శ్రీవారి సన్నిధిలో సింధు

pv sindhu visit tirumala

సాక్షి, తిరుమల: భారత స్టార్‌ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. కుటుంబ సభ్యులతో కలసి శనివారం ఆమె తిరుమలకు వచ్చారు. బ్రహ్మోత్సవాల్లో ఎనిమిదో రోజు శనివారం రాత్రి అశ్వవాహన సేవలో పాల్గొని, ఉత్సవమూర్తిని దర్శించుకున్నారు.

ఆమెకు టీటీడీ ఈవో అనిల్‌ కుమార్‌ సింఘాల్, జేఈవో శ్రీనివాసరాజు ప్రత్యేక దర్శనం కల్పించారు. ఆదివారం ఉదయం చక్రస్నానంలో పాల్గొని, పుష్కరిణిలో పవిత్ర స్నానం చేశారు. ఆమెతో పాటు హైదరాబాద్‌ జిల్లా బ్యాడ్మింటన్‌ సంఘం (హెచ్‌డీబీఏ) అధ్యక్షుడు చాముండేశ్వరీనాథ్‌ ఉన్నారు. చక్రస్నానం సందర్భంగా పుష్కరిణిలో పీవీ సింధు, పక్కన చాముండేశ్వరీనాథ్‌  

Back to Top