శిష్యురాలిపై అత్యాచారం చేశాడనే అభియోగం ఎదుర్కొంటున్న 75 ఏళ్ల యోగా గురువుకు కోర్టు విముక్తి కల్పించింది. పెళ్లి చేసుకుంటాననే పేరుతో తనను వంచించి అత్యాచారానికి పాల్పడ్డాడని యోగా గురువుపై ఓ శిష్యురాలు ఫిర్యాదు చేసింది.
న్యూఢిల్లీ: శిష్యురాలిపై అత్యాచారం చేశాడనే అభియోగం ఎదుర్కొంటున్న 75 ఏళ్ల యోగా గురువుకు కోర్టు విముక్తి కల్పించింది. పెళ్లి చేసుకుంటాననే పేరుతో తనను వంచించి అత్యాచారానికి పాల్పడ్డాడని యోగా గురువుపై ఓ శిష్యురాలు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు యోగా గురువును అరెస్టు చేసి కేసు నమోదు చేశారు. ఆమె యోగా నేర్చుకొనేందుకు గురువు ఇంట్లో ఫిబ్రవరి 2011లో 15 రోజుల పాటు బసచేసింది. తరువాత అదే సంవత్సరం జూలై, ఆగస్టు, సెప్టెంబర్ 2011 ల్లో మరోసారి ఆయన ఇంటికి వెళ్లింది. వీరిద్దరి మధ్య మంచి స్నేహసంబంధాలు ఏర్పడడంతో భార్య చనిపోయి ఇద్దరు పిల్లల తండ్రిగా ఉన్న ఈ యోగా గురువు పెళ్లి ప్రతిపాదన ముందుకు తెచ్చాడు. ఈ ప్రతిపాదనను రీనా తండ్రి కూడా ఆమోదించాడు. అయితే రీనాకు ఆర్థిక ఆలంబనగా ఏదైనా వనరు చూపాలని కోరారు. దీంతో వీరి మధ్య వివాదాలు చెలరేగాయి.
ఈ నేపథ్యంలో రీనా యోగా గురువుపై లైంగిక దాడి జరిపినట్లు తప్పు డు కేసు బనాయించింది. ఈ కేసు విచారణకు స్వీకరించిన అదనపు సెషన్స్ జడ్జి నివేదిత అనిల్ శర్మ కేసు పూర్వాపరాలను పరిశీలించి బాధితురాలు చెబుతున్నట్లు తనపై లైంగిక దాడి జరిగిన సాక్ష్యాలను చూపలేకపోయిందని స్పష్టం చేస్తూ యోగా గురువు మీద అభియోగాన్ని కొట్టివేశారు.