ప్రపంచ నంబర్‌వన్‌లుగా నిలిచిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా....
న్యూఢిల్లీ: ప్రపంచ నంబర్‌వన్‌లుగా నిలిచిన బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్, టెన్నిస్ క్రీడాకారిణి సానియామీర్జాలను సోమవారం లోక్‌సభ అభినందించింది. వీరు సాధించిన ఘనత పట్ల భారత జాతి గర్వపడుతోందని సభ ప్రశంసించింది.
‘సైనా, సానియా సాధించిన విజయాలు భవిష్యత్తుల్లో దేశంలోని యువ క్రీడాకారులందరికీ స్ఫూర్తిగా నిలుస్తాయి. భవిష్యత్తులో వీరిద్దరు మరింతగా రాణించాలి’ అని ఈ సందర్భంగా లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్ ఆకాంక్షించారు.