విశాఖ వన్డేపై అధికారుల సమీక్ష | officers review on visakha one day! | Sakshi
Sakshi News home page

విశాఖ వన్డేపై అధికారుల సమీక్ష

Sep 11 2014 7:47 PM | Updated on Sep 4 2018 5:07 PM

విశాఖ వేదికగా జరిగే మరో అంతర్జాతీయ వన్డే మ్యాచ్ కు సంబంధించి ఏర్పాట్లును గురువారం విశాఖ అధికారులు సమీక్షించారు.

విశాఖ: విశాఖ వేదికగా త్వరలో జరిగే అంతర్జాతీయ వన్డే మ్యాచ్ కు సంబంధించి ఏర్పాట్లును గురువారం విశాఖ అధికారులు సమీక్షించారు. అక్టోబర్‌ 14న భారత్‌-వెస్టిండీస్‌ జట్ల మధ్య జరిగే మూడో వన్డే మ్యాచ్ కు సంబంధించి క్రికెట్ ఆర్గనైజింగ్ కమిటీ తాజాగా సమావేశమైంది. ఈ సమావేశంలో కలెక్టర్, పోర్ట్ చైర్మన్, ఏసీఏ అధ్యక్ష, కార్యదర్శలు పాల్గొన్నారు.  భారత క్రికెట్ జట్టు వెస్టిండీస్ తో వన్డే, టెస్టు సిరీస్లు ఆడనుంది.  వరుసగా మూడో సారి కూడా విశాఖ మైదానం వెస్టిండీస్ ఆడే వన్డే మ్యాచ్‌కే వేదిక కానుండటం విశేషం.  హైదరాబాద్‌లో ఉప్పల్ స్టేడియంలో గతంలో మూడు టెస్టులు మ్యాచ్‌లు జరిగాయి.

 

2013 మార్చిలో ఆఖరి సారిగా ఇక్కడ టెస్టు మ్యాచ్ నిర్వహించారు. మరో వైపు ఈ సిరీస్‌లో మరో రెండు టెస్టులు బెంగళూరు, అహ్మదాబాద్‌లలో జరగనుండగా...ఇతర వన్డేలకు కోల్‌కతా, కటక్, ధర్మశాల, కొచ్చి ఆతిథ్యం ఇవ్వనున్నాయి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement