చాహల్‌ సరికొత్త రికార్డు | Yuzvendra Chahal Becomes Highest T20I Wicket-taker in 2017 | Sakshi
Sakshi News home page

చాహల్‌ సరికొత్త రికార్డు

Dec 21 2017 10:46 AM | Updated on Nov 9 2018 6:46 PM

Yuzvendra Chahal Becomes Highest T20I Wicket-taker in 2017 - Sakshi

కటక్‌: టీమిండియా పరిమిత ఓవర్ల క్రికెట్‌లో నిలకడగా రాణిస్తున్న స్పిన్నర్‌ యజ్వేంద్ర చాహల్‌ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో అత్యధిక అంతర్జాతీయ టీ 20 వికెట్లు సాధించిన బౌలర్‌గా చరిత్ర సృష్టించాడు. శ్రీలంకతో ఇక్కడ జరిగిన తొలి టీ 20లో నాలుగు వికెట్లు సాధించి విశేషంగా రాణించిన చాహల్‌.. 2017ల ఇప్పటివరకూ 19 టీ 20 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. తద్వారా ఆఫ్గనిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌(17)ను అధిగమించాడు. ఈ ఏడాది భారత్‌కు ఇంకా రెండు టీ 20 మ్యాచ్‌లు ఉండటంతో చాహల్‌ మరిన్ని వికెట్లను సాధించే అవకాశం ఉంది.

తొలి టీ 20లో ఉపుల్‌ తరంగా, ఏంజెలో మాథ్యూస్‌, అసేలా గుణరత్నే, దాసున్‌ షనక వికెట్లను చాహల్‌ తీసి లంకేయులు వెన్నువిరిచాడు. ఫలితంగా భారత్‌ టీ 20ల్లో 93 పరుగుల తేడాతో రికార్డు విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 180 పరుగులు చేయగా, లంక 87 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. చాహల్‌కు తోడు మరొక స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ రెండు వికెట్లు తీయగా, హార్దిక్‌ పాండ్యా మూడు వికెట్లు సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement