కుమారుడి పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించాలని ఆశిం చిన ఒక తండ్రి చైన్ స్నాచింగ్‌కు పాల్ప డి మొదటి ప్రయత్నంలోనే దొరికి పోయి జనం
కన్న ప్రేమ దొంగతనం చేయించింది!
Aug 9 2013 3:09 AM | Updated on Mar 22 2019 1:41 PM
దొడ్డబళ్లాపురం, న్యూస్‌లైన్ : కుమారుడి పుట్టినరోజు వేడుకను ఘనంగా నిర్వహించాలని ఆశిం చిన ఒక తండ్రి చైన్ స్నాచింగ్‌కు పాల్ప డి మొదటి ప్రయత్నంలోనే దొరికి పోయి జనం చేత చావు దెబ్బలు తిన్న సంఘటన పట్టణ పరిధిలో చోటుచేసుకుంది... పట్టణ శివారులోని వ ుుత్తూరు గ్రామానికి చెందిన పెయిం టర్ శంకర్ (28) చైన్ స్నాచింగ్‌కు పాల్పడి దెబ్బలు తిన్నాడు. కుమారుడి బర్త్‌డే గ్రాండ్‌గా నిర్వహించాలనుకున్న శంకర్ బుధవారం పట్టణంలో ఎక్కడైనా చోరీ చేయాలని చూశాడు.
మొద ట బ్యాంకుల వద్ద కాపు గాచిన శంకర్‌కు సౌందర్య మహల్ సర్కిల్ వద్ద ఉన్న సిండికేట్ బ్యాంక్ నుంచి బయటకు వచ్చిన కుంబారపేటకు చెందిన షాజియాతో పాటు ఆమె మెడలోని బంగారు చైన్ కనిపించింది. ఆమెను వెంబడించిన శంకర్ కుంబారపేట సమీపిస్తుండగానే షాజియా మెడలో చైను లాక్కుని పరిగెత్తాడు. షాజియా గట్టిగా కేకలు వేయడంతో చుట్టుపక్కల ఉన్న యువకులు శంకర్‌ను వెంబడించి ఎట్టకేలకు పట్టుకుని, షాజియా చైన్ తిరిగి ఇప్పించారు. నిందితుడిని కుంబారపేటలో కరెంట్ స్తంబానికి కట్టేసి రక్తం వచ్చేలా చితకబాదారు.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అక్కడి నుంచి ప్రభుత్వ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అనంతరం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. పోలీసు ల విచారణలో శంకర్ కుమారుడి బర్త్‌డే కోసం ఈ చోరీకి పాల్పడ్డట్టు చెప్పు కొచ్చాడు. సరిగ్గా ఏడాది క్రితం కుంబార పేటలో ఒంటరిగా ఉన్న ఒక మహిళను దారుణంగా హత్య చేసి ఒంటిపై ఉన్న బంగారు నగలు దోచుకెళ్లిన సంఘటన జనం మర్చి పోలేదు. దీంతో పట్టపగలే శంకర్ చోరీకి పాల్పడ్డంతో జనం ఆగ్రహం కట్టలు తెంచుకుంది. స్తంభానికి కట్టేసి రక్తం వచ్చేలా చితక బాదారు.
Advertisement
Advertisement