
అడిలైడ్: ఆస్ట్రేలియాతో జరుగుతున్న రెండో టెస్టులో పసలేని పాకిస్తాన్ బౌలింగ్‌కు తోడు ఫీల్డింగ్ కూడా నిరాశ పరుస్తోంది. పాకిస్తాన్ బౌలర్లు వికెట్లు తీయడానికి ఆపసోపాలు పడుతుండగా, పేలవమైన ఫీల్డింగ్‌తో సైతం పరుగులు సమర్పించుకుంటున్నారు. దాంతో పాకిస్తాన్ ఫీల్డింగ్‌పై ఆ దేశ దిగ్గజ ఆటగాడు వసీం అక్రమ్ మరోసారి విమర్శలు గుప్పించాడు. నిద్ర మత్తులు ఫీల్డింగ్ చేస్తున్నారా అంటూ ధ్వజమెత్తాడు. ప్రధానంగా యాసిర్ షా, మసూద్‌లు ఫీల్డ్‌లోనే నిద్ర పోతున్నారా అంటూ మండిపడ్డాడు. ‘ పాకిస్తాన్ క్రికెట్‌కు ఫీల్డింగ్ అనేది పెద్ద సమస్య. బంతిపై దృష్టి కేంద్రీకరించాలి. ఫీల్డర్ వెనుక బ్యాకప్‌గా ఎవరూ ఫీల్డింగ్ చేయడం లేదు. బౌండరీ లైన్‌పై కాకుండా పది గజాల ముందు ఫీల్డింగ్ చేయాలి’ అని అక్రమ్ పేర్కొన్నాడు.
నిన్నటి ఆటలో పాకిస్తాన్ ఫీల్డింగ్ వైఫల్యాలు కొట్టొచ్చినట్లు కనబడ్డాయి. యాసిర్ షా, మసూద్‌లతో పాటు షాహిన్ అఫ్రిది ఫీల్డింగ్‌లో నిరాశపరిచాడు. బౌండరీ వెళ్లకుండా ఆపాల్సిన బంతిని కాలితో తన్ని మరీ బౌండరీకి పంపించాడు. బంతిని ఆపే క్రమంలో నియంత్రణ లేకపోవడంతో పాటు సరైన దృష్టి పెట్టకపోవడంతో అఫ్రిది కాలు తగిలి బంతి బౌండరీకి వెళ్లింది. దీనికి సంబంధించి వీడియోలో నెట్టింట్లో హల్‌చల్ చేస్తున్నాయి.
David Warner reaches 50, thanks to some timely overthrows! #AUSvPAK | https://t.co/0QSefkJERk pic.twitter.com/dKVXDkhnDm
— cricket.com.au (@cricketcomau) November 29, 2019
😳🙈#AUSvPAK pic.twitter.com/FKkW2VDDFY
— cricket.com.au (@cricketcomau) November 29, 2019