ఫెల్ప్స్ ఐదోసారి... | Michael Phelps headed to Rio, becomes first male swimmer to make five Olympics | Sakshi
Sakshi News home page

ఫెల్ప్స్ ఐదోసారి...

Jul 1 2016 12:50 AM | Updated on Sep 4 2017 3:49 AM

ఫెల్ప్స్ ఐదోసారి...

ఫెల్ప్స్ ఐదోసారి...

లండన్ ఒలింపిక్స్ తర్వాత కెరీర్‌కు గుడ్‌బై చెప్పినా, మళ్లీ తిరిగి వచ్చిన అమెరికా మేటి స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్..

ఒమహా: లండన్ ఒలింపిక్స్ తర్వాత కెరీర్‌కు గుడ్‌బై చెప్పినా, మళ్లీ తిరిగి వచ్చిన అమెరికా మేటి స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్.. ఐదోసారి ఒలింపిక్స్ పోటీల్లో బరిలోకి దిగుతున్నాడు. దీంతో అమెరికా తరఫున ఐదుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న పురుష స్విమ్మర్‌గా అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నాడు. బుధవారం అర్ధరాత్రి జరిగిన యూఎస్ ఒలింపిక్ స్విమ్మింగ్ ట్రయల్స్‌లో ఫెల్ప్స్... పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ రేసును 1ని.54.84 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు.

దీంతో ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌కు బెర్త్ ఖాయం చేసుకున్నాడు. ఇప్పటి వరకు నాలుగుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఫెల్ప్స్ 18 స్వర్ణాలు సహా 22 పతకాలు సాధించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement