వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు-పున్నేలు శివారులో ఆటోను డీసీఎం వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు.
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
Jan 11 2017 10:58 AM | Updated on Aug 30 2018 4:10 PM
వర్ధన్నపేట : వరంగల్ అర్బన్ జిల్లా ఐనవోలు-పున్నేలు శివారులో ఆటోను డీసీఎం వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. వరంగల్-ఖమ్మం రాష్ట్ర రహదారిపై ఈ ప్రమాదం జరిగింది. జనగాం జిల్లా పాలకుర్తి మండలం కొండాపూర్ పెద్ద తండాకు చెందిన గుగులోతు బీత్యూ(42), బాదావత్ బోగ్యా(60)లు ఆటోలో పత్తి లోడుతో వరంగల్ వ్యవసాయ మార్కెట్‌కు వెళ్తున్నారు. పున్నేలు శివారు వద్దకు వచ్చేసరికి వరంగల్‌నుంచి ఎదురుగా వస్తున్న డీసీఎం ముందున్న వాహనాన్ని తప్పించబోయి వీరి ఆటోను ఢీకొంది. ఈ ప్రమాదంలో ముందు సీట్లో ఉన్న ఆటో యజమాని, డ్రైవర్ అయిన బీత్యూ, అతని పక్కన కూర్చున్న బోగ్యాలు అక్కడికక్కడే మృతి చెందారు. వెనుక సీట్లో కూర్చున్న మరో ఇద్దరికి స్వల్ప గాయాలు కాగా వీరిని వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.
Advertisement
Advertisement