-
ఈ లెడెకీ లేడీ ఫెల్ప్స్..!
రికార్డు సృష్టించటం, బద్దలు కొట్టడం హాబీ కొలనులో, చారిటీలో అన్నింటా ముందు 19 ఏళ్ల అమెరికా స్విమ్మర్ లెడెకీ ఆ అమ్మాయి వయసు 19 ఏళ్లు మాత్రమే... కానీ ఇప్పటికే తొమ్మిది సార్లు ప్రపంచ చాంపియన్... వరుసగా ఒలింపిక్స్‌లో రెండుసార్లు స్వర్ణాలు... ఇప్పటికే 12 సార్లు ప్రపంచ రికార్డులు బద్దలు కొట్టింది. అమెరికా దిగ్గజ స్విమ్మర్ ఫెల్ప్స్‌కు లేడీ క్లోనింగ్‌లా తన సంచలన ప్రదర్శనతో ఇప్పటికే ప్రపంచాన్ని ఆకర్షించింది. పిట్ట కొంచెం... కూత ఘనంలా సాగుతోంది కేటీ లెడెకీ ప్రస్థానం. సాక్షి క్రీడావిభాగం రియో ఒలింపిక్స్ స్విమ్మింగ్‌లో అమెరికాకు ప్రాతినిధ్యం వహిస్తున్న కేటీ లెడెకీ యమా ఫాస్ట్. కొలనులో దిగితే ఈమెను అందుకోవటం కష్టమే. లండన్ ఒలింపిక్స్ (2012)లో పాల్గొనేటప్పటికి ఈమె వయసు కేవలం 15 ఏళ్లే. అయినా ఎవ్వరూ ఊహించని రీతిలో 800 మీటర్ల ఫ్రీస్టయిల్లో స్వర్ణపతకం గెలుచుకుంది. అదీ అప్పటివరకున్న రెండో అత్యుత్తమ టైమింగ్‌తో. మహామహులైన స్విమ్మర్లను సైతం ముక్కున వేలేసుకునేలా చేసిందీ ఫిమేల్ ఫెల్ప్స్. అమెరికా రాజధాని వాషింగ్టన్ డీసీలో 1997లో పుట్టిన లెడెకీ ఆరెళ్లప్పటినుంచే కొలనులో విన్యాసాలు మొదలుపెట్టింది. ఈమె తల్లి కూడా న్యూమెక్సికో వర్సిటీ తరపున పలు ఆక్వాటిక్ ఈవెంట్లలో పాల్గొంది. స్కూలు స్విమ్మింగ్ కెరీర్లోనే లెడెకీ రెండు అమెరికా జాతీయ రికార్డులు నెలకొల్పింది. ‘రికార్డు’లతోనే పోటీ లండన్ ఒలింపిక్స్‌తోనే లెడెకీ సత్తా ప్రపంచానికి పరిచయం అయింది. ఆ తర్వాత జరిగిన పలు అంతర్జాతీయ ఈవెంట్లు, ప్రపంచ చాంపియన్‌షిప్‌లలో ఈమె జోరును ఎవరూ అడ్డుకోలేకపోయారు. లండన్‌కు రియోకు మధ్య జరిగిన అంతర్జాతీయ అక్వాటిక్ పోటీల్లో 16 బంగారు పతకాలు, ఒక రజత పతకం గెలుచుకుంది. అదీ సాదాసీదాగా కాదు. 12 సార్లు ప్రపంచ రికార్డులను బద్దలు కొట్టి.. వాటిని తనపేర రాసుకుంది. 2013 నుంచి వరుసగా మూడేళ్లు ప్రపంచ మహిళా స్విమ్మర్, అమెరికన్ స్విమ్మర్ ఆఫ్ ద ఇయర్ అవార్డులు ఈ లడకీవే. 2014లో అంతర్జాతీయ మహిళా ‘చాంపియన్ ఆఫ్ చాంపియన్స్’ అవార్డు అందుకుంది. 400 మీటర్లు, 800 మీటర్లు, 1,500 మీటర్ల ఫ్రీస్టయిల్లో ప్రస్తుత ప్రపంచ రికార్డు ఈమెపేరుపైనే ఉంది. 500, 1000, 1650 గజాల ఫ్రీస్టయిల్లోనూ ఫాస్టెస్ట్ టైమ్ రికార్డు ఈమెదే. తాజా రియో ఒలింపిక్స్‌లో 4ఁ100మీటర్ల ఫ్రీస్టయిల్ రిలేలో.. అమెరికా బృందంలో భాగంగా రజతం గెలిచింది. 400 మీటర్ల వ్యక్తిగత ఫ్రీస్టయిల్ విభాగంలో హీట్స్‌లో 3.58.71 టైమింగ్‌తో ఒలింపిక్స్ రికార్డు నమోదు చేసింది. ఫైనల్లో హీట్స్ కంటే రెండు సెకన్ల ముందే రేసు పూర్తి చేసి స్వర్ణం సాధించడంతో పాటు తన రికార్డును తనే బద్దలు కొట్టుకుంది. ‘లెడెకీ పోటీపడేది తోటి స్విమ్మర్లతోకాదు.. రికార్డులతో’ అని ఈమె గురించి తెలిసినవారంటారు. రికార్డులు+ఆత్మవిశ్వాసం+చారిటీ రేసుకు ముందు.. రేసు పూర్తయిన తర్వాత ఎప్పుడు చూసినా లెడెకీలో ఆత్మవిశ్వాసం మెండుగా కనబడుతుంది. ‘నేను గెలుస్తానని నాకు తెలుసు. ఆ ఆత్మవిశ్వాసమే నా బలం’ అని చాలా సందర్భాల్లో లెడెకీ బహిరంగంగానే వ్యాఖ్యానించింది. కొలనులో రికార్డులే కాదు మంచి మనసుతోనూ ఈ అమ్మాయి అమెరికన్ల మనసు గెలుచుకుంది. స్విమ్మింగ్‌లో తనకున్న క్రేజ్‌ని, సంపాదించిన దాంట్లో సింహభాగాన్ని వివిధ చారిటీ కార్యక్రమాలకు వినియోగిస్తూ ‘లెడెకీ ద గ్రేట్’ అనిపించుకుంటోంది. కేథలిక్ చారిటీస్, షెపర్డ్స్ టేబుల్, వూండెడ్ వారియర్స్ వంటి సంస్థల భాగస్వామ్యంతో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటుంది. చిన్న వయసులోనే రికార్డులు, మెడళ్లతోపాటు సేవా కార్యక్రమాలతో నేటి తరానికి ఆదర్శంగా నిలుస్తున్న లెడెకీకి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. -
ఫెల్ప్స్ ఐదోసారి...
ఒమహా: లండన్ ఒలింపిక్స్ తర్వాత కెరీర్‌కు గుడ్‌బై చెప్పినా, మళ్లీ తిరిగి వచ్చిన అమెరికా మేటి స్విమ్మర్ మైకేల్ ఫెల్ప్స్.. ఐదోసారి ఒలింపిక్స్ పోటీల్లో బరిలోకి దిగుతున్నాడు. దీంతో అమెరికా తరఫున ఐదుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొంటున్న పురుష స్విమ్మర్‌గా అరుదైన రికార్డును సొంతం చేసుకోనున్నాడు. బుధవారం అర్ధరాత్రి జరిగిన యూఎస్ ఒలింపిక్ స్విమ్మింగ్ ట్రయల్స్‌లో ఫెల్ప్స్... పురుషుల 200 మీటర్ల బటర్‌ఫ్లయ్ రేసును 1ని.54.84 సెకన్లలో ముగించి అగ్రస్థానంలో నిలిచాడు. దీంతో ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్‌కు బెర్త్ ఖాయం చేసుకున్నాడు. ఇప్పటి వరకు నాలుగుసార్లు ఒలింపిక్స్‌లో పాల్గొన్న ఫెల్ప్స్ 18 స్వర్ణాలు సహా 22 పతకాలు సాధించాడు.
ఈనాడు సంస్థల ఛైర్మన్ రామోజీరావు కన్నుమూత
రాజీనామా చేసి వెళ్లిపోండి.. టీడీపీ కార్యకర్తల అల్టిమేటం
పట్టలేని సంతోషం.. మర్చిపోలేని విషాదం.. రెండూ ఈ నెలలోనే!
పిఠాపురం వర్మపై జనసేన దాడి
ఇదేం వ్యాధి..నిద్రలో షాషింగ్ చేయడమా..?
టీడీపీ యథేచ్ఛదాడులతో ఏపీలో ఆటవిక పరిస్థితులు: వైఎస్ జగన్
పాస్వర్డ్ మర్చిపోయాడు.. 11 ఏళ్ల తరువాత చూస్తే రూ. కోట్ల డబ్బు
T20 WC 2024: పాక్‌ను మట్టికరిపించిన అమెరికా జట్టులో సగం మంది మన వారే..!
యాత్రికుల బస్సుపై ఉగ్రదాడి..9 మంది మృతి
నయన్- విఘ్నేశ్ వివాహ వార్షికోత్సవం.. భర్త ఎమోషనల్ పోస్ట్!
T20 World Cup 2024: భారత్-పాక్ మ్యాచ్.. సందడి చేసిన క్రిస్ గేల్
నయన్- విఘ్నేశ్ పెళ్లి రోజు.. తమ పిల్లలతో సెలబ్రేట్ చేసుకున్న స్టార్ కపుల్! (ఫోటోలు)
మోదీ 3.0లో .. 30 మంది కేబినెట్ మంత్రులు వీరే
విదేశాల్లో భారతీయ కార్లకు ఫుడ్ డిమాండ్!.. గత నాలుగేళ్లలో..
T20 World Cup 2024: టీమిండియాతో మ్యాచ్.. టాస్ గెలిచిన పాకిస్తాన్.. తుది జట్లు ఇవే..!
ప్రముఖ సింగర్‌పై రూమర్స్.. నాలుగో భర్తకు కూడా..!
టాలీవుడ్ హీరోయిన్‌కి అరుదైన వ్యాధి.. షాకింగ్ విషయాలు రివీల్
మూడోసారి ప్రధానిగా మోదీ ప్రమాణస్వీకారం
Advertisement