పరిమితి లేదు...  ఫిట్‌నెస్‌ ఉండాలంతే: కోహ్లి  

No restrictions for World Cup players, says Kohli - Sakshi

బెంగళూరు: వన్డే ప్రపంచకప్‌ నేపథ్యంలో భారత ప్రధాన ఆటగాళ్లు ఐపీఎల్‌లో ఆడే విషయమై ఎలాంటి పరిమితి విధించలేదని టీమిండియా కెప్టె¯Œ  విరాట్‌ కోహ్లి స్పష్టం చేశాడు. రాయల్‌ చాలెంజర్స్‌ బెంగళూరు కెప్టె¯Œ  కూడా అయిన కోహ్లి తమ ఫ్రాంచైజీకి సంబంధించిన యాప్‌ను శనివారం ఆవిష్కరించాడు. ఈ సందర్భంగా అతను మాట్లాడుతూ ‘ప్రత్యేకించి ఇన్నే మ్యాచ్‌లు అడాలని మా వాళ్లెవరికి చెప్పలేదు. నేను ఒకవేళ 10, 12 లేదంటే 15 మ్యాచ్‌లు ఆడాలనుకుంటే ఆడుకోవచ్చు. అలాగే ఇంకొందరు ఎక్కువైనా ఆడొచ్చు.

తక్కువైనా ఆడొచ్చు. ఇది ఆయా ఆటగాళ్ల ఫిట్‌నెస్‌కు సంబంధించిన అంశం. ఇందులో ఎవరి ప్రమేయం ఉండబోదు. ప్రపంచకప్‌ అనేది ప్రతి ఆటగాడి కల. అందుకే ప్రతి ఒక్కరు దాన్నే లక్ష్యంగా చేసుకుంటారు. అంతేగానీ మెగా ఈవెంట్‌కు ఎవరు మాత్రం దూరమవ్వాలనుకుంటారు’ అని అన్నాడు. పని భారమనేది సహజమని, దీన్ని బాధ్యతగా తీసుకోవాలన్నాడు. ఐపీఎల్‌ను ప్రపంచకప్‌కు ఒక మెట్టుగా సద్వినియోగం చేసుకోవాలన్నాడు.   

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top