అంతా నా బిడ్డ వల్లే : రోహిత్‌ శర్మ | Rohit Sharma Says Newborn Daughter Has Put Me in a Good Space | Sakshi
Sakshi News home page

అంతా నా బిడ్డ వల్లే : రోహిత్‌ శర్మ

Jun 17 2019 8:56 AM | Updated on Jun 17 2019 9:08 AM

Rohit Sharma Says Newborn Daughter Has Put Me in a Good Space - Sakshi

తను పుట్టడంతో తన దశ, దిశ మారిందని, అంతా కలిసొస్తుందని..

మాంచెస్టర్‌ : దక్షిణాఫ్రికాపై సెంచరీ.. ఆస్ట్రేలియాపై హాఫ్‌ సెంచరీ.. మళ్లీ ఇప్పుడు పాకిస్తాన్‌పై శతకం.. ఇదంతా తన గారాలపట్టీ సమైరా శర్మ వల్లేనని టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ తెలిపాడు. తను పుట్టడంతో తన దశ, దిశ మారిందని, అంతా కలిసొస్తుందని పేర్కొన్నాడు. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో రోహిత్‌ (113 బంతుల్లో 140; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) అ‍ద్భుత శతకంతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. ఈ ఘనవిజయానంతరం రోహిత్‌ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం నా జీవితంలో మంచిరోజులు నడుస్తున్నాయి. నాకు కూతురు పుట్టడం.. ఆమె రాకతోనే మంచి రోజులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం నేను క్రికెట్‌ను ఆస్వాదిస్తున్నాను. డబుల్‌ సెంచరీపై ఆలోచించలేదు. చక్కటి ప్రారంభం మీద ఇన్నింగ్స్‌ను నిర్మించాం. జట్టుగా మేం ఆడిన తీరు పట్ల సంతోషంగా ఉన్నాం. నేను ఔటైన తీరుకు అసంతృప్తి చెందా. ఆ షాట్‌ ఎంపిక నా నిర్ణయ లోపమే. నిలదొక్కుకున్నాక సాధ్యమైనన్ని పరుగులు చేయాలి. మంచి భాగస్వామ్యం నెలకొల్పాక, మ్యాచ్‌ను వశం చేసుకోవాలనుకుంటున్న సందర్భంలో ఔటవడం సరైనది కాదు. నిజంగా చెబుతున్నా... డబుల్‌ సెంచరీ గురించి నేను ఆలోచించలేదు. రాహుల్‌ చాలా బాగా ఆడాడు. అతడు సమయం తీసుకున్నా, నేరుగా షాట్లు ఆడలేని పరిస్థితిలో అది అవసరమే.’అని రోహిత్‌ శర్మ వ్యాఖ్యానించాడు. ఇక రోహిత్‌ గతేడాది డిసెంబర్‌లో ఆస్ట్రేలియా పర్యటనలో ఉండగా సమైరా శర్మ పుట్టిన విషయం తెలిసిందే. (చదవండి: భారత్‌ పరాక్రమం పాక్‌ పాదాక్రాంతం)

షార్ట్‌ బంతులే నాబలం..
పాక్‌ వ్యూహాలు తనని ఏమాత్రం ఇబ్బంది పెట్టలేదని, అసలు షార్ట్‌ బంతులే తన బలమని రోహిత్‌ తెలిపాడు. పాకిస్తాన్‌ బౌలర్లు హసన్‌, అలీ, వాహబ్‌ రియాజ్‌లు బౌన్సర్లు, షార్ట్‌బంతులో రోహిత్‌పై విరుచుకుపడ్డారు. మహ్మద్‌ ఆమిర్‌ బౌలింగ్‌ ఆచితూచి ఆడిన రోహిత్‌ ఈ ఇద్దరి బౌలర్లను చీల్చి చిండాడాడు. పాకిస్తాన్‌ రోహిత్‌కు 27 షార్ట్‌ బంతులు వేయగా.. హిట్‌ మాన్‌ 53 పరుగులు రాబట్టాడు. దీనిపై స్పందిస్తూ.. ‘ పాక్‌ వ్యూహాలతో పెద్దగా నేనేమి ఇబ్బంది పడలేదు. వారు బౌన్స్‌, షార్ట్‌ బంతులు వేసారు. తొలి 10 ఓవర్లు వారు అద్భుతంగా వేసారు. ఇంగ్లండ్‌ పిచ్‌ల్లో ఒక్కసారి బ్యాట్స్‌మన్‌ కుదురుకుంటే బౌలర్లకు చాలా కష్టం. చిన్న తప్పు చేసిన భారీ మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. కొన్ని మ్యాచ్‌లు, పరిస్థితులు కూడా బ్యాట్స్‌మెన్‌కు సవాల్‌గా నిలుస్తాయి. ఆరంభంలో షాట్స్‌ ఆడటం చాలా కష్టం. కానీ వారు ఏమనుకున్నారో ఏమో కానీ బౌన్సర్‌, లేకపోతే షార్ట్‌ బంతులు సంధించారు. కానీ షార్ట్‌బంతులే నా బలం. అందుకే చెలరేగా.’ అని రోహిత్‌ పేర్కొన్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement