కోహ్లీ సవాలును స్వీకరించిన మోదీ

PM Narendra Modi Accepted Virat Kohli Fitness Challenge - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : సోషల్‌ మీడియాలో చాలెంజ్‌లు ట్రెండింగ్‌ అవుతాయి. గతంలో ఐస్‌ బకెట్‌ ఛాలెంజ్‌ విపరీతంగా ట్రెండ్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ ఛాలెంజ్‌ల్లో ప్రముఖులు తాము చేస్తున్న పనిని ఇతరులకు ట్యాగ్‌ చేసి ఛాలెంజ్‌గా విసురుతారు. అవతలి వారు ఆఛాలెంజ్‌ను స్వీకరించి పూర్తి చేస్తారు. దీనితో పాటు ఇతర స్నేహితులకు ఇదేవిధంగా ట్యాగ్‌ చేస్తారు. తాజాగా ఇలాంటిదే ఇప్పుడు ట్విటర్‌లో ట్రెండింగ్‌లో ఉంది. అదే ఫిట్‌నెస్‌ ఛాలెంజ్‌..

ఇటీవల కేంద్ర క్రీడల శాఖా మంత్రి రాజ్యవర్ధన్‌ రాథోడ్‌ పుష్‌ అప్స్‌ చేస్తున్న వీడియోను ఫిట్‌నెస్‌ మంత్ర పేరుతో ట్విటర్‌లో పోస్ట్‌ చేస్తూ భారత క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ, హృతిక్‌ రోషన్‌, సైనా నెహ్వాల్‌ను ట్యాగ్‌ చేశారు. అయితే దీనిపై స్పందిస్తూ విరాట్‌ తాను చేస్తున్న ఎక్సర్‌సైజ్‌ వీడియోను పోస్ట్‌ చేశాడు. అంతేకాకుండా తన భార్య అనుష్క శర్మ, ప్రధాని నరేంద్ర మోదీ, మహేంద్ర సింగ్‌ ధోనిలు ఈ ఛాలెంజ్‌ స్వీకరించాలంటూ ట్యాగ్‌ చేశాడు. 

అయితే కోహ్లీ సవాలుపై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. విరాట్‌ ఛాలెంజ్‌ను స్వీకరిస్తున్నానని, త్వరలోనే తన వీడియో పోస్ట్‌ చేస్తానని ట్వీట్‌ చేశారు. మనం ఫిట్‌గా ఇండియా ఫిట్‌గా ఉంటుందని వ్యాఖ్యానించారు. 2014లో మోదీ ప్రధాని అయినప్పటి నుంచి  పలు యోగా క్యాంపులు నిర్వహించిన సంగతి తెలిసిందే. దేశ విదేశాలకు యోగా గొప్పతనం గురించి తెలుసే విధంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం (జూన్‌ 21) జరుపుతున్నారు.

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top