పుజారా శతకం.. భారీ స్కోరు దిశగా భారత్‌ | Pujara Scored Century In Boxing Day Test | Sakshi
Sakshi News home page

Dec 27 2018 7:50 AM | Updated on Dec 27 2018 8:04 AM

Pujara Scored Century In Boxing Day Test - Sakshi

మెల్‌బోర్న్‌: ఆస్ట్రేలియాతో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్‌ చతేశ్వర్‌ పుజారా సెంచరీ సాధించాడు. 280 బంతులు ఎదుర్కొన్న పుజారా 10 ఫోర్లతో ఈ సిరీస్‌లో రెండో శతకం నమోదు చేశాడు. టెస్టుల్లో 17 సెంచరీలు పూర్తిచేసిన పుజారాకు ఆసీస్‌పై ఇది నాలుగో శతకం. విరాట్‌ కోహ్లి కూడా పుజారాకు చక్కటి తోడ్పాటు అందిస్తున్నాడు. వీరిద్దరు నిలకడగా ఆడుతుండటంతో భారత్‌ భారీ స్కోరు దిశగా దూసుకెళ్తుంది. ఓవర్‌ నైట్‌ స్కోరు 215/2తో రెండో రోజు బ్యాటింగ్‌ దిగిన టీమిండియా లంచ్‌ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 272 పరుగులు చేసింది. ప్రస్తుతం పుజారా(103), కోహ్లి(69) క్రీజులో ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement