హెల్ప్ డెస్కులు ప్రారంభం | DDA launches 4 helpdesks | Sakshi
Sakshi News home page

హెల్ప్ డెస్కులు ప్రారంభం

Jun 7 2014 11:32 PM | Updated on Sep 2 2017 8:27 AM

ఎజెండా ఫర్ 100’లో భాగంగా ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) నాలుగు నాగరిక్ సువిధ కేంద్రాలను ప్రారంభించింది. ఐఎన్‌ఏ, రోహిణి, లక్ష్మీనగర్, ద్వారక ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ వీటిని ప్రారంభించారు.

న్యూఢిల్లీ: ‘ఎజెండా ఫర్ 100’లో భాగంగా ఢిల్లీ అభివృద్ధి సంస్థ (డీడీఏ) నాలుగు నాగరిక్ సువిధ కేంద్రాలను ప్రారంభించింది. ఐఎన్‌ఏ, రోహిణి, లక్ష్మీనగర్, ద్వారక ప్రాంతాల్లో లెఫ్టినెంట్ గవర్నర్ నజీబ్‌జంగ్ వీటిని ప్రారంభించారు. ఆస్తుల మార్పిడిపత్రాల అందజేత ఈ కేంద్రాల ప్రాథమిక బాధ్యత. ఈ విషయమై సంబంధిత అధికారి ఒకరు మాట్లాడుతూ డీ డీఏ ఫ్లాట్లు పొందినవారితోపాటు అందులో నివసిస్తున్నవారి సౌకర్యార్ధం వీటిని ప్రారంభించామన్నారు. ఇదిలాఉంచితే ‘ఎజెండా ఫర్ 100’లో భాగంగా డీడీఏ తన రికార్డులనన్నింటినీ డిజిటలీకరించనుంది. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనను పట్టణాభివృద్ధి శాఖకు పంపింది. తన పరిధిలోని అన్ని సేవలను ఆన్‌లైన్‌ద్వారా వీలైనంత త్వరగా అందుబాటులోకి తీసుకురానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement