క్లాస్‌ రూమ్‌లో ఊడిపడిన సిమెంట్‌ పెచ్చులు 

Roof Fall In Ulhasnagar Jhulelal School Three Students Injured - Sakshi

ముంబై : మహారాష్ట్రలోని ఓ పాఠశాలలో పై కప్పు పెచ్చులు ఊడిపడి ముగ్గురు విద్యార్థులకు గాయాలయ్యాయి. ఉల్హాస్‌నగర్‌లోని జులేలాల్ పాఠశాలలోని పదో తరగతి గదిలో విద్యార్థులు పాఠాలు వింటున్న సమయంలో ఒక్కసారిగా పైకప్పు కూలి వారిపై పడింది. దీంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటనలో గాయపడ్డవారిని జియా(16), ఇషిక(14), దియా(15)గా గుర్తించారు.

ఈ ఘటనలో గాయపడిన విద్యార్థుల తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వడంతో వారు అక్కడికి చేరుకున్నారు. స్కూల్‌ యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే ఈ ఘటన జరిగిందని వారు ఆరోపించారు. కాగా, స్కూల్‌ యాజమాన్యం ఇది కేవలం చిన్న ఘటనేనని.. విద్యార్థులకు చిన్నపాటి గాయాలు మాత్రమే అయ్యాయని తెలిపింది. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు ఆ తరగతి గదిలోని సీసీటీవీలో రికార్డు అయ్యాయి. 

Read latest State News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top