ఆయన చాలా గొప్ప వ్యక్తి : సెహ్వాగ్‌

Virender Sehwag Pays Tribute To Dr BR Ambedkar Through Twiter - Sakshi

ఢిల్లీ : భారత మాజీ విధ్వంసక ఓపెనర్‌ వీరేంద్ర సెహ్వాగ్‌ భారత రాజ్యాంగ సృష్టికర్త డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌కు ఘనమైన నివాళి అర్పించాడు. ' భారత రాజ్యాంగాన్ని తనదైన శైలిలో చెక్కిన శిల్పి అంబేద్కర్‌కు ఇవే నా ఘనమైన నివాళి' అంటూ ట్విటర్‌ వేదికగా స్పందించాడు. అంబేద్కర్‌ జయంతిని పురస్కరించుకొని వీరేంద్ర సెహ్వాగ్‌ స్పందిస్తూ.. ' బీఆర్‌ అంబేద్కర్‌ నిజంగా చాలా గొప్ప వ్యక్తి. అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం అంబేద్కర్‌ గొప్పగా పోరాడరని కొనియాడాడు. స్వాతంత్ర పోరాటంలో తన వంతు పాత్ర పోషిస్తూ.. అన్ని వర్గాలకు న్యాయం చేకూరేలా భారత రాజ్యాంగాన్ని రూపొందించారు. దళితులు, ఇతర అణగారిన వర్గాల వారిపై వివక్షను అణగదొక్కేందుకు తన వంతు కృషి చేసి భారతరత్న సాధించారని' తెలిపాడు. (అందుకే అతన్ని పాక్‌ 'వివ్‌ రిచర్డ్స్‌' అంటారు)

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top