'అశ్విన్ది ఎప్పుడూ కీలక పాత్రే' | Mahendra Singh Dhoni Says R Ashwin Has Bailed Him out of Tough Situations | Sakshi
Sakshi News home page

'అశ్విన్ది ఎప్పుడూ కీలక పాత్రే'

Apr 10 2016 6:57 PM | Updated on Sep 3 2017 9:38 PM

'అశ్విన్ది ఎప్పుడూ కీలక పాత్రే'

'అశ్విన్ది ఎప్పుడూ కీలక పాత్రే'

ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో పుణె సూపర్ జెయింట్స్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ చేత ఒకే ఓవర్ వేయించడం పట్ల ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని స్పందించాడు.

ముంబై:ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)-9లో భాగంగా శనివారం ముంబై ఇండియన్స్ తో జరిగిన మ్యాచ్ లో పుణె సూపర్ జెయింట్స్ స్పిన్నర్ రవి చంద్రన్ అశ్విన్ చేత ఒకే ఓవర్ వేయించడం పట్ల ఆ జట్టు కెప్టెన్ మహేంద్ర సింగ్  ధోని స్పందించాడు. ప్రతికూల వాతావరణం కారణంగానే అశ్విన్ కు ఒక ఓవర్ మాత్రమే ఇవ్వాల్సివచ్చిందన్నాడు.


'రవి చంద్రన్ అశ్విన్ మాకు ప్రధాన బౌలర్. అనుభవంతో పాటు పరిణితి ఉన్న బౌలర్. మ్యాచ్ క్లిష్ట పరిస్థితిలో  ఉన్న సమయంలో అశ్విన్ వికెట్లు తీసి జట్టు విజయాల్లో పాలు పంచుకున్నాడు. అశ్విన్కు ఏ సమయంలో బంతిని అప్పగించినా దానికి తగిన న్యాయం చేస్తాడు. అశ్విన్ది ఎప్పుడూ కీలక పాత్రే. ఐపీఎల్ తొలి మ్యాచ్లో అశ్విన్ చేత ఒక ఓవర్ మాత్రమే బౌలింగ్ చేయించడానికి ప్రతికూల వాతావరణమే తప్పా వేరే కారణాలేవు'అని ధోని స్పష్టం చేశాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement