చెవులు మూసుకున్న రాహుల్‌.. ఫొటో వైరల్‌ | KL Rahul Unusual Gesture After Scoring Century Goes Viral | Sakshi
Sakshi News home page

చెవులు మూసుకున్న రాహుల్‌.. ఫొటో వైరల్‌

Dec 19 2019 5:20 PM | Updated on Dec 19 2019 5:20 PM

KL Rahul Unusual Gesture After Scoring Century Goes Viral - Sakshi

విశాఖపట్నంలో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 107 పరుగుల తేడాతో వెస్టిండీస్‌పై ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. రోహిత్‌ శర్మ, కేఎల్‌ రాహుల్‌ సెంచరీలతో కదం తొక్కి.. భారత విజయంలో కీలక పాత్ర పోషించారు. రాహుల్‌ 104 బంతుల్లో 8 ఫోర్లు, 3 సిక్సర్లతో 104 పరుగులు చేశాడు. అయితే రాహుల్‌ సాధించిన సెంచరీ కన్నా.. ఆ తర్వాత అతను చెవులు మూసుకున్న ఫొటో ఒకటి సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. దీనిపై కొందరు ఫన్నీగా కామెంట్లు పెడుతుండగా.. మరికొందరు మాత్రం వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నారు. రాహుల్‌ అలా ఎందుకు చేశాడనేదానిపై క్లారిటీ లేకపోయినా.. ట్విటర్‌లో మీమ్స్‌తో హోరెత్తిస్తున్నారు. 

‘తప్పయింది దేవుడా.. మళ్లీ కాఫీ విత్‌ కరణ్‌ షోకు వెళ్లను’, ‘ఎగ్జామ్‌లో కాపీ కొడుతుంటే టీచర్‌కు దొరికిపోయినట్టున్నాడు’, ‘తల్లిదండ్రులు తిడుతున్నారమో’, ‘కరణ్‌ జోహార్‌ కాఫీ విత్‌ కరణ్‌కు పిలిచాడనుకుంటా’, ‘రాహుల్‌ ప్లేస్‌లో ధావన్‌ను తీసుకోస్తామని ఎవరో చెప్పినట్టున్నారు’ అంటూ నెటిజన్లు తమ క్రియేటివిటిని చాటుకుంటున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement