డిఫెన్స్ న్యాయవాది డి.కె.మిశ్రా గాయపడిన కారణంగా ఉబర్ క్యాబ్‌లో అత్యాచార కేసుపై విచారణను
న్యూఢిల్లీ: డిఫెన్స్ న్యాయవాది డి.కె.మిశ్రా గాయపడిన కారణంగా ఉబర్ క్యాబ్‌లో అత్యాచార కేసుపై విచారణను స్థానిక అదనపు సెషన్స్ కోర్టు ఈ నెల నాలుగో తేదీకి వాయిదా వేసింది. మెట్లపై నుంచి జారిపడిన కారణంగా గాయపడ్డానని, అందువల్ల కోర్టుకు హాజరు కాలేననని మిశ్రా కోర్టుకు తెలియజేశారు. దీంతో న్యాయమూర్తి కావేరీ బవేజా సోమవారం పైవిధంగా ఉత్తర్వులు జారీ చేశారు.