చాంప్ లయోలా అకాడమీ | OU korfball tournament overall champion loyola academy | Sakshi
Sakshi News home page

చాంప్ లయోలా అకాడమీ

Jan 21 2014 3:15 AM | Updated on Jul 31 2018 4:52 PM

చాంప్ లయోలా అకాడమీ - Sakshi

చాంప్ లయోలా అకాడమీ

ఓయూ ఇంటర్ కాలేజి కార్ఫ్‌బాల్ టోర్నమెంట్ టైటిల్‌ను లయోలా అకాడమీ జట్టు కైవసం చేసుకుంది. ఎ.వి.కాలేజి జట్టుకు రెండో స్థానం లభించింది.

ఎల్బీ స్టేడియం,న్యూస్‌లైన్: ఓయూ ఇంటర్ కాలేజి కార్ఫ్‌బాల్ టోర్నమెంట్ టైటిల్‌ను లయోలా అకాడమీ జట్టు కైవసం చేసుకుంది. ఎ.వి.కాలేజి జట్టుకు రెండో స్థానం లభించింది. అవంతి కాలేజి జట్టుకు మూడో స్థానం దక్కింది. ఓయూ గ్రౌండ్స్‌లో సోమవారం జరిగిన ఫైనల్లో లయోలా అకాడమీ జట్టు 19-6 స్కోరుతో ఎ.వి.కాలేజి జట్టుపై విజయం సాధించింది. లయోలా అకాడమీ జట్టులో శ్రీగణేష్ 12 పాయింట్లు చేయగా, పాషా 10 పాయింట్లను నమోదు చేశారు. ఎ.వి.కాలేజి జట్టులో సుధీర్ 4 పాయింట్లు చేశాడు. విజేతలకు ఓయూ ఇంటర్ యూనివర్సిటీ టోర్నీ సెక్రటరీ ప్రొఫెసర్ ఎల్.లక్ష్మీకాంత్ రాథోడ్ ట్రోఫీలను అందజేశారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement