రెండో స్థానంలో హైదరాబాద్ బాలుర జట్టు | The boys' team finished second in Hyderabad | Sakshi
Sakshi News home page

రెండో స్థానంలో హైదరాబాద్ బాలుర జట్టు

Nov 20 2014 12:21 AM | Updated on Sep 2 2017 4:45 PM

రెండో స్థానంలో హైదరాబాద్ బాలుర జట్టు

రెండో స్థానంలో హైదరాబాద్ బాలుర జట్టు

తెలంగాణ స్కూల్స్ అండర్-14 బాలుర హ్యాండ్‌బాల్ టోర్నీలో హైదరాబాద్ జట్టుకు రెండో స్థానం లభించింది.

అంతర్ జిల్లా స్కూల్స్ అండర్-14 హ్యాండ్‌బాల్ టోర్నీ
 
ఎల్బీ స్టేడియం: తెలంగాణ స్కూల్స్ అండర్-14 బాలుర హ్యాండ్‌బాల్ టోర్నీలో హైదరాబాద్ జట్టుకు రెండో స్థానం లభించింది. వరంగల్ జిల్లా స్కూల్స్ గేమ్స్ సమాఖ్య ఆధ్వర్యంలో వరంగల్‌లోని జేఎన్ స్టేడియంలో జరిగిన ఫైనల్లో వరంగల్ జట్టు 11-9 స్కోరుతో హైదరాబాద్ జట్టుపై విజయం సాధించింది. దీంతో హైదరాబాద్ రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఈ సెలక్షన్ టోర్నీలో జాతీయ స్కూల్స్ అండర్-14 హ్యాండ్‌బాల్ టోర్నీలో పాల్గొనే తెలంగాణ జట్టును ఎంపిక చేశారు.

ఇందులో హైదరాబాద్‌కు  చెందిన ముగ్గురు క్రీడాకారులు చోటు దక్కించుకున్నారు. సందీప్(తెలంగాణ రాష్ట్ర సాంఘిక సంక్షేమ స్కూల్, షేక్‌పేట్), వి.సాయి కిరణ్ (గతి గవర్నమెంట్ హైస్కూల్), ఎం.సాయి అభినవ్ (లిటిల్ ఫ్లవర్ హైస్కూల్) ఎంపికయ్యారు. జాతీయ పోటీలు వచ్చే నెల మొదటి వారంలో నాగ్‌పూర్‌లో జరుగుతాయి.

Advertisement
Advertisement