సైనా పాత్ర నాకు దక్కిన గౌరవం: శ్రద్ధా కపూర్‌ | Shraddha Kapoor to play Saina Nehwal role in biopic | Sakshi
Sakshi News home page

సైనా పాత్ర నాకు దక్కిన గౌరవం: శ్రద్ధా కపూర్‌

Apr 26 2017 10:44 PM | Updated on Sep 5 2017 9:46 AM

సైనా పాత్ర నాకు దక్కిన గౌరవం: శ్రద్ధా కపూర్‌

సైనా పాత్ర నాకు దక్కిన గౌరవం: శ్రద్ధా కపూర్‌

క్రీడాభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సైనా నెహ్వాల్‌ బయోపిక్‌కి రంగం సిద్ధమైంది.

ముంబై:  క్రీడాభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తోన్న సైనా నెహ్వాల్‌ బయోపిక్‌కి రంగం సిద్ధమైంది. ప్రపంచ అగ్రశ్రేణి షట్లర్‌ సైనా జీవిత చరిత్రలో శ్రద్ధాకపూర్‌ టైటిల్‌ పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని ట్విట్టర్‌ ద్వారా శ్రద్ధాకపూర్‌ వెల్లడించారు. ‘సైనా’ సినిమాలో టైటిల్‌ రోల్‌ రావడం తన అదృష్టమని తెలిపారు.

అగ్రశ్రేణి క్రీడాకారిణిగా సైనా జీవితం ఆద్యంతం ఆసక్తికరం. సైనా ప్రపంచ మాజీ నెం.1 బ్యాడ్మింటన్‌ ప్లేయర్‌. కోట్లాదిమందికి ఆమె ఆదర్శనీయం. యువతకు మార్గదర్శి. అలాంటి సైనా పాత్ర తనకు దక్కిన గౌరవంగా భావిస్తున్నానని  శ్రద్ధా కపూర్‌ ట్వీట్‌ చేశారు. ఈ చిత్రానికి అమోల్‌ గుప్తే దర్శకత్వం వహిస్తున్నారు. టీ– సీరీస్‌ సంస్థ సినిమాను నిర్మిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement