తిరుమలలో భారీ వర్షం | heavy rain in tirumala | Sakshi
Sakshi News home page

తిరుమలలో భారీ వర్షం

Dec 1 2016 4:10 PM | Updated on Sep 4 2017 9:38 PM

తిరుమలలో అకాల వర్షం కురిసింది.

తిరుమల: తిరుమలలో అకాల వర్షం కురిసింది. గురువారం మధ్యాహ్నం ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చి భారీ వాన కురిసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన నాడా తుఫాను ప్రభావంతో వర్షం కురిసింది. దీంతో స్వామివారి సర్వదర్శనం కోసం నిల్చున్న భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాలినడక దారిలో భారీ ఈదురుగాలులు వీస్తున్నాయి. చెట్లు విరిగి పడే అవకాశాలు ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. భారీ వర్షం కారణంగా ఘాట్‌రోడ్డులో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని.. వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని అలిపిరి టోల్‌గేట్ వద్ద అధికారులు సూచనలు చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement