'థ్యాంక్యూ.. సారా అండ్‌ అర్జున్‌'

Watch Video Of Sachin Tendulkar Turns Barber For Son Arjun - Sakshi

ముంబై : టీమిండియా దిగ్గజం, మాస్టర్‌ బ్లాస్టర్‌ సచిన్‌ టెండూల్కర్‌  బ్యాటింగ్‌లో ఎంత నైపుణ్యతను ప్రదర్శించాడనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తన బ్యాటింగ్‌ పవర్‌తోనే క్రికెట్‌ ప్రపంచంలో లెక్కలేనన్ని రికార్డులు తన ఖాతాలో వేసుకున్న సచిన్‌ హెయిర్‌కట్‌ చేయడంలోనూ అంతే నైపుణ్యతను చూపిస్తున్నాడు. తాజాగా తన కొడుకు అర్జున్‌ టెండూల్కర్‌కు హెయిర్‌కట్‌ చేసిన వీడియోనూ ఇప్పుడు తెగ వైరల్‌గా మారింది. కొన్ని రోజుల క్రితం ఎవరి సహాయం లేకుండానే తనే సొంతంగా హెయిర్‌కట్‌ చేసుకున్న సచిన్‌ తాజాగా అర్జున్‌కు హెయిర్‌ ట్రిమ్‌ చేశాడు. సచిన్‌కు అతని కూతురు సారా టెండూల్కర్‌ అసిస్టెంట్‌గా వ్యవహరించడం ఇందులో మరో విశేషం.('కష్టపడి సంపాదించాలి.. డిమాండ్‌ చేయొద్దు')

'క్రికెటర్‌గా దేశం తరపున ఎన్నో మ్యాచ్‌లు ఆడి గెలిపించాను. ఆటకు గుడ్‌బై చెప్పిన తర్వాత తండ్రిగా బాధ్యతలు నెరవేరుస్తున్నా. ఒక తండ్రిగా నా కోరికలు నెరవేర్చుకుంటున్నా.. పిల్లలతో కలిసి ఆడుకోవడం, తినడం, కుటుంబంతో కలిసి ఆనందంగా గడపడం లాంటివి చేస్తున్నా. తాజాగా నా కొడుకు అర్జున్‌కు హెయిర్‌కట్‌ చేయడం కూడా అందులో బాగమే. క్రికెట్‌ తర్వాత నేను బాగా సక్సెస్‌ అయింది హెయిర్‌కట్‌లో అని చెప్పాలి. అందులోనూ హెయిర్‌కట్‌ చేసిన తర్వాత వాడు( అర్జున్‌) చాలా అందంగా ఉన్నాడు. నాకు అసిస్టెంట్‌గా పని చేసినందుకు థ్యాంక్యూ ! సారా ' అంటూ క్యాప్షన్‌లో పేర్కొన్నాడు. ('సెంచరీ కంటే భార్య చేసే హెయిర్‌కట్‌ కష్టంగా ఉంది')

లాక్‌డౌన్‌ 4వ దశలో దేశంలోని సెలూన్‌ షాపులకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చినా చాలా వరకు తెరుచుకోలేదనే చెప్పాలి. దీంతో యూట్యూబ్‌ను ఫాలో అవుతూ చాలా మంది తమ స్నేహితులు, ఇంట్లో వారితోనే హెయిర్‌ కట్‌ చేయించుకుంటున్నారు. ఇందులో సెలబ్రిటీలు కూడా చాలా మందే ఉన్నారు. లాక్‌డౌన్‌ మొదటి దశలో టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి తన భార్య అనుష్క శర్మతో హెయిర్‌ ట్రిమ్‌ చేసుకున్న సంగతి తెలిసిందే. కాగా సోమవారం టీమిండియా టెస్టు క్రికెటర్‌ చటేశ్వర్‌ పుజార తన భార్య పూజాతో హెయిర్‌ కట్‌ చేసుకుంటున్న ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన సంగతి తెలిసిందే.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి 

Read also in:
Back to Top