
ప్రియుడితో కలసి భర్త హత్య
భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన విల్లుపురం సమీపంలో జరిగింది.
అన్నానగర్: భార్య ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన సంఘటన విల్లుపురం సమీపంలో జరిగింది. విల్లుపురం సమీపంలోని కక్కనూర్ గ్రామానికి చెందిన సింగారం(38) స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో పరోటా మాస్టర్. ఇతనికి అదే ప్రాంతానికి చెందిన సత్య(30)తో పదేళ్ల కిందట వివాహం జరిగింది. వీరికి నితీష(4) కుమార్తె ఉంది. ఎప్పటిలాగే సోమవారం రాత్రి సింగారం పని ముగించుకుని ఇంటికి వచ్చాడు.
ఆ సమయంలో సత్య, సింగారం మధ్య తగాదా ఏర్పడింది. ఈ స్థితిలో మంగళవారం ఉదయం సింగారం ఇంట్లో మృతి చెంది ఉన్నాడు. సత్య తన భర్త విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడని బోరున విలపించింది. దీనిపై ఫిర్యాదు అందుకున్న పోలీసులు సింగారం మృతదేహాన్ని పరిశీలించగా గొంతు భాగంలో గాయాలున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ముండియంబాక్కం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానంతో సత్య వద్ద విచారణ చేయగా ఆమె, తన ప్రియుడితో కలిసి హత్య చేసినట్లు అంగీకరించింది. పోలీసులు సత్య, ఆమె ప్రియుడిని అరెస్టు చేసి జైలుకు పంపారు.