయించే శక్తి ఉన్నా నేను సంయమనం పాటించా. దేవుడు అన్ని చూస్తుంటాడంటూ సహనంతో ఎదురు చూశా. అంతేకానీ.. కేసీఆర్ కుటుంబంపై ఏనాడూ.. ఎలాంటి రాజకీయ కక్ష చర్యలకు పాల్పడలేదు. వారిని జైలుకు పంపుతానన్న హామీని కూడా నెరవేర్చలేదు. నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే.. కేసీఆర్ కుటుంబంలో ఏం జరగాలో అది జరిగింది. నా మీద కక్ష చూపిన వారిని ఆ దేవుడే ఆసుపత్రిపాలు చేశాడు. నేను నిజంగానే కక్ష సాధింపు చర్యలకు పాల్పడి ఉంటే ఇవాళ కేటీఆర్(KTR) అసెంబ్లీలో కూర్చొని ఇలా మాట్లాడేవారు కాదు. ప్రజలు రాష్ట్ర అభివృద్ధి కోసం నాకు అధికారం ఇచ్చారు. కక్షలు తీర్చుకోవడానికి కాదు. ఎవరివి కక్ష సాధింపు చర్యలో తెలంగాణ సమాజం ఇదంతా గమనిస్తోంది’’ అని సీఎం రేవంత్ అన్నారు. ఇదీ చదవండి: అది నిరూపిస్తే రాజకీయ సన్యాసం చేస్తా: కేటీఆర్ -
మంత్రి పదవి కోసం అధిష్టానం వద్దకు క్యూ..!
హైదరాబాద్: ఉగాది లోపు అంటే మరో రెండు రోజుల్లో తెలంగాణ క్యాబినెట్ విస్తరణపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉండటంతో ఢిల్లీకి కాంగ్రెస్ నేతలు క్యూకడుతున్నారు. పలువురు కాంగ్రెస్ నేతలు తమకు మంత్రి పదవి కావాలంటే తమకు కావాలంటూ ఢిల్లీ విమానం ఎక్కేవందుకు సన్నద్ధమయ్యారు. ఇవాళ సాయంత్రం కొంతమంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇప్పటికే మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీ నాయక్, నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డిలు ఢిల్లీలో ఉండగా, ఈరోజు(గురువారం) సాయంత్రం ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలతో పాటు పలువురు ఎస్టీ, ఎస్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లేందుకు సన్నద్ధమైనట్లు తెలుస్తోంది.తమ సామాజిక వర్గాలకు మంత్రి వర్గంలో ప్రాతినిధ్యం కల్పించాలని అధిష్టానానికి కాంగ్రెస్ ఎమ్మెల్యేలు విన్నవించనున్నారు. ఈ మేరకు కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ తో వీరు సమావేశమయ్యే అవకాశం ఉంది.తెలంగాణ క్యాబినెట్ విస్తరణకు సంబంధించి రెండు రోజుల క్రితం హైకమాండ్ కసరత్తు చేసింది. డీనిలో భాగంగా పలువురు రాష్ట్ర ముఖ్యనేతలకు ఢిల్లీ పిలిచి క్యాబినెట్ విస్తరణపై సుదీర్ఘంగా చర్చించింది హైకమాండ్. అయితే క్యాబినెట్ విస్తరణలో ఎవరికి చోటు కల్పించాలి.. ఎవరికి ఉద్వాసన పలకాలి అనే అంశం ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ తమ వంతు ప్రయత్నంలో భాగంగా పలువురు నేతలు ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలను కలవనున్నారు. తెలంగాణ క్యాబినెట్ రేసులో సుదర్శన్ రెడ్డి, ప్రేమ్ సాగర్ రావు, వాకాటి శ్రీహరి, కోమటిరెడ్డి రాజగోపాల్, మల్ రెడ్డి రంగారెడ్డి, బాలు నాయక్ లు ఉన్నట్లు తెలుస్తోంది. -
400 ఎకరాల భూమి వేలం.. రేవంత్‌కు కిషన్‌రెడ్డి లేఖ
సాక్షి, ఢిల్లీ: తెలంగాణలో రాజకీయం మరోసారి ఆసక్తికరంగా మారింది. సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర గనుల శాఖ మంత్రి కిషన్ రెడ్డి తాజాగా లేఖ రాశారు. ఈ లేఖలో ప్రభుత్వ భూముల అమ్మకం గురించి ముఖ్యంగా ప్రస్తావించారు. రంగారెడ్డి జిల్లాలోని 400 ఎకరాల ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో గతంలో రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి ప్రస్తావించారు.కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి లేఖలో..‘ఆర్థిక వనరుల సమీకరణ పేరిట రంగారెడ్డి జిల్లా, శేరిలింగంపల్లి మండలం, కంచ గచ్చిబౌలి గ్రామంలోని సర్వే నంబర్ 25(పి)లో ఉన్న 400 ఎకరాల ప్రభుత్వ భూమిని తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలికసదుపాయాల సంస్థ (TGIIC) ద్వారా వేలం వేయాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. గతంలో మీరు పీసీసీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు భవిష్యత్తు తరాలను, ప్రజా ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వ భూముల అమ్మకానికి వ్యతిరేకంగా మాట్లాడారు. ‘మనం బ్రతకడానికి, మన సోకులకు ప్రభుత్వ భూములు అమ్మొద్దు, ఒకవేళ ప్రభుత్వ భూములను అమ్మితే భవిష్యత్తులో ప్రజల అవసరం కోసం ఏదైనా నిర్మించాలన్నా, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, విద్యాలయాలు కానీ, చివరకు చచ్చిపోతే స్మశానాలకు కూడా భూమి లేని పరిస్థితి ఉంటుంది’ అని గతంలో మీరు మాట్లాడిన మాటలను ఈ సందర్భంగా ఒకసారి గుర్తు చేస్తున్నాను.నేడు మీరు వేలం వేయాలని నిర్ణయం తీసుకున్న ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూమికి ఆనుకుని జీవవైవిధ్యానికి నెలవైన అనేక వృక్షజాలం, జంతుజాలం, సరస్సులు ఉన్నాయి. ఇందులో 734 వృక్ష జాతులు, 220 పక్షి జాతులతో సహా నెమళ్లు, వలస పక్షులు, మచ్చల జింకలు, నాలుగు కొమ్ముల జింకలు, అడవి పందులు, కొండ చిలువలు, భారతీయ నక్షత్ర తాబేళ్లు వంటి వైవిధ్య భరితమైన జీవజాతులు, మష్రూమ్ రాక్ తో సహా సహజసిద్ధంగా ఏర్పడి ఎంతో ఆకర్షణీయంగా ఉండే రాళ్ల అమరికలెన్నో ఉన్నాయని అనేకమంది ప్రముఖులు తెలియజేస్తున్నారు.మీరు వేలం వేయాలని నిర్ణయం తీసుకున్న ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూమి అటవీశాఖ పరిధిలోకి రానప్పటికీ చుట్టూ పచ్చని చెట్లతో, వైవిధ్యమైన జీవజాతులతో కూడిన ఈ భూమి నగరానికి ఊపిరులూదే ఒక ఆక్సిజన్ వనరుగా ఉంది. అలాంటి ఈ భూమిని కాంక్రీట్ నిర్మాణాలతో నింపేస్తే, భూమిలో నీటివనరులు తగ్గిపోయి, ఆయా జీవజాతులకు నష్టం జరిగి, పర్యావరణానికి, నగరానికి పెద్దఎత్తున ముప్పు చేకూరే అవకాశం ఉంది. పర్యావరణానికి మీరు చేయబోయే ఈ నష్టం తిరిగి పూడ్చలేనిది.ముఖ్యంగా ఈ భూమి పరిధిలో ఉన్న భారతీయ నక్షత్ర తాబేళ్ళకు, వాటి ఆవాసాలకు ముప్పు పొంచి ఉండటం ఆందోళనకరం. వన్యప్రాణుల సంరక్షణ చట్టం, 1972 లోని షెడ్యూల్ IV కింద భారతీయ నక్షత్ర తాబేళ్ళు సంరక్షించవలసిన జీవజాతుల కిందకు వస్తాయి. ఈ చట్టం కింద ఆయా జీవజాతుల సంరక్షణతోపాటు, వాటి ఆవాసాలను కూడా సంరక్షించాలి. ఈ నక్షత్ర తాబేళ్ళు 2016 నుంచి IUCN (ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్సర్వేషన్ ఆఫ్ నేచర్) లో దుర్బలమైన జాబితాలో చేర్చబడి ఉన్నాయి. అంటే, ఇది అంతరించిపోతున్న వాటి జీవజాతిని సూచిస్తుంది. అంతేకాకుండా ఈ నక్షత్ర తాబేళ్ళు 2019 నుంచి అంతర్జాతీయ వాణిజ్యంలో అంతరించిపోతున్న వృక్ష, జంతుజాలం (CITES - కన్వెన్షన్ ఆన్ ఇంటర్నేషనల్ ట్రేడ్ ఇన్ ఎన్ డేంజర్డ్ స్పీసిస్ ఆఫ్ వైల్డ్ ఫ్లోరా & ఫానా) కన్వెన్షన్ యొక్క అపెండిక్స్-I లో కూడా చేర్చబడి ఉన్నాయి.అంటే ఆయా జీవజాతులకు అంతర్జాతీయ వాణిజ్యం నుంచి అత్యున్నత స్థాయిలో రక్షణ కూడా కల్పించబడి ఉంది. కాబట్టి, వన్యప్రాణుల సంరక్షణ చట్టం, 1972 నిబంధనల ప్రకారం ఇప్పుడు మీరు వేలం వేయాలని నిర్ణయం తీసుకున్న 400 ఎకరాల భూమిని, దానిని ఆనుకుని ఉన్న 800 ఎకరాల భూమిని కలిపి జాతీయ ఉద్యానవనంగా ప్రకటించే అవకాశాన్ని కూడా ప్రభుత్వం పరిశీలించాలి.నగరంలో ఒకప్పుడు అడవులను, కొండలను తలపించే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, హైటెక్ సిటీ వంటి ప్రాంతాలు పట్టణీకరణ కారణంగా ఒక కాంక్రీట్ అడవిలాగా మారిపోయి సహజసిద్ధమైన వాటి స్వరూపాన్ని కోల్పోయాయి. ఆయా ప్రాంతాలలో ఎక్కడా ఒక చెట్టును, పుట్టను, కొండను వదలకుండా మొత్తం కాంక్రీట్ నిర్మాణాలతో నింపేశారు. ఇవి చాలవన్నట్లు ఆర్థిక వనరుల పేరిట ఇప్పుడు పర్యావరణ వైవిధ్యంలో భాగమైన భూములను కూడా కాంక్రీట్ అడవులుగా మార్చడం స్థానికంగా నివసిస్తున్న ప్రజలు, ఆ భూమికి పక్కనే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో చదువుతున్న విద్యార్థులు, పర్యావరణ ప్రేమికులు ఇలా ఎవరికీ కూడా ఆమోదయోగ్యం కాదు.ఇప్పటికే రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నగరంలో పచ్చదనం పూర్తిగా తగ్గిపోతోంది, ఖాళీ స్థలాలు అనేక కారణాలతో కనుమరుగవుతున్నాయి. నగరంలో ఆట స్థలాలు, వాకింగ్ ట్రాక్‌లు, పార్కులు, పర్యావరణ స్థలాలు అన్యాక్రాంతమవుతున్నవి. భవిష్యత్తు తరాల కోసం కొంతైనా ఈ స్థలాలను రక్షించవలసిన బాధ్యత మనందరిపైన ఉన్నది. కావున, ప్రభుత్వ భూముల అమ్మకంపై గతంలో మీరు వ్యక్తం చేసిన అభిప్రాయాలకు కట్టుబడి ఉంటారని, సహజసిద్ధంగా ఏర్పడిన కొండలతో సహా పర్యావరణ, జీవ వైవిధ్యానికి ఎలాంటి నష్టం చేకూర్చకుండా సంరక్షిస్తారని, ఈ 400 ఎకరాల ప్రభుత్వ భూముల వేలం ప్రక్రియను వెంటనే నిలుపుదల చేయాలని కోరుతున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. -
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా
తెలంగాణ శాసనసభ నిరవధిక వాయిదా11 రోజులు సభ జరిగింది.97 గంటల 32 నిమిషాలు సాగింది.శాసనసభలో 12 బిల్లులను ప్రవేశపెట్టి ఆమోదం తెలిపింది.11 రోజుల శాసనసభలో 146 మంది సభ్యులు మాట్లాడారు.16 ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారుశాసనసభలో కాంగ్రెస్ పార్టీ 65, టిఆర్ఎస్ 38, బిజెపి 8, ఎంఐఎం 7, సిపిఐ ఒక సభ్యులు ఉన్నట్లు ప్రకటించిన స్పీకర్డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క @అసెంబ్లీవాస్తవరూపిణ రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టాం.ఏ శాఖలకు కేటాయించిన బడ్జెట్‌ను ఆ శాఖలకు దాదాపు 70% పైగా ఖర్చు చేస్తాం.గత ప్రభుత్వం శాఖలకు కేటాయించిన బడ్జెట్‌ను పూర్తిగా ఖర్చు చేయలేదు.ఎస్సీ వెల్ఫేర్ కు 42 వేల కోట్లు, బీసీ వెల్ఫేర్‌కు 15000 కోట్లు ఖర్చు చేయలేదు.అన్ని శాఖలకు కలిపి 70 వేల కోట్లకు పైగా ఖర్చు చేయకుండా వదిలేశారుగత పదేళ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఆర్థిక అరాచకత్వం చేసింది.గత ప్రభుత్వం లెక్క 20 శాతం పెంచకుండా జాగ్రత్తగా బడ్జెట్ తయారు చేశాం.బడ్జెట్ పై కాకుండా సొంత రాజకీయ వ్యాఖ్యలు సభలు చేస్తున్నారు.నేను ఆషామాషీగా రాజకీయాల్లోకి రాలేదు.యాదృచ్ఛికంగా రాజకీయాల్లోకి రాలేదు.నేను యాక్టింగ్, యాక్సిడెంటల్ పొలిటిషన్ కాదు.ఫ్యూడల్ వ్యవస్థలో అణిచివేతలను దాటుకుంటూ రాజకీయాల్లోకి వచ్చాను.కంఫర్ట్ లెవెల్స్ నాకు లేవు... నా లెక్క ఎవ్వరూ బాధపడొద్దు అనే ఆలోచన కలిగిన వ్యక్తిని నేను.దోపిడి చెయ్యడానికి రాజకీయాల్లోకి రాలేదు.సమాజానికి మంచి చేయాలనే ఆలోచనతో రాజకీయాల్లోకి వచ్చిన.నేను అడ్డగోలుగా ఎదిపడితే అది మాట్లాడొచ్చు కానీ చెయ్యను.జూన్ 2వ తేదీ తెలంగాణ ఆవిర్భావం రోజున రాజీవ్ యువ వికాసం సాంక్షన్ లెటర్లు ఇస్తాం.ఏలేటి మహేశ్వర్‌రెడ్డి BJLP ఫ్లోర్ లీడర్ @అసెంబ్లీతెలంగాణకు కేంద్రం నిధులు ఇవ్వలేదంటూ అవాస్తవాలు మాట్లాడొద్దు.కాంగ్రెస్ కూటమిలో చేరేందుకు BRS ప్రయత్నిస్తోంది.డీలిమిటేషన్‌తో అన్యాయం అంటూ కొత్త రాగం ఎత్తుకున్నారు.కుటుంబ పార్టీలే బీజేపీని వ్యతిరేకిస్తున్నాయి.రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది.అప్పులు తీర్చేందుకు మళ్లీ అప్పులు చేయాల్సిన స్థితిలో ప్రభుత్వం ఉంది.ఆటో డ్రైవర్లకు 12 వేలు ఇస్తామన్న హామీని నెరవేర్చాలి.రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి అప్పుల అప్పారావు, రొటేషన్ చక్రవర్తి వలే ఉంది. సీఎం రేవంత్ రెడ్డిమా ప్రభుత్వం ఎవరి పై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడలేదు.500 ఫైన్ వేసే డ్రోన్ కేసులో నన్ను చర్లపల్లి జైలులో వేశారు.నక్సలైట్లు, దేశ ద్రోహులు ఉండే డిటెన్షన్ సెల్లో నన్ను వేశారునేను పడుకోకుండా రాత్రి కూడా లైట్లు వేసే వారు.16 రోజులు నిద్రపోకుండా చేశారునా బిడ్డ లగ్గానికి రాకుండా ఢిల్లీ నుంచి అడ్వకేట్లను తీసుకొచ్చారు.జైలు నుంచి ఫంక్షన్ హాల్‌కు వచ్చి...మళ్ళీ జైలుకు పోయా.నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజే... కేసీఆర్ కుటుంబంలో ఏం జరగాలో అది జరిగింది.కక్ష్య సాదింపు ఎవరు చేశారు.నేను కక్ష్య సాదింపు దిగితే... కేసీఆర్ కుటుంబం జైలులో ఉండేది.కేసీఆర్ కుటుంబం జైలులో పెడతా అని ఎన్నికల హామీ ఇచ్చా...కానీ ఆ హామీని నెరవేర్చలేదు.మేం నిజంగా కక్ష సాధింపు చర్యలకు పాల్పడితే… వాళ్లు అక్కడ కూర్చుని నోటికొచ్చినట్లు మాట్లాడేవారు కాదుచంచలగూడ జైల్లోనో, చర్లపల్లి జైల్లోనో మమ్మల్ని పెట్టినచోటే ఉండేవారు.డ్రోన్ ఎగరేస్తే రూ. 500 ఫైన్ వేస్తారు.. కానీ అధికారం అడ్డుపెట్టుకుని ఎంపీగా ఉన్న నన్ను చర్లపల్లి జైల్లో పెట్టారు16 రోజులు నన్ను డిటెన్షన్ సెల్లో ఒక మనిషి కూడా కనిపించకుండా మమ్మల్ని నిర్బంధించిన ఆ కోపాన్ని బిగపట్టుకున్నాం తప్ప కక్ష సాధింపునకు పాల్పడలేదులైట్లు ఆన్ లోనే పెట్టి ఒక్క రాత్రి కూడా పడుకోకుండా జైల్లో గడిపేలా చేశారుకరుడు గట్టిన నేరస్తున్ని బంధించినట్లు ఒక పార్లమెంట్ సభ్యుడిగా ఉన్న నన్ను బంధించారువాళ్ల తప్పులను దేవుడు చూస్తాడు..అంతకు అంత అనుభవిస్తారు అనుకుని ఊరుకున్నానా మీద కక్ష చూపిన వారిని దేవుడే ఆసుపత్రిపాలు చేశాడుచర్లపల్లి జైలు నుంచి నా బిడ్డ లగ్నపత్రిక రాసుకోవడానికి వెళ్లకుండా అడ్డుకున్నారురాజకీయ కక్ష సాధింపులంటే మీవి కదాఅయినా నేను కక్షసాధింపు చర్యలకు పాల్పడలేదునిజంగానే నేను కక్ష సాధించాలనుకుంటే మీ కుటుంబమంతా చర్లపల్లి జైల్లో ఉండేవారుకానీ ఆ పని నేను చేయలేదు.. మేం విజ్ఞత ప్రదర్శించాం..ప్రజలు అధికారం ఇచ్చింది నా కక్ష తీర్చుకోవడానికి కాదని నేను విజ్ఞత ప్రదర్శించాసొంతపార్టీ ఆఫీసులో బూతులు తీయించి రికార్డు చేయించినా… చెంపలు వాయించే శక్తి ఉన్నా నేను సంయమనం పాటించాఎవరివి కక్ష సాధింపు చర్యలోతెలంగాణ సమాజం ఇదంతా గమనిస్తోంది..కేటీఆర్ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మాజీ మంత్రి కేటీఆర్ సవాల్.తెలంగాణ రాష్ట్రంలో పూర్తిగా రుణమాఫీ కాలేదు.కొడంగల్ అయినా సిరిసిల్ల అయిన వెళ్దాం 100శాతం రుణమాఫీ అయినట్లు నిరూపిస్తే శాశ్వతంగా రాజకీయాలు వదిలేస్తానేను తలచుకుంటే ఎవ్వరూ మిగలరని సీఎం అంటున్నారు.. ఎవరు తలచుకున్న ఏం ఫరక్ పడదు.మీ ఇండ్లపై డ్రోన్లు ఎగరవేసి మీ భార్య, బిడ్డల ఫోటోలు తీస్తే ఊరుకుంటారా?నేను జైలుకు వెళ్లాను తెలంగాణ కోసం కొట్లాడి జైలుకు వెళ్లాను.రేవంత్ రెడ్డి ఎవరికోసం జైలుకు వెళ్లారు ఎందుకోసమే వెళ్లారు?తమ వరకు వచ్చేసరికి భార్యా పిల్లలు గుర్తుకు వస్తారా ఇతరులకు భార్యా పిల్లలు ఉండరా?లేని రంగులు అంటగడితే అప్పుడు మాకు బాధ వేయడం ఈరోజు మీరు బాధపడితే ఎలా?డీలిమిటేషన్‌పై తెలంగాణ అసెంబ్లీలో తీర్మానం పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి. రేవంత్ కామెంట్స్.. జనాభా తగ్గిన రాష్ట్రాలు నష్టపోకూడదు. పునర్విభజనకు జనాభా ఒక్కటే ప్రామాణికం కాకూడదు. జనాభా నియంత్రణ శాపంగా మారకూడదు. రాష్ట్రాన్ని యూనిట్‌గా తీసుకుని నియోజకవర్గ పునర్విభజన చేయాలి. కేంద్రం నిర్ణయంతో ప్రజల్లో ఆందోళన నెలకొందిఅన్ని పార్టీలతో సంప్రదింపులు జరపాలి. ఆ తర్వాతే లోక్‌సభ సీట్ల పునర్విభజన జరగాలి.డీలిమిటేషన్‌పై కేంద్ర ప్రభుత్వం చర్యలే తీసుకోలేదు.ఎందుకు ఈ హడావిడి అని కేంద్రమంత్రులు మాట్లాడుతున్నారు.జనాభా నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం విధివిధానాలు ఖరారు చేసింది..జనాభా నియంత్రణను దక్షిణ భారత దేశం పాటిస్తే..ఉత్తరాది రాష్ట్రాలు నియంత్రణ చేయకపోవడంతో జనాభా పెరిగింది2026 తర్వాత జనాభా లెక్కించి.. దాని ప్రకారం నియోజకవర్గాల పునర్విభజన చేయాల్సి ఉండటంతో ఇది చర్చనీయాంశమైంది.1971 జనాభా లెక్కల తర్వాత కేంద్రం.. జనాభా నియంత్రణ విధివిధానాలను తీసుకువచ్చింది.ఇందిరాగాంధీ, వాజ్‌పేయి.. 25ఏళ్ల పాటు నియోజకవర్గాల పునర్విభజనను వాయిదా వేశారు.డీలిమిటేషన్ ఈజ్ లిమిటేషన్ ఫర్ సౌత్.ప్రస్తుత జనాభా ప్రకారం ఎస్సీ, ఎస్టీ సీట్లను పెంచాలి.ఉత్తరాది రాష్ట్రాలు జనాభా నియంత్రణ చేయలేదు.కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న ద్వంద్వ విధానాలను నిరసిస్తూ.. అసెంబ్లీలో తీర్మానం పెట్టాం. సౌత్‌కు అన్యాయం జరుగుతుందని ఇందిరాగాంధీ గతంలోనే గుర్తించారు.2011 జనాభా లెక్కల ప్రకారం జమ్ము కశ్మీర్, సిక్కిం అసెంబ్లీలలో సీట్లు పెంచారు.డీలిమిటేషన్‌తో 24 శాతం ఉన్న దక్షిణాది ఎంపీల సంఖ్య 19 శాతానికి తగ్గిపోతుంది. హరీష్ రావు కామెంట్స్..ఈ సెషన్లో ఒక్కరోజు మాత్రమే క్వశ్చన్ అవర్ పెట్టారు..క్వశ్చన్ అవర్ లేకపోవడంతో సభ్యుల అనుమానాలు నివృత్తి కావడం లేదు..ఇకనైనా వీలైనన్ని రోజులు క్వశ్చన్ అవర్‌తో పాటు జీరో అవర్ పెట్టాలి.శ్రీధర్ బాబు కామెంట్స్..అర్ధరాత్రి వరకు సభ నడుపుతున్నాం.ప్రతీ సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇస్తున్నాం..సభ్యులు అడిగిన ప్రతీ ప్రశ్నకు లేఖ ద్వారా సమాధానం తెలియజేస్తాం. తెలంగాణ అసెంబ్లీలో కాగ్ రిపోర్టును ప్రవేశపెట్టిన డిప్యూటీ సీఎం భట్టి.2023-24 ఏడాది కాలంతో కలిపి గత ఐదేళ్లలో 4లక్షల 3వేల 664 కోట్ల అప్పులు చేసినట్లు తెలిపిన కాగ్.2023-24 ఏడాదిలో పబ్లిక్ మార్కెట్ నుంచి 49,618 కోట్ల అప్పులు తెచ్చిన ప్రభుత్వం.గత ఏడాది కాలంలో 200 శాతం FRBM పరిధి పెరిగినట్లు తెలిపిన కాగ్2023-24లో తెలంగాణ రెవెన్యూ సర్ ప్లస్ 779 కోట్లుగా పేర్కొన్న కాగ్.2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన ఫైనాన్స్ అకౌంట్స్, అప్రోప్రియేషన్ అకౌంట్స్ పై నివేదిక2023-24 బడ్జెట్ అంచనా 2,77,690 కోట్లు, చేసిన వ్యయం 2,19,307 కోట్లుబడ్జెట్ అంచనాలో 79 శాతం వ్యయంజీఎస్డీపీలో వ్యయం అంచనా 15 శాతంఆమోదం పొందిన బడ్జెట్ కంటే అదనంగా అంచనాల్లో 33 శాతం 1,11,477 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం349 రోజుల పాటు 10,156 కోట్లు వేస్ అండ్ మీన్స్ అడ్వాన్స్ సదుపాయాన్ని వినియోగించుకున్న ప్రభుత్వం35,425 కోట్ల ఓవర్ డ్రాఫ్ట్ సదుపాయాన్ని 145 రోజుల పాటు వినియోగించుకున్న ప్రభుత్వం2023-24లో వడ్డీల చెల్లింపుల కోసం 24,347 కోట్ల వ్యయంవేతనాలకు 26,981 కోట్లు ఖర్చుఖజానాకు పన్ను ఆదాయం నుంచే 61.83 శాతం నిధులు2023-24లో కేంద్రం నుంచి వచ్చిన గ్రాంట్ల మొత్తం కేవలం 9934 కోట్లురెవెన్యూ రాబడుల్లో 45 శాతం వేతనాలు, వడ్డీ చెల్లింపులు, పెన్షన్లకే ఖర్చు2023-24లో రెవెన్యూ మిగులు 779 కోట్లురెవెన్యూ లోటు 49,977 కోట్లు,జీఎస్డీపీలో రెవెన్యూ లోటు శాతం 3.332023-24 ముగిసే వరకు రుణాల మొత్తం 4,03,664 కోట్లు, జీఎస్డీపీలో అప్పుల శాతం 272023-24 వరకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన గ్యారంటీల మొత్తం 2,20,607 కోట్లు2023-24 లో తీసుకున్న 50,528 కోట్లలో 43,918 కోట్లను మూలధనం వ్యయం పై ఖర్చు చేసిన ప్రభుత్వం2023-24 లో స్థానిక సంస్థలు, ఇతర సంస్థలకు ప్రభుత్వం ఇచ్చిన నిధులు 76,773 కోట్లు, 11 శాతం పెరుగుదలశాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనరైతు రుణమాఫీ చేయాలని శాసనమండలి ఆవరణలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నిరసనప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేసిన ఎమ్మెల్సీలురైతు రుణమాఫీ బోగస్ అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీల నినాదాలు కాసేపట్లో అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం.నేటితో ముగియనున్న తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు.సభలో కాగ్ రిపోర్ట్ పెట్టనున్న డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కద్రవ్యవినిమయ బిల్లుకు ఆమోదం తెలుపనున్న అసెంబ్లీఅసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యే కామెంట్స్..ఎమ్మెల్యే కేపీ వివేకానంద..బీజేపీ, కాంగ్రెస్ ఇద్దరు గల్లీలో దోస్తీ.. ఢిల్లీలో కుస్తీ అని మొదటి నుండి చెబుతున్నాం..నిన్న అసెంబ్లీ వేదికగా కాంగ్రెస్, బీజేపీ మధ్య పొత్తు అర్థం అయ్యింది..అసెంబ్లీ సమావేశంలో మా హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు లేక.. బీజేపీ ఎమ్మెల్యేలతో స్క్రిప్ట్ రాసి చదివిపిస్తుంది కాంగ్రెస్..కాంగ్రెస్ పార్టీ రాసిచ్చిన స్క్రిప్ట్ నే బీజేపీ ఎమ్మెల్యేలు, కేంద్ర మంత్రులు చదువుతున్నారు..నిన్న సభలో ఉత్తమ్ కుమార్ రెడ్డి వద్ద సమాధానం లేక బీజేపీ ఎమ్మెల్యేలకు ఇచ్చి మాట్లాడించారు..అన్ని అనుమతులతో కాళేశ్వరం కట్టాము..అప్పుడు కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీ పార్టీనే..మరి కేంద్రంలో బీజేపీ పార్టీ సమర్థవంతంగా పని చేయడం లేదా అని ప్రశ్నిస్తున్నాము..కాంగ్రెస్ తరపున మాట్లాడడం కంటే.. నేరుగా కాంగ్రెస్ కండువా కప్పుకుంటే సరిపోతుంది..ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అబద్దాలపై ఏర్పడిన ప్రభుత్వం..తమ హామీలు, తమ బాధ్యతలు విస్మరిస్తూ పరిపాలన చేస్తున్నారు..అధికారంలో రాక ముందు పీఆర్సీ, డీఏ లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చారు..ఈ రోజు మా పార్టీ తరపున సభలో వాయిదా తీర్మానం పెడుతున్నాం..తప్పకుండా ఉద్యోగులకు ప్రకటించిన హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నాం..ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్..మోడీ దేశంలో కాంగ్రెస్ హఠావో అంటున్నారు..తెలంగాణలో బీజేపీ నేతలు కాంగ్రెస్ బచావ్ అంటున్నారు..బీజేపీ నేతలు రేవంత్ రెడ్డితో డీలింగ్ చేసుకుంటున్నారు..భట్టి అంటే మాకు గౌరవం ఉండేది..ఇప్పుడు భట్టి అహంకారంతో మాట్లాడుతున్నారు..గత అసెంబ్లీలో మహిళా ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని మొహం ఎక్కడ పెట్టుకుంటారని అన్నారు..నిన్న ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని భట్టి అన్నారు..30 శాతం కమీషన్ తీసుకుంటున్నారని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అంటున్నారు..మా దగ్గర కమిషన్ తీసుకుంటున్నారని కాంట్రాక్టర్లు అంటున్నారు..దేశంలో ఎక్కడా లేని విధంగా సెక్రటేరియట్ లో కాంట్రాక్టర్లు ధర్నా చేశారు..నిన్న భట్టి మాట్లాడిన మాటలను ఉపసంహరించుకోవాలి..భట్టి రోజు రోజుకి అహంకారపూరితంగా మాట్లాడుతున్నారు..భట్టి తన గౌరవాన్ని నిలబెట్టుకోవాలి..ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి..సభలో శాంతి భద్రతలపై మాట్లాడితే మైక్ కట్ చేశారునా ఇంటిపై ఎమ్మెల్యే గాంధీతో పాటు రౌడీలు నా ఇంటిపై దాడి చేశారునన్ను హత్య చేసేందుకు ప్రయత్నించారుసైబరాబాద్ డీసీపీ, మాదాపూర్ ఏసీపీ స్వయంగా రౌడీ షీటర్లను తీసుకొచ్చి హత్య ప్రయత్నం చేశారుఇప్పటికే ఏడాది గడుస్తున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదుశాసన సభ్యుడుగా నాకే భద్రత లేకపోతే సామాన్యుల పరిస్థితి ఏంటి?.సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేస్తున్నా సైబరాబాద్ డీసీపీ మాదాపూర్ ఏసీపీని సస్పెండ్ చేయాలినన్ను హత్య చేసేందుకు వచ్చిన గాంధీపై త్రీ నాట్ సెవెన్ కేసు బుక్ చేశారుఇప్పటివరకు ఎందుకు అరెస్ట్ చేయలేదురాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ ఉందా?నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని కంప్లైంట్ చేస్తే ఉల్టా నా పైనే కేసు పెట్టి బలవంతంగా మా ఇంటి డోర్లు పగలగొట్టి తీసుకెళ్లారుపార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో నిన్న సభలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు.కేసు సుప్రీంకోర్టులో ఉండగా ఉప ఎన్నికలు రావని ప్రకటన చేశారుదీనిపై ఏప్రిల్ 2న సీఎం వ్యాఖ్యలపై సుప్రీం దృష్టికి తీసుకెళ్తాంపార్టీ మారిన 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవుప్రభుత్వ నిర్లక్ష్యంతో నా నియోజకవర్గంలో పంటలు ఎండిపోతున్నాయిమంత్రి పొంగులేటికి సంబంధించిన రాఘవ కన్ స్ట్రక్షన్ కంపెనీని బ్లాక్‌లిస్టులో పెట్టాలిసుంకేశాల కన్ స్ట్రక్షన్ చేసిన కంపెనీని బ్లాక్ లిస్టులో పెట్టాలికాళేశ్వరం ప్రాజెక్టు తో 18 లక్షల ఎకరాలకు సాగునీరు అందించారు కేసీఆర్చిన్న కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించడం లేదు.. వెంటనే వారికి బిల్లు చెల్లించాలి -
అందరి నోట.. రాజగోపాల్‌రెడ్డి మాట!
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: పదిహేను నెలల నిరీక్షణ అనంతరం మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డికి రాష్ట్ర మంత్రివర్గంలో స్థానం దక్కబోతోందన్న వార్త మంగళవారం అందరి నోటా వినిపించింది. శాసనసభ హాలు, లాబీల్లోనూ ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డిని పలు వురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కలిసి అభినందనలు తెలిపారు. శాసనసభ ఎన్నికలకు ముందు అధిష్టానం ఇచ్చిన హామీతో రాజగోపాల్‌రెడ్డి తిరిగి సొంత పార్టీకి చేరుకున్నారు. మునుగోడు నుంచి ఆయన విజయం సాధించడంతో పాటు భువనగిరి ఎంపీగా చామల కిరణ్‌కుమార్‌రెడ్డిని గెలిపించుకున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి అప్పగించిన బాధ్యతను పక్కాగా నిర్వర్తించారు. దీంతో మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు జరిగినా మంత్రి పదవి ఖాయమన్న భరోసా రాజగోపాల్‌రెడ్డి వర్గీయుల్లో ఉంది. కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైన నేపథ్యంలో తనకు అధిష్టానం ఏ పదవి అప్పగించినా బాధ్యతతో నిర్వహిస్తానని రాజగోపాల్‌రెడ్డి మంగళవారం మీడియా చిట్‌చాట్‌లో పేర్కొన్నారు. అయితే ఆయన అనుచరులు, ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని ఆయన అభిమానులు మాత్రం రాజగోపాల్‌రెడ్డికి హోంమంత్రిగా బాధ్యతలు అప్పగిస్తే బాగుంటుందని పేర్కొంటున్నారు. -
‘కమీషన్ల’పై దద్దరిల్లిన సభ!
30% కమీషన్ తీసుకుంటున్నారని వాళ్ల ఎమ్మెల్యేలే అంటున్నారు. 20% కమీషన్ అంటూ సచివాలయంలో ధర్నాలు జరుగుతున్నాయి- కేటీఆర్కేటీఆర్ను చాలెంజ్ చేస్తున్నా.. మీ ఆరోపణలను రుజువు చేయండి. లేదంటే ప్రజలకు, సభకు క్షమాపణ చెప్పండి. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి.-భట్టి సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర శాసనసభ బుధవారం దద్దరిల్లింది. ప్రభుత్వ పెద్దలు కమీషన్లు తీసుకుంటున్నారంటూ బీఆర్ఎస్ సభ్యుడు కె.తారకరామారావు పేర్కొనడం, ఒళ్లు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలంటూ ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హెచ్చరించడంతో ఇరుపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు, అరుపులు, కేకలతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. మంత్రులు అడ్డుపడుతుండటంతో.. బడ్జెట్ పద్దులపై బుధవారం జరిగిన చర్చలో బీఆర్ఎస్ సభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతుండగా మంత్రులు పదేపదే అడ్డుపడటంపై కేటీఆర్ అభ్యంతరం తెలిపారు. ‘‘మంత్రులు పదే పదే అడ్డుపడుతున్నారు. సంయమనం ఉండాలి. మేం కూడా రెచ్చగొట్టగలం. 30శాతం కమీషన్ తీసుకుంటున్నారని వాళ్ల ఎమ్మెల్యేలే అంటున్నారు. 20శాతం కమీషన్ అంటూ సచివాలయంలో (కాంట్రాక్టర్ల) ధర్నాలు అవుతున్నాయి’’అని వ్యాఖ్యానించారు. దీనిపై భట్టి విక్రమార్క తీవ్రంగా స్పందించారు. ‘‘కేటీఆర్‌ను చాలెంజ్ చేస్తున్నా.. మీ ఆరోపణలను రుజువు చేయండి. లేకుంటే సభకు, రాష్ట్ర ప్రజలకు క్షమాపణ చెప్పండి’’అని సవాల్ చేశారు. గత ప్రభుత్వం పాపం వల్లే రూ.లక్ష కోట్ల పనులు చేసిన వారు బిల్లులు రాక సచివాలయం చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఒళ్లు దగ్గరపెట్టుకుని మాట్లాడాలంటూ.. కేటీఆర్‌ను ఉద్దేశించి భట్టి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘బాధ్యతతో రాజకీయాల్లో వచ్చాం. అడ్డగోలుగా మీలా రాష్ట్రం మీద పడి బరితెగించి దోపిడీ చేయడానికి రాలేదు. నాలాగా అణగారిన వర్గాలు, బాధితులు, పీడితులు, పేద కుటుంబాల కోసం ఏదో చేయాలని ఉన్నతమైన ఆశయంతో వచ్చిన వాళ్లం. మీలా ఏడెనిమిది లక్షల కోట్ల అప్పులు చేసి రాష్ట్రాన్ని పాడు చేసిపోయేందుకు రాలేదు. మాట్లాడే ముందు బాధ్యత, నిబద్ధత ఉండాలి. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలి. ఏదీ పడితే అది మాట్లాడితే చెల్లుతుంది అనుకుంటున్నారా?’’అని మండిపడ్డారు. ఇదే సమయంలో కేటీఆర్ క్షమాపణ చెప్పాలంటూ కాంగ్రెస్ సభ్యులు పెద్ద ఎత్తున నినాదాలు మొదలుపెట్టారు. ‘30శాతం కమీషన్..’అంటూ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను సభ రికార్డుల నుంచి తొలగిస్తామని ప్యానెల్ స్పీకర్ రేవూరి ప్రకాశ్‌రెడ్డి ప్రకటించారు. బీఆర్ఎస్ సభ్యుల నిరసనతో.. కేటీఆర్‌ను ఉద్దేశించి ‘ఒళ్లు బలిసి’అంటూ భట్టి తప్పుడు మాటలు మాట్లాడరంటూ బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. కేటీఆర్ మాట్లాడేందుకు మళ్లీ మైక్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ వెల్ దగ్గరికి దూసుకెళ్లారు. మొదట కేటీఆరే రెచ్చగొట్టారని, ఒకట్రెండు అన్‌పార్లమెంటరీ పదాలుంటే తొలగిస్తామని ప్యానెల్ స్పీకర్ నచ్చజెప్పేందుకు ప్రయత్నించినా నిరసన కొనసాగించారు. ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని మాత్రమే తాను సూచించానని భట్టి వివరణ ఇచ్చారు. ఈ క్రమంలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి మాట్లాడుతూ.. కమీషన్లపై కాంగ్రెస్ ఎమ్మెల్యేలు చెప్పిన మాటలనే కేటీఆర్ ప్రస్తావించారని చెప్పారు. బట్టలు విప్పి కొడతామంటూ సభలో సీఎం రేవంత్ అన్నప్పుడు లేని అభ్యంతరం తమ మాటలకు ఎందుకని ప్రశ్నించారు. దీంతో ప్యానల్ స్పీకర్ ఆయన మైక్ కట్ చేసి బీజేపీ సభ్యుడికి మాట్లాడే అవకాశం ఇచ్చారు. దీనికి నిరసనగా ‘వద్దురా నాయనా.. ట్వంటీ పర్సెంట్ పాలన’అంటూ నినాదాలు చేస్తూ సభ నుంచి బయటకు వచ్చారు. కేటీఆర్, హరీశ్‌రావుతోపాటు పార్టీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ప్రవేశద్వారం వద్ద కాసేపు బైఠాయించి నినాదాలు చేశారు. భట్టి దళితుడనే ఆరోపణలు: పొన్నం దళితుడైన భట్టి విక్రమార్కకు ప్రతిపక్ష నేత పదవి దక్కవద్దనే ఉద్దేశంతోనే గతంలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలను బీఆర్ఎస్లో విలీనం చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యానించారు. ఇప్పుడు దళితుడు ఆర్థిక మంత్రిగా ఉండటాన్ని జీర్ణించుకోలేకపోతున్నారని విమర్శించారు. -
ఉప ఎన్నికలు రావు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: ‘‘శాసనసభ 2014 నుంచి 2023 వరకు ఏ సంప్రదాయాలను ఆచరించిందో ఇప్పుడు కూడా వాటినే ఆచరిస్తున్నం. అప్పటి నుంచి చట్టం మారలే.. న్యాయం మారలే.. స్పీకర్ పదవి, విప్ పదవి మారలే.. పాలకపక్షం, ప్రతిపక్షం అట్లనే ఉన్నాయి. రాజ్యాంగం అసలే మారలేదు. ఇంక ఎట్లొస్తయ్ ఉప ఎన్నికలు? సభ్యులెవరూ ఆందోళన చెందవద్దు..’’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం పార్లమెంటరీ వ్యవస్థలో పాటించిన పద్ధతులను పరిగణనలోకి తీసుకుని గతంలో అవలంబించిన విధానాలను అనుసరిస్తున్నట్టు చెప్పారు. వాటి ప్రకారం ఏ ఉప ఎన్నికలు రావని వ్యాఖ్యానించారు. బుధవారం శాసనసభలో బడ్జెట్‌పై చర్చలో సీఎం రేవంత్ మాట్లాడారు. రాష్ట్రంలో ఉప ఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘పార్టీ మారారా, మారలేదా అంటే మేం మారనే లేదు. అభివృద్ధిలో భాగంగా సీఎంని కలసి వచ్చామని కాంగ్రెస్‌లో చేరినవాళ్లు అంటున్నారు. మీరు మంత్రులు చేసినవాళ్లు అనర్హులు కాలేదు. ఉప ఎన్నికలు రాలేదు. కానీ ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తాయని, వచ్చే వారమే ఉప ఎన్నికలని అంటున్నారు. ఎట్లా వస్తాయి? రూల్‌బుక్ వాళ్లే రాశారు. రూల్‌బుక్ కూడా మారలేదు కదా. ప్రచారం కూడా చేసుకుంటున్నరు.. ఒకాయన (తాటికొండ రాజయ్య) నేనే అభ్యరి్థని అని ఆడ, ఈడ ప్రచారం చేసుకొంటున్నారు. ఆయన అమాయకుడు. తెల్లపంచె కట్టుకొని తిరుగుతున్నడని గతంలో ఉప ముఖ్యమంత్రి పదవినే ఊడబీకిన్రు. ఇప్పుడు ఆయన.. ఉప ఎన్నిక వచ్చింది. వచ్చే వారమే ఎలక్షన్ అని తిరుగుతున్నరు. సభ్యులెవరూ ఆందోళన చెందాల్సిన పనిలేదు. ఏ ఉప ఎన్నికలు రావు. వారు (హరీశ్‌రావు) ఉప ఎన్నిక కోరుకున్నా కూడా రావు. ఒకవేళ ఆయన ఇటొచి్చనా, అటొచ్చినా కూడా ఏ ఉప ఎన్నికలు రావు. సభకు కోర్టు నుంచి రక్షణ ఉంటుంది.. పార్టీ ఫిరాయింపుల కేసు సుప్రీంకోర్టులో ఉంది. సభలో నేను మాట్లాడితే కొంత రక్షణ ఉంటుంది. బయట మాట్లాడేవాళ్లకు ఆ ప్రొటెక్షన్ ఉండదు. సభ బయట ఉప ఎన్నికలు వస్తాయని.. వచ్చే వారమే ఉప ఎన్నిక అని అంటున్నారు. అదంతా ఉత్తదే. ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అభివృద్ధి మీదనే మేం దృష్టి పెట్టాం. ఎన్నికలు, ఉప ఎన్నికల మీద మాకు దృష్టి లేదు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాలి. తప్పు చేసినవాళ్లను శిక్షించాలి. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేయాలనేదే మా ఉద్దేశం..’’ అని సీఎం రేవంత్ పేర్కొన్నారు. -
అసెంబ్లీలో మరోసారి రచ్చ రచ్చ.. సీఎం రేవంత్ వ్యాఖ్యలపై దుమారం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీలో మరోసారి గందరగోళం నెలకొంది. సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై దుమారం రేగింది. స్పీకర్ పోడియం వద్ద బీఆర్ఎస్, ఎంఐఎం నిరసనకు దిగాయి. పాయింట్ ఆఫ్ ఆర్డర్ ఫాలో కావడం లేదని ఆందోళన చేపట్టాయి. ఎంఐఎం, బీఆర్ఎస్ నిరసనలపై మంత్రి శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి అప్పుడు మాట్లాడితే ఇప్పుడు పాయింట్ ఆఫ్ ఆర్డర్‌పై నిరసన చేయడం కరెక్ట్ కాదన్నారు. నిరసనను విరమించుకోవాలి సభకు సహకరించాలి. అసెంబ్లీ నిబంధనలను ప్రశాంత్ రెడ్డి హరీష్ రావు తెలుసుకోవాలని శ్రీధర్‌బాబు అన్నారు.మాజీ మంత్రి హరీష్‌రావు అసెంబ్లీ బయట మీడియాతో మాట్లాడుతూ, కోర్టులో కేసు నడుస్తుండగా సీఎం రేవంత్ సభలో మాట్లాడారని.. అది రూల్స్‌కు వ్యతిరేకమన్నారు. కోర్టులో కేసు నడుస్తుంటే.. సీఎం రేవంత్ రెడ్డి తీర్పు ఇచ్చారు. తీర్పు సుప్రీంకోర్టు ఇస్తుందా? రేవంత్ ఇస్తారా?. ముఖ్యమంత్రి తన పరిధిని దాటి ప్రివిలేజ్ కిందికి వస్తది. సీఎం వ్యాఖ్యలపై పాయింట్ ఆఫ్ ఆర్డర్ చేశాం. సీఎం వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశాం. మాకు అవకాశం ఇవ్వనందున సభ నుంచి వాకౌట్ చేశామని ఆయన పేర్కొన్నారు.‘‘సీఎం రేవంత్‌రెడ్డి రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారు. సీఎం వ్యాఖ్యలను సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తాం. సూచనల కోసం మైక్ ఇవ్వాలని సీఎం సూక్తులు చెప్పారు. సూచనలు చెప్తాం.. అంటే మైక్ ఇవ్వడం లేదు. బెట్టింగ్ యాప్‌ను గతంలోనే బీఆర్ఎస్ ప్రభుత్వం రద్దు చేస్తూ జీవో ఇచ్చింది. ఈ పదిహేను నెలల్లో బ్యాటింగ్ యాప్స్‌ను అరికట్టడంలో ఈ ప్రభుత్వం విఫలమైంది. ఈ ప్రభుత్వం వచ్చాక బెట్టింగ్ యాప్స్ కారణంగా ఆత్మహత్యలు ఎక్కువ అయ్యాయి. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ అయింది. ప్రతీ పదిహేను నిమిషాలకు ఒక హత్యాచార ఘటనలు జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో 50 శాతం సీసీటీవీలు పనిచేయడం లేదు. పోలీస్ వాహనాలకు డీజీల్ కోసం ప్రభుత్వం పైసలు ఇవ్వడం లేదు’’ అని హరీష్‌రావు వ్యాఖ్యానించారు.