‘దేవుడి మీద ఒట్టు..ఆ పార్టీలో చేరను’ | bjp leader J. Narasimha Swamy condemns to join JDS | Sakshi
Sakshi News home page

‘దేవుడి మీద ఒట్టు..ఆ పార్టీలో చేరను’

Jul 17 2017 7:04 PM | Updated on Mar 29 2019 9:31 PM

‘దేవుడి మీద ఒట్టు..ఆ పార్టీలో చేరను’ - Sakshi

‘దేవుడి మీద ఒట్టు..ఆ పార్టీలో చేరను’

ఆ దేవుడిమీదొట్టు..బీజేపీని వదిలి జేడీఎస్‌ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు వట్టి పుకార్లు మాత్రమే..

బెంగళూరు: ‘ఆ దేవుడిమీదొట్టు..బీజేపీని వదిలి జేడీఎస్‌ పార్టీలో చేరుతున్నట్లు వస్తున్న వార్తలు వట్టి పుకార్లు మాత్రమే..వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో నేను బీజేపీ అభ్యర్థిగానే పోటీ చేస్తా’..అని మాజీ ఎమ్మెల్యే జే నరసింహస్వామి స్పష్టం చేశారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

జేడీఎస్‌ పార్టీ తండ్రీ, కొడుకుల పార్టీ అని, ఆ కుటుంబంలో వ్యక్తే పార్టీని సూట్‌కేస్‌ పార్టీగా మార్చారంటూ నరసింహస్వామి విమర్శించారు. ఆ పార్టీ వల్ల రాష్ట్ర ప్రజలకు ఒరిగేదేం లేదని చెప్పుకొచ్చారు. గతంలో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తాలూకా అభివృద్ధికి రూ.800 కోట్లు ఇచ్చారని, ఆ పనులను ఇప్పటి ఎమ్మెల్యే వెంకటరమణయ్య తన పనులుగా చెప్పుకోవడం సిగ్గుచేటు అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement