
బుల్లితెర నటితో అసభ్య ప్రవర్తన
షూటింగ్ ముగించుకుని కారులో వెళుతున్న బుల్లితెర నటితో డ్రైవర్లు అసభ్యకరంగా ప్రవర్తించారు.
శివాజీనగర(బెంగుళూరు): షూటింగ్ ముగించుకుని కారులో వెళుతున్న బుల్లితెర నటితో డ్రైవర్లు అసభ్యకరంగా ప్రవర్తించారు. బెంగళూరులోని హెగ్గెనహళ్లి క్రాస్ వద్ద సోమవారం చోటు చేసుకున్న ఈ ఘటన కలకలం రేపింది.
అద్దె కారులో వెళ్తున్న సమయంలో డ్రైవర్లు సచిన్, ప్రవీణ్‌లు తనను చెయ్యి పట్టుకొని లాగటమే కాకుండా అసభ్యంగా ప్రవర్తించారని బుల్లితెర నటి రూపా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న రాజగోపాలనగర పోలీసులు దర్యాప్తు చేపట్టారు.