విలియమ‍్సన్‌ వచ‍్చేశాడు.. | Unchanged Rajasthan opt to bat, Williamson returns For SRH | Sakshi
Sakshi News home page

విలియమ‍్సన్‌ వచ‍్చేశాడు..

Mar 29 2019 7:44 PM | Updated on Mar 29 2019 7:45 PM

Unchanged Rajasthan opt to bat, Williamson returns For SRH - Sakshi

హైదరాబాద్‌: ఐపీఎల్‌లో భాగంగా  ఇక్కడ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్తాన్‌ రాయల్స్‌ టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకుంది. టాస్‌ గెలిచిన రాజస్తాన్‌ కెప్టెన్‌ అజింక్యా రహానే ముందుగా బ్యాటింగ్‌ తీసుకున్నాడు. ఇప్పటివరకూ ఇరు జట్లు లీగ్‌లో ఇంకా బోణీ కొట్టకపోవడంతో గెలుపుపై దృష్టి సారించాయి. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టులో కేన్‌ విలియమ్సన్‌ చేరాడు. గత మ్యాచ్‌లో విలియమ‍్సన్‌ ఆడకపోవడంతో భువనేశ్వర్‌ కెప్టెన్‌గా వ్యవహరించాడు. అయితే తాజా మ్యాచ్‌కు విలియమ్సన్‌ అందుబాటులోకి రావడంతో సన్‌రైజర్స్‌ బ్యాటింగ్‌ బలం మరింత పెరిగింది.  మరొకవైపు రాజస్తాన్‌ ఎటువంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతోంది.

సొంతగడ్డపై ఆడుతున్న తొలి మ్యాచ్‌లో సన్‌రైజర్స్‌ విజయం సాధించి లీగ్‌లో బోణీ కొట్టాలని భావిస్తోంది. కోల్‌కతాలో ఆడిన మొదటి మ్యాచ్‌లో నైట్‌రైడర్స్‌పై భారీ స్కోరు చేసినా రైజర్స్‌ ఫలితం సాధించలేకపోయింది. మరోవైపు రాజస్తాన్‌ ‘మన్కడింగ్‌’ మాయలో పంజాబ్‌తో మ్యాచ్‌ను కోల్పోయింది. ఇప్పుడు ఇరు జట్లు విజయం సాధించాలనే ఏకైక లక్ష్యంతో బరిలోకి దిగుతున్నాయి. సొంత ప్రేక్షకుల మధ్య మ్యాచ్‌ జరుగనుండటంతో హైదరాబాదీల మద్దతుతో సన్‌రైజర్సే ఫేవరెట్‌గా కనబడుతోంది.

సన్‌రైజర్స్‌ జట్టు: కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, బెయిర్‌ స్టో, విజయ్‌ శంకర్‌, యూసఫ్‌ పఠాన్‌, మనీష్‌ పాండే, రషీద్‌ ఖాన్‌, భువనేశ్వర్‌ కుమార్‌, షహబాజ్‌ నదీమ్‌, సందీప్‌ శర్మ, సిద్దార్థ్‌ కౌల్‌

రాజస్తాన్‌ జట్టు: అజింక్యా రహానే(కెప్టెన్‌), జోస్‌ బట్లర్‌, సంజూ శాంసన్‌, స్టీవ్‌ స్మిత్‌, బెన్‌ స్టోక్స్‌, రాహుల్‌ త్రిపాఠీ, కృష్ణప్ప గౌతమ్‌, జోఫ్రా ఆర‍్చర్‌, ఉనాద్కత్‌, శ్రేయస్‌ గోపాల్‌, ధావల్‌ కులకర్ణి
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement