తొలి ఫీల్డర్‌గా సురేశ్‌ రైనా

Suresh Raina becomes first fielder to take 100 IPL catches - Sakshi

చెన్నై: ఇప్పటికే ఐపీఎల్‌లో ఐదు వేల పరుగులను పూర్తి చేసి అరుదైన ఘనతను సొంతం చేసుకున్న చెన్నై సూపర్‌ కింగ్స్‌ ఆటగాడు సురేశ్‌ రైనా.. తాజాగా మరో రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు.  బుధవారం చెపాక్‌ స్టేడియం వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌ పృథ్వీ షా క్యాచ్‌ అందుకున్న రైనా ఐపీఎల్‌లో వంద క్యాచ్‌ను అందుకున్నాడు. ఫలితంగా ఐపీఎల్‌లో వంద క్యాచ్‌లు పట్టిన తొలి ఫీల్డర్‌గా రైనా రికార్డు సృష్టించాడు.
(ఇక్కడ చదవండి: చెన్నై సూపర్‌ ‘స్పిన్‌’ )

రైనా తర్వాత స్థానాల్లో ఏబీ డివిలియర్స్‌ (84), రోహిత్‌శర్మ (82 ), పొలార్డ్‌(80), కోహ్లి(72)లు ఉన్నారు. తన కెరీర్‌లో 189వ ఐపీఎల్‌ మ్యాచ్‌  ఆడిన రైనా 37 బంతుల్లో 59 పరుగులు చేసి చెన్నై విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఈ మ్యాచ్‌లో చెన్నై 80 పరుగుల తేడాతో విజయం సాధించింది.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top