అమిర్ కు పీసీబీ వార్నింగ్ | PCB warns Aamir of repeated misconduct in domestic cricket | Sakshi
Sakshi News home page

అమిర్ కు పీసీబీ వార్నింగ్

Oct 17 2015 7:48 PM | Updated on Sep 3 2017 11:06 AM

అమిర్ కు పీసీబీ వార్నింగ్

అమిర్ కు పీసీబీ వార్నింగ్

పాకిస్థాన్ దేశవాళీ క్రికెట్ లో క్రీడా నియమావళిని ఉల్లంఘించి ప్రత్యర్థి ఆటగాడితో ఘర్షణకు దిగిన మహ్మద్ అమిర్ కు ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) గట్టిగా వార్నింగ్ ఇచ్చింది.

కరాచీ:పాకిస్థాన్ దేశవాళీ క్రికెట్ లో క్రీడా నియమావళిని ఉల్లంఘించి ప్రత్యర్థి ఆటగాడితో ఘర్షణకు దిగిన మహ్మద్ అమిర్ కు ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. మళ్లీ అటువంటి చర్యలకు పాల్పడితే కఠిన శిక్షను ఎదుర్కొవాల్సి వస్తుందంటూ హెచ్చరించింది. ఈ మేరకు అమిర్ ను పీసీబీ చైర్మన్ షహర్ యార్ ఖాన్ తీవ్రంగా మందలించారు. ' ఇది కచ్చితంగా నిబంధలను ఉల్లంఘించినట్లే అవుతుంది. అమిర్ నుంచి మరోసారి ఆ తరహా ఘటనను చూడాలని అనుకోవడం లేదు. అమిర్ పునరాగమన ప్రోగ్రామ్ లో భాగంగా కొన్ని మార్గదర్శకాలున్నాయి. వాటిని అమిర్ పాటించాల్సి ఉంది' అని షహర్ యార్ ఖాన్ తెలిపారు.

ఖ్వైదా-ఈ-అజామ్ ట్రోఫీలో భాగంగా గురువారం సుయి సౌత్రన్ గ్యాస్-పీఐఏల మధ్య  మ్యాచ్ జరుగుతుండగా అంతర్జాతీయ స్థాయి ఆటగాళ్లైన  ఫైజల్ ఇక్బాల్, మహ్మద్ అమిర్ లు ఒకరి నొకరు దూషించుకున్నారు. క్రికెట్ లో  స్లెడ్జింగ్ అనేది భాగంగా మారిపోయినప్పటికీ  అమిర్ ను దొంగ (చోర్) అంటూ ఇక్బాల్  దూషించాడు. మ్యాచ్ జరుగుతుండగా తొలుత అమిర్ , ఇక్బాల్ ల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో అమిర్  ఘాటుగా స్పందించడంతో ఇరువురి మధ్య మాటల యుద్ధం కొనసాగింది.  ఇక నియంత్రణ కోల్పోయిన ఫైజల్..   నువ్వు దొంగ అంటూ అమిర్ పై వ్యక్తిగత దూషణలకు దిగాడు. తీవ్ర వివాదాన్ని రేపిన ఈ ఘటనలో ఆ క్రికెటర్లకు మ్యాచ్ రిఫరీ జరిమానా విధించారు. అమిర్ కు మ్యాచ్ ఫీజులో 150 శాతం జరిమానా పడింది.

2010లో లార్డ్స్ లో ఇంగ్లండ్ తో మ్యాచ్ సందర్భంగా అమిర్ పై ఫిక్సింగ్ ఆరోపణలు రావడంతో అతనిపై ఐసీసీ ఐదేళ్ల నిషేధం విధించిన సంగతి తెలిసిందే. కాగా, ఇటీవల అమిర్ పై ఉన్న నిషేధాన్ని ఐసీసీతో పాటు పాకిస్థాన్ క్రికెట్ బోర్డులు ఎత్తివేయడంతో అతను దేశవాళీ పోటీల్లో పాల్గొనడానికి క్లియరెన్స్ వచ్చింది.  దీనిలో భాగంగానే అమిర్  సుయి సౌత్రన్ గ్యాస్ జట్టు తరపున బరిలోకి దిగాడు. అంతర్జాతీయ క్రికెట్ పునరాగమనంలో భాగంగా అమిర్ 2016 వరకూ దేశవాళీ మ్యాచ్ ల్లో ఆడాల్సి ఉంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement