మిచెల్ స్టార్క్ 'ఫాస్టెస్ట్' రికార్డు! | Mitchell Starc breaks Saqlain Mushtaq record | Sakshi
Sakshi News home page

మిచెల్ స్టార్క్ 'ఫాస్టెస్ట్' రికార్డు!

Aug 22 2016 12:37 PM | Updated on Nov 9 2018 6:43 PM

మిచెల్ స్టార్క్ 'ఫాస్టెస్ట్' రికార్డు! - Sakshi

మిచెల్ స్టార్క్ 'ఫాస్టెస్ట్' రికార్డు!

ఆస్ట్రేలియా ప్రధాన పేసర్ మిచెల్ స్టార్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు.

కొలంబో: ఆస్ట్రేలియా ప్రధాన పేసర్ మిచెల్ స్టార్ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. వన్డేల్లో వంద వికెట్లను అత్యంత వేగంగా సాధించిన బౌలర్గా సరికొత్త మైలురాయిని నెలకొల్పాడు. దీంతో 19 ఏళ్ల క్రితం పాకిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ సక్లయిన్ ముస్తాక్(53 మ్యాచ్ల్లో) సాధించిన రికార్డును స్టార్క్ సవరించాడు. శ్రీలంకతో జరిగిన తొలి వన్డే ద్వారా స్టార్(52 మ్యాచ్ల్లో) ఈ ఘనతను సాధించాడు. అయితే ఈ ఇద్దరూ బౌలర్లూ శ్రీలంకపై ఫాస్టెస్ట్ వికెట్ల మార్కును చేరడం విశేషం.  ఇదిలా ఉండగా ఈ నెల ఆరంభంలో ఆస్ట్రేలియా తరపున టెస్టుల్లో వంద వికెట్లను సాధించిన ఐదో  లెఫ్మార్మ్ పేసర్గా స్టార్క్ గుర్తింపు సాధించాడు.


ఈ మ్యాచ్లో శ్రీలంకపై ఆస్ట్రేలియా మూడు వికెట్లు తేడాతో గెలుపొందింది. శ్రీలంక నిర్దేశించిన 228 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఆసీస్ 46.5 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి విజయం సాధించింది.  ఈ మ్యాచ్లో స్టార్క్ మూడు వికెట్లు సాధించాడు.దీంతో టెస్టు సిరీస్లో ఎదురైన తీవ్ర పరాభవానికి ఆసీస్ ప్రతీకారం తీర్చుకుంది. టెస్టు సిరీస్లో శ్రీలంక 3-0 తో ఆసీస్ను క్లీన్ స్వీప్ చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆసీస్ నంబర్ వన్ స్థానం నుంచి మూడో ర్యాంకు పడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement