ఆదుకోని ఈజిప్టు ఉల్లి | onion from Egypt hits Indian ports; prices to cool | Sakshi
Sakshi News home page

ఆదుకోని ఈజిప్టు ఉల్లి

Sep 16 2013 12:02 AM | Updated on Sep 1 2017 10:45 PM

మార్కెట్లోకి వచ్చిన ఈజిప్టు ఉల్లి కూడా ధరలపై ప్రభావం చూపించలేకపోయిం ది. కొన్ని నెలలుగా ఉల్లి ధరలు పైపైకి పోతూ సామాన్యుడి నెత్తిన పెనుభారం

సాక్షి, ముంబై: మార్కెట్లోకి వచ్చిన ఈజిప్టు ఉల్లి కూడా ధరలపై ప్రభావం చూపించలేకపోయిం ది. కొన్ని నెలలుగా ఉల్లి ధరలు పైపైకి పోతూ సామాన్యుడి నెత్తిన పెనుభారం మోపుతున్న సంగతి తెలిసిందే. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా దేశంలో ఉల్లి ఉత్పత్తులు తగ్గిపోయి ధరలు అమాంతం పెరిగిపోవడంతో విదే శాల నుంచి ఉల్లిని దిగుమతి చేసుకునేందుకు ఏర్పా ట్లు చేసుకున్నారు. ఈ నేపథ్యంలోనే నవీ ముంబై వాషిలోని వ్యవసాయ ఉత్పత్తుల మార్కెటింగ్ కమిటీ (ఏపీఎంసీ) లోకి ఈజిప్టు ఉల్లి భారీగా దిగుమతి అయ్యింది. 
 
 అయినప్పటికీ రిటైల్ ఉల్లి ధరలపై ఎలాంటి ప్రభావం పడలేదు. ఈ ఉల్లి కేజీ రూ.47కు లభిస్తున్నప్పటికీ ఇక్కడ మాత్రం రూ.50-52 చొప్పున విక్రయిస్తున్నారు. మూడు నెలల కిందట ఉల్లి కొరత ఏర్పడడంతో గత నెలలో జెప్సన్ ఎంట ర్‌ప్రైజెస్ కంపెనీ ఐదు కంటైనర్ల ఉల్లిని ఈజిప్టు నుంచి దిగుమతి చేసుకుంది. ఈ ఉల్లి  ఈజిప్టు నుంచి జేఎన్‌పీటీకి రావడానికి 22 రోజులు పట్టింది. అక్కడి నుంచి మార్కెట్లోకి రావడానికి మరో పది రోజులు పట్టింది. నెలకు పైగా ఎయిర్ కండిషన్డ్ కంటైనర్‌లో ఉండటం తో ఉల్లిపాయలు తడిగా మారాయి. దాంతో వీటిని బయట ఎండబెట్టాల్సిన అవసరం ఏర్పడింది.
 
 ఈ ఉల్లి చూడడానికి గులాబీ రంగులో, పెద్ద సైజులో, ఘాటుగా  ఉంటుంది. కాని తడి గా ఉండడంవల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉండ డం లేదు. దీంతో ఈ ఉల్లికి తక్కువ ధర పలుకుతోంది. జెప్సన్ దిగుమతి చేసుకున్న నాలుగు కంటైనర్లలో ఒక్కో దానిలో 25 కేజీల చొప్పున 1,100 సంచులు ఉన్నాయి. ప్రస్తుతం హోల్‌సేల్ మార్కెట్లోకి ఒక కంటైనర్ ఉల్లిని మాత్రమే తీసుకొచ్చారు. తడిగా ఉండడంవల్ల ఎండబెట్టేందుకు గోదాంలోకి తరలించారు. సోమవారం మరో కంటైనర్ ఉల్లి మార్కెట్లోకి వస్తుం దని ఉల్లి, ఆలు మార్కెటింగ్ డైరె క్టర్ అశోక్ వాలుంజ్ అన్నారు. 
 
 కాగా ఈజిప్టు నుంచి వాషి మార్కెట్‌కు చేరుకునే సరికి ఉల్లిధర కేజీకీ రూ.51 పలుకుతోంది. కాని ఈ ఉల్లి ధర పడిపోవడంతో దిగుమతి చేసుకున్న వారు నష్టపోయారు. గతంలో పాకిస్థాన్, చైనా నుంచి ఉల్లి వాషి మార్కెట్‌కు వచ్చింది. పాకిస్తాన్ ఉల్లిపై ఎవరికీ అనుమానం రాలేదు. చైనా ఉల్లి మాత్రం కొబ్బరికాయ సైజులో ఉండి, రుచిగా లేకపోవడంతో కొనుగోలుదారులు ముఖం చాటేశారు. ప్రస్తుతం ఈజిప్టు ఉల్లి పరిస్థితి అలాగే ఉంది. ఈ ఉల్లి చౌక ధరకు లభించినప్పటికీ పెరిగిన పని, వ్యయ భారంవల్ల తక్కువ ధరకు విక్ర యించేందుకు వీలుపడడం లేదని వ్యాపారులు అంటున్నారు.  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement