అందుకే తొలుత బ్యాటింగ్‌: రోహిత్‌ | Wanted to face challenge with the World Cup in mind, Rohit | Sakshi
Sakshi News home page

అందుకే తొలుత బ్యాటింగ్‌: రోహిత్‌

Feb 4 2019 11:42 AM | Updated on May 29 2019 2:38 PM

Wanted to face challenge with the World Cup in mind, Rohit - Sakshi

వెల్లింగ్టన్‌: వచ్చే వరల్డ్‌కప్‌ను దృష్టిలో పెట్టుకునే కఠిన పిచ్‌లపై ఆడాలని భావించినట్లు టీమిండియా తాత్కాలిక సారథి రోహిత్‌ శర్మ తెలిపాడు. అందుకే న్యూజిలాండ్‌తో చివరి వన్డేలో తొలుత బ్యాటింగ్‌ తీసుకున్నట్లు తెలిపాడు. ఆ పిచ్‌ ముందుగా పేసర్లకు అనుకూలిస్తుందని తెలిసినా, టాస్‌ గెలిచిన తర్వాత ప్రయోగాత్మకంగా ముందుగా బ్యాటింగ్‌కు చేయడానికి మొగ్గుచూపినట్లు పేర్కొన్నాడు.

‘టాస్‌కు ముందు పిచ్‌ను పరిశీలించా. అక్కడున్న తేమ తొలుత పేసర్లకు సహకరిస్తుందని ముందే తెలుసు. ప్రపంచకప్‌ మ్యాచ్‌ల్లో కఠిన పరిస్థితులు ఉంటాయి కాబట్టి వాటినెలా ఎదుర్కోవాలో ఇక్కడ చూడాలని భావించాం. నిజమే.. మేం త్వరగా నాలుగు వికెట్లు చేజార్చుకున్నాం. పరిస్థితులు బాగాలేనప్పుడు, బంతి స్వింగ్‌ అవుతున్నప్పుడు ఎలా బ్యాటింగ్‌ చేయాలో నేర్చుకోవడానికి ఇది ఉపయోపగడింది. ఇలా పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా ఆడాలన్నది అనుభవ పూర‍్వకంగా మేము తెలుసుకున్నాం’ అని రోహిత్ తెలిపాడు. ఈ మ్యాచ్‌లో 30 ఓవర్ల వరకూ రన్‌రేట్‌ బాగాలేకపోయినప్పటికీ, 250 స్కోరును అందుకోవడం సానుకూల అంశమని రోహిత్‌ తెలిపాడు.

ఇక్కడ చదవండి: ‘ఐదు’లో అదుర్స్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement