నృత్య దర్శకురాలితో ప్రభుదేవా పెళ్లి? | Prabhu Deva love with Bollywood choreographer | Sakshi
Sakshi News home page

నృత్య దర్శకురాలితో ప్రభుదేవా పెళ్లి?

Sep 24 2014 9:22 AM | Updated on Apr 3 2019 6:23 PM

నృత్య దర్శకురాలితో ప్రభుదేవా పెళ్లి? - Sakshi

నృత్య దర్శకురాలితో ప్రభుదేవా పెళ్లి?

నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవాపై బాలీవుడ్‌లో ఒక కొత్త ప్రచారం వీర విహారం చేస్తోంది. ఒక ముంబాయి నృత్య దర్శకురాలి ప్రేమలో ప్రభు పడ్డారని, త్వరలోనే

నృత్య దర్శకుడు, నటుడు, దర్శకుడు ప్రభుదేవాపై బాలీవుడ్‌లో ఒక కొత్త ప్రచారం వీర విహారం చేస్తోంది. ఒక ముంబాయి నృత్య దర్శకురాలి ప్రేమలో ప్రభు పడ్డారని, త్వరలోనే ఆమెను పెళ్లి చేసుకోనున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. ప్రభుదేవా మొదట్లో రమలత్ అనే డ్యాన్సర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం విదితమే.  ఆ తర్వాత మనస్పర్థల కారణంగా ప్రభుదేవా, రమలత్ విడిపోయి వివాహ రద్దు పొందారు. అందుకు కారణం నటి నయనతారనే ప్రచారం జరిగింది.
 
 ప్రభుదేవా నయనతారలు ప్రేమించుకున్నప్పటికీ పెళ్లి పీటలెక్కలేదు. కాగా ప్రస్తుతం ప్రభుదేవా బాలీవుడ్‌లో ప్రముఖ దర్శకుడిగా ప్రకాశిస్తున్నారు. ఆయన తెరకెక్కించిన వాంటెడ్, రౌడీ రాథోర్ లాంటి చిత్రాలు ఘన విజయాన్ని సాధించాయి. ప్రస్తుతం అజయ్ దేవగన్, సోనాక్షి సిన్హా జంటగా యాక్షన్ జాక్సన్ చిత్రం రూపొందిస్తున్నారు. ఈ చిత్రం త్వరలో తెరపైకి రానుంది. ప్రభుదేవా తన చిత్రాల్లో వరుసగా సోనాక్షి సిన్హాకు అవకాశమివ్వడం వీరిద్దరి మధ్య ఏదో ఉందనే ప్రచారం హోరెత్తింది. తాజాగా ప్రభుదేవా బాలీవుడ్ నృత్య దర్శకురాలితో షికార్లు కొడుతున్నట్లు త్వరలో ఆమెను పెళ్లి చేసుకోనున్నట్లు బాలీవుడ్ మీడియా ఊదరగొడుతోంది. అయితే ఆ నృత్య దర్శకురాలెవరో? ఆమె వివరాలేవీ వెల్లడించలేదు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement