వారు అందుకే రావడం లేదు: పీసీబీ

 PCB Says Big players Missing From Visiting Windies side due to IPL - Sakshi

పీసీబీ చైర్మెన్‌ నజామ్‌ సేతి

కరాచీ : టీ20 సిరీస్‌లో భాగంగా పాకిస్థాన్‌లో పర్యటించే వెస్టిండీస్‌ జట్టు కీలక ఆటగాళ్లు దూరం కావడంపై పాకిస్తాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) క్రికెట్‌ బోర్డు స్పందించింది. భద్రతా కారణాల వల్ల వెస్టిండీస్‌ ఆటగాళ్లు సిరీస్‌కు దూరమవుతున్నారనే ప్రచారాన్ని పీసీబీ చైర్మెన్‌ నజామ్‌ సేతి ఖండించారు. కేవలం ఇద్దరు ఆటగాళ్లే ఈ సిరీస్‌కు దూరం అవుతున్నారని, వారు ఐపీఎల్‌లో ఆడేందుకు చేసుకున్న ముందుస్తు ఒప్పంద వల్ల పాక్‌లో పర్యటిచడం లేదని స్పష్టం చేశారు.

విండీస్‌ రెగ్యులర్‌ టీ20 కెప్టెన్‌ కార్లోస్‌ బ్రాత్‌వైట్‌, జాసన్‌ హోల్డర్‌, క్రిస్‌ గేల్‌, దేవంద్ర బిషూలు భద్రతా కారణాల వల్ల పాక్‌లో పర్యటించడం లేదని ప్రకటించారు. సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ టీ20 సిరీస్‌కు వెస్టిండీస్‌ కెప్టెన్‌గా ఆల్‌రౌండర్‌ జాసన్‌ మహ్మద్‌ వ్యవహరించనున్నాడు. అయితే ఈ టీ20 సిరీస్‌ గతేడాది నవంబర్‌లోనే జరగాల్సి ఉండగా.. కరేబియన్‌ కీలక ఆటగాళ్లు బంగ్లాదేశ్‌ ప్రీమియర్‌ లీగ్‌లో పాల్గొనడంతో వాయిదా పడింది. 

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top