‘ఆ సలహాలు వరల్డ్‌కప్‌లో ఆచరణలో పెడతా’ | Ponting, Sourav Gangulys Insights To World Cup, Dhawan | Sakshi
Sakshi News home page

‘ఆ సలహాలు వరల్డ్‌కప్‌లో ఆచరణలో పెడతా’

Apr 26 2019 6:24 PM | Updated on Apr 26 2019 6:28 PM

Ponting, Sourav Gangulys Insights To World Cup, Dhawan - Sakshi

ఢిల్లీ: ప్రస్తుత ఐపీఎల్‌ సీజన్‌ నుంచి తాను ఎన్నో విలువైన పాఠాలు నేర్చుకున్నానని ఢిల్లీ క్యాపిటల్స్‌ ఆటగాడు శిఖర్‌ ధావన్‌ తెలిపాడు. ప్రధానంగా కోచ్‌ రికీ పాంటింగ్‌, సలహాదారు సౌరవ్‌ గంగూలీలు తన బ్యాటింగ్‌ టెక్నిక్‌లో మరిన్ని మెళకువలు నేర్పారన్నాడు. వారి నుంచి నేర్చుకున్న పరిజ్ఞానాన్ని వరల్డ్‌కప్‌లో ఆచరణలో పెడతానని ధావన్‌ స్పష్టం చేశాడు. 

‘రికీ, గంగూలీతో కలిసి పని చేయడం నా అదృష్టం.  వారిద్దరూ గొప్ప కెప్టెన్లు. ఈ ఇద్దరి ఆలోచనా విధానం, గేమ్‌ వ్యూహాలు, దృక్పథాన్ని దగ్గరి నుంచి పరిశీలించడం ద్వారా ఎంతో నేర్చుకున్నా.ఈ జ్ఞానాన్ని ఐపీఎల్‌తో పాటు వరల్డ్‌క్‌పలోనూ ఉపయోగిస్తాను’ ధావన్‌ తెలిపాడు. ఢిల్లీ జట్టుకు పాంటింగ్‌ చీఫ్‌ కోచ్‌గా, సౌరవ్‌ సలహాదారుగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement