ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఇచ్చిన వివరణ లేఖను సభలో పెట్టామని స్పీకరు పేర్కొన్నారు.
ఎమ్మెల్యే రోజా లేఖ సభకు సమర్పణ
Sep 10 2016 5:57 PM | Updated on Oct 29 2018 8:10 PM
హైదరాబాద్: వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే రోజా ఇచ్చిన వివరణ లేఖను సభ ముందుంచుతున్నట్లు స్పీకరు కోడెల శివప్రసాద్ ప్రకటించారు. గత ఏడాది డిసెంబరు 18వ తేదీ సభలో జరిగిన పరిణామాలకు క్షమాపణ చెబుతున్నట్లు ఎమ్మెల్యే ఆర్‌కే రోజా ఇచ్చిన వివరణ లేఖను సభలో పెట్టామని స్పీకరు పేర్కొన్నారు. గత ఏడాది డిసెంబరు 18వ తేదీన అసెంబ్లీలో జరిగిన పరిమామాలకు బాధ్యులను చేస్తూ ఆర్‌కే రోజాను ఏడాది పాటు సస్పెండ్ చేసినట్లు స్పీకరు అప్పట్లో సభలో ప్రకటించిన విషయం విదితమే. దీనిపై ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో సభాపతికి వివరణ లేఖ సమర్పించాలని, దానిని పరిశీలించి వివాదాన్ని పరిష్కరించి స్పీకరు సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోర్టు సూచించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇటీవల ఆమె స్పీకరుకు రాసిన లేఖను సభకు సమర్పించినట్లు స్పీకరు పేర్కొనడం గమనార్హం.
Advertisement
Advertisement